
కొమ్మాది (భీమిలి): త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు దు్రష్పచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మధురవాడలో జరిగిన ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment