లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Closing Update 31th July 2024 | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Wed, Jul 31 2024 3:52 PM | Last Updated on Wed, Jul 31 2024 3:56 PM

Stock Market Closing Update 31th July 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్టాలకు చేరువలో సెషన్‌ను ముగించాయి. నిఫ్టీ అయితే 25,000లకు దగ్గరకు వచ్చింది.

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 358.93 పాయింట్లు లేదా 0.44% లాభంతో 81,814.33 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.49% లాభపడి 24,978.95 వద్ద ఉ‍న్నాయి.

నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, రిలయన్స్‌, గ్రాసిమ్‌, టాటా కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌ జాబితాలో ఉ‍న్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement