దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. వచ్చే సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఊహించిన బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీ వడ్డీ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో సానుకూల ధోరణిని పెంపొందించాయి.
నిఫ్టీ 213.40 పాయింట్లు లాభపడి 21,654.75 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ కూడా 701.63 పాయింట్లు ఎగిసి 72,038.43 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు సూచీలు తాజా ముగింపు శిఖరాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి లాభంతో డిసెంబరులో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 8 శాతం ఎగబాకాయి.
బీఎస్‌ఈలో లిస్ట్ అయిన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో రూ.358.9 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 361.3 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో మదుపర్లు ఒక్క సెషన్‌లోనే దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల మేర సంపన్నులయ్యారు.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, లార్సెన్ & టూబ్రో, నెస్లే, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్‌తో సహా 360కి పైగా స్టాక్‌లు బీఎస్‌ఈలో ఇంట్రాడే ట్రేడ్‌లో తమ తాజా 52 వారాల గరిష్టాలను తాకాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment