Two killed, 31 injured as Russian missile hits clinic in Ukraine - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ క్లినిక్‌పై క్షిపణి దాడి..

Published Sat, May 27 2023 8:40 AM | Last Updated on Sat, May 27 2023 10:19 AM

Russian Missile Hits Clinic In Ukraine Two Killed - Sakshi

ఉక్రెయిన్‌లోని క్లినిక్‌లపై శుక్రవారం రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, సుమారు 30కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖ జెనీవా ఒప్పందాల ప్రకారం.. ఈ దాడిని తీవ్రమైన యుద్ధ నేరంగా పేర్కొంది. యుద్ధంలో సైనికులు, పౌరుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది రష్యా అనేదానికి ఇది చక్కని ఉదాహరణ. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ వీడియోలో ధ్వంసమైన భవనం నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించాయి. మూడంతస్థుల సదరు భవనం పైఅంతస్థుల పూర్తిగా దెబ్బతింది.

ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్‌ వేదికగా దుష్ట దేశం మాత్రమే ఇలా క్లినిక్‌లపై దాడి చేస్తుంది. ఇందులో సైనిక ప్రయోజనం ఉండదు. ఇది నిజంగా రష్యన్‌ టెర్రర్‌. మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధ నేరం అని జెలెన్స్కీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడికి ముందు ఈ క్లినిక్‌లో ఇద్దరు పిల్లల తోసహా 30 మంది ఈ భవనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే సరిగ్గా అదే సమయంలో 69 ఏళ్ల వ్యక్తి ఈ క్లినిక్‌ని దాటుతుండగా హత్యకు గురయ్యాడని, శిథిలాల నుంచి మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ప్రాంతీయ గవర్నర్‌ సెర్హి లైసాక్‌ పేర్కొన్నారు.

కాగా, ఉక్రెయిన్‌ మందుగుండు సామాగ్రి డిపోలపై రాత్రిపూట దాడి చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అంతేగాదు దక్షిణ రష్యాలో ఉక్రెయిన్‌ రాకెట్‌, డ్రోన్లతో దాడి చేసిందని పేర్కొంది. అందువల్లే తాము క్షిపణి దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. పైగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను కూడా తోసిపుచ్చుతోంది రష్య. కానీ ఉక్రెయిన్‌ మాత్రం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ తూర్పు ప్రాంతంలో రష్యా సుమారు 10 క్షిపణులు, 20కి పైగా ‍డ్రోన్‌లు కూల్చివేసినట్లు పేర్కొనడం గమనార్హం. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

(చదవండి: ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్‌ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement