
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు లాభ, నష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల నష్టంతో 64,831 వద్ద.. నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 19,284 వద్ద ట్రేడింగ్ ముగించాయి.
కొన్ని బ్యాంకులకు ఫిచ్ క్రెడిట్ రేటింగ్‌లను సవరించిన తర్వాత బ్యాంకుల షేర్లు సూచీలను దిగువకు లాగాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే స్వల్పంగా పెరిగాయి.
ఇదీ చదవండి: దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు
టాప్ గెయినర్స్ జాబితాలో మారుతి సుజుకీ, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టైనాన్, హిందాల్కో కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇక అదానీ ఎంటర్‌ప్రైజస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐచర్ మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment