దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు కొద్ది సేపటికే పతాక స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 73 వేల పాయింట్లకు చేరువ కాగా నిఫ్టీ 22 వేల పాయింట్లను దాటింది.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 435.56 పాయింట్లు లేదా 0.61 శాతం పెరిగి 72,080.86 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ 156.35 పాయింట్లు లేదా 0.72 శాతం లాభపడి 21,853.80 వద్ద ముగిసింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్లు అస్థిరతను ప్రదర్శించాయి. అయితే, బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ సవరణలను శుక్రవారం మార్కెట్లు స్వాగతించినట్లు కనిపిస్తోంది.
బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment