
సాక్షి, విశాఖపట్నం : తనకు 3 రోజుల క్రితం కూడా టీడీపీ టికెట్ ఇస్తామన్నారని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే భీమిలినుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నేత ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. నాయకులు ఎలాంటి ఆలోచనల్లో ఉన్నా ఓటర్లు మాత్రం వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడు అయోమయమేనని, ఆయన ఆలోచనలే వల్లే ఇప్పుడు రాష్ట్రానికి కష్టాలు వచ్చాయన్నారు.
అప్పుడు ప్రత్యేక హోదా అన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారు.. ఇప్పుడు ఏదీ లేకుండా పోయిందంటూ ఎద్దేవా చేశారు. హోదా కోసం రాజీనామా చేద్దామంటే అప్పుడు చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తున్నారని నొక్కివక్కానించారు.
Comments
Please login to add a commentAdd a comment