Venkatapuram
-
కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు
-
వైఎస్సార్సీపీలోకి వెంకటాపురం
శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురంలో దాదాపు 60 కుటుంబాలు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వీరంతా పార్టీ మారారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వీరికి ఎమ్మెల్సీ భరత్ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ప్రజలు, పేదల కోసం ప్రతిక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామంలో ఇప్పటివరకు మూడు కుటుంబాలు మాత్రమే వైఎస్సార్సీపీలో ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 60 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామంలో పట్టున్న తమ్మన్నగారి వెంకటస్వామి, కోళ్లఫారం పెద్దన్నగారి జయవేలు, గొర్లెప్పగారి వెంకటస్వామి, గురుస్వామి వెంకటేష్, సుబ్బక్కగారి సుబ్రమణ్యం, గురుస్వామప్పగారి వెంకటేశు, మునివెంకట, రంగస్వామి, ఎ.వి.రమేష్, ఎన్.సుబ్బన్న సహా పలు కుటుంబాల పెద్దలు పార్టీలో చేరారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో వివక్షకు తావులేకుండా తమకు లబ్ధిచేకూరడం, ఎమ్మెల్సీ భరత్ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చడంతో తాము పార్టీలో చేరుతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసుంధర, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ గోవింద్, ఎంపీటీసీ సభ్యుడు చలం, బెంగళూరు మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. -
కారులో సజీవ దహనం కేసులో ఊహించని ట్విస్ట్
-
రాష్ట్రపతి రామప్ప పర్యటనకు సీఎం కేసీఆర్!
వెంకటాపురం (ఎం): ఈనెల 28న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రమే హాజరవుతారని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారయినట్లు సమాచారం. రామప్ప ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటివరకు రాలేదు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ రానుండటంతో పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రామప్పలో మూడు ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రామప్పలో గంటన్నరపాటు రాష్ట్రపతి... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గంటన్నరపాటు కొనసాగనుంది. భద్రాచలం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 2:20 గంటలకు ఆమె రామప్పకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 సమయంలో ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 3:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. రాష్ట్రపతి విలేకరులతో మాట్లాడతారా లేదా అనేది అధికారికంగా ఖరారు కాలేదు. -
ఉన్నత చదువుకు డబ్బుల్లేవని ఉసురు తీసుకుంది!
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి -
‘అమ్మ’ పెట్టదు.. అడగనివ్వదు!
రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో వడ్డే కులానికి చెందిన దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. దశాబ్దాలుగా రెండు గదుల ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసిన ఆ దంపతులు... మరోమార్గం లేక ఇద్దరు కోడళ్లు, కుమారులతో కలిసి ఆ ఇంట్లోనే సర్దుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఇల్లు కట్టుకునేందుకు అర్హులు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఇంటి పట్టా కోసం తన పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరూ దరఖాస్తు చేసే సాహసం చేయని పరిస్థితి. ఇలాంటి వారు వెంకటాపురంలో చాలా మందే ఉన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ.. ఇక్కడ రాజకీయ నాయకులకు భయపడి ఒక్క పథకం పొందలేకపోతున్నారు. రామగిరి/అనంతపురం: వెంకటాపురం.. ఈ పేరు వినిపిస్తే చాలు ఓ రాజకీయ నేత గుర్తొస్తారు. ఏళ్లుగా అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. గ్రామంలో బతికి బట్టకట్టాలంటే వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. లేదంటే ఊరు విడవక తప్పని పరిస్థితి. చివరకు ప్రభుత్వ పథకాలైనా వారు చెప్పిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. కాదూ.. కూడదని దరఖాస్తు చేయాలనుకుంటే ఆ గ్రామంలో వారికి నిలువ నీడ ఉండదు. అందుకే 750 జనాభా ఉన్న వెంకటాపురం దశాబ్దాలుగా పూర్తి నిర్బంధంలో బతుకుతోంది. దరఖాస్తు చేసుకోవాలంటేనే భయం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందరో అర్హులు వాటిని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటున్నారు. కానీ రామగిరి మండలం వెంకటాపురంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇద్దరు వలంటీర్లను ఆ గ్రామంలో నియమించినా.. ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకం తీసుకుంటే తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే దురాలోచనతో ఆ గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోనీ వారైనా నిరుపేదలను ఆదుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఏ మెట్రో సిటీలోనో లేదా జిల్లా కేంద్రంలోనో హాయిగా గడుపుతున్న ఆ ‘పెద్ద’ కుటుంబం నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గూడు లేని 46 మంది ఉన్నా.. వెంకటాపురం గ్రామంలో నిలువ నీడ లేని వారు 46 మంది ఉన్నట్లు ఆ గ్రామస్తులే చెబుతున్నారు. కానీ అధికారులు వెళ్లి అడిగితే ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరవలేని పరిస్థితి. అందువల్లే చాలా మంది సొంత ఊరును వదులుకుని బంధువుల ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో పర్యటించిన తహసీల్దార్ 14 మంది గ్రామస్తులకు ఇళ్లు లేనట్లు గుర్తించారు. వారంతా దరఖాస్తు చేసుకుంటే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో గ్రామానికే చెందిన రైతు శ్రీనివాసులు పేదలకు పట్టాలిచ్చేందుకు సర్వేనంబర్ 752లోని తన 2.50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ అక్కడి రాజకీయ నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తమ గ్రామస్తులకు అవసరం లేదని చెబుతున్నారు. ఫలితంగా గూడులేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులే చొరవ తీసుకుని.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటాపురం అభివృద్ధిపై దృష్టి సారించింది. స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా వెంకటాపురం వాసుల పరిస్థితి అర్థం చేసుకుని అధికారులనే గ్రామానికి పంపారు. దీంతో మండల అధికారులు పథకాలకు అర్హులను గుర్తించారు. అందువల్లే ప్రస్తుతం గ్రామంలోని 100 మందికి పెన్షన్లు.. 215 రేషన్ కార్డులు ఉన్నాయి. అదో ప్రత్యేక రాజ్యం వెంకటాపురంలో ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఆ గ్రామంలోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే సాహసం చేయలేకపోతున్నారు. ఒక్క కుటుంబం రాజకీయ ఉనికి కోసం ఎందరో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆ రాజకీయ కుటుంబీకులు తమ దుస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, లేకపోతే వారే సాయం చేసినా బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులను గుర్తించాం వెంకటాపురంలో ఇళ్లు లేని వారు 14 మంది ఉన్నట్లు గుర్తించాం. అయితే వారెవరూ ఇంటి కోసం గానీ, స్థలం కోసం గానీ దరఖాస్తు చేయలేదు. వారు ఇల్లు కావాలని కోరితే తప్పకుండా స్థలం ఇవ్వడంతో పాటు అర్హత మేరకు ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. – నారాయణస్వామి, తహసీల్దార్ రామగిరి -
గద్దర్‌ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వెంకటాపురం డివిజన్‌కు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్, మరికొంత మంది నేతలు గద్దర్‌ను కలిశారు. కేవలం మర్వాదపూర్వకంగానే కలిసినట్లు మంత్రి కొప్పుల తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గద్దర్‌కు పరిచయం చేశారు. ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అనంతరం కేటీఆర్‌తో పలు సందర్భాల్లో విభేదించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
వెంకటాపురంలో వైఎస్ఆర్ క్లినిక్‌ను ప్రారంభించిన మంత్రి అవంతి
-
గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం
-
'వైఎస్సార్ క్లినిక్'ను ప్రారంభించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేదే లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదరక పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్సార్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. (ఏపీ టూరిజంలో అవినీతిపై విచారణ) త్వరలోనే ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలు మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్సార్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్సార్సీపి సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) -
ఇసుక మాఫియాపై హైకోర్టు జోక్యం
సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంథని మండలంలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న్యాయవాది గట్టు వెంకట నాగమణి కోర్టుకు లేఖ రాశారు. భూగర్భ జలాలు అడుగంటుతుండగా, రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో ఎండగట్టింది. (ఆ వారసులకు రూ.20 వేల కోట్లు) రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో పేర్కొంది. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను,శాఖలను ప్రతి వాదులుగా చేర్చింది. గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీల మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. (ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్) -
కరోనా పోరు: విజేత ఆ ఊరు
కరోనా.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్–19 పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఆ నలుగురు బాధితులు కూడా చికిత్స అనంతరం కోలుకుని తిరిగి రావడంతో, ఆ ఊరు ఊపిరి పీల్చుకుంది. పద్మనాభం(భీమిలి): పద్మనాభం మండలంలోని వెంకటాపురం గ్రామం కరోనాను జయించింది. గ్రామంలో నలుగురికి కరోనా సోకినప్పటికీ, అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. గ్రామంలో ఇంకెవరికీ వైరస్ లక్షణాలు లేకపోవడంతో పాటు ఆ నలుగురు రోగులు కూడా ఆరోగ్యవంతులై రావడంతో, దాదాపు మూడు వారాల అనంతరం ఆ ఊరిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గత నెల 17వ తేదీన లండన్ నుంచి స్వగ్రామమైన వెంకటాపురం వచ్చిన యువకుడికి అదే నెల 20వ తేదీన కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో 21న విశాఖపట్నం ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. 22వ తేదీన కరోనా పాజిటివ్‌గా గుర్తించి, ఆ యువకుడి కుటుంబ సభ్యులైన తండ్రి, తల్లి, సోదరి, నాన్నమ్మలతో పాటు 33 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో యువకుడి నాన్నమ్మ మినహా మిగతా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకడంతో వెంకటాపురం గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. 23రోజులు ఆ గ్రామస్తులు కంటిపై కునుకు లేక తల్లడిల్లారు. అయితే 29మందికి నెగెటివ్ రావడంతో వీరిని ఇళ్లకు పంపించారు. ఐదు రోజుల క్రితం చికిత్స పూర్తయి కోలుకున్న తర్వాత యువకుడిని, అతడి తండ్రిని డిశ్చార్జి చేశారు. సోమవారం యువకుడి తల్లి, సోదరి కోలుకోవడంతో వారిని ఇంటికి పంపించేశారు. వీరంతా వెంకటాపురం గ్రామంలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఊరుకు చుట్టుపక్కల గ్రామాలతో సంబంధం లేక ఉన్న వీరు ఇప్పుడు పక్క గ్రామాలకు ప్రవేశించేందుకు ఆటంకాలు తొలగడంతో గండం గట్టెక్కామని ఊపిరి పీల్చుకున్నారు. కట్టడి చేశారిలా.. కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాక వెంకటాపురం గ్రామస్తులు మూడు కిలోమీటర్ల పరిధిలోని రేవిడి, రౌతుపాలెం, పాండ్రంగి గ్రామాల్లోకి వెళ్లకుండా మూడు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రేవిడి జంక్షన్లో పగటి వేళల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు పీసీలు, రాత్రి వేళల్లో ఇద్దరు ఏఆర్, ఇద్దరు సివిల్ కానిస్టేబుళ్లతో పోలీస్ పికెట్ ఇంకా కొనసాగుతోంది. వెంకటాపురం కళ్లాల్లో ఇద్దరు, పాండ్రంగి జంక్షన్లో ఒక కానిస్టేబుల్, ఇద్దరు టీచర్లతో పికెట్ నిర్వహించారు. ఏసీపీ రవిశంకరరెడ్డి ఆధ్యర్యంలో సీఐ విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పికెట్లు కొనసాగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసు నిర్థారణ అయిన 22వ తేదీ నుంచి వెంకటాపురం గ్రామంలో ప్రతి రోజు వెంకటాపురం, రేవిడి గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో బ్లీచింగ్ జల్లడం, వెంకటాపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయడం చేస్తున్నారు. డ్రైనేజీల్లో పూడిక తీస్తున్నారు. కరోనా వైరస్ సోకిన బాధితుల ఇంటిని సోడియం హైపో క్లోరైట్‌తో మరింత శుద్ధి చేశారు. టెన్షన్ తగ్గింది మా గ్రామంలో కరోనా అదుపులోకి రావడంతో భయం పోయింది. ఎవరికి ఎలా ఉంటుందో అని భయపడుతుండేవాళ్లం. బయటి ఊరికి రాకపోకలు ఉండేవి కావు. ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. వైరస్ ప్రభావం తొలగిపోవడంతో రేవిడి గ్రామంలోకి వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నాం. – బి.వెంకట సూర్యకుమార్, వెంకటాపురం కల్లోలం నుంచి ప్రశాంతత వెంకటాపురం గ్రామం కరోనా కల్లోలం నుంచి గట్టెక్కింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో ఉన్నంత కాలం మా గ్రామానికి చెందిన వారు ఇళ్లు విడిచి బయటికి వచ్చే వారు కాదు. ఎప్పడు ఏం జరుగుతోందని ఆందోళన మధ్య కాలం గడిపాం. మా ఊరిలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది. – ఎ.బంగారుబాబు, వెంకటాపురం మంచి చికిత్స అందించారు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి ఆస్పత్రికి వెళ్లాం. మమ్మల్ని ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా ఆరోగ్యం బాగుంది. రిపోర్ట్ నెగెటివ్ రావడంతో మమ్మల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసి ఇంటికి పంపించేశారు. గ్రామంలోనే ఉంటున్నాం. – కరోనా బాధితుడు, వెంకటాపురం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం కరోనా సోకినప్పటి నుంచి వెంకటాపురంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం. వీధుల్లో బ్లీచింగ్ చల్లిస్తున్నాం. సోడియం హైపో క్లోరైట్‌ను పిచిచారీ చేయిస్తున్నాం. లాక్ డౌన్‌ను ఈ గ్రామంలో మరింత పకడ్బందీగా అమలు చేశాం. – జి.వి.చిట్టిరాజు, ఎంపీడీవో -
ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు
ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు. గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీఈటీ హత్యతో వెలుగులోకి.. ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్‌లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హతుల వివరాలివీ.. వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ). -
జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రామప్ప.. మెరిసిందప్పా
ఆహా... ఎంతలో ఎంతమార్పు! ఏడొందల ఏళ్ల క్రితం నిర్మాణరంగంలో ప్రపంచానికి సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన రామప్ప దేవాలయం పరిసరాలు ఎలా ఉండేవి ఎలా మారాయి..! గుడిని గుర్తుపట్టకుండా ఉన్న పిచ్చిమొక్కలను, 300 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమకట్టడాలను అధికారులు తొలగించారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతం కేవలం 20 రోజుల్లో ఆహ్లాదకరంగా మారిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తించేందుకు ఈ నెల 25న యునెస్కో ప్రతినిధులు అక్కడికి వస్తుండటమే దీనికి కారణం. మార్పు ఎంతుందో ఈ చిత్రాలే సాక్ష్యం. –సాక్షి, హైదరాబాద్. ఎంత గొప్ప ఆలయమైనా సరే, అడ్డదిడ్డంగా వెలిసే అక్రమ నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని గజిబిజిలా మార్చేస్తాయి. రామప్ప దేవాలయం ప్రవేశద్వార ప్రాంతం 20 రోజుల క్రితం ఇలా ఉంది. ఇప్పుడక్కడ దేవాలయం, దాని చుట్టూ చెట్లు తప్ప మరేం లేదు. యునెస్కో నిబంధనల ప్రకారం.. కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలుండకూడదు. అందుకే అధికారులు ఇలా మార్చేశారు. రామప్ప ఆలయం తరహాలోనే మంచి నిర్మాణకౌశలం ఉన్న చిన్నగుడి ఇది. ఆలయం శిల్ప సౌందర్యం ఇప్పటివరకు కనిపించేది కాదు. ఇప్పుడు ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. మూలవిరాట్టు దర్శనం కాకున్నా, శిల్పుల పనితనాన్ని దర్శించుకునే అవకాశం చిక్కింది. గుబురుగా పెరిగిన చెట్లు, లతలతో ఇదో పొదరిల్లులా మారింది కదూ. కానీ అక్కడ ఓ రాతి నిర్మాణం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలమైతే ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. అది త్రికూటాలయం. రామప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో దీనిన్ని కట్టారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత దానికి విముక్తి కలిగింది. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెంకటాపురం డ్వాక్రా మహిళలు
-
ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ
-
వైఎస్ జగన్ పాదయాత్రలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర @2000 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురం నుంచి ఏలూరుకు చేరుకోనున్న జగన్.. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి. ప్రజాసంకల్పయాత్ర 2000కి.మీ పైలాన్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్ పాదయాత్ర 2000కి.మీ మైలురాయికి గుర్తుగా కొబ్బరిమొక్కను నాటుతున్న వైఎస్ జగన్ జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని.. ►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు ►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర ►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక ►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర ►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు ►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర ►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు ►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
వణుకుతున్న వెంకటాపురం
సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని గాదిరాస్ నుంచి వలస వచ్చిన 20 కుటుంబాలకు చెందిన 110 మంది చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా గ్రామ సమీపంలోనే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు వారాల్లో ముగ్గురు మృతి గ్రామానికి చెందిన మడకం వుంగయ్య(18) అనే యువకుడు 15 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా వారం క్రితం కొవ్వాసి జోగయ్య(25) అనే యువకుడూ అకస్మాత్తుగా మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మంగమ్మ భర్త మడివి గంగయ్య(60) బుధవారం మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మడకం సుక్కమ్మ, మడివి దేవయ్య, పొడియం లింగయ్య ఒళ్లంతా మంట, జ్వరం, దగ్గు, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా వుంది. కాగా, వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు ఏడుగురాళ్లపల్లిలోని ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సదరు నాటువైద్యుడు కుండల్లో ఏవో ఆకులు పెట్టి మంత్రాలు చదువుతూ ఆకులతో ఆమె ఒంటిపై నిమురుతున్నాడు. కాగా, వ్యాధుల కారణంతో చాలామంది భయాందోళనలతో గ్రామాన్ని వీడుతున్నారు. వాగు నీరే తాగునీరు... గ్రామంలో 20 కుటుంబాలు నివాసముంటున్నా తాగునీటి కోసం ఇక్కడ ఒక్క బోరు కూడా లేదు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఏడు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చిన్నపాటి కాలిబాట మాత్రమే ఉంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత మరణాలు కూడా కాటుకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సవలం సత్తిబాబు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది కూడా అడపాదడపా వస్తున్నారని.. తామే వారాంతపు సంత రోజుల్లో ఆసుపత్రికి వెళ్తుంటామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వ్యాధుల పరిస్థితిని తెలుసుకున్న ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించింది. సకాలంలో వైద్యం అందకే మరణాలు వివిధ వ్యాధుల వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదురుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తాం. – డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో. -
వెంకటాపురంలో హైడ్రామా
పశ్చిమగోదావరి , ఏలూరు రూరల్: ఏలూరు మండలం వెంకటాపురం పం చాయతీలో మంగళవారం హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యాయలంలో పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకా వాల్సిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వదంతులు హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని కొందరు వార్డు సభ్యులు స్వయంగా మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష స మావేశానికి హాజరుకావడం లేదంటూ ఇన్చార్జి కార్యదర్శి రత్నం సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. దీంతో అప్పటికే వచ్చిన అప్పలనాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగారు. గంట ముందు వాయిదా నోటీసు అందిస్తారా అంటూ ప్రశ్నించారు. పరువు కోసం పాకులాట టీడీపీ నుంచి బహిష్కృతుడైన రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా 9 మంది వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేయడం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి సవాల్‌గా మారింది. గ్రామంలో 3.27 ఎకరాల్లో ఏర్పాటుచేసే లే–అవుట్, కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు అపార్ట్మెంట్లకు అనుమతి ఇస్తూ అజెం డాలో పేర్కొన్న అంశాలకు తీర్మానాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వార్డు సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే వీటిని పాలకవర్గ సమావేశంలో అప్పలనాయుడు వర్గం తిరస్కరించేందుకు సిద్ధమయ్యింది. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే వర్గీయులు తీర్మానం వీగిపోతే పరువు పోతుందనే ఆలోచనతో సభ్యులను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని పలువురు చెబుతున్నారు. చివరకు సర్పంచ్‌ను సమావేశానికి వెళ్లవద్దంటూ ఆదేశించి సమావేశాన్ని వాయిదా వేయించారని సభ్యులు అంటున్నారు. పాలకవర్గ సభ్యులు ప్రమేయం లేకుండా గ్రామంలో తీర్మానాలు, అభివృద్ధి పనులు తమ వర్గీయులకే ఎమ్మెల్యే బుజ్జి వర్గం కేటాయిస్తోందని అప్పలనాయుడు వర్గం ఆరోపిస్తోంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో 9 మంది అప్పలనాయుడుకు మద్దతు ప్రకటించారు. 8 మంది ఎమ్మెల్యే వర్గం వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. -
నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది
‘‘సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు ఓ సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయిన్టైన్ చేశాడు. ఆ పాయింట్‌తో పాటు స్క్రీన్‌ప్లే నాకు నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులు సైతం వీటి గురించి మాట్లాడు తుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు రాహుల్. వేణు మడికంటి దర్శకత్వంలో రాహుల్ హీరోగా తూము ఫణికుమార్, ‘శ్రేయాస్’ శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ శుక్రవారం విడుదలైంది. మౌత్ టాక్ వల్ల సింగిల్ స్క్రీన్స్‌లో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయని, మల్టీప్లెక్స్‌లలో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయన్నారు రాహుల్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు రొమాంటిక్ ఫిల్మ్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశా. ‘వెంకటాపురం’కు ముందు ఓ కొత్త జోనర్లో చేయాలని క్లియర్ కట్‌గా డిసైడయ్యా. ఆ టైమ్‌లో వేణు ఈ కథ చెప్పారు. అయితే సెకండాఫ్‌లో నా క్యారెక్టర్ గ్రాఫ్ ఛేంజ్ అయ్యి రివెంజ్ మోడ్‌లోకి వెళ్తుంది. స్టేషన్లో పోలీసులను కొడతా. జనాలు నన్ను ఆ సీన్స్‌లో యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉండేది. అక్కణ్ణుంచి సినిమా పీక్స్‌లోకి వెళ్లిందని చాలామంది చెప్పారు. ప్రేక్షకుల ప్రశంసలతో భవిష్యత్తులోనూ ఇలాంటి కొత్త కథలు చేయొచ్చనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను పదిమందిని కొడితే ప్రేక్షకులు నమ్మాలని సిక్స్ ప్యాక్ చేశా. సినిమా చూసి లక్ష్మీ మంచు, మనోజ్, సాయిధరమ్ తేజ్, సుధీర్‌బాబు వంటి ప్రముఖులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాతో నాకో కొత్త ఇమేజ్ రావడం హ్యాపీ’’ అన్నారు. -
రాహుల్‌ని ఆనంద్‌గానే గుర్తు పెట్టుకుంటారు!
రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. మాధికంటి వేణు దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ యువతి హత్య చుట్టూ కథంతా తిరుగుతుంటుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే యూత్‌పుల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ‘రాహుల్’ను ఆనంద్‌గానే గుర్తుపెట్టుకుంటారు. డైరెక్టర్ వేణు టేకింగ్ బాగుంది’’ అని అన్నారు. రాహుల్ మాట్లాడుతూ –‘‘కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుంది. మా సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని అన్నారు. -
సస్పెన్స్.. థ్రిల్...
‘‘వెంకటాపురం’ పాటలు బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి వంద రోజులు ఆడాలి. తెలంగాణ కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వచ్చి తెలంగాణ వాడీ వేడీ చూపించాలి. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే ఆంధ్రావాళ్లంతా తెలంగాణావాదులే. మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసి మెలిసి ఉండాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెంకటాపురం’. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా బిగ్ సీడీని నాయిని, పాటల సీడీని దర్శకుడు మారుతి విడుదల చేశారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ నాకు మంచి మిత్రుడు. ఈ చిత్రకథ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. అచ్చు పాటలు, రీ–రికార్డింగ్ బాగుంటాయి. తనతో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తా’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని రాహుల్ తెలిపారు.