కొత్త ఏడాది మొదటి రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఎట్టకేలకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సోమవారం సెషన్ ముగింపు సమయంలో బెంచ్‌మార్క్ సూచీలు భారీ స్వింగ్‌లను చవిచూశాయి.
ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు లేదా 0.04 శాతం పెరిగి 72,272 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు లేదా 0.05 శాతం పెరిగి 21,742 వద్ద ముగిసింది. సూచీలు వరుసగా 72,562, 21,834 వద్ద రికార్డు స్థాయిలను తాకాయి.
నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు అత్యధిక లాభాలను అందుకుని టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక ఐషర్ మోటర్స్, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్ర&మహీంద్ర, బజాజ్ ఆటో, హిందాల్కో కంపెనీ షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను మూటగట్టుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment