![Shocking Incident: Rajasthan Businessman Collapsed And Died At Clinic - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/7/clinic.jpg.webp?itok=OJ_yziYO)
ఒక వ్యక్తి క్లినిక్ వచ్చి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....61 ఏళ్ల దిలీస్ కుమార్ మదానీ పంటి నొప్పికి చికిత్స కోసం క్లినిక్‌కి వచ్చాడు. అతను క్లినిక్ వెలుపల కుర్చిలో పేపర్ చదువుతూ కూర్చొన్నాడు. కాసేపటికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అంతే అందరూ చూస్తుండగానే కుర్చిలోంచి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటేనే క్లినిక్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు.
ఐతే వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మహేంద్ర మదానీ మాట్లాడుతూ...దిలీప్ గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. వారంతా బార్మెర్‌లోని పంచపద్రలో ఉంటారని అన్నారు. ఒక పనిపై బార్మెర్ వచ్చాడని, అనుకోకుండా పంటినొప్పి రావడంతో క్లినిక్‌కి వచ్చినట్లు తెలిపారు. అతను ఉదయం బాగానే ఉన్నాడని అకస్మాత్తుగా ఇంత ఘోరం జరిగిపోయిందని భాదగా చెప్పారు.
इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे।
— Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022
कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV
Comments
Please login to add a commentAdd a comment