న్యూఢిల్లీ: సరైన ఫలితాలు సాధించని విద్యాసంస్థల్ని మూసివేయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ వర్గాలు చెప్పాయి. విద్యాసంస్థలు, వర్సిటీల పనితీరు ఆధారంగా అత్యుత్తమం, మెరుగుపడేందుకు అవకాశం ఉన్న, ఆశించిన ఫలితాలు సాధించని సంస్థలుగా వర్గీకరిస్తారని అధికారులు తెలిపారు.
మొదట తరగతిలో ఉండే వాటికి మరిన్ని స్వయంపాలన అధికారాలు, నిధులు అందుతాయని, రెండో తరగతిలో సంస్థలకు లోపాల్ని సరిదిద్దుకునేందుకు సలహాలు ఇస్తారన్నారు. మూడో విభాగంలోని సంస్థలు పనితీరు మెరుగుపర్చేందుకు యూజీసీకి మార్గనిర్దేశక బాధ్యతలు అప్పగిస్తామని, పనితీరు మెరుగుపడకపోతే మూసివేయడం లేదా ఇతర విద్యాసంస్థల్లో కలపడం గానీ చేస్తారన్నారు.
విద్యాసంస్థలు వెనకబడితే మూసివేతే!
Published Mon, Mar 20 2017 3:56 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement
Advertisement