
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 96.01 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 72,989.93 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,033.18-72,633.54 రేంజ్‌లో ట్రేడ్ అయింది.
అలాగే నిఫ్టీ 50 36.65 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 22,082.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,105.05 వద్ద, ఇంట్రాడేలో 21,964.60 వద్ద కనిష్టాన్ని తాకింది.
నిఫ్టీ 50లోని 50 షేర్లలో 28 షేర్లు నష్టాల్లో ముగియగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ షేర్లు 4.95 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3.03 శాతం వరకు లాభపడ్డాయి.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.69 శాతం, 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగియగా, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు 1.31 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment