ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్‌–16లు | US approves sending F-16s to Ukraine from Denmark and Netherlands | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్‌–16లు

Published Mon, Aug 21 2023 5:46 AM | Last Updated on Mon, Aug 21 2023 5:46 AM

US approves sending F-16s to Ukraine from Denmark and Netherlands - Sakshi

కీవ్‌/ఇనెడోవిన్‌: రష్యాను దీటుగా ఎదుర్కోలేక డీలాపడిన ఉక్రెయిన్‌లో ఉత్సాహాన్ని నింపే పరిణామం. ఆ దేశానికి అత్యాధునిక ఎఫ్‌–16 యుద్ధ విమానాలను అందజేయాలనే నిర్ణయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీంతో నెదర్లాండ్స్, డెన్మార్క్‌లు అమెరికా తయారీ ఎఫ్‌–16లను ఉక్రెయిన్‌కు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లో పర్యటించారు. ఆదివారం ఆయన నెదర్లాండ్స్‌లోని ఎయిండ్‌ హోవెన్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్‌ రుట్‌తో సమావేశమయ్యారు. అక్కడున్న రెండు ఎఫ్‌–16 విమానాలను పరిశీలించారు. అనంతరం మార్క్‌రుట్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమ షరతులకు ఉక్రెయిన్‌ అంగీకరించిన తర్వాతే ఎఫ్‌–16ల సరఫరా మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆ షరతులు ఏమిటన్నది వెల్లడించలేదు.

తమ వద్ద ప్రస్తుతం 42 ఎఫ్‌–16 విమానాలున్నాయని, వీటిలో కొన్నిటిని ఉక్రెయిన్‌కు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌కు తాము 19 ఎఫ్‌–16లను అందజేస్తామని డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌ ప్రకటించారు. ఎఫ్‌–16 యుద్ధ విమానాల పైలెట్లకు 6 నుంచి 8 నెలల శిక్షణ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నిర్ణయం చారిత్రకమని జెలెన్‌స్కీ కొనియాడారు.

రష్యా దాడుల్లో ఏడుగురు మృతి
ఉక్రెయిన్‌లోని చెరి్నహివ్‌ నగరంపై శనివారం రష్యా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో సోఫియా అనే ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. రష్యాలోని కుర్‌స్క్‌ ప్రాంత రాజధాని కుర్‌స్క్‌ రైల్వే స్టేషన్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి జరిపింది. రైల్వే స్టేషన్‌ పైకప్పునకు మంటలు అంటుకుని అయిదుగురు గాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడితో మాస్కోలోని రెండు ఎయిర్‌పోర్టుల్ని కొద్ది గంటలపాటు మూసివేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement