
Today Stock market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ భారీగా పతనమైంది. ఏకంగా 517 పాయింట్లు క్షీణించి 65,601 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 19,553 పాయింట్ల వద్ద ముగిసింది.
(ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డాని కన్నుమూత)
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు అశ్విన్ డాని కన్నుమూయడంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.
ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్‌లో లార్సెన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇక టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, దివిస్ ల్యాబ్స్, విప్రో ష్లేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment