దేశీయ స్టాక్‌మార్కెట్ లాభాల ర్యాలీ కొనసాగింది. గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు అదే జోరును కొనసాగిస్తూ లాభాలతోనే ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 541.60 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 71,728.46 పాయింట్లకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 176.40 పాయింట్లు లేదా 0.82 శాతం ఎగిసి 21,638.65 వద్ద ముగిసింది.
ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, టెక్‌మహీంద్ర, టాటా స్టీల్ షేర్లు మంచి లాభాలతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు షేర్లు భారీ నష్టాలతో టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment