Stock market today: దేశీయ స్టాక్‌మార్కెట్‌లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను హై వ్యాల్యూ స్టాక్‌లలో లాభాలను స్వీకరించడానికి ప్రేరేపించడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 536 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 71,356.60 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 148 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 21,517.35 వద్ద స్థిరపడింది.
బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సిప్లా, ఐటీసీ కంపెనీల షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో, టాటా స్టీల్ షేర్లు నష్టాలను చవిచూసి టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment