సాక్షి, విశాఖపట్నం: ప‌్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేదే లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదరక పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్సార్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. (ఏపీ టూరిజంలో అవినీతిపై విచారణ)
త్వరలోనే ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలు
మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్సార్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్సార్‌సీపి సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..)
Comments
Please login to add a commentAdd a comment