Today Stockmarket Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సూచీలు ఈరోజు మరింతగా పతనమయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయింది. 65,322 పాయింట్లకు క్షీణించింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 114 పాయింట్ల నష్టంతో 19,428 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రధానంగా ఇండస్ బ్యాంక్, ఎన్‌టీపీ, దివిస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇక హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైనాన్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాల బాటలో నడిచాయి.
ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment