జనగామ: వరంగల్ జిల్లా జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ నిర్లక్ష్యంగా చేసి ఓ మహిళకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టారు. వివరాలు... జనగామకు చెందిన ఓ ఉపాధ్యాయుడి సతీమణికి ఐదేళ్ల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఈ ఆస్పత్రి.. ప్రభుత్వ వైద్యురాలి పర్యవేక్షణలో నడుస్తోంది. కాగా ఈ వైద్యురాలు ఆపరేషన్ సమయంలో ఆట్రే అనే పరికరాన్ని రోగి కడుపులోనే మరిచి కుట్లేసింది. బాధితురాలికి నొప్పి వస్తుండటంతో ఇటీవల ఓ వైద్యుని సంప్రదించగా.. కడుపులో ఆట్రే ఉందని స్కానింగ్ రిపోర్ట్‌లో తేలింది. ఈ విషయాన్ని గతంలో ఆపరేషన్ చేసిన వైద్యురాలికి చెప్పడంతో సమస్య పరిష్కారానికి ‘సెటిల్‌మెంట్’ చేసినట్లు సమాచారం. బాధితురాలికి ఆపరేషన్ చేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు రూ.2 ల క్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.
కడుపులో ఆట్రేను మరిచిన వైద్యురాలు
Published Wed, Jul 16 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement