f-16 war planes
-
ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్–16లు
కీవ్/ఇనెడోవిన్: రష్యాను దీటుగా ఎదుర్కోలేక డీలాపడిన ఉక్రెయిన్‌లో ఉత్సాహాన్ని నింపే పరిణామం. ఆ దేశానికి అత్యాధునిక ఎఫ్–16 యుద్ధ విమానాలను అందజేయాలనే నిర్ణయానికి అమెరికా పచ్చజెండా ఊపింది. దీంతో నెదర్లాండ్స్, డెన్మార్క్‌లు అమెరికా తయారీ ఎఫ్–16లను ఉక్రెయిన్‌కు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా డెన్మార్క్, నెదర్లాండ్స్‌ల్లో పర్యటించారు. ఆదివారం ఆయన నెదర్లాండ్స్‌లోని ఎయిండ్ హోవెన్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మార్క్ రుట్‌తో సమావేశమయ్యారు. అక్కడున్న రెండు ఎఫ్–16 విమానాలను పరిశీలించారు. అనంతరం మార్క్రుట్ మీడియాతో మాట్లాడుతూ.. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరించిన తర్వాతే ఎఫ్–16ల సరఫరా మొదలవుతుందని స్పష్టం చేశారు. ఆ షరతులు ఏమిటన్నది వెల్లడించలేదు. తమ వద్ద ప్రస్తుతం 42 ఎఫ్–16 విమానాలున్నాయని, వీటిలో కొన్నిటిని ఉక్రెయిన్‌కు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌కు తాము 19 ఎఫ్–16లను అందజేస్తామని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ప్రకటించారు. ఎఫ్–16 యుద్ధ విమానాల పైలెట్లకు 6 నుంచి 8 నెలల శిక్షణ అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్, డెన్మార్క్‌ల నిర్ణయం చారిత్రకమని జెలెన్స్కీ కొనియాడారు. రష్యా దాడుల్లో ఏడుగురు మృతి ఉక్రెయిన్‌లోని చెరి్నహివ్ నగరంపై శనివారం రష్యా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో సోఫియా అనే ఆరేళ్ల చిన్నారి సహా ఏడుగురు చనిపోగా మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంత రాజధాని కుర్స్క్ రైల్వే స్టేషన్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. రైల్వే స్టేషన్ పైకప్పునకు మంటలు అంటుకుని అయిదుగురు గాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్ డ్రోన్ దాడితో మాస్కోలోని రెండు ఎయిర్‌పోర్టుల్ని కొద్ది గంటలపాటు మూసివేశారు. -
ఆకలి కేకల పాకిస్థాన్‌ను భారత్ ఆదుకోవాలని చూస్తే.. అమెరికా చేస్తోందేంటి?
పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది? కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్ఠి వానలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తి కోట్లాది మందిని నిరాశ్రయులను చేసేశాయి. ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక పాక్ పాలకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతటి విపత్తు వేళ పాకిస్థాన్ ప్రజల ఆకలి తీర్చడానికి.. అందుకోసం పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఇతర ఉత్పత్తులు అందించడానికి భారత ప్రభుత్వం సంసిద్ధమైపోయింది. పాక్ ప్రభుత్వం అడిగితే చాలు మరుక్షణమే వాటిని అందించి పాక్‌ను ఆదుకోవాలని భారత ప్రభుత్వం సమాయత్తమైపోయింది. ఇపుడు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే పాకిస్థాన్‌ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? వీలైనంతగా ఆహార ఉత్పత్తులను అందించి అక్కడి ప్రజల కడుపులు నింపాలి. ఇంతటి భీకరమైన పరిస్థితులు నెలకొన్న ఉన్న వేళ అగ్రరాజ్యం అమెరికా ఏం చేసిందో తెలుసా? పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఆకలి కేకల పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అవసరమా? ఆహార ధాన్యాల బస్తాలు అవసరమా? అన్నది ఆరేళ్ల కుర్రాడినడిగినా చెప్తాడు. కానీ అమెరికాకి మాత్రం పాకిస్థాన్‌ను మరోలా ఆదుకోవాలని అనిపించింది . అందుకే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్? అమెరికా ఏం చెబుతోందంటే పాకిస్థాన్‌కు తాము గతంలో సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఆధునికీకరించడానికి అవసరమైన స్పేర్ పార్టులను అందించడంతో పాటు ఆధునికీకరించే పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెబుతోంది. అది కూడా గతంలో తాము విక్రయించిన యుద్ధ విమానాలు జీవితకాలం పాటు పనిచేసేలా వాటికి సర్వీసింగ్ చేస్తున్నాం అంతే అని చెప్పుకొస్తోంది. ఇంతకు మించిన జోక్ మరోటి ఉంటుందా? ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ.. యావత్ భూగోళాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తూ ఉగ్రహింసను విశ్వవ్యాప్తం చేసే అజెండాతో పాకిస్థాన్ తమ దేశాన్నే ఓ ఉగ్రకర్మాగారంగా మార్చేసిందని ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విషయం అమెరికాకి తెలీదా? ఇపుడు పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలను నెక్ట్స్ లెవెల్‌కి అప్ గ్రేడ్ చేసి ఇస్తే వాటిని పాకిస్థాన్ ఎవరిపై ప్రయోగిస్తుంది? సింపుల్.. భారత్ పైనే కదా. ఇది అమెరికాకి తెలీకుండా ఉంటుందా? ఈ వ్యాపారం అమెరికాకి కొత్తకాదు. అమెరికా చరిత్ర అంతా ఆయుధాల అమ్మకాలతోనే ముందుకు నడిచింది. యుద్ధాలు తేవడం ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకోవడం.. ఇదీ అమెరికా శైలి. 1980లకి ముందు అమెరికా పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అమ్మింది. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సోవియట్ యూనియన్ను దెబ్బతీయడం కోసం పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. వీరి సాయంతోనే పాకిస్థాన్ ముజాహిదీన్లను చేరదీసి వారిని ఉగ్రవాదులుగా మార్చి పెంచి పోషించింది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్ కాయిదాపై యుద్ధానికి అమెరికా కాలుదువ్విన వేళ మళ్లీ పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసింది అమెరికా. ఆఫ్ఘనిస్థాన్‌లో 20 ఏళ్ల పాటు మకాం వేసిన అమెరికా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించినా తాలిబాన్‌ను మాత్రం ఏమీ చేయకుండా వదిలేసింది. చివరకు గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ ప్రజల మాన ప్రాణాలను తాలిబాన్ చేతుల్లో పెట్టేసి తమ సేనలను ఆఫ్ఘన్ నుండి వెనక్కి రప్పించేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా తాలిబాన్‌తో చేతులు కలిపింది. పాకిస్థాన్, తాలిబాన్ కలిస్తే ఆసియాలో మరింత అగ్గి రాజుకోవడం ఖాయమని మేధావులు ఆందోళన చెందుతున్నారు కూడా. సరిగ్గా ఈ తరుణంలోనే ఇపుడు అమెరికా మరోసారి పాకిస్థాన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇస్లామబాద్ వినువీధిలో ఎఫ్-16 యుద్ధవిమానాలు?
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో పాక్ పాత్రికేయుడు చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. ఇస్లామాబాద్ మీదుగా ఆకాశంలో ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎగురుతున్నాయని అతడు చెప్పాడు. జియో టీవీలో పనిచేసే హమీద్ మీర్ అనే జర్నలిస్టు ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. రాణా మహ్మద్ ఉస్మాన్ అనే మరో వ్యక్తి తాను కూడా బాగా పెద్ద శబ్దం విన్నట్లు ట్వీట్ చేశాడు. దక్షిణాసియా దేశాల్లో పేద ప్రజలే ఎక్కువగా ఉన్నారని.. వారికి యుద్ధాలు మంచివి కావని, అందువల్ల ఈ యుద్ధకాంక్షను వెంటనే ఆపాలని మరో ట్వీట్లో హమీద్ మీర్ కోరాడు. ఒక్కసారిగా ఈ ట్వీట్ కలకలం రేపింది. దాంతో కాసేపటికే.. మరో వ్యక్తి మాత్రం ఎవరూ ఆందోళన చెందొద్దని, ఏ క్షణంలో యుద్ధం వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఇస్లామాబాద్ వాసులకు చెప్పడానికి పాక్ దళాలే విమానంతో విన్యాసాలు చేశాయని మరో ట్వీట్లో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే పాకిస్థానీ వైమానిక దళం ముందు జాగ్రత్తగా ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ చేసి ఉంటుందని అంటున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటనలు మాత్రం ఏవీ వెలువడలేదు. F-16 planes flying at 10:20 pm over Islamabad — Hamid Mir (@HamidMirGEO) 22 September 2016 I heard many of them aloud. https://t.co/bxUVkQGsSZ — Rana Muhammad Usman (@rana_usman) 22 September 2016 @HamidMirGEO Scary sounds really.I was sitting in the lawn of hostel with friends but now we moved to the rooms due to thunderous sounds. — Moazzama Ali (@moazzamaali) 22 September 2016 @HamidMirGEO dont worry it is just to assure people of islmabd that our forces are fully aware and ready to fight — ملک انورزیب خان (@malikanwerpmln) 22 September 2016 War is not good for the poor people of South Asia who are in majority let the majority unite and stop this war mongering — Hamid Mir (@HamidMirGEO) 22 September 2016