ఆహా... ఎంతలో ఎంతమార్పు! ఏడొందల ఏళ్ల క్రితం నిర్మాణరంగంలో ప్రపంచానికి సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన రామప్ప దేవాలయం పరిసరాలు ఎలా ఉండేవి ఎలా మారాయి..! గుడిని గుర్తుపట్టకుండా ఉన్న పిచ్చిమొక్కలను, 300 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమకట్టడాలను అధికారులు తొలగించారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతం కేవలం 20 రోజుల్లో ఆహ్లాదకరంగా మారిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తించేందుకు ఈ నెల 25న యునెస్కో ప్రతినిధులు అక్కడికి వస్తుండటమే దీనికి కారణం. మార్పు ఎంతుందో ఈ చిత్రాలే సాక్ష్యం.
–సాక్షి, హైదరాబాద్.
ఎంత గొప్ప ఆలయమైనా సరే, అడ్డదిడ్డంగా వెలిసే అక్రమ నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని గజిబిజిలా మార్చేస్తాయి. రామప్ప దేవాలయం ప్రవేశద్వార ప్రాంతం 20 రోజుల క్రితం ఇలా ఉంది.
ఇప్పుడక్కడ దేవాలయం, దాని చుట్టూ చెట్లు తప్ప మరేం లేదు. యునెస్కో నిబంధనల ప్రకారం.. కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలుండకూడదు. అందుకే అధికారులు ఇలా మార్చేశారు.
రామప్ప ఆలయం తరహాలోనే మంచి నిర్మాణకౌశలం ఉన్న చిన్నగుడి ఇది. ఆలయం శిల్ప సౌందర్యం ఇప్పటివరకు కనిపించేది కాదు.
ఇప్పుడు ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. మూలవిరాట్టు దర్శనం కాకున్నా, శిల్పుల పనితనాన్ని దర్శించుకునే అవకాశం చిక్కింది.
గుబురుగా పెరిగిన చెట్లు, లతలతో ఇదో పొదరిల్లులా మారింది కదూ. కానీ అక్కడ ఓ రాతి నిర్మాణం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలమైతే ఎండిన చెట్లతో నిండి ఉంటుంది.
అది త్రికూటాలయం. రామప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో దీనిన్ని కట్టారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత దానికి విముక్తి కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment