మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.!
ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్‌ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు.
23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!.
A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024
Comments
Please login to add a commentAdd a comment