
ఉక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అదీగాక సైనికపరంగా, ఆయుధ సంపత్తి పరంగా అతి పెద్ద దేశమైన రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్‌ని నిలువరించలేకపోయింది. పైగా రష్యా దాడులను తనదైన శైలిలో తిప్పుకొడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఉక్రెయిన్. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీని ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.
రాజధానీ కీవ్ ప్రధాన కార్యాలయంలపై రష్యన్లు దాడి చేసి ఉంటే మృత్యువుతో పోరాడే వాడినన్నారు. అయినా తనకు ఎలా కాల్చాలో తెలుసనని చెప్పారు. రష్యన్లు మిమ్మల్ని బందీగా తీసుకువెళ్తారేమోనని ఊహించగలరా? అని ప్రశ్నించగా..దాన్ని అవమానకరంగా భావిస్తానని అన్నారు. ఫిబ్రవరి 24, 2022న యుద్ధం ప్రారంభమైన తొలి రోజునే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రవేశించడానికి యత్నించాయని చెప్పారు.
ఐతే వారు అధ్యక్ష కార్యాలయాలు ఉన్న సెంటర్‌లోని బంకోవా స్ట్రీట్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. ఒకవేళ వారు పరిపాలన విభాగాల్లోకి వచ్చి ఉంటే తాము అక్కడ ఉండలేకపోయే వాళ్లమన్నారు. పైగా బాంకోవా స్ట్రీట్‌ని చాలా కట్టుదిట్టమైన భ్రదతతో ఉంచామని ఖైదీలా బంధింపబడే అవకాశమే లేదని ధీమాగా చెప్పారు. మీరు పిస్టల్‌ని వాడటం ప్రాక్టీస్ చేస్తున్నారా? లేక బంధిపబడకుండా ఉండేలా మిమ్మిల్ని మీరు కాల్చుకోవడం కోసం ప్రాక్టీసు చేస్తున్నారా? అని మీడియా అడగగా..ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తనని కాల్చుకోవడానికి కాదని కాల్పులు జరపడానికేనని సమాధానమిచ్చారు జెలెన్‌స్కీ.
(చదవండి: మహిళా సమాధులకు తాళలు..రీజన్ తెలిస్తే సిగ్గుతో తలదించుకోక తప్పదు..)
Comments
Please login to add a commentAdd a comment