దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో కొత్త శిఖాలకు చేరాయి. బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, పేర్లతో పాటుగా ఐటీ స్టాక్‌లలో దూసుకుపోతున్న ర్యాలీ శుక్రవారం ఈక్విటీ సూచీలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 847 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 72,568 స్థాయి వద్ద ముగిసింది. ట్రేడ్ ముగించే ముందు సెన్సెక్స్ 72,721 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా 247 పాయింట్లు లేదా 1.14 శాతం పెరిగి 21,895 వద్ద ముగిసే ముందు 21,928 వద్ద కొత్త శిఖరాగ్రాన్ని చేరింది.
ఈరోజు ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, టెక్‌మహీంద్ర, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టీసీఎస్‌ల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక సిప్లా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాబ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment