దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం రికార్డ్ మార్కులు తాకిన బెంచ్ మార్క్ సూచీలు రోజంతా అదే దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ రికార్డ్ గరిష్టాన్ని కోల్పోకుండా అదే మార్క్ వద్ద నిలిచింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 126.38 పాయింట్లు 0.15% పుంజుకుని 81,867.73 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52.85 పాయింట్లు లేదా 0.21% లాభపడి 25,004.00 షెషన్‌ను ముగించింది.
నిఫ్టీ సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకున్నాయి. మహీంద్రా&మహీంద్రా, హీరో మోటర్ కార్ప్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టాటా మోటర్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment