మనుషులైతే ఏదైనా గాయమైతే చికిత్స కోసం ఆస్పుత్రులకు వెళ్లడం కామన్. కానీ జంతువులకు గాయలైతే వాటి పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. జూలో ఉండే వాటికైతే అక్కడ ఉన్న అధికారులే దగ్గరుండి వాటి బాగోగులు చూసుకుంటారు. బయట ఉండే మిగతా జంతువులైతే ఏదైనా గాయమైతే అలానే నిరసించి ఉండిపోతాయి తప్ప చికిత్స అందించేవారు ఉండరు. కానీ ఇక్కడొక కోతి గాయాల బారిన పడితే మిగతా జంతువుల మాదిరిగా అలానే ఉండిపోలేదు. మనుషుల వలే ఆస్పుత్రికి వచ్చి చికిత్సకోసం వైద్యుడికై నిరీక్షించింది.
వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని ఒక కోతి తన గాయాలకు చికిత్స చేయించుకోవడం కోసం ససారమ్‌లోని ఆస్పత్రికి వెళ్లింది. ఆ కోతి చికిత్స కోసం తన బిడ్డతో సహా వచ్చింది. పైగా వైద్యుడి కోసం ఓపికగా నిరిక్షించింది కూడా. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆస్పత్రిలో తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఆ కోతికి వైద్యం అందించిన డాక్టర్ అహ్మద్ మాట్లాడుతూ...మొదట ఆ కోతికి చికిత్స అందించాలంటే చాలా భయపడ్డాను.
ఆ తర్వాత ఆ కోతిని కాస్త నిశితంగా గమనించి చూస్తే కోతి ముఖానికి గాయమైందని అర్థమైంది. ఒక ఇంజక్షన్ చేసి అయింట్ మెంట్ రాసిన తర్వాత పేషంట్ల మంచం పైనే విశ్రాంతి తీసుకుంది. కాసేపటి తర్వాత ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా వెళ్లిపోయింది.
बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5
— manish (@manishndtv) June 8, 2022
(చదవండి: గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...)
Comments
Please login to add a commentAdd a comment