దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించడంతో ఈరోజు (జనవరి 20) దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలను ట్రేడింగ్ కోసం తెరిచారు.
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీల సూచీలు ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు మార్క్‌లను తాకాయి. సెన్సెక్స్ 321.32 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 71,508.18 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ నిఫ్టీ 123.45 పాయింట్లు లేదా 0.58 శాతం ఎగిసి 21,585.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
కోల్‌ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, కొటాక్ మహీంద్ర, ఐసీఐసీ బ్యాంకు షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, మహీంద్ర&మహీంద్ర, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ షేర్ల నష్టాలను మూటకట్టకుని టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment