
విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న బృందం సభ్యులు
సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట తల్లిదండ్రుల మొర
కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన
మెదక్ జిల్లాలో బృందం పర్యటన
నంగునూరు/సిద్దిపేట రూరల్: ‘పిల్లలు తక్కువగా ఉండటంతో పాఠశాలలు మూసి వేస్తున్నారని సార్లు చెప్పిండ్రు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చేర్పించడంతో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది’ అని సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నా రు. సోమవారం మెదక్‌జిల్లా సిద్దిపేట, నంగునూరు మండలాల్లో అధ్యయన బృందం పర్యటించింది. ఈ బృందంలో అశోక్‌కుమార్‌గుప్తా, వెంకటేశ్వర్‌రావు, శ్రావణ్‌కుమార్, రత్నంలు సభ్యులుగా ఉన్నారు. మొదట ఎన్సాన్‌పల్లి మదిరలోని తిప్పరబోయిన కాలనీలో బృందం పర్యటించింది. ఇక్కడి పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నంగునూరు మండ లం బాషాగూడెం, సీతారాంపల్లి తండా, హనుమాన్‌నగర్, రాజ్‌గోపాల్‌పేటల్లో బృందం పర్యటించింది. స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. పాఠశాలలను ఎప్పటి నుంచి మూసివేశారు.. సమీపంలోని పాఠశాల ఎంత దూరంలో ఉందని ఆరా తీశారు. ఐదారుగురు విద్యార్థులుండటంతో స్కూల్‌ను మూసేస్త్తున్నామంటూ సార్లు చెప్పారని గ్రామసులు బృందం దృష్టికి తీసుకొచ్చారు. బాషాగూడెం లో 6, పక్కీర్ కాలనీలో 5, సీతరాంపల్లి తండాలో 4, హన్మన్‌నగర్‌లో ఐదుగురు విద్యార్థులుండటంతో వాటిని మూసేశామని ఎంఈఓ దేశిరెడ్డి బృందానికి తెలిపారు. స్కూళ్లు తెరిస్తే పిల్లలను బడికి పంపిస్తారా అని ప్రశ్నించడంతో టీచర్లను నియమించి స్కూళ్లు తెరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. బృందం వెంట డీఈఓ నజీమోద్దీన్ తదితరులున్నారు.