దేశీయ స్టాక్ మార్కెట్‌లు గురువారం భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,729.77 పాయింట్లు లేదా 2.05% పతనమై 82,536.52 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 529.95 పాయింట్లు లేదా 2.05% క్షీణించి 25,266.95 వద్దకు పడిపోయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతోంది. మిగిలిన షేర్లు స్టాక్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్, రిలయన్స్, మారుతీ సుజుకీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
అదేవిధంగా నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ మాత్రమే లాభపడగా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటర్స్ భారీ నష్టాలను చవి చూశాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనంలో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)