పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్
విద్యుత్, నీటి వనరులే లక్ష్యంగా రష్యా దాడులు
ఐదుగురు మృత్యువాత, 13 మందికి గాయాలు
భారీ నష్టం వాటిల్లిందన్న జెలెన్‌స్కీ
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 100 వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, మరో 100 షహీద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ‘రష్యా మా కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపూరితంగా దాడు లకు తెగబడింది. ఖార్కివ్, కీవ్ మొద లుకొని ఒడెసా, పశ్చిమ ప్రాంతాల వరకు జరిగిన దాడుల్లో భారీగా నష్టం వాటిల్లింది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 13 మంది పౌరులు గాయప డ్డారని చెప్పారు. తమ భూభాగంపై రష్యా పాల్పడిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్రూయి జ్ మిస్సైళ్లు, హైపర్‌సోనిక్ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులు మొత్తం 15 రీజియన్లలో..అంటే దాదాపు దేశంలోని సగం ప్రాంతాల్లో బీభ త్సం సృష్టించినట్లు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్.. ఉక్రెనెర్గో.. దెబ్బతిన్న మౌలిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యవసర విద్యుత్ కోతలను ప్రకటించింది. ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటీఈకే కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. రాజధాని లోని విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్ మేయర్ తెలిపారు.
కీవ్‌పైకి దూసు కొచ్చిన 15 క్షిపణులు, మరో 15 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయన్నారు. కాగా, ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాల నిర్వహణకు ఎంతో కీలకమైన విద్యుత్ వ్యవస్థలను తమ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు ఛిన్నాభిన్నం చేశాయని, లక్ష్యాలను అవి గురి తప్పకుండా ఛేదించాయని రష్యా ఆర్మీ ప్రకటించింది.
22 డ్రోన్లను కూల్చివేశాం: రష్యా
సరటోవ్, యరోస్లావ్ల్ ప్రాంతాలపైకి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఉక్రెయిన్ ప్రయోగించిన 22 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనల్లో పలు నివాస భవనాలు దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని తెలిపింది. కస్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ బలగాలు మరింతగా ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా, ఉక్రెయిన్ బలగాలు, ఆయుధ సామగ్రి రవాణాకు కేంద్రంగా ఉన్న పొక్రొవ్‌స్క్‌కు అతి సమీపంలోకి రష్యా బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం.
Currently, across the country, efforts are underway to eliminate the consequences of the Russian strike. This was one of the largest attacks – a combined strike, involving over a hundred missiles of various types and around a hundred “Shaheds.” Like most Russian strikes before,… pic.twitter.com/0qNTGR98rR
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment