Clinic
-
అనుమతుల్లేని ప్రైవేట్ ఆసుపత్రులపై దృష్టి
సాక్షి,సిటీబ్యూరో: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారిస్తోంది. నగర శివారులో జాతీయ సహా పలు రహదారుల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తుండటంతో పాటు ఇష్టానుసారంగా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం లేకుండా నిర్వహణ.. ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఫీజుల వివరాల పట్టికతో సహా డాక్టర్లు,సిబ్బంది,పడకల సంఖ్య వంటి సమాచారాన్ని పొందుపరచాల్సి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. వైద్యశాఖ పర్యవేక్షణ కొరవడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఒక అనుమతితో మూడు బ్రాంచ్‌లు.. ఒక ఆసుపత్రికి అనుమతి తీసుకుని రెండు, మూడు బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిశీలన, విచారణ లేకుండానే వైద్యారోగ్యశాఖ అనుమతులు ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో వందల సంఖ్యలో క్లినిక్‌లు, ఆసుపత్రులు ఇలానే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనవసరంగా వైద్య పరీక్షలు.. అవసరం లేకుండా ఇష్టానుసారంగా వైద్యపరీక్షలు చేస్తూ.. పేదల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. ప్రైవేటు డయాగ్నస్టిక్, అ్రల్టాసౌండ్ సెంటర్లపై ఇటీవల అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని సెంటర్లపై చర్యలకు జిల్లా వైద్యారోగ్యశాఖ సిద్ధమవుతోంది. బొల్లారంలో క్లినిక్ సీజ్.. తాజాగా శుక్రవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మింట్ చట్టాన్ని ఉల్లంఘించిన భవానీ పోలీ క్లినిక్‌ను డీఎంహెచ్ఓ డాక్టరు ఉమాగౌరీ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. క్లినిక్ నిర్వాహకులు నకిలీ జనరల్ ఫిజీషియన్‌గా అవతారమెత్తి, హైడోస్ యాంటీబయాటిక్స్ రాయడం, ఐవీ ఇన్ఫ్యూషన్లు ఇవ్వడం వంటి అనుచిత వైద్యచర్యలు చేపడుతున్నట్టు సమాచారం. అర్హతలేని వ్యక్తులతో నడుస్తుందన్న ఫిర్యాదుతో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఇలా.. అలోపతి ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మింట్ చట్టం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, కన్సల్టెంట్ క్లినిక్‌లు, ఆయుష్ క్లినిక్‌లు, పిజియోథెరఫీ కేంద్రాలు అన్నింటికీ అనుమతి తప్పనిసరి. డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులతో పాటు పనిచేసే వైద్యుల రిజి్రస్టేషన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిమాపక, బయోవేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్‌తో సహా అన్నిరకాల పత్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. ఫీజుల వసూళ్లపై... ప్రైవేట్ ,కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు మొదలుకుని వైద్య పరీక్షలు తదితర వాటిల్లో దోపిడీని పసిగట్టిన జిల్లా వైద్యారోగ్యశాఖ బోర్డులు ఏర్పాటు చేయాలని వాటికి సూచినలు చేస్తోంది. అనుమతిలేనివి ఎక్కువే.. మేడ్చల్ జిల్లాలో 2,730 పైగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉండగా.. ఇందులో రిజిస్ట్రేషన్‌తో సహా వివిధ అనుమతితో కొనసాగుతున్నట్లు ఆసుపత్రులు 1755 మాత్రమే ఉన్నాయి. అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రులు 975 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. అనుమతులు ఉన్న ఆసుపత్రుల్లో 100 కంటే ఎక్కువ పడకలు(బెడ్స్) ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు 48 ఉండగా.. 20 నుంచి 100 పడకలు(బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 317 ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంటోంది. 20 పడకలు (బెడ్స్) ఉన్న ఆస్పత్రులు 294 ఉన్నాయి. 712 పాలీక్లినిక్‌లు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, 180 డెంటల్ ఆసుపత్రులు, 46 ఫిజియోథెరపీ సెంటర్లు, 08రిహాబిలిటేషన్ సెంటర్లు, అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లు 628 ఉన్నాయి. అనుమతి లేకుండా 400 వరకు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు ప్రభుత్వ నిబంధనలు, ప్రమాణాలు పాటించని ప్రైవేట్ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై నోటీసులు జారీచేసి,సీజ్ చేస్తాం.అధిక ఫీజుల వసూళ్లతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – డా.ఉమాగౌరీ, డీఎంహెచ్ఓ -
రాజారెడ్డి ఐ ఆస్పత్రిని ప్రారంభించిన వైఎస్ జగన్
-
పట్టాలెక్కిన వైద్యం
ఒక ఐడియా అనేక జీవితాలను మార్చేసింది. వైద్యానికి నోచుకోని గ్రామాలకు వైద్యం పట్టాల మీద పరుగులు పెడుతోంది. దేశంలో మూలమూలలను కలుపుతోంది రైల్వే. మారుమూల డ్యూటీ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. వారిలో చాలామందికి వైద్యం అందుబాటులో లేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి సమీప పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఈ అంతరాన్ని ఒక్క ఐడియాతో భర్తీ చేసింది ఇటీ పాండే. పేషెంట్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డాక్టర్లనే పేషెంట్ల దగ్గరకు చేరుస్తోంది. ‘రుద్ర, హాస్పిటల్ ఆన్ వీల్స్’(Hospital on Wheels) పేరుతో ఆమె మొదలు పెట్టిన రైలు పెట్టె క్లినిక్(Train Box Clinic)లు ఊరూరా తిరుగుతూ వైద్యసేవలందిస్తున్నాయి.డాక్టర్లొస్తున్నారు మహారాష్ట్ర, భుసావాల్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటీ పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గోల్డ్ మెడల్ సాధించింది. రైల్వేలో 26 ఏళ్ల అనుభవంలో ఆమె అనేక సమస్యలను దగ్గరగా చూశారు. చిన్న ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ఉద్యోగులు పెడుతున్న సెలవుల్లో ఎక్కువభాగం కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతోనేనని తెలుసుకున్నారామె. ఇప్పటికీ మనదేశంలో గ్రామాలకు వైద్యం సుదూరంలోనే ఉంది. వైద్యం కోసం పట్టణాలకు వెళ్లక తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యాన్ని గ్రామాల బాట పట్టించారు.ఇందుకోసం కొత్తగా డబ్బు ఖర్చు చేసిందేమీ లేదన్నారామె. పాతబడిన రైలు బోగీలకు రిపేర్ చేసి క్లినిక్‌లుగా మార్చారు. రైల్వే హాస్పిటల్ వైద్యసిబ్బంది ఆ రైళ్లలో గ్రామాలకు వెళ్తారు.ప్రాథమికంగా అవసరమైన మందులుంటాయి. ఈసీజీ, బ్లడ్ సాంపుల్ కలెక్షన్ వంటి అవసరమైన పరికరాలతో వెళ్తుందీ రైలు. ఒక్కోరోజు ఒక్కో రూట్. ఒక గ్రామానికి పదిహేను రోజులకొకసారి చొప్పున నెలలో రెండుసార్లు వెళ్తుందీ ఆరోగ్యరైలు. జనవరిలో పట్టాలెక్కిందిభుసావాల్ డివిజన్లో పాతిక వేల మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది జనవరి 18వ తేదీన పట్టాలెక్కిన ఈ రైలు క్లినిక్‌లలో తొలిరోజు 259 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ చక్రాలు కట్టుకుని మా ఊరికి వస్తుంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది... అంటున్నారు వైద్యసహాయం అందుకుంటున్న మహిళలు. -
స్కూలు, క్లినిక్‌లపై ఇజ్రాయెల్ దాడి
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు. ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు. మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు. బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి బీరుట్: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్మెంట్ కిందిభాగం దెబ్బతింది. -
స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్‌లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్‌ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని వైద్య శాఖ అన్ని జిల్లాల డీఎంహెచ్వోలను ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి 2024–25లో అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్టు వైద్యులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి పట్టణాలు, నగరాల్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గతంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈమేరకు డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ విభాగాల్లో వైద్యులను 2021లో నియమించారు. వీరిలో ఒక్కో వైద్యుడు రోజుకు రెండు పీహెచ్‌సీల్లో రెండేసి గంటల చొప్పున స్పెషలిస్ట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ వచ్చారు. ఇలా వారంలో 12 పీహెచ్‌సీల్లో సేవలు అందించేవారు. తద్వారా మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అవసరమైన చికిత్స అందించేవారు. వివిధ వ్యాధిగ్రస్తులపై ప్రభావం రక్తపోటు, మధుమేహం, ఎముకలు, గైనిక్ సంబంధిత సమస్యలతో బాధపడే గ్రామీణ ప్రజలు స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలంటే ఏరియా, జిల్లా ఆస్పత్రులు లేదంటే బోధనాస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు, మహిళలు, నడవలేని స్థితిలో ఉన్న వారు ప్రయాణాలు చేసి పట్టణాలు, నగరాలకు వెళ్లాలంటే ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ అవస్థలను నివారించేందుకు గత ప్రభుత్వం స్పెషలిస్టు క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది. టీడీపీ ప్రభుత్వం తొలగించిన స్పెషలిస్టు డాక్టర్లు ఇలాస్పెషాలిటీ వైద్యుల సంఖ్య డెర్మటాలజీ 17 ఈఎన్టీ 16 జనరల్ సర్జరీ 18 జనరల్ మెడిసిన్ 22 పల్మనాలజీ 10 గైనకాలజీ 22 ఆర్థోపెడిక్స్ 29 పీడియాట్రిక్స్ 18 -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
హెల్త్ ఏటీఎం..అన్ని పరీక్షలు ఇక్కడే!
-
ఉక్రెయిన్ క్లినిక్‌పై క్షిపణి దాడి..
ఉక్రెయిన్‌లోని క్లినిక్‌లపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, సుమారు 30కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ జెనీవా ఒప్పందాల ప్రకారం.. ఈ దాడిని తీవ్రమైన యుద్ధ నేరంగా పేర్కొంది. యుద్ధంలో సైనికులు, పౌరుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది రష్యా అనేదానికి ఇది చక్కని ఉదాహరణ. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ధ్వంసమైన భవనం నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించాయి. మూడంతస్థుల సదరు భవనం పైఅంతస్థుల పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా దుష్ట దేశం మాత్రమే ఇలా క్లినిక్‌లపై దాడి చేస్తుంది. ఇందులో సైనిక ప్రయోజనం ఉండదు. ఇది నిజంగా రష్యన్ టెర్రర్. మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధ నేరం అని జెలెన్స్కీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడికి ముందు ఈ క్లినిక్‌లో ఇద్దరు పిల్లల తోసహా 30 మంది ఈ భవనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే సరిగ్గా అదే సమయంలో 69 ఏళ్ల వ్యక్తి ఈ క్లినిక్‌ని దాటుతుండగా హత్యకు గురయ్యాడని, శిథిలాల నుంచి మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ప్రాంతీయ గవర్నర్ సెర్హి లైసాక్ పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ మందుగుండు సామాగ్రి డిపోలపై రాత్రిపూట దాడి చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అంతేగాదు దక్షిణ రష్యాలో ఉక్రెయిన్ రాకెట్, డ్రోన్లతో దాడి చేసిందని పేర్కొంది. అందువల్లే తాము క్షిపణి దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. పైగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను కూడా తోసిపుచ్చుతోంది రష్య. కానీ ఉక్రెయిన్ మాత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ తూర్పు ప్రాంతంలో రష్యా సుమారు 10 క్షిపణులు, 20కి పైగా డ్రోన్లు కూల్చివేసినట్లు పేర్కొనడం గమనార్హం. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్) -
క్లిక్ అయిన ‘ఉమెన్ క్లినిక్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఉమెన్ స్పెషల్ క్లినిక్‌లు క్లిక్ అయ్యాయి. రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమానికి విశేషస్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్యపరీక్షలు జరిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంద ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్స్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు మంగళవారాల్లో మొత్తం 19 వేల మందికిపైగా మహిళలకు వైద్యపరీక్షలు జరిగాయి. ‘మహిళ ఆరోగ్యం– ఇంటి సౌభాగ్యం’అనే లక్ష్యంతో ఈ వైద్యకేంద్రాల్లో మహిళలకు సంబంధించిన 8 ప్రధా న ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. మహిళలు తీరిక లేకనో, భయం కారణంగానో, సరైన అవగాహన లేకనో, సొంతంగా ఆసు పత్రికి వెళ్లలేకనో, ఇతర కారణాలతోనో తమ అనారోగ్య సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోవడతో వారి ఆరోగ్య సమస్యలు ముదిరి, పెద్ద వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇలాంటివారికి ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమం కొండంత భరోసా ఇస్తోంది. క్రమంగా పెరుగుతున్న ఆదరణ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కరీంనగర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14వ తేదీ నుంచి క్లినిక్‌లలో ఆరోగ్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటివారం 4,793 మంది మహిళలు పరీక్షలు చేయించుకున్నారు. రెండోవారం 6,328 మంది మహిళలు క్లినిక్‌లకు వచ్చారు. ఓపీ 32 శాతం పెరిగింది. 28న 7,965 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. అంతకుముందు వారంతో పోల్చితే 26 శాతం మంది అధికంగా రికార్డుస్థాయిలో క్లినిక్‌లకు వచ్చారు. మొదటివారం 2,723 నమూనాలు, రెండోవారం 2,792, మూడోవారం 4,727 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపారు. ఫలితాలు 24 గంటల్లోనే సంబంధిత మహిళలకు అందుతున్నాయి. సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి హరీశ్ మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను ప్రతి ఒక్కరూ స ద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. -
అన్నదాతకు అందుబాటులో ‘న్యాయం’
సాక్షి, హైదరాబాద్ /జనగామ: కార్మికులు, మహిళలు, బాలలు, ఖైదీలు.. ఇలా సమాజంలోని పలు వర్గాలకు న్యాయ సహాయం చేసే కేంద్రాలు దేశంలో చాలా ఏర్పాటయ్యాయి. కానీ తొలిసారిగా రైతులకు న్యాయ సహాయం అందించేందుకు కూడా ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. బమ్మెర పోతన హలం పట్టిన నేల దేశ చరిత్రలో ఈ నూతన అధ్యాయానికి వేదికవుతోంది. పోతానామాత్యుడి స్వగ్రామమైన తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’మొదలవుతోంది. నల్సార్ విశ్వవిద్యాలయం, తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ క్లినిక్ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్ ఈ రైతు న్యాయ సేవా కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, నల్సార్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకృష్ణదేవరావులు పాల్గొననున్నారు. ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోన్న ఈ కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలందించగలిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆలోచన మేరకు దేశ వ్యాప్తంగా ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటవుతాయని న్యాయ, భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. అన్ని అంశాల్లో రైతుకు సహకారం దుక్కి దున్నేనాటి నుంచి తన పంటను మార్కెట్లో అమ్ముకునే వరకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో అవసరమైన న్యాయ సాయం అందించడమే ధ్యేయంగా బమ్మెర గ్రామంలో ఈ ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ఏర్పాటవుతోంది. భూ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లిన సమయంలో, మార్కెట్లో మోసాలు చోటు చేసుకుంటే, పంటల బీమా అమలు కానప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ రైతులకు అవసరమైన న్యాయ సాయాన్ని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు. న్యాయ సేవలను అందించడంతో పాటు రైతు, భూ చట్టాలపై అవగాహన కల్పి చడం, రైతులను చైతన్యపర్చడం లాంటి కార్యక్రమాలను కూడా ఈ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గ్రామంలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సాయం ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం పారా లీగల్ కార్యకర్త అందుబాటులో ఉంటారు. రైతుల సమస్యలను నమోదు చేసుకునే ఈ కార్యకర్త సదరు వివరాలను నల్సార్, లీగల్ సర్విసెస్ అథారిటీ, లీఫ్స్ సంస్థలకు పంపనున్నారు. నల్సార్ విద్యార్థులు వాటిని పరిశీలించి సహాయాన్ని అందిస్తారు. రాష్ట్రంలోని 25 న్యాయ కళాశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు రైతులకు చట్టాలపై అవగాహన కల్పి చేందుకు గాను క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. గత 17–18 ఏళ్లుగా భూ సమస్యలపై పనిచేస్తోన్న లీఫ్స్ సంస్థ మరికొంత వ్యవసాయ చట్టాల అమలుపై గ్రామీణ స్థాయిలో పనిచేయనుంది. రైతులకు న్యాయ సేవల దిశగా మొదటి ప్రయత్నం రైతులకు చట్టాలతో అవసరం పెరిగింది. కానీ వారి అవసరాలు తీర్చే స్థాయిలో సౌకర్యాలు పెరగలేదు. న్యాయ సేవలూ అందుబాటులో లేవు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ మొదటి ప్రయత్నం. ఇది విజయవంతం అయితే బమ్మెరే కాదు దేశమంతటా ఇలాంటి సేవలు అందించే బ్లూప్రింట్ తయారవుతుంది. – లీఫ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్ -
షాకింగ్ ఘటన: చూస్తుండగానే...హఠాత్తుగా కుర్చిలోంచి కుప్పకూలిపోయాడు
ఒక వ్యక్తి క్లినిక్ వచ్చి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....61 ఏళ్ల దిలీస్ కుమార్ మదానీ పంటి నొప్పికి చికిత్స కోసం క్లినిక్‌కి వచ్చాడు. అతను క్లినిక్ వెలుపల కుర్చిలో పేపర్ చదువుతూ కూర్చొన్నాడు. కాసేపటికి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అంతే అందరూ చూస్తుండగానే కుర్చిలోంచి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటేనే క్లినిక్ సిబ్బంది అతనికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు మృతుడు సోదరుడు మహేంద్ర మదానీ మాట్లాడుతూ...దిలీప్ గార్మెంట్ వ్యాపారం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. వారంతా బార్మెర్లోని పంచపద్రలో ఉంటారని అన్నారు. ఒక పనిపై బార్మెర్ వచ్చాడని, అనుకోకుండా పంటినొప్పి రావడంతో క్లినిక్‌కి వచ్చినట్లు తెలిపారు. అతను ఉదయం బాగానే ఉన్నాడని అకస్మాత్తుగా ఇంత ఘోరం జరిగిపోయిందని భాదగా చెప్పారు. इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे। कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV — Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022 (చదవండి: మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు..ఉద్రిక్తంగా యూపీ) -
‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు
హిందూపురం: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని కలెక్టర్ బసంత్‌కుమార్ అన్నారు. విలేజ్ క్లినిక్‌లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్‌ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్‌తో సంపూర్ణ రక్షణ పుట్టపర్తి అర్బన్: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక పాఠశాల వద్ద ఓపీ నిర్వహించగా, మధ్యాహ్నం వరకూ గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు వంటి వాటికి మందులు తీసుకున్నారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని, గర్భిణులు, బాలింతల ఇళ్లకే వెళ్లి వైద్యలు పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి, నిరుపేదలకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నెలా వైద్య బృందం గ్రామానికి విచ్చేసి రోజంతా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మానాయక్, పుట్టపర్తి వైద్యాధికారి నాగరాజు నాయక్, సీహెచ్ఓ నగేష్, రమణయ్య, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి ) -
ట్రాన్స్జెండర్లకు ఆరోగ్యమస్తు.. తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్
సాక్షి, వరంగల్: ట్రాన్స్జెండర్లను సమాజం నేటికీ చిన్నచూపు చూస్తోంది. రీ అసైన్మెంట్ సర్జరీ కారణంగా తరచూ అనారోగ్యం బారినపడుతున్నప్పటికీ వైద్యం పొందడంలోనూ అడుగడుగునా వారికి వివక్ష ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు ఎదురవుతున్న శారీరక, మానసిక సమస్యలకు చికిత్స అందించేందుకు వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ముందుకొచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఈ క్లినిక్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఎంజీఎంలోని 133, 134 ఓపీ రూమ్‌లలో ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాన్స్జెండర్లకు ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు అందించనుంది. సైకలాజికల్ కౌన్సెలింగ్‌తోపాటు హర్మోనల్ థెరపీ, సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ, బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, మ్యాస్టెక్టమీ, హిస్టరెక్టమీ, ప్లాస్టిక్ సర్జరీ, చర్మవ్యాధులు వంటి వాటికి స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తమిళనాడులో ఈ సేవలు అందుతుండగా రాష్ట్రంలో మాత్రం ఎంజీఎం సొంతంగా మొదలు పెడుతోంది. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు... ఎంజీఎంలో వారానికోరోజే ఈ క్లినిక్‌లో ఓపీ సేవ లు అందనున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ట్రాన్స్జెండర్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం హెల్ప్‌లైన్ నంబర్ 99631 64111ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు ఫోన్‌చేసి పేరు, అనారోగ్య సమస్య చెబితే క్లినిక్ పనివేళల సమాచారం చెబుతారు. ఓపీ సేవ ల్లో ఎస్టీఐ కౌన్సిలర్ కీర్తి సతీశ్‌కుమార్, తెలంగా ణ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ మొబిలైజర్ పూర్ణిమారెడ్డి చేదోడువాదోడుగా ఉండనున్నారు. సంపూర్ణ వైద్యసేవలు అందుతాయి.. ఇప్పటికే హెచ్ఐవీ పాజిటివ్ ట్రాన్స్జెండర్లకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఇతర వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ క్లినిక్‌తో వారికి సంపూర్ణ వైద్యసేవలు అందినట్టవుతాయి. ఇందుకోసం మా సిబ్బంది కృషి చేస్తారు. – వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
ఆసుపత్రిలో సంగీత కచేరీలు...అక్కడ రోగులకు అదే ఔషధం!
సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్ క్లినిక్ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్లు, గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్‌లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా. (చదవండి: కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి) -
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన కోతి: వీడియో వైరల్
మనుషులైతే ఏదైనా గాయమైతే చికిత్స కోసం ఆస్పుత్రులకు వెళ్లడం కామన్. కానీ జంతువులకు గాయలైతే వాటి పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. జూలో ఉండే వాటికైతే అక్కడ ఉన్న అధికారులే దగ్గరుండి వాటి బాగోగులు చూసుకుంటారు. బయట ఉండే మిగతా జంతువులైతే ఏదైనా గాయమైతే అలానే నిరసించి ఉండిపోతాయి తప్ప చికిత్స అందించేవారు ఉండరు. కానీ ఇక్కడొక కోతి గాయాల బారిన పడితే మిగతా జంతువుల మాదిరిగా అలానే ఉండిపోలేదు. మనుషుల వలే ఆస్పుత్రికి వచ్చి చికిత్సకోసం వైద్యుడికై నిరీక్షించింది. వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని ఒక కోతి తన గాయాలకు చికిత్స చేయించుకోవడం కోసం ససారమ్‌లోని ఆస్పత్రికి వెళ్లింది. ఆ కోతి చికిత్స కోసం తన బిడ్డతో సహా వచ్చింది. పైగా వైద్యుడి కోసం ఓపికగా నిరిక్షించింది కూడా. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆస్పత్రిలో తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఆ కోతికి వైద్యం అందించిన డాక్టర్ అహ్మద్ మాట్లాడుతూ...మొదట ఆ కోతికి చికిత్స అందించాలంటే చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఆ కోతిని కాస్త నిశితంగా గమనించి చూస్తే కోతి ముఖానికి గాయమైందని అర్థమైంది. ఒక ఇంజక్షన్ చేసి అయింట్ మెంట్ రాసిన తర్వాత పేషంట్ల మంచం పైనే విశ్రాంతి తీసుకుంది. కాసేపటి తర్వాత ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా వెళ్లిపోయింది. बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5 — manish (@manishndtv) June 8, 2022 (చదవండి: గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...) -
ఆ క్లినిక్‌లో ఫీజు ‘ఒక్కరూపాయే’
భువనేశ్వర్ : ఒక రూపాయికి ఏమోస్తుందో టపీమనీ చెప్పమంటే..ఏంచేప్తాం...కాస్త ఆలోచించి..ఏ చాక్లెట్ పేరో చెప్పేస్తాం..కానీ ఆరోగ్యాన్ని అందించే క్లినిక్ ఫీజు ఒక్క రూపాయి అంటే ఏవరైన నమ్ముతారా? అయితే ఈ స్టోరి చదివేయండి మరీ..తాను అందరిలా కష్టపడి డాక్టర్ చదివాడు.. పేదలకు ఏదైనా చేయాలనుకున్నాడు. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక రూపాయితోనే క్లినిక్ ప్రారంభించి అందరి మన్ననలని పొందుతున్నాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్( విఐయంఎస్ఎఆర్) ఉంది. దీనిలో శంకర్ రామచందాని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు. ఇతను పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బూర్లా గ్రామంలో ఒక రూపాయికే క్లినిక్‌ను ప్రారంభించాడు. తన పనిగంటలు మినహయించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు పేదవారికోసం క్లినిక్‌లో సేవచేయడానికి నిర్ణయించుకొన్నాడు.ఈ క్లినిక్‌లో వృద్దులు, దివ్యాంగులు, నాణ్యమైన వైద్యంపొందలేని వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపాడు. తాను కేవలం మాస్ప్రజల, పేదల డాక్టర్‌నని అన్నాడు. విమ్సారా ఆసుపత్రిలో ఒపిడిలో వృద్దులు గంటల కొద్ది నిరీక్షించలేని వారందరికి ఈ క్లినిక్‌లో చికిత్స చేస్తున్నానని అన్నాడు. రామచందాని భార్య సిఖా చందాని డెంటల్ సర్జన్..ఈమె కూడా భర్త అడుగు జాడల్లో నడుస్తోంది. పేదలకు తానుకూడా సేవలు అందిస్తొంది. కాగా, 2019లో రోడ్డుపై పడి ఉన్న ఒక కుష్ఠురోగిని రామచందాని తన స్వహస్తలతో అతడిని పట్టుకొని వారింటికి వెళ్ళి దిగబెట్టి వచ్చాడు. అప్పుడు రామచందాని తండ్రి దివంగత బ్రహ్మనంద్ రామచందాని ఒక నర్పింగ్ హోమ్‌ని ప్రారంభించాలని కోరాడు. నర్సింగ్ హోమ్ ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పేదలకు ఒక రూపాయితో క్లినిక్‌ను ప్రారంభించానని అన్నాడు. ఈ రూపాయికూడా పేదలకు తాము ఉచితంగా సేవ చేసుకుంటున్నామనే భావన ఉండకూడదనే తీసుకుటున్నట్లు తెలిపాడు. గత సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో డ్యూటికన్న కూడా ఎక్కువ సమయాన్ని ఆసుపత్రిలోనే సేవలు చేసి అందరి మన్ననలను పొందాడు రామచందాని. అంతేకాకుండా ఒక కొవిడ్ సొకిన పేషేంట్ ని తన కారులో విమ్సర్ ఆసుపత్రికి చేర్చి అందరిచేత శభాష్ అనిపించుకొన్నాడు. -
వెంకటాపురంలో వైఎస్ఆర్ క్లినిక్‌ను ప్రారంభించిన మంత్రి అవంతి
-
గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం
-
'వైఎస్సార్ క్లినిక్'ను ప్రారంభించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేదే లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదరక పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్సార్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. (ఏపీ టూరిజంలో అవినీతిపై విచారణ) త్వరలోనే ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలు మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్సార్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్సార్సీపి సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) -
అపోలో ‘సొసైటీ క్లినిక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో క్లినిక్ భారీ నివాస సముదాయాల్లో సొసైటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవల్లో ఉన్న అప్నా కాంప్లెక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, పుణే, చెన్నైలో వీటిని నెలకొల్పుతారు. ఈ క్లినిక్స్‌లో వైద్యుల కన్సల్టేషన్, రక్తపరీక్షల కోసం నమూనాల సేకరణ, హెల్త్ చెక్ ప్యాక్స్, ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు, వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మూడేళ్లలో హైదరాబాద్‌లో ఇటువంటి కేంద్రాలు 75 దాకా ఏర్పాటు చేస్తామని అపోలో క్లినిక్ సీవోవో ఆనంద్ వెల్లడించారు. మరో ఎనిమిది నగరాలకు విస్తరించడం ద్వారా 2021 నాటికి 500 కేంద్రాల స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. -
‘సహజం’ మరి.. దిగ్గజాలూ ఇటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాక్ టు బేసిక్స్... అనేది ఆయుర్వేద ఉత్పత్తులకు అమాంతం డిమాండ్ పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు, ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు, హెయిర్ ఆయిల్స్‌లో వినియోగదార్లు ‘నేచురల్’ కోరుకుంటుండటంతో కంపెనీలు దీనిపై మరింత ఫోకస్ పెడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద, సహజ ఉత్పత్తుల వాడకం ఉన్నప్పటికీ, యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి రావడం, పతంజలి రాకతో భారత మార్కెట్లో వీటకి ఊపొచ్చింది. ఇక్కడున్న అపార అవకాశాల నేపథ్యంలో దిగ్గజ కంపెనీలూ నేచురల్ బాట పట్టడం విశేషం. ప్రపంచంలో ఆయుర్వేద ఉత్పత్తుల తొలి ఈ–కామర్స్ వేదికైన ‘ఆల్ఆయుర్వేద.కామ్’ అమ్మకాల్లో హైదరాబాద్ వాటా ఏకంగా 40 శాతం ఉండటం గమనార్హం. ఇదీ దేశీయ మార్కెట్.. భారత ఆయుర్వేద, సహజ ఉత్పత్తుల మార్కెట్ 13–15 శాతం వార్షిక వృద్ధితో సుమారు రూ.50,000 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా హెయిర్ ఆయిల్స్ వాటా రూ.30,000 కోట్లు. ఆయుర్వేద ఔషధాలు రూ.10,000 కోట్లు, ఆహార పదార్థాలు రూ.1,000 కోట్లు నమోదు చేస్తున్నాయి. మిగిలిన వాటా పర్సనల్ కేర్ ఉత్పత్తులది. 2020 నాటికి మొత్తం మార్కెట్ రూ.70,000 కోట్లకు చేరుతుందని ‘కపివ’ ఫౌండర్ శ్రే బధానీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డాబర్, బైద్యనాథ్, హిమాలయ, ఇమామీ, చరక్, విక్కో, హమ్దర్ద్ వంటి ప్రముఖ కంపెనీలు ఆయుర్వేద, సహజ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంప్రదాయ చైనా మందులకు ఆదరణ ఉంది. దీన్ని సానుకూలంగా తీసుకున్న భారతీయ కంపెనీలు... యూఎస్, సింగపూర్, హాంకాంగ్, యూకే తదితర దేశాలకు ఎగుమతుల్ని పెంచటంపై దృష్టి పెట్టాయి. హాలీవుడ్లో పాపులర్ ప్లాస్టిక్ సర్జన్ అయిన భారత సంతతికి చెందిన డాక్టర్ రాజ్ కనోడియా... ఉసిరితో చేసిన సౌందర్య సాధనాలను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం. తీవ్రమైన పోటీ..: బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి దూకుడు మీద ఉంది. అవకాశమున్న అన్ని విభాగాల్లోకీ ప్రవేశిస్తోంది. ఆయుర్వేద, నేచురల్ప్రొడక్టులను విక్రయిస్తున్న ఆల్ఆయుర్వేద.కామ్ భారత్‌తోపాటు విదేశీ కస్టమర్లకూ చేరువవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ ఆయుర్వేద ఉత్పత్తులతో లీవర్ ఆయుష్ బ్రాండ్‌ను పరిచయం చేసి... బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. కేరళకు చెందిన ఇందులేఖ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనిలీవర్ రెండేళ్ల కిందట కొనుగోలు చేయటం తెలిసిందే. కోల్గేట్–పామోలివ్ నుంచి కోల్గేట్ వేదశక్తి, సిబాకా వేదశక్తి, సెన్సిటివ్ క్లోవ్ పేరుతో కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. ఇక దేశీ దిగ్గజం డాబర్.... ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌తో చేతులు కలిపి యూఎస్ విపణిలో ఉత్పత్తులు విక్రయిస్తోంది. మెడిమిక్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న చోళాయిల్ ఇతర విభాగాలకు విస్తరిస్తోంది. ఇమామీ తన పాపులర్ బ్రాండ్స్ కేశ్ కింగ్, బోరో ప్లస్, నవరత్న, ఝండూబామ్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, మెంథోప్లస్ ఉత్పత్తుల ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివిండ్ ఫౌండేషన్ ప్రమోట్ చేస్తున్న శ్రీశ్రీ ఆయుర్వేద బ్రాండ్ కూడా విదేశాల్లోకి ప్రవేశించింది. క్లినిక్స్కూ కార్పొరేట్ కిక్కు...! ఉత్పత్తుల విస్తరణ, కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆయుర్వేద క్లినిక్స్ సైతం కార్పొరేట్ స్థాయిని సంతరించుకుంటున్నాయి. కేరళ ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, జీవ ఆయుర్వేద, కీవ ఆయుర్వేద వంటి కంపెనీలు క్లినిక్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. బైద్యనాథ్‌కు చెందిన కపివ బ్రాండ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా క్లినిక్స్‌ను ప్రారంభిస్తోంది. కాగా, సహజ వనమూలికలతో తయారైన సౌందర్య సాధనాల విపణి సుమారు రూ.9,000 కోట్లుంది. ఈ విభాగంలోకి నియోవేద, జస్ట్ హెర్బ్స్, డిసర్ట్ స్లె్పండర్, సోల్ట్రీ, ఫస్ట్ వాటర్ సొల్యూషన్స్ వంటి కొత్త బ్రాండ్లు ప్రవేశించాయి. ఆయిల్స్దే హవా.. దేశంలో సహజ ఉత్పత్తుల విపణిలో రూ.30వేల కోట్ల వాటాతో హెయిర్ ఆయిల్స్ హవాయే నడుస్తోంది. నిజానికి పట్టణ ప్రాంతాల్లో తల నూనెల వాడకం కొన్నేళ్లుగా తగ్గుతోంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనెతోపాటు నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారైన నూనెల రాకతో వాడకం తిరిగి పుంజుకుందని డాబర్ ఇండియా హెయిర్ ఆయిల్స్, షాంపూస్ మార్కెటింగ్ హెడ్ రజత్ నందా తెలిపారు. చుండ్రు, తలనొప్పి, ఒత్తిడి, వెంట్రుకలు రాలడం, బట్టతల వంటి సమస్యల పరిష్కారానికి సహజ, ఆయుర్వేద ఉత్పత్తులతో తయారైన నూనెలపై ఆధారపడుతున్నారని చెప్పారు. తలనూనెల పరిశ్రమలో 80 శాతం వ్యవస్థీకృత రంగానిదేనని ఆయన వెల్లడించారు. -
మా క్లినిక్‌కు వచ్చేయండి..
♦ గర్భిణులపై ఘోష ఆస్పత్రి వైద్యుల ఒత్తిడి ♦ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటే పట్టించుకోని వైనం ♦ మాట వినని వారికి సేవల్లోనూ వివక్ష ♦ క్లినిక్‌లలో శస్త్రచికిత్సలు.. పేదలపై బిల్లుల భారం ♦ వైద్యులపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు ఇది ప్రభుత్వాస్పత్రి.. ఇక్కడ వైద్యసేవలు బాగోవు.. ఎవరూ పట్టించుకోరు.. మా మాట వినకుంటే మీకు ఘోసే మిగులుతుంది.. మీ కోసమే చెబుతున్నాం.. ప్రయివేటు క్లినిక్‌కు వచ్చేయండి.. గర్భిణులకు శస్త్రచికిత్స చేసి పురుడుపోస్తాం.. తల్లీపిల్లలను రక్షిస్తాం.. మంచి సేవలు అందిస్తాం.. ఇదీ విజయనగరం జిల్లాలోని ఘోష ఆస్పత్రిలో చేరిన గర్భిణులు, వారి బంధువులకు వైద్యులు ఇచ్చే సూచన, సలహా. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదలకు ఉత్తమ సేవలందించాల్సిన వైద్యులు ఆర్థిక భారం వేస్తున్నారు. సొమ్ము సంపాదనే లక్ష్యంగా డాక్టర్ వృత్తికే మచ్చతెస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలను నిర్వీర్యం చేస్తూ పేదల ప్రాణాలను పణంగా పెడుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం ఫోర్ట్: ‘గజపతినగరం మండలానికి చెందిన ఓ గర్భిణి ప్రసవం ఇటీవల ఘోష ఆస్పత్రిలో చేరింది. ఆమెను రెండు, మూడు రోజుల వరకు వైద్యులు పట్టించుకోలేదు. అ తర్వా త ఓ వైద్యురాలు తన క్లినిక్‌కు వస్తే బాగా చూస్తానని చెప్పి అక్కడకు తీసుకెళ్లిపోయింది. క్లినిక్‌లో ప్రసవం జరిపించి రూ.27వేలు బిల్లు వసూలు చేశారు. ఆస్పత్రిలో అయితే తమకు ఉచితంగా ప్రసవం అయ్యేదని, క్లినిక్‌లో ప్రసవం జరిపించడం వల్ల రూ.27 వేలు ఖర్చుయిందని, అప్పుచేసి డబ్బులు కట్టామంటూ గర్భిణి బంధువులు డీఎంహెచ్ఓకు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఇది వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే. తరచూ ఆస్పత్రిలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్టు పలువురు గర్భిణులు, బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చే అధికశాతం మంది గర్భిణులను ఏదో ఒక వంక చూపి ప్రయివేటు క్లినిక్‌లకు రిఫర్ చేస్తున్నారని వాపోతున్నారు. గర్భిణులు చికిత్స పొందే వార్డుల్లోకి వైద్యులు ప్రతి రోజు వెళ్లినా పట్టించుకోరనే అపవాదు ఉంది. కొంతమంది వైద్యులు అయితే గర్భిణులతో నేరుగా మా క్లినిక్‌కు రావచ్చు కదా.. బాగా చూస్తానని చెబుతున్నారు. కొంతమంది ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక వైద్యుల చెప్పిన విధంగా క్లినిక్‌లకు వెళ్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నంతసేపు అంతగా పట్టించుకోని వైద్యులు క్లినిక్‌కు వచ్చిన వెంటనే ప్రసవం జరిపించేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో అయితే ఉచితంగా ప్రసవం జరిపించాలి. అదే క్లినిక్‌ల్లో అయితే వేలకు వేలు ఫీజులు వస్తాయి. సాధారణ ప్రసవం అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు, సిజేరియన్ అయితే రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. దీని వల్ల రెక్కాడితేగాని డొక్కాడాని బడుగుజీవులు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక అప్పులు పాలువుతున్నారు. విచారణ జరిపిస్తాం.. గజపతినగరానికి చెందిన ఓ గర్భిణిని ఘోష ఆస్పత్రి నుంచి క్లినిక్‌కు తీసుకెళ్లి ప్రసవం అనంతరం రూ.27 వేలు వరకు బిల్లు వసూలు చేశారని గర్భిణి బంధువు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతాం. ఆస్పత్రిలో సక్రమంగా వైద్యసేవలు అందేలా చూస్తాం. –డాక్టర్ సి.పద్మజ, డీఎంహెచ్‌వో -
ప్రకాశం ఏదీ?
ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న జిల్లా ఇది. కానీ... పాలకులకు ఆయనకున్న దేశభక్తి లేదు. ప్రజలంటే ఆయనకున్న అనురక్తి లేదు. మూత్రపిండాల వ్యాధితో పిల్లలు సైతం రాలిపోతున్న జిల్లా ఇది. ఈ చీకటి ప్రభుత్వం కొంచెం ప్రకాశం చూస్తే బాగుండు. ప్రకాశం జిల్లాను చూస్తే బాగుండు. మెకానిక్కు పెద్ద కష్టం పేద కుటుంబంలో పుట్టి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న 20 ఏళ్ల షేక్ షంషూర్ కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఈ యువకుడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రోజు వారీ కూలీ. మెకానిక్ షాపులో పని చేసే షంషూర్ నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు చికిత్స చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కిస్తే సరిపోతుందని చెప్పి రెండుసార్లు రక్తం ఎక్కించారు. కొద్దిరోజుల తరువాత ఏ ఆహారం తిన్నా వాంతి చేసుకోవడం, అందులో రక్తం కనిపించడంతో బద్వేలు నుంచి వచ్చిన భూతవైద్యుని ఆశ్రయించారు. అప్పటికి తగ్గక పోవడంతో ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు వైద్యశాలలో చూపించారు. ఆ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు పాడయ్యాయి వెంటనే మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో వేరే హాస్పిటల్‌కు వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దుతో చికిత్సకు డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షంషూర్ నెల్లూరులో చికిత్స పొందుతున్నాడు. నీటి సమస్యే ప్రధాన కారణం.. కలుషితమైన నీటివల్లే తన కుమారుడి కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారని షంషూర్ తండ్రి ఇబ్రహీం ఆవేదనగా తెలిపాడు. తాము పంచాయతి వారు సరఫరాచేసే కుళాయి నీరు తాగే వారమనీ ఆ నీరు వాసనగా ఉండేదని తెలిపాడు. షంషూర్కు మెడ దగ్గర రంధ్రం వేసి ఇప్పటివరకు 24 సార్లు డయాలసిస్ చేయించామనీ వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి ఉంటుందనీ వెళ్లిన ప్రతిసారి 700 రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపాడు. ఇదిగాక వారానికి 2,500 రూపాయల విలువగల ఇంజక్షన్, 500 రూపాయల మందులు, నెలకు ఒకసారి 3,500 రూపాయల విలువగల ఇంజక్షన్ వాడాల్సి వస్తోందని అంత ఖర్చు తాము ఏమాత్రం భరించలేమని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటివరకు నెల్లూరులో చికిత్సకు 44 వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు. అయితే ప్రతిసారి మెడద్వారా డయాలసిస్ చేయడం కుదరదని, చెన్నై వెళ్లి చేతిలో ఆపరేషన్ ద్వారా పైపు ఏర్పాటు చేసుకొని వస్తే దాని ద్వారా డయాలసిస్ చేస్తామని నెల్లూరు వైద్యులు తెలిపారని చెప్పాడు. కూతురు పెండ్లి డబ్బుతో చికిత్స.. కూతురు ఆషా పెండ్లి కోసం 3 లక్షల రూపాయలు దాచి పెట్టామనీ పెళ్లి కూడా కుదిరిందనీ అయితే కుమారునికి వ్యాధి బయటపడటంతో చికిత్సకు డబ్బులు అవసరమని పెండ్లిని రద్దు చేసుకున్నామని ఇబ్రహీం తెలిపాడు. తాను కూడా తమ్ముడి కోసం మహారాష్ట్రలో చేస్తున్న పనిని వదిలేసి వచ్చానని అన్న షబ్బీర్ చెప్పాడు. జీవన్ ఆధార్‌లో రిజిస్ట్రేషన్ విఫలం.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవన్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో కిడ్నీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించడంతో అక్కడికి వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నామని ఎవరిని అడిగినా ఒకరిపై ఒకరు చెబుతున్నారే తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, ఎంఎల్ఏ, ఎంపి లెటరు తీసుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పారన్నాడు. చివరికి ఒక స్నేహితుడి సహాయంతో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు సహకారంతో జగన్ సార్‌ను కలుసుకుని తన సమస్యను చెప్పగలిగామని ఇబ్రహీం తెలిపాడు. ప్రభుత్వసాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరోగ్యశ్రీ వల్లే బతుకుతున్నా... గత నాలుగేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదుకునే వారు లేక బాధపడుతున్నానని కిడ్నీ బాధితుడు మల్లెల ఎలేజర్ అన్నాడు. హనుమంతునిపాడు మండలం హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన మెల్లెలఎలేజర్ది నిరుపేద కుటుంబం. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మరియమ్మ, 5 మంది సంతానం ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పరీక్షలు చేయించుకుంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాని చెప్పారు. దాంతోవారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే డబ్బులు లేక మూడుసార్లు డయాలిసిస్ మానుకున్నాడు. దీంతో పొట్టంతా వాపు వచ్చింది. కదలలేని పరిస్థితిలో మంచం పట్టి ఉన్నాడు. కుటుంబానికి ఎటువంటి ఆదాయం లేదు. భార్యాపిల్లలు సంపాదించిన రోజువారీ కూలీతో పోషణ జరుపు కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ కార్డు వలనే ఇంత కాలం గొంతులో ఊపిరుందని, అది లేకుంటే ఎప్పుడో మృతి చెందేవాడినని ఎలేజర్ అన్నాడు. కుటుంబం గడవక పిల్లల్ని చదువు మాన్పించి కూలి పనులకు పంపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన వీరపనేని లింగయ్య కుటుంబంలో నలుగురికి కిడ్నీ వ్యాధి సోకింది. లింగయ్యకు, అతడి భార్య నాగరత్తమ్మకు, ఐదో కుమారుడు గోపాల్‌కు, లింగయ్య వదిన నారాయణమ్మకు కిడ్నీ వ్యాధి సోకింది. ఒకే కుటుంబంలో నలుగురికి ఈ వ్యాధి సోకడంతో కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. లింగయ్య మిగతా నలుగురు కుమారులు తోచిన సంపాదన చేస్తూ వీరికి వైద్యం చేయిస్తున్నారు. మూడేళ్ల కిందట గోపాల్‌కు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్పటికే కుదిరిన పెళ్లి ఆగిపోయి తల్లిదండ్రులు లింగయ్య, నాగరత్తమ్మలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒకపక్క తమ ఇద్దరికీ అదే వ్యాధి సోకి మృత్యువుకు చేరువ అవుతుంటే యుక్తవయస్సులో ఎటువంటి సంతోషాలకు నోచుకోని తన బిడ్డ ఇలా ఈ వ్యాధి బారిన పడటం తల్లిదండ్రులను కలచివేసింది. భారమైన వైద్యఖర్చులు.. ఒకే కుటుంబంలో నలుగురికి వ్యాధి సోకడం వల్ల ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో అందరికీ వైద్యం చేసే స్తోమత లేని లింగయ్య దంపతులు సతమతమవుతున్నారు. తమ పిల్లలకు తాము భారంగా మారుతున్నామని ఏమి చేయాలో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సాయం చేస్తే తప్ప కోలుకోలేని ఇలాంటికుటుంబాలు ఈ ప్రాంతంలో కొల్లలు. తిరుపతమ్మకు ఆయువు పోయండి... బతకాలనే ఆశకు ఆయువు పోయండి అంటూ ఆ అమ్మాయి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని పెదవరిమడుగు గ్రామానికి చెందిన నూకతోటి తిరుపతమ్మ వయసు 19 సంవత్సరాలు. వీరిది నిరుపేద కుటుంబం. తల్లి ఆదిలక్ష్మి వ్యవసాయ కూలీ. కొన్నేళ్ల కిందటే ఇల్లు విడిచి వెళ్లిపోయిన తండ్రి ఆచూకీ నేటికీ లేదు. ఈనెల 19వ తేదీ తిరుపతమ్మకు కాళ్లు, చేతులు వాపు రావడంతో ఒంగోలులోని కిడ్నీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అమ్మాయికి మూత్రపిండాలు రెండూ చెడిపోయినట్లు తెలపడంతో తల్లి తల్లడిల్లిపోయింది. తమకు సెంటు భూమి కూడా లేదని, కూలిపని చేసి ఇద్దరు కుమార్తెలను పోషించి పెద్ద చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపాల్సిన వయస్సులో కూతురు గురించి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చిందని ఆమె కన్నీర మున్నీరయ్యింది. ఈవిషయాన్ని పీసీపల్లి సభలో శుక్రవారం వైఎస్ జగన్‌కు విన్నవించింది. ►ప్రకాశం జిల్లాలో మితిమీరిన ఫ్లోరైడ్‌తో ప్రాణనష్టం. ► రెండేళ్లలో కిడ్నీ వ్యాధులతో 420 మంది మృతి ► అనధికారికంగా వెయ్యిమందికి పైనే ► చావుకు దగ్గరగా వందల్లో బాధితులు ► కనిగిరి, కొండపి ప్రాంతాల్లో అధికం ► రోగులకు ఉచిత వైద్యం లేదు... డయాలసిస్ లేదు ► తూతూ మంత్రంగా ప్రభుత్వ వ్యవహారం -
ఫేస్బుక్ వ్యసనపరుల కోసం క్లినిక్!
కాన్స్టాంటిన్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఫేస్‌బుక్‌కు ఉన్నటువంటి ఆదరణ, ఆకర్షణ మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు లేదనే చెప్పాలి. అయితే దీనిని పరిమితంగా వాడినంత వరకు పరవాలేదు గానీ.. శృతి మించితే మాత్రం మత్తుపదార్దాలకు బానిసైన వారికంటే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికోసం చికిత్స అందించడానికి ఫేస్ బుక్ డీఅడిక్షన్ క్లినిక్‌లు వెలుస్తున్నాయి. అల్జీరియాలోని కాన్స్టాంటిన్లో ఇటీవలే ఓ ప్రైవేట్ క్లినిక్‌ను తెరిచారు. అయితే ఆ క్లినిక్ అందించే సేవల లిస్ట్‌లో మత్తు పదార్థాలకు(డ్రగ్స్) బానిసైన వారు, ఆల్కహాల్ వ్యసనపరులతో పాటు.. ఫేస్బుక్ బాధితులకు కూడా చికిత్స అందించబడుతుందని తెలిపారు. ఫిజికల్ డ్రగ్స్ కంటే ఎక్కువగా ఈ ఫేస్బుక్ వ్యసనపరులకు చికిత్స అవసరమని క్లినిక్ డాక్టర్ రవుఫ్ బొకాఫా వెల్లడించారు. అల్జీరియాలో ఇప్పటికే 10 మిలియన్ల ఫేస్బుక్ యూజర్లు ఉండగా, ఈ సంఖ్య ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోంది. దీంతో ఫేస్బుక్ బాధితులతో క్లినిక్‌కు బాగానే ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్బుక్ బాధితులను.. 'బ్లూ మ్యాజిక్' బారిన పడిన వారిగా ఇక్కడి క్లినిక్‌లో ట్రీట్చేస్తున్నారు. -
అమెరికాలో మళ్లీ షూటౌట్
-
అమెరికాలో మళ్లీ షూటౌట్
- కొలరాడో స్ప్రింగ్స్ లోని ఆసుపత్రిలో సాయుధుడి కలకలం - పోలీసు సహా ముగ్గురి మృతి, 10 మందికి గాయాలు.. దుండగుడి పట్టివేత కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా మరోసారి తుపాకి చప్పుళ్లతో దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రం, కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలోకి ప్రవేశించిన సాయుధుడు.. పలువురిపై కాల్పులు జరిపి, మరొకొందరిని బందీలుగా పట్టుకున్నాడు. శనివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఉదయం 11:45కు) ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుడికి, పోలీసులకు మధ్య కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా ముగ్గురు చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఆసుపత్రి లోపల నక్కిఉన్న దుండగుడి వద్ద భారీ ఎత్తున గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. బందీగా లోపలే ఉండిపోయిన ఓ మహిళ.. తన బంధువులకు ఫోన్ చేసి ఇద్దరు సాయుధులు ఉన్నట్లు చెప్పింది. అధికారుల ద్వారా కాల్పుల ఘటన వివరాలను తెలుసుకున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా.. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ నిర్వాహించాల్సిందిగా ఆదేశించారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ అనంతరం పోలీసులు.. దుండగుణ్ని పట్టుకోగలిగారు. గాయపడ్డ 11 మందికి ప్రాణాపాయం లేదని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ షతెర్స్ చెప్పారు. ఐదు రోజుల కిందట న్యూ ఆర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్క్ లో ఇరు వర్గాలకు మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మరణించిన సంగతి తెలిసిందే. -
జిల్లాలో మరో స్వైన్ ఫ్లూ మరణం
- మూడుకు చేరిన మృతుల సంఖ్య ఒంగోలు సెంట్రల్: జిల్లాలో స్వైన్‌ఫ్లూతో శనివారం ఉదయం మరొకరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే..ఇంకొల్లుకు చెందిన కావూరి కోకిలాదేవి (72) అనే వృద్ధురాలు ఈనెల 23వ తేదీ తీవ్ర జలుబు, దగ్గు, జ్వరంతో ఒంగోలు నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించి స్వైన్‌ఫ్లూగా అనుమానించి చికిత్స ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐడీఎస్పీ సిబ్బంది కోకిలాదేవి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఐపీయం ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు మూడు రోజుల క్రితం నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించిన ఆమె శనివారం ఉదయం మృతిచెందింది. రాష్ట్ర చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ జాయింట్ డెరైక్టర్ జె.వి.వి.ఆర్.కె.ప్రసాద్ శనివారం ఒంగోలు చేరుకుని మృతురాలు చికిత్స పొందిన ప్రైవేటు వైద్యశాలను సందర్శించి, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
కాంట్రాక్ట్ కిడ్నాపేనా?
హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.16 లక్షలు తీసుకుని విడుదల చేసినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వైద్యుడికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా 20 మంది కాల్‌డాటా సేకరించినట్లు సమాచారం. పోలీసులు 10 మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పాత నేరస్తులూ ఉన్నట్లు సమాచారం. హుజూరాబాద్ : వైద్యుడి కిడ్నాప్ వ్యవహారంలో ఫోన్ కాల్‌డాటా ఆధారంగా ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన ఒక ఆటోడ్రైవర్, వల్భాపూర్‌కు చెందిన ఒకరు, కేశవాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు జీల్గులకు చెందిన మరొకరిని పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మాజీ నక్సలైట్ పేరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒక నాయకుడి పేరును సందేహిస్తున్నట్లు సమాచారం. ఎవరి పాత్ర ఎంత అని ఇంకా స్పష్టంకాలేదు. అనుమానితుల ఫోన్నంబర్లకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి సిమ్‌కార్డులు పొందినట్లు తెలిసింది. దీంతో గుర్తింపుకార్డులు లేకుండా సిమ్‌కార్డులు ఇస్తున్న పలువురిని సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందమేనా? డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఉదంతం వెనుక పాత నేరస్తుల పేర్లు వినిపిస్తుండడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు, వైద్యుడికి చేసిన హెచ్చరికలు, డబ్బులు డిమాండ్ చేసిన పద్ధతి చూస్తుంటే దీని వెనుక ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఉండచ్చనే అనుమానాలు లేకపోలేదు. సదరు వైద్యుడిపై కక్ష, కోపాలతో ఎవరైనా కిడ్నాప్‌కు వ్యూహరచన చేశారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. వైద్యుడిని చంపినా.. చంపకున్నా డబ్బులు వస్తాయని కిడ్నాపర్లు మాట్లాడినట్లు తెలుస్తుండటంతో ఇటు వ్యూహరచన చేసిన వ్యక్తుల నుంచి వచ్చే డబ్బులతోపాటు అటు బాధిత వైద్యుడు ఇచ్చే డబ్బుల కోసం కూడా ఆశపడ్డట్లు అర్థమవుతోంది. చివరకు సగం డబ్బులతోనే వ్యూహం బెడిసికొట్టడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పక్కా కాంట్రాక్ట్‌తోనే ఈ కిడ్నాప్ జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఉదంతంపై పోలీసుల విచారణ ఒక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సస్పెన్స్‌కు తెరదించుతామని ఖాకీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలతో జిల్లా పోలీస్‌బాస్ సైతం ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది. -
కడుపులో ఆట్రేను మరిచిన వైద్యురాలు
జనగామ: వరంగల్ జిల్లా జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ నిర్లక్ష్యంగా చేసి ఓ మహిళకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టారు. వివరాలు... జనగామకు చెందిన ఓ ఉపాధ్యాయుడి సతీమణికి ఐదేళ్ల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఈ ఆస్పత్రి.. ప్రభుత్వ వైద్యురాలి పర్యవేక్షణలో నడుస్తోంది. కాగా ఈ వైద్యురాలు ఆపరేషన్ సమయంలో ఆట్రే అనే పరికరాన్ని రోగి కడుపులోనే మరిచి కుట్లేసింది. బాధితురాలికి నొప్పి వస్తుండటంతో ఇటీవల ఓ వైద్యుని సంప్రదించగా.. కడుపులో ఆట్రే ఉందని స్కానింగ్ రిపోర్ట్‌లో తేలింది. ఈ విషయాన్ని గతంలో ఆపరేషన్ చేసిన వైద్యురాలికి చెప్పడంతో సమస్య పరిష్కారానికి ‘సెటిల్మెంట్’ చేసినట్లు సమాచారం. బాధితురాలికి ఆపరేషన్ చేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు రూ.2 ల క్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. -
సహనమూర్తి...సేవాస్ఫూర్తి..!
వైద్యుడు రోగికి మందుల చీటీ రాసిచ్చి తన పాత్ర పూర్తయిందనుకోకుండా మందులు కొనుక్కోమని డబ్బిస్తుంటే ఏమనాలి? డాక్టర్ ఎం. శ్రీనివాసరావు అనాల్సిందే. ఇలా ఎన్నాళ్లు చేస్తారంటే ‘చేయాలనే మనసు ఉండాలే కానీ ఇదేమంత కష్టం కాద’టారాయన. ‘‘నేను ఇదంతా చేస్తున్నది మా అమ్మకోసమే! అమ్మ కోసం చేసే పని భారమనిపించదు. నన్ను డాక్టర్ని చేయడానికి మా అమ్మ పడిన కష్టంతో పోలిస్తే నేను జనానికి చేస్తున్న సహాయంలో అసలు కష్టమే లేదు. చేతినిండా డబ్బు ఉండి నన్ను డాక్టర్ని చేయలేదు, కొడుకుని డాక్టర్ని చేయాలనే తపనతో పైసాపైసా కూడబెట్టి నన్ను చదివించింది. మనసున్న డాక్టర్‌గా పేరు తెచ్చుకోమని కోరింది. అందుకే నేను డాక్టర్నయిన తర్వాత మా నాన్న పేరుతో క్లినిక్ తెరిచాను, అమ్మ పేరుతో చారిటీ ప్రారంభించి ఉచితంగా వైద్యం చేస్తున్నాను’’ అని కూడా అంటారు. హైదరాబాద్‌లోని డి.డి కాలనీలో డాక్టర్ శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగానే మొదట వారి తల్లి వెంకటసుబ్బమ్మ కనిపించారు. మాటలు కలిపాక... ‘‘మాది కడప జిల్లా కొత్తనెల్లూరు, మా వారిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పొనుగోడు. ఆయనకు హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్లో క్లర్కు ఉద్యోగం వచ్చింది. నాకు ఐదుగురు పిల్లలు. శ్రీనివాస్ ఆఖరివాడు. అబ్బాయిని డాక్టర్ని చేయాలని మావారి కోరిక. ఆయన అలా అంటుంటే నాకూ సంతోషంగా ఉండేది. అనుకున్నట్లే మెడిసిన్‌లో చేర్చాం. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. ఏడాదిలోపే మా జీవితంలో పిడుగుపడినట్లయింది. మా వారు హఠాత్తుగా పోయారు. ఇల్లు గడవాలి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇన్ని బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి. కాంపెన్సేటరీ గ్రౌండ్స్ ప్రకారం మా వారి ఉద్యోగం ఇచ్చారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో స్వీపర్ ఉద్యోగం తప్ప మరే ఉద్యోగానికీ అర్హత లేదు. స్వీపర్‌గా నాకు వచ్చే జీతంతో ఇల్లు గడుస్తుంది కానీ చదువుల ఖర్చు భారంగా ఉండేది. నా బాధ చూసి శ్రీనివాస్ మెడిసిన్ మానేసి దొరికిన ఉద్యోగంలో చేరతానని పట్టుపట్టాడు. ‘నిన్ను డాక్టర్ని చేయాలన్న మీ నాన్న కోరిక తీర్చడానికి నేనింత కష్టపడుతున్నాను. నిన్ను డాక్టర్ని చేసినప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. నీ చదువు మాన్పించడం నాకిష్టం లేదు. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసి తెచ్చే జీతం డబ్బుని నేను సంతోషంగా ఖర్చుచేయలేను కూడ. డాక్టర్‌గా సంపాదించిన డబ్బుతో నన్ను పోషించు. డాక్టర్‌గా పదిమందికి సహాయం చేయడమే నాకు సంతోషం. ఈ నాలుగేళ్లు కష్టపడడానికి నేను సిద్ధమే’ అని చెప్పాను. ఇక నా కష్టం అంటావా తల్లీ! నేను ఎవరి కోసం కష్టపడ్డాను, నా బిడ్డ కోసమే. పేదోళ్లకు అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలుసుకుని మసులుకోమని మాత్రం చెప్పేదాన్ని. అప్పటి నా మాట పట్టుకుని ఇంతమందికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడని ఊహించలేదు. టీవీల్లో కనిపించే పెద్దోళ్లు, భరణి సారు, కోడి రామకృష్ణ సారు లాంటి గొప్పోళ్లు ఫోన్ చేసి ‘ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా, నీ బిడ్డ సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి వైద్యం చేస్తున్నాడో! లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్టులకు ఉచితంగా వైద్యం చేస్తాడు అంతా నీ పెంపకంలో గొప్పదనమే’ అని ప్రశంసిస్తుంటే నాకు మనసు నిండిపోతుంటుంది’’ అన్నారామె కళ్లు చెమర్చు తుండగా. రోజుకు మూడుషిఫ్టుల్లో... ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సరూర్‌నగర్‌లో ఇంటి వద్ద ఉచిత వైద్యం, ఆ తర్వాత హాస్పిటల్లో డ్యూటీ. మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం, సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు అంబర్‌పేటలో సొంత క్లినిక్ బాధ్యతలు... ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు డాక్టర్ శ్రీనివాస్. ఈ తల్లీకొడుకులిద్దరూ స్వతహాగా గాయకులు. ఆకాశవాణి కార్యక్రమాల్లో రేడియో అక్కయ్య, అన్నయ్యలతో గొంతుకలిపిన అనుభవం వెంకటసుబ్బమ్మది. ఆమె ఏడేళ్లపాటు రేడియోలో దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు ఆలపించారు. భర్తపోయి, ఉద్యోగంలో చేరిన తర్వాత గాయనిగా కొనసాగడం కష్టమైంది. కానీ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీనివాసరావు జానపద గేయాలు పాడతారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. సినిమాల్లో నటిస్తారు. అయితే అవన్నీ డాక్టర్ పాత్రలే. ఇప్పటికి 45 సినిమాలు, సీరియల్స్‌లో డాక్టర్‌గా కనిపించారు. అమ్మా! నీకు వందనం!! సినీ పరిశ్రమలోని అభిమానులు సన్మానం చేస్తామన్నప్పుడు డాక్టర్ స్పందించిన తీరులో ఆర్ద్రత వ్యక్తమైంది. ‘మీకు కనిపిస్తున్న ఈ రూపం, ఈ వ్యక్తిత్వం, దయాగుణాలకు కారకురాలైన మా అమ్మకు సన్మానం చేయండి’ అన్నారాయన. అలా 2011లో రవీంద్రభారతిలో వెంకటసుబ్బమ్మకు జరిగిన సన్మానాన్ని తలుచుకుంటూ... ‘‘మా అమ్మ అక్కినేనిగారి అభిమాని. నన్ను ఆయనకు పరిచయం చేసుకుని మా అమ్మకు మీ చేతుల మీదుగా సన్మానం చేయమని అడిగాను. మదర్స్‌డే రోజున ఆయన చేతుల మీదుగా జరిగిన సన్మానంలో పిల్లలకు దూరమై వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న అమ్మలెందరో ఉన్నారు. వారికి కూడా కొడుకుగా మారి చేయగలిగింది చేయమని సూచించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి ఉచిత వైద్యం చేయడమే కాదు, మాకొచ్చే శాంపిల్ మందులిచ్చేవాడిని. చాలా వృద్ధాశ్రమాల్లో నిర్వహణ సరిగ్గా లేక వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని తెలిసి, ఓ మోడల్ హోమ్ ప్రారంభించాను. నీకు మించిన బరువును తలకెత్తుకుంటున్నావేమో జాగ్రత్త అంటోంది మా అమ్మ. సంకల్పబలమే నడిపిస్తుందనే నమ్మకంతో సాగిపోతున్నాను’’ అన్నారీ డాక్టర్. - వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎస్ఎస్ ఠాకూర్ మాటల్లో చెప్పలేనంత సంతోషం! అప్పుడు మా శ్రీనివాస్ మెడిసిన్ తొలి ఏడాది చదువుతున్నాడు. నాకు వెన్నెముకకు ఆపరేషన్ అయి బెడ్ మీదున్నాను. అప్పుడే కాలేజ్‌లో ప్రాక్టికల్స్‌కి కోటుతో వెళ్లాలనగానే మా వారు తెచ్చారు. నిన్ను కోటులో చూడాలని ఉందని అడిగాను. ఇంటికెళ్లి కోటుతో వచ్చాడు. అప్పుడు కంటినిండా చూసుకుని, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఆ రోజు పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. - వెంకట సుబ్బమ్మ, డాక్టర్ శ్రీనివాసరావు తల్లి