34 మంది మృతి, 69 మందికి గాయాలు
డెయిర్ అల్–బలాహ్/బీరుట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక స్కూలు, క్లినిక్‌లపై జరిగిన దాడుల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. శరణార్థులు తలదాచుకుంటున్న డెయిర్ అల్– బలాహ్‌లోని స్కూలు భవనంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 28 మంది చనిపోగా, 54 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి, ఏడుగురు మహిళలున్నట్లు అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
శరణార్థులకు సాయం అందించే విషయమై ఓ సంస్థ ప్రతినిధులు శిబిరం నిర్వాహకులతో చర్చిస్తున్న సమయంలో భవనంపై దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాకు‡్ష్యలు తెలిపారు. ఉదయం 11.20 గంటల సమయంలో ఘటన జరిగినప్పుడు స్కూలు భవనంలో సుమారు 3 వేల మంది ఉన్నట్లు పాలస్తీనియన్ రెడ్ క్రీసెంట్‌కు చెందిన రిస్క్ మేనేజ్‌మెంట్ కోఆర్డినేటర్ హిషామ్ అబూ హోలీ తెలిపారు. దాడి తీవ్రతకు మృతదేహాలు ముక్కముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోయాయన్నారు.
ఛిద్రంగా మారిన శరీర భాగాలనే ఏరి ఆస్పత్రికి తరలించినట్లు అక్కడి భయానక పరిస్థితిని హిషామ్ వివరించారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారన్నారు. మొత్తం మూడంతస్తులకు గాను ఒకటో ఫ్లోర్‌లో శిబిరం పరిపాలన సిబ్బంది ఉండగా, మిగతా రెండంతస్తుల్లోనూ శరణార్థులే తలదాచుకుంటున్నారన్నారు.
మొదటి అంతస్తు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. కానీ, దాడి తీవ్రతకు రెండు, మూడు అంతస్తులు సైతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వివరించారు. మరో ఘటనలో..గాజా నగరం పశి్చమాన ఉన్న అల్–రిమల్ క్లినిక్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన లక్షిత దాడిలో ఆరుగురు చనిపోగా మరో 15 మంది గాయపడ్డారని గాజాలోని అంబులెన్స్ సరీ్వస్ ప్రతినిధి పరేస్ అవాద్ తెలిపారు.
బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి: 11 మంది మృతి
బీరుట్: సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ గురువారం చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 11 మంది మృతి చెందారని, 48 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రస్ అల్–నబాలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించగా.. అపార్ట్‌మెంట్ కిందిభాగం దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment