UNESCO
-
'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..
యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్‌లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది. వారసత్వ జాబితాలో..టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్‌లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది. ముఖ్యమైన టీ సంగతులు...టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు. 1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్‌ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్‌గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్‌ను తయారు చేస్తారు. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
యునెస్కో సాంస్కృతిక ఫుడ్స్ 2024
యునెస్కో ప్రతి యేటా వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను, అక్కడి కళారూ΄ాలను గుర్తించి మనముందుకు తీసుకువస్తుంది. ఈ యేడాది అత్యంత ప్రాచీనమైన వివిధ రుచికరమైన వంటకాల జాబితాను తీసుకొచ్చింది. వాటిలో...అరబిక్ కాఫీఅరబ్ ప్రపంచంలో కాఫీ తయారీ, దానిని అతిథులకు అందజేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందట. ఈ విధానం కూడా వారి తరతరాల భాగస్వామ్యం ఉందని, దీనిని యునెస్కో జాబితాలో చేర్చింది.జపాన్ వారి సాకె రైస్వైన్గా గుర్తింపు పొందిన సాకె ను స్థానిక సాంస్కృతిక వేడుకలలో సేవిస్తారు. దీని తయారీ వెనక తరాలుగా వస్తున్న కుటుంబాల శ్రమ ఉంటుంది.మలేషియన్ బ్రేక్ఫాస్ట్వంటకాల రుచి గురించి చెప్పుకోవాలంటే ఉదయం అల్పాహారంగా మలేషియా ‘నాసి లెమక్, రోటీ కనాయ్’ని ఈ దేశపు హిస్టరీగా చెప్పుకోవచ్చు. వందల ఏళ్ల ఈ ఆహార తయారీ ఫార్ములా వారికి మాత్రమే తెలుసు.కొరియా జంగ్కొరియా వంటకాలలో జంగ్ అనే వంటకం తయారీ, రుచి, దానిని నిల్వ చేసే పద్ధతలు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్నాయి.అజెర్బైజాని బ్రెడ్మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల బ్రెడ్స్ చూసి ఉంటాయి. కానీ, అజెర్బైజాని బ్రెడ్ తయారీలో వారి సంస్కృతి పరమైన ప్రభావం ఎంతో ఉందంటున్నారు. ఈ బ్రెడ్ తయారీలో వాడే పదార్థాలు, తయారీలో తరాల వారసత్వం ఉందని జాబితాలో పొందుపరిచారు. -
ఎలిఫెంటా కేవ్స్ ఏనుగు కోసం వెతకొద్దు!
ఎలిఫెంటా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ముంబయి టూర్లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. సముద్రం మధ్యలో ఓ దీవి. అందులో ఓ కొండ. ఆ కొండలో తొలిచిన గుహలివి. అయితే ఈ కొండ మీద కానీ, గుహల్లోనూ ఎంత వెదికినా ఏనుగు మాత్రం కనిపించదు. బ్రిటిష్ వారు ముచ్చటపడి తమ దేశం తీసుకెళ్లాలనుకున్నారట. పెకలించే ప్రయత్నంలో డ్యామేజ్ అవడంతో ఏనుగును వదిలేసి కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనంతో సరిపెట్టుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు డ్యామేజ్ అయిన ఏనుగు విగ్రహానికి మరమత్తులు చేసి నగరంలోని శివాజీ మ్యూజియంలో ఉంచారు. ఏనుగు లేదని ఈ గుహలను చూడడం మానుకోకూడదు. ఈ గుహలు మన వారసత్వానికి ప్రతీకలు. ఈ గుహలను చేరడానికి అరేబియా సముద్రంలో సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.నీరెండలో కడలి విహారంఎలిఫెంటా కేవ్స్‌కి ముంబయిలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫెర్రీలో వెళ్లాలి. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తీసుకెళ్తాయి. ఈ సీజన్లో మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యుడు గోరువెచ్చగానే ఉంటాడు. ఫెర్రీ బోట్‌పై అంతస్థులో ప్రయాణిస్తూ ముంబయి తీరంలో అరేబియా తీరాన్ని వీక్షించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఓ ఎడ్యుకేషన్ కూడా. హార్బర్‌కు వచ్చిన షిప్పులు పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. బకెట్‌కి తాడు కట్టి బావిలో నీటిని తోడినట్లు సముద్రపు నీటిని తోడుకుని షిప్ లోపలికి వెళ్తుంటారు. ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. ఎలిఫెంటా కేవ్స్ టూర్లో ఇది బోనస్. షిప్పులు తీరానికి రెండు కిలోమీటర్ల వరకు ఆగి ఉంటాయి. వాటిని చూస్తూ ప్రయాణించడం వల్ల కేవ్స్‌కు పదికిలోమీటర్లు ప్రయాణించిన విషయం అర్థం కాదు. కడలి గర్భం నుంచి తీరాన్ని చూడవచ్చుకొండ దగ్గర ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. గుహలను చేరడానికి టాయ్‌ట్రైన్ ఉంది. కానీ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. ట్రైన్ కోసం ఎదురు చూడాలా నడవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. సముద్రం లోపల పది కిలోమీటర్ల దూరం నుంచి తీరాన్ని చూడడం బాగుంటుంది. సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. శిల్పాలు మాట్లాడతాయి!ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. శిల్పాల్లో బౌద్ధం, శైవం ప్రభావం కనిపిస్తుంది. ఒక్కో శిల్పం ఒక్కో కావ్యంతో సమానం. మనం చూస్తున్న శిల్పంలో దాగిన కావ్యకథ గైడ్ వివరించే వరకు అర్థం కాదు. విధ్వంసకారులు ఏ శిల్పాన్నీ వదల్లేదు. ప్రతి శిల్పానికి ఎక్కడో ఓ చోట గాయం తప్పనిసరి. హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను చెక్కారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల ఆధీనంలోకి వచ్చింది. శైవం పతాకస్థాయికి చేరిన కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ శిల్పాలను చెక్కించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో సమాజం స్త్రీ పురుష సమానత్వం గురించి ఆలోచించింది. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి శైవాన్ని మాధ్యమం చేసుకుంది. అలా రూపొందిన శిల్పమే అర్ధనారీశ్వరుడి శిల్పం. పిఎస్: ఎలిఫెంటా కేవ్స్ సందర్శనకు సోమవారం సెలవు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!) -
‘యునెస్కో’ రూట్లో మంజీరా అభయారణ్యం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా డ్యామ్‌కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. ఈ క్రమంలో అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునే అర్హతలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. మంజీరా అభయారణ్యాన్ని జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సమాచార క్రోడీకరణతో.. మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీశాఖ ఈపీటీఆర్ఐ (ఎని్వరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో కలసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్ వెట్‌ల్యాండ్ బోర్డుకు పంపారు. దాన్ని పరిశీలించిన బోర్డు మరికొన్ని వివరాలు పంపాలని కోరింది. ఈ మేరకు ఈపీటీఆర్ఐ, అటవీశాఖ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాయి. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.వాణిప్రసాద్ సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలసి అభయారణ్యాన్ని సందర్శించారు. మరో రెండు రోజుల్లో ఈపీటీఆర్ఐ ఈ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదనలుసిద్ధం అవుతున్నాయి మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఈ గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్నాం. ఎంతో జీవ వైవిధ్యం కలిగిన ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం – సి.శ్రీధర్‌రావు, డీఎఫ్ఓ, సంగారెడ్డి అభయారణ్యం ప్రత్యేకతలివీ.. » సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో సుమారు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. » ఈ అభయారణ్యంలో 303 రకాల పక్షులు నివాసం ఉంటున్నట్టు అటవీశాఖ గుర్తించింది. అందులో సుమారు 140 రకాల పక్షులు హిమాలయాలను దాటి ఇక్కడికి వలస వస్తాయి. వేసవి, వర్షాకాలం రెండు సీజన్లలోనూ విదేశీ పక్షులు వలస వచ్చి వెళుతుంటాయి. అందులో పెంటెడ్ స్టార్క్, ఫ్లెమింగో, బార్‌హెడెడ్ గూస్ వంటి పక్షులూ ఉన్నాయి. ళీ మొసళ్లు, ఇతర 14 రకాల ఉభయచరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 57 జాతులకు చెందిన చేపలు, 32 రకాల సీతాకోకచిలుకలకు ఈ ప్రాంతం ఆవాసం. ఈ జలాశయంలో తొమ్మిది చిన్న దీవులు ఉన్నాయి. యునెస్కో గుర్తింపుతో ప్రయోజనాలివీ.. » ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. స్థానికంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తారు. » నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇక్కడ స్టడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుందని అటవీశాఖ వర్గాలు చెప్తున్నాయి. » ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అలాగే యునెస్కో నుంచి నిధులు వస్తాయి. » వెట్‌ల్యాండ్ అథారిటీ కూడా ఈ ప్రాంత సంరక్షణ కోసం నిధులు కేటాయించనుంది. -
తొలి సాహిత్య నగరం కోజికోడ్.. యునెస్కో గుర్తింపు
దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్‌ను భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. అక్టోబర్ 2023లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ (యూసీసీఎన్)కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.కేరళలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్.. కోజికోడ్ సాధించిన విజయాన్ని ప్రకటించారు. కోల్‌కతా వంటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన నగరాలను పక్కకునెట్టి, యునెస్కో నుండి కోజికోడ్ ‘సిటీ ఆఫ్ లిటరేచర్’ బిరుదును దక్కించుకుందని మంత్రి తెలిపారు.కోజికోడ్‌లో 500కుపైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్‌లో ఉంటూ సాహిత్యరంగానికి ఎనలేని సేవలు అందించారు. యూసీసీఎన్‌లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెందిన గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా, కోజికోడ్ సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది.యునెస్కో నుండి ఈ ఘనతను అందుకున్న ఇతర నగరాల్లో బుఖారా ‘క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్’ విభాగంలో, కాసాబ్లాంకా ‘మీడియా ఆర్ట్స్’ విభాగంలో, చాంగ్కింగ్ డిజైన్ విభాగంలో, ఖాట్మండు ఫిల్మ్ కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. -
ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
దూరం నుంచి చూస్తే భారీ మట్టిదిబ్బలా కనిపిస్తుంది గాని, ఇది పురాతన రాతి కట్టడం. ఇది సామూహిక సమాధి. కొత్తరాతి యుగం నాటి ఈ భారీ సమాధి ఐర్లండ్‌లోని డ్రోహడా పట్టణానికి చేరువలో బోయన్ నదీ తీరాన ఉంది. దీనిని క్రీస్తుపూర్వం 3200 ప్రాంతంలో నిర్మించి ఉంటారని అంచనా.ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది. న్యూగ్రేంజ్ మాన్యుమెంట్ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ కట్టడాన్ని 1.1 ఎకరాల విస్తీర్ణంలో 39 అడుగుల ఎత్తున నిర్మించారు. దీని లోపలకు చేరుకోవడానికి ప్రవేశ ద్వారం, అక్కడి నుంచి అరవై అడుగుల నడవ దారి ఉంటాయి. లోపలి భాగంలో ఉన్న మూడు గదుల్లో పురాతన మానవ అస్థికలు కనిపిస్తాయి.ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలోనే నిట్టనిలువుగా రాళ్లను నిలిపి, వాటిని కలుపుతూ వృత్తాకారంలో ఈ సమాధిని నిర్మించడం విశేషం. పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిలోపల జరిపిన తవ్వకాల్లో దహనం చేసిన మానవ అస్థికలు, దహనం చేయని మానవ అస్థికలు కూడా దొరికాయి. వాటితో పాటు ఆనాటి మానవులు ఉపయోగించిన పలు వస్తువులు కూడా దొరికాయి.ఇవి చదవండి: పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా.. -
ఏపీలో ‘ఐబీ’ అమలుపై ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేయడాన్ని అంతర్జాతీయ వేదికపై విద్యావేత్తలు ప్రశంసించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మూడు రోజుల ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు శుక్రవారం ముగిసింది. చివరిరోజు అసమానతలు లేని సమాజం కోసం సమగ్ర సమీకృత విద్యా బోధన ప్రతి ఒక్కరికీ అందించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు యూఎన్వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు అంతర్జాతీయ వేదికపై చెప్పామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులు, విద్యార్థి–ఉపాధ్యాయుల మధ్య బలపడిన సత్సంబంధాలపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇన్‌క్లూజన్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమరా మార్టి కసాడో హామీ ఇచ్చినట్టు షకిన్ పేర్కొన్నారు. ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషనల్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను ప్రశంసించారన్నారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్... ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురామ్ “పాఠశాలల్లో స్థిరమైన సమ్మిళిత పద్ధతులు’పై పాన్ ఆసియా కమిటీ చర్చలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సంబంధించిన అవసరాలు, విశ్లేషణలో భాగంగా తాము ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించామని, ప్రభుత్వం గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు
గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పటేల్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్భా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్ధిల్లుతోంది. గుజరాత్‌కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపును తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. గుజరాత్ ప్రజలకు అభినందనలు’ అని పేర్కొన్నారు. గర్బా అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు? -
హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం
జైపూర్: రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. రైలు ప్రత్యేకతలు.. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్), భిల్ బేరీ వాటర్‌ఫాల్ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. రైలు వేళలు.. మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో -
ప్రపంచ వారసత్వ జాబితాలోకి శాంతినికేతన్
న్యూఢిల్లీ: నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశి్చమ బెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. యునెస్కో ఆదివారం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటించింది. ‘వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కినందుకు శాంతినికేతన్‌కు అభినందనలు’అని పేర్కొంది. బీర్భమ్ జిల్లాలోని ఈ చారిత్రక నిర్మాణానికి వారసత్వ గుర్తింపు కోసం భారత్ ఎప్పటినుంచో కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయ నగరి పశి్చమ కోల్‌కతాకు 160 కి.మీ.ల దూరంలో ఉంది. గీతాంజలి కర్త, విశ్వ కవి రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదట్లో ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులమతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. శాంతినికేతన్ ప్రాంగణంలో చిన్న విద్యా సంస్థగా రవీంద్రుని ఆధ్వర్యంలో మొదలైన విశ్వభారతి నేడు దేశంలో అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, సంగీతం, అగ్రికల్చరల్ సైన్స్, రూరల్ రీ కన్సŠట్రక్షన్ వంటి వాటిలో ఎన్నెన్నో కోర్సులు అందిస్తోంది. దివంగత ప్రధాని ఇందిరా గాం«దీ, మరో నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ వంటి మహామహులు ఎందరో ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే. -
ఏపీ ప్రభుత్వ విద్యార్థులకు వైట్‌హౌస్ ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి (యూఎన్వో)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల ప్రతినిధి బృందానికి అమెరికా అధ్యక్ష భవనం సందర్శించాల్సిందిగా ఆహ్వానం అందింది. శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు అమెరికాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్ర మే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించడం విశేషం. యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో 10 మంది విద్యార్థుల బృందం గురువారం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. 26 వరకు సదస్సులు, సమావేశాలు మన రాష్ట్ర బృందంలోని విద్యార్థులు శనివారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (యునెస్కో)లో జరిగే సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సదస్సులో పాల్గొంటారు. 17న కొలంబియా యూనివర్సిటీలో జరిగే గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రసంగిస్తారు. 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారు. 22న యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో జరిగే ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు. -
రామప్ప ఆలయంలో గాలిలో తేలుతున్న స్తంభం..!
-
రామప్ప చెరువు మధ్యలో ఎత్తయిన శివుడి విగ్రహం
-
రామప్ప దేవాలయం మరియు వాటి రహస్య శక్తులు..!
-
షార్ట్‌కట్ అని 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'నే కూల్చేశారు
బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. గ్రేట్ వాల్ అయితే ఏంటి? చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. షార్ట్‌కట్ అని.. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. చారిత్రాత్మకం.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. 🚜 In the Chinese province of Shanxi, locals destroyed a section of the Great Wall of China with an excavator, — Sohu During interrogation, the man and woman admitted that they worked at a construction site nearby, and thus wanted to shorten the way to work. The ruined section… pic.twitter.com/2enLL69y7H — UNEWS (@UNEWSworld) September 4, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత.. -
చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
దూద్‌బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్ నగరంలో నేషనల్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్‌లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైటెక్ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్ హైదరాబాద్‌లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్‌ను ప్రారంభించనున్నామన్నారు. తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జాన్వీ శర్మతో పాటు వినయ్ కుమార్ మిశ్రా, చంద్రకాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చాక్లెట్ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..
చాక్లెట్ కొండలు చాక్లెట్ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్‌లోని బొహోల్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్‌ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్ ప్రావిన్స్‌లో ఈ చాక్లెట్ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్ రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది. (చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే) -
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్‌ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్‌కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
నాణ్యమైన విద్యను అందించడంలో భారత్ విధానం: యునెస్కో ఛీఫ్
ప్రధాని నరేంద్ర మోదీ మన్కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌కు చేరుకోవడం చారిత్రాత్మకం. ఈసందర్భంగా ఈ వందవ ఎపిసోడ్‌ని ఇండియాలోని వివిధ భాషలతో సహా 11 విదేశీ భాషల్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆడ్రీ అజౌలే మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే యునెస్కో లక్ష్యం గురించి అజౌలే మోదీతో మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోదీని ప్రశ్నించారు. అందుకు మోదీ బదులిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పనిచేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు దివంగత డి ప్రకాశ్ రావుని గుర్తుతెచ్చుకుంటూ..ఆయన టీ అమ్మేవాడు. నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్ష్యం అని చెప్పారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ , కోవిడ్-19 సమయంలో ఇ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన హేమలత గురించి మాట్లాడారు మోదీ. ఇంకా అజౌల్ ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ..అతర్జాతీయా ఎజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోదీ ఎలా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నారనే దాని గురించి కూడా అడిగారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికి పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్ష్యద్వీప్‌లోని కుమ్మెల్ బ్రదర్స్ చాలెంజర్ క్లబ్ లేదా కర్ణాటక కావెంశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అన్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి ప్రజలు లేఖలు ద్వారా అలాంటి వాటి గురించి తెలియజేశారు. అందులో భాగంగా మేము రంగోలి, దేశ భక్తిగీతాలు, లాలి పాటలు కంపోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వల్లే విభిన్న ప్రపంచ సంస్కృతిని మరింత సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోదీ చెప్పారు. (చదవండి: మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..) -
రామప్ప ఆలయంపై రాజకీయం
-
వాటర్ వార్నింగ్!
సాక్షి, అమరావతి: మానవాళికి నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 – 300 కోట్ల మంది నీటి కొరత ఎదుర్కొంటుండగా రాబోయే దశాబ్ద కాలంలో ఇది తీవ్రం కానుంది. అంతర్జాతీయ సమాజం మేల్కొని సహకరించుకోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో హెచ్చరించింది. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా న్యూయార్క్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వినియోగం, నిర్వహణపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వరల్డ్ వాటర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల (జనాభాలో 26 శాతం) మందికి సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. 3.6 బిలియన్ల (46 శాతం) జనాభాకు సురక్షితమైన పారిశుధ్య నిర్వహణ అందుబాటులో లేదు. ఉమ్మడి భవిష్యత్తును కాపాడుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎదుర్కొంటున్న పట్టణ జనాభా 2016లో 930 మిలియన్లు ఉండగా 2050 నాటికి 1.7–2.4 బిలియన్లకు పెరుగుతుందని వరల్డ్ వాటర్ నివేదిక అంచనా వేసింది. నీటిని సంరక్షించుకుంటూ జల వనరులను స్థిరంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సదస్సులో సూచించారు. అందరికీ నీరు– పారిశుధ్యం అందించాలంటే ప్రపంచ దేశాలు ఉమ్మడి ప్రణాళికను అనుసరించాలన్నారు. కలసికట్టుగా నీటి సంక్షోభ నివారణ చర్యలను వేగవంతం చేయాలని యూఎన్ వాటర్ చైర్ పర్సన్ గిల్బర్ట్ ఎఫ్.హౌంగ్బో పిలుపునిచ్చారు. సహకారంతో సంక్లిష్టతలను అధిగమిద్దాం.. అంతర్జాతీయ సరిహద్దులను పంచుకునే నదులు, జలాశయాల నిర్వహణలో నెలకొన్న సంక్లిష్టతలను అధిగమించకుంటే కష్టాలు తప్పవని యూఎన్ వాటర్ సదస్సు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది. ఇందుకు ప్రత్యేక దౌత్య మార్గాలను అనుసరించాలని కోరింది. ఇది నీటి భద్రతకు మించి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిపింది. అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందాలున్న 468 జలాశయాలలో కేవలం 6 మాత్రమే ఒప్పందానికి లోబడి ఉన్నట్లు వెల్లడించింది. 2013లో మెక్సికోలో ప్రారంభించిన మోంటెర్రే వాటర్ ఫండ్ కార్యక్రమం ద్వారా నీటి నాణ్యతను పెంచడంతో పాటు వరద నివారణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపింది. ఇక నైరోబీకి 95 శాతం మంచినీటిని, కెన్యాకు 50 శాతం విద్యుత్‌ను సరఫరా చేసే తానా–నైరోబి నదీ పరీవాహక ప్రాంతంతో పాటు ఆఫ్రికాలో అనుసరించిన విధానాలు పరస్పర సహకారానికి ఉదాహరణగా పేర్కొంది. -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్‌లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
ఇరాన్లో ‘బాలికలకు విషం’...
దుబాయ్: ఇరాన్లో ను విద్యకు దూరం చేసేందుకు వారి స్కూళ్లపైకి విష వాయువులు వదులుతున్న ఉదంతాలపై యునెస్కో ఆందోళన వెలిబుచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరింది. స్కూళ్లలో బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని సూచించింది. ఇరాన్లో జరుగుతున్న పరిణామాలను తన మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయని యునెస్కో సారథి ఆద్రే అజౌలే అన్నారు. -
Education Report 2021: అధ్యాపకుల కొరతే కారణం
పాఠశాల విద్యారంగంలో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో వెలువడిన ‘విద్యా నివేదిక–2021’ చాటుతోంది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా, వాటిలో 21.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 91.30 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. ఈ పాఠశాలల్లో గణితం, సైన్స్, సోషల్, భాషా సబ్జెక్టులను బోధించేందుకు తప్పనిసరిగా అధ్యాపకులు ఉండాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. నీతి ఆయోగ్ 2019లో విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యతా సూచీ ప్రకారం దేశంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో కేవలం 30 శాతానికే గణితంలో ప్రావీణ్యం ఉందని తేలడం వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. 2,021 లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో 21,077, ఉత్తర ప్రదేశ్‌లో 17,683 బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా పని చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారుగా 11.16 లక్షల మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటుందని యునెస్కో స్పష్టం చేసింది. టీచర్ల నియామకం జరుపకుండా ఏళ్ల తరబడి ఒప్పంద ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లతో సరిపెడుతుండటంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఈ క్రమంలో సర్కారీ విద్యావ్యవస్థను బలహీనపరుస్తూ, పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల విశృంఖల విద్యా వ్యాపారానికి ప్రభుత్వాలే కారణమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని అనేక ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరోమార్గం లేకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. హరియాణాలో 2020వ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 25 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది తెలంగాణలో సుమారు రెండు లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి అదనంగా వచ్చి చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరుతున్న తరుణంలో టీచర్లు తగ్గి పోతుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: దేశభక్తి అంటే తిరంగా సెల్ఫీ కాదు!) – మోటె చిరంజీవి, వరంగల్ -
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్) కింద కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’కు ఎంపికయ్యాయి. దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్ ట్రస్ట్ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది. వారెవ్వా.. ముంబై మ్యూజియం.. ఏసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్ మెరిట్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో... 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. -
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యునెస్కోలో ‘లేపాక్షి’
సాక్షి, అమరావతి: విజయనగర సామ్రాజ్యాధీశుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల జాబితాలో చోటు సాధించడం ద్వారా అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు, పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. అత్యద్భుత శిల్ప కళా సౌందర్యం.. ప్రపంచంలోనే పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్థంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతి బింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. యునెస్కో కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా అందులో లేపాక్షి ఉండటం విశేషం. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మ లు (జియోగ్లిఫ్స్), మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల మూలాలతో నిర్మించిన వంతెనలు (లివింగ్ రూట్ బ్రిడ్జి) ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో.. విభజన అనంతరం నిర్లక్ష్యానికి గురైన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ ఆధ్వర్యంలో ఇటీవల లేపాక్షి విశిష్టతపై ప్రత్యేక సంచికను రూపొందించి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర పురావస్తు శాఖకు పంపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో తొలి ప్రయత్నంలోనే లేపాక్షికి స్థానం దక్కింది. మరో ఆరు నెలల్లో తుది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో లేపాక్షిని యునెస్కో వారసత్వ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజ సిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. కళా కౌశలానికి ప్రతీక.. 16వ శతాబ్దంలో 70 స్తంభాలతో నిర్మించిన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం విజయ నగర ప్రభువుల కళాతృష్ణ, నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయంలోని 69 స్థంభాలు పైకప్పు భారాన్ని మోస్తుండగా ఒక స్థంభాన్ని మాత్రం గాలిలో వేలాడేలా ఏర్పాటు చేయడం విశేషం. నాట్య మండపం, మధ్యయుగం నాటి నిర్మాణ చాతుర్యంతో పురాతన శివాలయం, చక్కని ఎరుపు, నీలి, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు వర్ణాల్లోని కలంకారీ చిత్రాలు శ్రీకృష్ణదేవరాయల చిత్రలేఖన అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. ముఖమండçపం పైకప్పులో చిత్రీకరించిన రామాయణ, మహాభారత పౌరాణిక గాథలు ఆకట్టుకుంటున్నాయి. జయహో లేపాక్షి లేపాక్షి: యునెస్కో విడుదల చేసిన జాబితాలో లేపాక్షి ఆలయానికి చోటు దక్కడంతో స్థానికంగా సంబరాలు మిన్నంటాయి. నందీశ్వరుడి విగ్రహం వద్ద గ్రామస్తులు కేక్ కట్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జయహో లేపాక్షి అంటూ నినాదాలు చేశారు. జాబితాలో లేపాక్షికి శాశ్వత గుర్తింపు దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి కోరారు. -
బడుల మూసివేతతో ఒక తరం మొత్తానికి నష్టం!
న్యూఢిల్లీ: కరోనా కారణంగా బడులు మూసివేతతో ఒక తరం మొత్తం దుర్బలమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత విలువ ప్రకారం లెక్కిస్తే ఒక తరం విద్యార్ధులు బడుల మూసివేతతో 17 లక్షల కోట్ల డాలర్ల జీవితకాల ఆర్జనను నష్టపోతారని అంచనా వేసింది. ఈ మొత్తం ప్రస్తుత ప్రపంచ జీడీపీలో 14 శాతానికి సమానమని తెలిపింది. కరోనా కారణంగా పలు దేశాల్లో విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. యునెస్కో, యూనిసెఫ్‌తో కలిసి ప్రపంచబ్యాంకు ‘‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్’’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గతంలో అనుకున్నదానికన్నా విద్యాసంస్థల మూసివేతతో వచ్చే నష్టం అధికమని తెలిపింది. బడుల మూసివేతతో 10 లక్షల కోట్ల డాలర్లు నష్టమని 2020లో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. గతంలో అల్పాదాయ దేశాల్లోని పిల్లల్లో 53 శాతం మంది పేదరికంతో జీవించడాన్ని నేర్చుకునేవారని, స్కూల్స్ మూసివేతతో వీరి సంఖ్య 70 శాతానికి చేరనుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో ప్రపంచ విద్యావ్యవస్థలు స్తంభించాయని, కరోనా బయటపడిన 21 నెలల తర్వాత కూడా కోట్లాదిమంది పిల్లల బడులు మూసివేసే ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీరిలో చాలామందికి ఇకపై బడికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేసింది. జ్ఞానార్జనకు పిల్లలు దూరం కావడం నైతికంగా సహించరానిదని, ఒకతరం పిల్లలు పేదరికంలోకి జారడం భవిష్యత్ ఉత్పాదకతపై, ఆదాయాలపై పెను ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఎడ్యుకేషన్ గ్లోబల్ డైరెక్టర్ జైమె సావెద్రా వివరించారు. నిజాలను చూపుతున్న గణాంకాలు బడుల మూసివేతతో గతంలో చేసిన అంచనాల కన్నా తీవ్ర ఫలితాలున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నట్లు నివేదిక తెలిపింది. గ్రామీణ భారతం, పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో తదితర ప్రాంతాల్లో పిల్లలు లెక్కలు, చదవడంలో నష్టపోయారని గణాంకాలు వివరిస్తున్నట్లు తెలిపింది. బడుల మూసివేత ఎంతకాలం కొనసాగింది, విద్యార్థుల సామాజికార్థిక పరిస్థితి, గ్రేడ్ లెవల్‌ను బట్టి నష్టాలుంటాయని వివరించింది. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో కేవలం 3 శాతం కన్నా తక్కువ మొత్తమే విద్యారంగానికి అందాయని విమర్శించింది. చాలా దేశాల విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్లాంటివి చేపట్టినా, వీటి విస్తృతి, నాణ్యత వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. అల్పాదాయ దేశాల్లో సుమారు 20 కోట్ల మంది విద్యార్ధులు నూతన విద్యాబోధనా పద్ధతులకు దూరంగా ఉన్నారని పేర్కొంది. -
గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?
Google Doodle Celebrating Pizza: ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా? చేస్తే.. డూడుల్‌లో ఉన్న పిజ్జా మార్క్‌ను చూశారా?.. కనీసం క్లిక్ చేసి చూశారా?.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డిష్ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్ డూడుల్ ద్వారా మినీ గేమ్‌ను నిర్వహిస్తోంది. ఈ మినీ పజిల్ గేమ్ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్ చేస్తుంటారు. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లు అక్కడ చూపించే పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్‌కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్‌గా కట్ చేస్తేనే పాయింట్లు(స్టార్స్) దక్కుతాయి. అలా లెవెల్స్‌ను దాటుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ►పిజ్జా.. ఇటాలియన్ డిష్ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్ అనే ప్రచారం కూడా ఉంది). ►నెపోలిటన్ పిజ్జాయ్‌యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్ ద్వారా తయారు చేయడం. ►నేపుల్స్(కాంపానియా రీజియన్ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. ►పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్‌యువొలొ’ అంటారు. ►పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుంటుంది. ►2020 పిజ్జా గ్లోబల్ బిజినెస్‌లో.. వెస్ట్రన్ యూరప్ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ►ఉత్తర అమెరికా 48.6 బిలియన్ డాలర్లు. ►ఆసియా దేశాల్లో 11.7 బిలియన్ డాలర్లు ►ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ►ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్) వెళ్తుంటాయి. ►2019 నుంచి పిజ్జా మార్కెటింగ్ గ్లోబల్ వైడ్‌గా విపరీతంగా జరుగుతోంది. ►2023 నాటికి పిజ్జా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. ►సోషల్‌మీడియా అడ్వర్టైజింగ్ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్ నిపుణుల అంచనా. ►నార్వే, స్వీడన్లలో ఫ్రొజెన్, గ్లూటెన్ పిజ్జాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇప్పుడు. ►యూరప్, నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్, లాటిన్ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్, బ్రెజిల్.. పిజ్జా మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి. ►భారత్‌లో కరోనా సీజన్లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్ మార్కెట్ వాల్యూ 1.52 బిలియన్ డాలర్లు దాటేసింది. ► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. ►మొత్తం భారత్ పిజ్జా మార్కెట్లో డొమినోస్ వాటా 55 శాతంగా ఉంటోంది. పైగా డొమినోస్ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. ►ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి భారత్‌లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారు. ►అయితే భారత్‌లో బ్రాండెడ్ పిజ్జా బిజినెస్‌తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్ బిజినెస్ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే బ్రాండెడ్ పిజ్జా మార్కెట్‌కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా. ►ఎదురయ్యే ఛాలెంజ్.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్ ఆపరేటర్లతో పాటు ఔట్లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. -సాక్షి వెబ్‌స్పెషల్ -
Tourist Spot: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ విహారం.. ఖండాంతరాలు దాటి..
భరత్పూర్ బర్డ్ శాంక్చురీ... మన పక్షి ప్రేమికుడు సలీం అలీ మానసపుత్రిక. పక్షులు... ఖండాలు దాటి వస్తాయి. పర్యాటకులు... దేశాలు దాటి వస్తారు. పిల్లలు... ఏకంగా బడినే తెచ్చేస్తారు. worlds most important bird breeding: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్‌లో ఉంది. ఈ ప్రదేశం దేశరాజధాని ఢిల్లీకి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమదూరంలో ఉంది. ఆగ్రాలో తాజ్‌మహల్ చూసిన తర్వాత పశ్చిమంగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే భరత్‌పూర్‌లో ఉంటాం. ఏటా ఇక్కడికి సైబీరియా పక్షులు వస్తాయి. ఇక్కడ ఉన్నవి, అతిథులుగా వచ్చినవి కలిపి మొత్తం 370 పక్షిజాతులను చూడవచ్చు. అందుకే ప్రపంచంలోని ఆర్నిథాలజిస్టులు భరత్‌పూర్‌కి క్యూ కడతారు. ఏడాదికి లక్ష మంది పర్యాటకులకు తగ్గరు, వారిలో యాభై వేల మంది విదేశీయులే. స్కూలు పిల్లలైతే ఆ పరిసరాల జిల్లాలే కాదు ఢిల్లీ నుంచి కూడా ఎక్స్కర్షన్కి భరత్‌పూర్‌కి వస్తారు. పిల్లలకు వంద పేజీల పుస్తకంతో కూడా చెప్పలేనన్ని సంగతులను ఒక్క టూర్‌తో చెప్పవచ్చు. అందుకే బడి అప్పుడప్పుడూ అడవిలోకి వచ్చేస్తుంటుంది. బర్డ్ సాంక్చురీలో ఏనుగు మీద విహారం ఏనుగు అంబారీ! భరత్పూర్ బర్డ్ శాంక్చురీలో ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీతోపాటు రిక్షా సఫారీ కూడా ఉంటుంది. పక్షులు శబ్దాలకు బెదిరి ఎగిరిపోకుండా ఉండాలంటే ఏనుగు మీద కానీ రిక్షాలో కానీ వెళ్లాలి. రిక్షావాలానే గైడ్‌గా వ్యవహరిస్తాడు. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్లడానికి మాత్రం జీప్ సఫారీనే మంచి ఆప్షన్. ఇక్కడ సఫారీ పగలు మాత్రమే. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బర్డ్ శాంక్చురీ ప్రవేశ ద్వారం దగ్గరే జీప్ బుక్ చేసుకోవాలి. మితిమీరిన శబ్దాలను, హారన్లను అనుమతించరు. సొంత వాహనంలో వెళ్లినా సరే శాంక్చురీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని వదిలి టూరిజం శాఖ వాహనాల్లోనే లోపలికి వెళ్లాలి. ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియో షూటింగ్‌ను అనుమతిస్తారు. కానీ ఎంట్రీ టికెట్‌తోపాటు కెమెరాలకు చార్జ్ చెల్లించాలి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! వేటాడే అడవి కాదిప్పుడు ►ఇది ఒకప్పుడు భరత్పూర్ రాజుల వేటమైదానం. బ్రిటిష్ వైశ్రాయ్‌లు కూడా ఏటా ఇక్కడ డక్షూట్ నిర్వహించేవారు. ►ఒక ఏడాది వైశ్రా య్ లార్డ్ లినిత్గౌ వేటలో వేలాది పక్షులు వేట ఆనందానికి బలయ్యాయి. ►ప్రసిద్ధ పక్షి ప్రేమికుడు సలీం అలీ కృషితో నలభై ఏళ్ల కిందట ఈ ప్రదేశం పక్షి సంరక్షణ కేంద్రంగా మారింది. ►1985లో ఇది వర ల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ►అడవిలో నేల రాళ్ల మయం. నున్నటి కాలిబాట వంటి రోడ్డు కూడా ఉండ దు. రాళ్లబాటలోనే నడవాలి. కాబట్టి ఈ టూర్లో మంచి షూస్ ధరించాలి. ►ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, జైపూర్ టూర్ ప్లాన్‌లో భరత్పూర్ కూడా ఇమిడిపోతుంది. ఇదే మంచికాలం! ఖండాంతరాల నుంచి వచ్చే వలస పక్షులను చూడాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లాలి. ఆహ్లాదకరంగా వెకేషన్ కోసమే అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. గడ్డకట్టే చల్లని వాతావరణం నుంచి సమశీతోష్ణమైన వాతావరణాన్ని వెతుక్కుంటూ వచ్చే ఈ పక్షులకు ఆరు నెలల పాటు మంచి విడిది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఏదైనా కారణం చేత ఒక ఏడాది నీటి నిల్వలు లేకపోయినట్లయితే ఈ పక్షులు నీళ్లున్న వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. ఒకసారి ఈ చక్రం గాడి తప్పితే మళ్లీ పక్షులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ బర్డ్ శాంక్చురీ అసలు పేరు కేలాదేవ్ నేషనల్ పార్క్. ఈ పక్షి సంరక్షణ కేంద్రం భరత్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే భరత్‌ఫూర్ శాంక్చురీగా వాడుకలోకి వచ్చింది. ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు నేలకు దిగి పక్షుల రెక్కల్లో ఒదిగిపోయినట్లు్ల ఉంటుంది. రంగురంగుల పక్షులు నీటిలో మునిగి చేపలు పట్టుకుని కడుపు నిండిన తర్వాత ఒడ్డుకు చేరతాయి. తడిసిన రెక్కలను విప్పార్చి సన్‌బాత్ చేస్తున్న దృశ్యం ఈ టూర్లో కనువిందు చేసే మరో ప్రత్యేకత. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
Telangana: ‘యునెస్కో’కు మరో 25 ప్రతిపాదనలు
సాక్షిప్రతినిధి, వరంగల్: పురాతన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున రామప్పకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో మరో 25 పర్యాటక ప్రాంతాలను యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2016 నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని, అయితే అప్పుడు పలు దేశాలు తిరస్కరించాయన్నారు. ఆయా దేశాలతో విదేశాంగ శాఖ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడి, వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేసేలా చేశారని తెలిపారు. ఇందులోభాగంగా 17 దేశాలు రామప్పకు జై కొట్టాయన్నారు. తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం పరిరక్షించుకోవాలని, నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. తర్వాత కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు వేయిస్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి నుంచి కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు వెళ్లారు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. -
AP: యునెస్కో ప్రమాణాలకు తీసిపోని కళా వైభవం
మూడు వేల ఏళ్లనాటి కూచిపూడి నృత్య కళ.. తొమ్మిది శతాబ్దాల క్రితం ఎర్రమల కొండల్లో నిర్మించిన గండికోట.. 16వ శతాబ్దం నాటి లేపాక్షి ఆలయం.. గాలిలో తేలియాడే రాతి స్తంభం.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం.. 550 ఏళ్లనాటి తిమ్మమ్మ మర్రిమాను.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్.. విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు వంటి సహజసిద్ధ ప్రదేశాలు.. తరగని వారసత్వ సంపదలతో ఏపీ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతోంది. వీటిని యునెస్కో ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్ది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయం శతాబ్దాల నాటి కట్టడాలు.. అపూర్వ శిల్ప సోయగాలు.. సహజసిద్ధ ప్రదేశాలు.. సంప్రదాయ కళలు.. సాంస్కృతిక వైభవాలు.. అరుదైన స్మారక చిహ్నాలతో మన రాష్ట్రం భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాలుగా ఆక్రమణలకు, నిరాదరణకు గురైన వాటిని పరిరక్షించి కొత్త శోభ అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది. ఈ క్రమంలోనే ప్రాధాన్యతా జాబితాలో అగ్రస్థానంలో కడప జిల్లాలోని గండికోట (గ్రాండ్ కేనియాన్ ఆఫ్ ఇండియా), అనంతపురంలోని లేపాక్షి (వీరభద్ర స్వామి) ఆలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. వారసత్వ నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్ది వాటికి ప్రపంచ వారసత్వ హోదా సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం బౌద్ధ స్థూపాలు.. బెలూం, బొర్రా గుహలు కూడా.. రాష్ట్రంలోని మూడు స్థూపాలు, కట్టడాలను ఆదర్శ సంరక్ష పథకం కింద కేంద్ర ప్రభుత్వం పరిరక్షించనుంది. గుంటూరు జిల్లానాగార్జున కొండలోని బౌద్ధ స్థూపాలు, శ్రీకాకుళంలోని శాలిహుండంలో బౌద్ధ అవశేషాలు, అనంతపురంలోని లేపాక్షి ఉన్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వైఫై, ఫలహార శాల, వ్యాఖ్యాన కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు తదితర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇటీవల కట్టడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా గండికోటను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఇక కర్నూలులోని బెలూం గుహలు, విశాఖ జిల్లాలోని బొర్రా గుహలు, శ్రీకాకుళం జిల్లాలోని 8–10వ శతాబ్దంలో నిర్మించిన శ్రీముఖలింగేశ్వరాలయం అద్భుత శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ వారసత్వ హోదాకు పోటీపడుతున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్ యునెస్కో ప్రమాణాలు ఇలా.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరాలంటే యునెస్కో సూచించిన 10 ప్రమాణాల్లో ఏదో ఒక దానికి సరిపోల్చాలి. 2, 3, 4 ప్రమాణాల ప్రకారం వాస్తు, శిల్పకళ, సాంకేతికత, స్మారక కట్టడాలు, కళలు, పట్టణం–ప్రణాళిక, ప్రకృతి దృశ్యం, సంస్కృతి–సంప్రదాయం, నాగరికత, మానవ చరిత్రలో గొప్ప నిర్మాణాలు ఉండాలి. 7, 8, 9 ప్రమాణాల ప్రకారం అద్భుతమైన, అసాధారణమైన సహజ సౌందర్యం, ప్రాంతాలు, స్థల చరిత్ర భౌగోళిక సాక్ష్యాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం వారసత్వ హోదాకు ప్రాథమిక అర్హతను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1,154 ప్రదేశాలు, కట్టడాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి. వీటిలో భారతదేశంలోని 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజసిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. కడప జిల్లాలోని గండికోట గ్రాండ్ కేనియన్ గార్జ్ వ్యూ ప్రణాళికతోనే యునెస్కో గుర్తింపు ఏపీలోని లేపాక్షి, గండికోట, ఒంటిమిట్ట, శాలిహుండం, శ్రీముఖ లింగేశ్వరాలయం, బెలూం గుహలు, తిమ్మమ్మ మర్రిమాను వంటి వాటికి యునెస్కో జాబితాలో చేరడానికి అన్ని అర్హతలున్నాయి. ప్రపంచ వారసత్వ కేంద్ర నియమాల ప్రకారం తొలుత ఈ ప్రతిపాదిత కట్టడాలు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వివరణాత్మక నివేదికను తయారు చేసి కేంద్ర పురావస్తు శాఖ ద్వారా దేశంలోని ప్రపంచ వారసత్వ కేంద్రానికి పంపాలి. వారు పరిశీలించి ప్రతిపాదిత ప్రదేశాల్లో సంరక్షణ మరమ్మతులు, ఆక్రమణల తొలగింపు వంటివి చేపడితే యునెస్కో గుర్తింపు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. – ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు,సీఈవో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అనంతపురం జిల్లాలో తిమ్మమ్మమర్రిమాను యునెస్కో ప్రమాణాలకు సరితూగేవి ఇవే.. క్రీ.శ 1,123లో నిర్మించిన గండికోట ఎర్రమల కొండల్లో అద్భుతమైన ఒంపుతో పెన్నా నది హొయల మధ్య సహజసిద్ధ ప్రకృతి సౌందర్యంతో యునెస్కో ప్రమాణాన్ని నెరవేరుస్తోంది. 16వ శతాబ్దంలో నిర్మించిన లేపాక్షి ఆలయం అద్భుత శిల్పకళతో.. గాలిలో తేలియాడే రాతి స్తంభం నిర్మాణంతో గొప్ప కట్టడంగా వారసత్వ ప్రమాణాలకు సరితూగుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం మూడు గోపురాలు.. 160 అడుగుల ఎత్తైన ముఖద్వారంతో అద్భుత నిర్మాణంగా అలరారుతోంది. ఆలయ మధ్య మండపంలో 32 స్తంభాలున్న మండపం చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది. ఇది కూడా యునెస్కో ప్రమాణాలతో సరితూగుతోంది. కూచిపూడి నృత్య కళ, కూచిపూడి కళాకారుల జీవనం యునెస్కో 6వ ప్రమాణం ప్రకారం కళాత్మక జీవన విధానం, సరికొత్త ఆలోచనలు, సంప్రదాయ కళ, ప్రపంచ ప్రాముఖ్యతకు సరిపోలుతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని తిమ్మమ్మ మర్రిమాను యునెస్కో సహజసిద్ధ, జీవ వైవిధ్యం, భౌగోళిక పరిమాణం, పర్యావరణ ప్రమాణాలకు తగ్గట్టుగా 4.721 ఎకరాల్లో విస్తరించింది. దాదాపు 550 ఏళ్లనాటి ఈ వృక్షం 1,110 ఊడలను కలిగి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్, విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు సహజసిద్ధ, జీవ వైవిధ్య ప్రమాణానికి దగ్గరగా ఉంది. -
అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!
వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!) చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు. ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు. 1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి. (చదవండి: పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్) -
‘సింహాద్రి అప్పన్న’కు యునెస్కో గుర్తింపునకు యత్నాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని బుధవారం కలిసి కోరారు. రామప్ప ఆలయానికి మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. వీటి గురించి భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయ త్నిస్తాయన్నారు. సహకారం అందిస్తాం.. ఆలయ శిల్పకళ, శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు సింహాచలం దేవస్థానానికి ఉన్నాయని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారని ఈవో తెలిపారు. -
ఇంటర్నెట్లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారో తెలుసా?
ఒక్క నిమిషం.. 60 సెకన్లు.. ఇంత టైంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చేయగలరు? అవునూ.. ఏం చేయగలం అని ఆలోచిస్తున్నారా? మరి డిజిటల్ ప్రపంచంలో.. ఈ ఒక్క నిమిషంలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇదే డౌటు మరికొందరికి వచ్చినట్లుంది. దీంతో 2021లో ఇంటర్నెట్లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారన్న దానిపై ఓ పరిశోధన చేశారు. ఆ వివరాలు ఇవిగో.. 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కొన్ని కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది. అందులో మన రామప్ప, గుజరాత్‌లోని దోలవీర ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యునెస్కో ఇప్పటివరకూ 167 దేశాల్లోని 1,155 ప్రదేశాలను లేదా కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్లయింది. గతేడాది వరకూ చైనా, ఇటలీలు చెరో 55 స్థానాలతో సమానంగా ఉండేవి. తాజా జాబితాలో అది మారిపోయింది. ఇక మన పరిస్థితి చూస్తే.. భారత్ ఈ జాబితాలో టాప్–10లో ఉంది. ఆ వివరాలివీ.. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
మన రామప్ప... మనందరి గౌరవం
-
పాత శిల్పాలకు కొత్త ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇటీవల పరిగి సమీపంలోని ఓ గ్రామానికెళ్లా.. ఆ ఊరి నిండా శిల్పాలే. వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దుస్థితి కొంత దూరమవుతుందన్న ఆశాభావం కలుగుతోంది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావటమే ఇందుకు కారణం. ఆలయ శిల్పాలే యునెస్కోను ఆకర్షించాయి. ఫలితంగా శిల్పాలకు కొంతగుర్తింపు పెరుగుతుంది. నిరాదరణకు గురవుతున్న పురాతన శిల్పాలకు కొంత గౌరవం దక్కుతుంది’అని ప్రముఖ స్తపతి, రామప్ప దేవాలయ నిర్మాణానికి వినియోగించిన ఎర్ర ఇసుక రాతిని తొలిచిన క్వారీలను ఇటీవల వెలుగులోకి తెచ్చిన పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇది గొప్ప మలుపు కర్ణాటకలోని హంపికి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. 10 వేల కుటుంబాలకు ఉపాధి రావటమే కాకుండా, నిత్యం విదేశీ పర్యాటకులతో ఆ ప్రాంతం కొత్త అందాలతో పాటు వేగంగా పురోగమించేందుకు అవకాశం కలిగింది. పట్టడకల్ దేవాలయాలకు ఆ గుర్తింపు వచినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంతో మనవద్ద కూడా అలాంటి అభివృద్ధికి అవకాశం ఉంది. కాలక్రమంలో వాటిల్లో చాలావరకు దాడులకు గురై ధ్వంసం కావటంతో వాటి శిల్పాలు ఊరూవాడ చిందరవందరగా పడిపోయాయి. అవగాహనలేని స్థానికులు వాటిని గాలికొదిలేశారు. ఇప్పుడు రామప్పకు గుర్తింపుతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి ఆ శిల్పాలకు కొంత గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. శిల్పులకూ గౌరవం వస్తుంది రామప్ప దేవాలయంలోని నల్లరాతితో చెక్కిన శిల్పాలు, స్తంభాల ముందు నిలబడితే అద్దంలో చూసుకుంటున్నామన్న భావన వస్తుంది. రాతిని గాజులాగా మార్చేసిన 8 శతాబ్దాల క్రితం నాటి శిల్పుల ఘనతకు ఇప్పుడు మరింత గుర్తింపు వస్తుంది. వారిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి యంత్రాలు అందుబాటులో లేని సమయంలో.. ఉలితోనే రాతిని అద్దంలా మార్చిన ప్రతిభ నేటి తరానికి తెలుస్తుంది. శిథిల ఆలయాల పునరుద్ధరణ అవసరం.. కాకతీయుల కాలంలో అద్భుత దేవాలయాలను నిర్మించారు. అంతకుముందు చాళక్యులు కట్టిన అలంపూర్ లాంటి ఆలయాలున్నాయి. కానీ చాలావరకు శిథిలమవుతున్నాయి. రామప్పకు ప్రపంచ గుర్తింపు నేపథ్యంలో.. శిథిలమవుతున్న పాత దేవాలయాలను పునరుద్ధరించాలన్న ఆలోచన కూడా గ్రామాలకు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యునెస్కోను మెప్పించాలి
27 చారిత్రక కట్టడాలనూ.. చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్‌లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. ఆగస్టు 4న ఏఎస్ఐ, కలెక్టర్ సమావేశమవ్వాలి ‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్ విభాగం, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. -
ధోలావీరాకు యునెస్కో గుర్తింపు
ధోలవిరా: హరప్పా నాగరికత కాలం నాటి నగరం ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు యునెస్కో మంగళవారం ప్రకటించింది. చైనాలోని ఫుఝౌలో జరుగుతున్న 44వ యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ సమావేశాల్లోనే తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ప్రకటించడం తెల్సిందే. తాజా ప్రకటనతో భారత్‌లోని మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరినట్లయింది. అదేవిధంగా, గుజరాత్లో యునెస్కో గుర్తించిన ప్రాంతాల జాబితాలో పావగఢ్ సమీపంలోని చంపానెర్, పటన్‌లోని రాణీ కీ వావ్, చారిత్రక అహ్మదాబాద్ సరసన నాలుగో ప్రాంతంగా ధొలావి చేరింది. భారతదేశ చరిత్రలో గుజరాత్ రాష్ట్రం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం ఖదీర్ దీవిలో ధోలావీరా మహానగరానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1,800 సంవత్సరం వరకు సుమారు 1,200 ఏళ్లపాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. ఆనాటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి. -
ప్రధాని రాష్ట్రానికి బహుమతి: యునెస్కో జాబితాలో మరో చారిత్రక కట్టడం
న్యూఢిల్లీ: ఇటీవల తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో జాబితాలో చేర్చగా తాజాగా మరో కట్టడం యునెస్కో జాబితాలో చేరింది. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యునెస్కో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ధోలవిరాను ప్రపంచ వారసత్వ జాబితాలో చేరుస్తూ యునెస్కో ట్వీట్ చేసింది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. కచ్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం 4,500 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు ఉన్నాయి. భారత్ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన 40వ వారసత్వ సంపద ధొలవిరా పట్టణం. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ట్విటర్లో తెలిపారు. 🔴 BREAKING! Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO #WorldHeritage List. Congratulations! 👏 ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/bF1GUB2Aga — UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳😷 (@UNESCO) July 27, 2021 It gives immense pride to share with my fellow Indians that #Dholavira is now the 40th treasure in India to be given @UNESCO’s World Heritage Inscription. Another feather in India’s cap as we now enter the Super-40 club for World Heritage Site inscriptions. pic.twitter.com/yHyHnI6sug — G Kishan Reddy (@kishanreddybjp) July 27, 2021 -
మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సం పద హోదా రావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నా రు. ఇందుకు రాష్ట్ర ప్రజల తరపున మోదీకి అభినందనలు తెలిపారు. భారత వారసత్వ సంపదకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్న ప్రధాని తపన వల్లే ఈ హోదా లభించిందన్నారు. దీనికోసం కృషిచేసిన కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలకు కూడా సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్)’తొమ్మిది లోపాల ను ఎత్తిచూపిందని గుర్తుచేశారు. -
ఈసారి కుతుబ్ షాహీ టూంబ్స్
సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వర దేవాలయానికి ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో, తదుపరి కుతుబ్ షాహీ టూంబ్స్ రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర నిర్మాతలైన కుతుబ్ షాహీ వంశస్తుల సమాధుల ప్రాంగణాన్ని గతంలోనే యునెస్కోకు ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైంది. వాస్తవానికి అప్పట్లో చార్మినార్, గోల్కొండలతో కలిపి దాన్ని ప్రతిపాదించారు. అద్భుత కట్టడాలే అయినప్పటికీ చార్మినార్, గోల్కొండల చుట్టూ పలు ఆక్రమణలు ఉండటంతో యునెస్కో ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేసింది. దీంతో సమాధుల ప్రాంగణం ఒక్కదాన్నే ప్రతిపాదించాలన్న ఆలోచన తాజాగా తెరపైకి వస్తోంది. కాగా తదుపరి దశలో పాండవుల గుట్ట, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయ సమూహాలకు కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించే అర్హత ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్కు అవకాశం ఉంది రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావటంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. యునెస్కోకు ప్రతిపాదన (డోజియర్) రూపొందించటం మొదలు, చివరకు ఫైనల్ ఓటింగ్ రోజున వర్చువల్ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో ఈ ట్రస్టు కలిసి పనిచేసింది. ఇప్పుడు తదుపరి ప్రతిపాదన విషయంలో కూడా ఇదే ట్రస్టు కీలకంగా వ్యవహరించనుంది. ఈసారి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణాన్ని ప్రతిపాదించాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ‘రామప్ప’లాంటి ప్రతిపాదన మరోసారి చేసేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్న ప్రాంతం కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణమే అని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు ‘సాక్షి’తో చెప్పారు. గతంలో అడ్డుగా నిలిచిన పరిస్థితులను చక్కదిద్దగలిగితే కుతుబ్ షాహీ టూంబ్స్కు కూడా ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజవంశీయుల సమాధులన్నీ ఒకేచోట.. ఓ రాజవంశానికి చెందిన వారి సమాధులన్నీ ఒకేచోట ఉండటం, వాటి నిర్మాణం ప్రత్యేకంగా రూపొందటం ప్రపంచంలో మరెక్కడా లేదు. కుతుబ్ షాహీ రాజులు, వారి భార్యలు, పిల్లలు, వారి ముఖ్య అనుచరుల సమాధులు .. వెరసి 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. గోల్కొండ కోటకు కేవలం కిలోమీటరు దూరంలో ఇబ్రహీంబాగ్గా పేర్కొనే చోట వీటిని నిర్మించారు. పర్షియన్–ఇండియన్ నిర్మాణ శైలితో అద్భుతంగా నిర్మించారు. ç1543–1672 మధ్య ఇవి రూపొందాయి. వారి పాలన అంతరించాక వాటి నిర్వహణ సరిగా లేక కొంత దెబ్బతిన్నా.. 19వ శతాబ్దంలో సాలార్జంగ్–3 వాటిని మళ్లీ మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ఢిల్లీలోని హుమయూన్ సమాధిని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో.. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం మరింత సులభంగా యునెస్కో గుర్తింపును పొందుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. మరో నాలుగేళ్ల తర్వాతనే.. తాజా ప్రతిపాదనను యునెస్కో ముందుంచేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరైన పోటీ లేనిపక్షంలో మళ్లీ తెలంగాణకు అవకాశం రావచ్చునని అంటున్నారు. ఈలోపు నిర్ధారించుకున్న కట్టడ పరిసరాలను యునెస్కో నిబంధనల మేరకు తీర్చిదిద్దితే, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా మరో గొప్ప అవకాశాన్ని ఒడిసిపట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో గొప్ప నిర్మాణం అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాల సమూహం.. కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వాటిని నిర్మించిన బాదామీ చాళుక్యులే అలంపూర్‌లో ఏడో శతాబ్దంలో బ్రహ్మేశ్వరాలయాల సమూహాన్ని అద్భుత శిల్ప, వాస్తు నైపుణ్యంతో నిర్మించారు. నవ బ్రహ్మలుగా తొమ్మిది శివరూపాలతో ఉన్న ఈ ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర ఒడ్డున ఉన్న ఈ ఆలయాలను ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. వాటిల్లో 32 రకాల కిటికీలు, పైకప్పు శిల్పాలు రేఖా నాగర ప్రాసాదం శైలిలో నిర్మాణాలు జరిగాయి. దాదాపు 50 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణానికి కూడా వారసత్వ హోదా పొందే అర్హత ఉందని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ విశ్రాంత స్తపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. పాండవుల గుట్ట కూడా సిద్ధం.. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం మానవుడి చిత్రలేఖనం ఎలా ఉండేది..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్వపు వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట గుహలను పరికిస్తే తెలుస్తుంది. దాదాపు వేయి చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బింబేడ్కాలో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల్లో వేల సంఖ్యలో ఇలాంటి చిత్రాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఆదిమానవులు వేసిన అన్ని చిత్రాలు ఒకేచోట బయటపడ్డ దాఖలాలు లేవు. దీంతో దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాతో సత్కరించింది. ఆ తర్వాత అన్ని చిత్రాలున్న ప్రాంతంగా ఇప్పటివరకు పాండవుల గుట్టనే రికార్డుల్లో ఉంది. ఇది కూడా యునెస్కో గుర్తింపును పొందగల అర్హతలున్న ప్రాంతమేనని పురావస్తు పరిశోధకులు రంగాచార్యులు, శ్రీరామోజు హరగోపాల్‌లు తెలిపారు. -
తెలుగు చరితకు విశ్వ ఘనత
తెలుగు జాతికిది సంతోష సందర్భం. తెలుగు ఖ్యాతికిది విశ్వవిఖ్యాత సంబరం. కొన్నేళ్ళ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీక రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకుంది. గర్వంతో తెలుగు వారి ఛాతీ ఉప్పొంగేలా చేసింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పట్టం సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప కొత్త చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప గుడికి ఈ విశ్వవిఖ్యాత పట్టం రావడానికి వారసత్వ ప్రియుల మొదలు ప్రభుత్వాల దాకా ఎందరో కృషి చేశారు. పురాస్మరణకూ, పర్యాటకం పుంజు కోవడానికీ తోడ్పడే ఈ విశ్వఘనత అనేక రకాల ప్రత్యేకమైనది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో అంతర్జాతీయ సహకారంతో శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి పెట్టిన ప్రత్యేక సంస్థ ‘యునెస్కో’. ఆ సంస్థ నుంచి 1972లో ఓ అంతర్జాతీయ ఒప్పందంగా వార సత్వ కట్టడాల గుర్తింపు ప్రారంభమైంది. 1977లో మన దేశం ఆ ఒప్పందంలో భాగమైంది. 1983లో మన దేశం నుంచి తొలిసారిగా అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. అప్పటి నుంచి దేశంలోని ఖజురహో శిల్పాలు, కోణార్క్ ఆలయం, మహాబలిపురం, హంపీ నిర్మాణాలు, ఎర్రకోట, ఖజిరంగా జాతీయ పార్క్ తదితర 38 సాంస్కృతిక నిర్మాణాలు, సహజ అభయారణ్యాలు ‘యునెస్కో’ గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ వరుసలో 39వదిగా మన రామప్ప ఆ జాబితాకు ఎక్కింది. ఇప్పటికి ఇలా మొత్తం 167 దేశాల్లోని 1130 నిర్మాణాలు ఈ ప్రత్యేక గుర్తింపు సాధించాయి. రామప్ప గుడి కట్టి 800 ఏళ్ళు పూర్తయినప్పటి నుంచి ఈ గుర్తింపు కోసం మన ప్రభుత్వాలు కృషి చేస్తూ వచ్చాయి. 2014 ఏప్రిల్‌లో ప్రయత్నించి, విఫలమయ్యాం. అప్పటి నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో మటుకు కొనసాగుతూ, గుర్తింపు కోసం రామప్ప గుడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 సెప్టెంబర్‌లో అక్కడి అధికారులొచ్చి, మన శిల్పకళా సౌందర్యాన్ని చూసి వెళ్ళారు. దరఖాస్తు లోని లోటుపాట్ల సవరణ, నృత్య శిఖామణుల వివరణతో మన వాదనకు బలం చేకూరింది. ఇంతలో కరోనా కారణంగా గత ఏడాది సమావేశం వాయిదా పడింది. చివరకు చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో 44వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం వర్చ్యువల్‌గా జరిగినప్పుడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలు దాటాక తీపి కబురందింది. మొత్తం 21 సభ్యదేశాలలో నార్వే అభ్యంతరం చెప్పింది. కానీ, మన ప్రభుత్వ దౌత్యం ఫలించి, రష్యా చొరవతో 17పైగా సభ్య దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అలా రామప్పకు విశ్వవిఖ్యాతి దక్కింది. పది వేర్వేరు అంశాలను బట్టి ఈ గుర్తింపు ఈసారి రామప్పతో పాటు చైనా, ఇరాన్, స్పెయిన్‌లలోని కట్టడాలకూ లభించింది. ‘విలక్షణ శైలి... సూక్ష్మరంధ్రాలుండి నీటిలో తేలే తేలికైన ఇటుకలతో కట్టిన ఆలయ విమానం... కాకతీయ సంస్కృతినీ, నృత్య సంప్రదాయాలనూ ప్రతిఫలించే అద్భుత ఆలయ శిల్పాలు...’ అంటూ యునెస్కో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ విశేషాలను వేనోళ్ళ పొగడడం విశేషం. రామప్పగా పేరుపడ్డ శివాలయమైన రుద్రేశ్వరాలయం కాకతీయ శిల్పకళా విశిష్టతకు మకుటాయ మానం. విశాల కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుని పాలనలో, సేనాని రేచర్ల రుద్రుడు నిర్మిం చిన ఈ ఆలయ సముదాయానిది పెద్ద కథ. క్రీ.శ. 1213లో నిర్మాణమైన ఈ గుడిలో ఎన్నెన్నో విశే షాలు. ఇది భక్తులకు గుడి. నల్లని రాళ్ళపై చెక్కిన అపురూపమైన స్త్రీమూర్తులతో కళాప్రియులకు అద్భుత శిల్పసౌందర్యశాల. ‘శాండ్ బాక్స్ టెక్నాలజీ’లో ఇసుక మీద పేర్చిన రాళ్ళతో నిర్మాణ నిపుణులకు అపూర్వ ఇంజనీరింగ్ అద్భుతం. వెరసి, రాశిగా పోసిన విశేషాల కుప్ప– రామప్ప. దాదాపు 40 ఏళ్ళు ఈ నిర్మాణం కోసం శ్రమించిన శిల్పి రామప్ప పేరు మీదే ఎనిమిదొందల ఏళ్ళ నాటి ఈ గుడికి ఆ పేరొచ్చిందని కథ. ఆ తరువాత కట్టిన వాటెన్నిటికో గుర్తింపు దక్కినా, ఇప్పటి దాకా ఆ భాగ్యం రామప్పకు దక్కకపోవడం విచారకరమే. చరిత్రపై శ్రద్ధ, ఘనవారసత్వాన్ని కాపాడుకోవాలనే ధ్యాస లేని సమాజంలో ఈ ప్రాచీన శిల్పవిన్నాణానికి ఇప్పటికైనా గుర్తింపు రావడమే ఉన్నంతలో ఊరట. మన తెలుగు నేలపై ఇంకా వేయిస్తంభాల గుడి, లేపాక్షి లాంటి అద్భుతాలు, పునరుద్ధరిం చాల్సిన శిథిల నిర్మాణాలు, మరుగునపడిన చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. ఆలనాపాలనా లేని వాటిపై ఇకనైనా దృష్టి పెట్టాలి. కళలు, సంస్కృతి, చరిత్రపై తమిళ, కన్నడిగ, మలయాళీలకున్న అక్కర తెలుగువారికి లేదనే అపఖ్యాతి తరతరాలుగా మూటగట్టుకున్నాం. ఆ మచ్చను తుడిచేయా లంటే, ఇది సరైన సమయం! ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో’ అన్న సినారె సాక్షిగా చరిత్రకెక్కని చరితార్థుల కథలు వెలికి తీయడానికి ఇదే సందర్భం! రామప్పకు దక్కిన గుర్తింపు మన జాతి చరిత్ర, సంస్కృతి, కళలపై స్వాభిమానం పెంచుకోవడానికి అందివచ్చిన అవకాశం! కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ లాంటి సంస్థలు, కొందరు కళాప్రియులు రెండు రాష్ట్రాల్లో ఇతోధికంగా శ్రమిస్తున్నా, అదొక్కటే సరిపోదు. భారతీయ పురావస్తు శాఖ తోడ్పాటు, తగిన నిధుల కేటాయింపుతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. చరిత తెలుకోనిదే భవితను నిర్మించలేమనే చైతన్యంతో ప్రజలు భాగస్వాములు కావాలి. సమష్టిగా బాధ్యతను భుజానికెత్తుకొని, మన ఘనతను విశ్వానికి చాటాలి. ఆ దీక్షలో రామప్ప నుంచే తొలి అడుగు వేయాలి! -
రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
-
రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం
-
రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: కేటీఆర్ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన వారిందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. @UNESCO pic.twitter.com/ljfJvQ7691 — Telangana CMO (@TelanganaCMO) July 25, 2021 -
రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం
సాక్షి, ఢిల్లీ: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. రామప్ప దేవాలయం కాకతీయుల అద్భుతమైన నైపుణ్యం అని కొనియాడారు. అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. స్వయంగా శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానికి కృతజ్ఞతలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించటం పట్ల చాలా సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘దేశ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరపున ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్న ప్రధానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. Excellent! Congratulations to everyone, specially the people of Telangana. The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex and get a first-hand experience of it’s grandness. https://t.co/muNhX49l9J pic.twitter.com/XMrAWJJao2 — Narendra Modi (@narendramodi) July 25, 2021 -
వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం
-
రామప్పకు విశ్వఖ్యాతి
‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో.. ►ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ►రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ►యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది. ►యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ►రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్/ న్యూఢిల్లీ: వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. చైనాలోని వూహాన్ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. ఏళ్లుగా చేస్తున్న కృషితో.. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్ (దరఖాస్తు) రూపొందకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో డోజియర్‌ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి.. మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆక్రమణలను చూసి బిత్తరపోవడంతో.. నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులతో ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి బిత్తరపోయి, ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్లీ సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్ఐ)తోపాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది. సౌకర్యాలు కల్పించాలి.. ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్ఐ పరిధిలో ఉంది. కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తోంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణకు ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఇస్తోంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి. పీవీ అప్పుడే ఆకాంక్షించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్ స్టోన్స్’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు. ఆ శిల్పాలు అద్భుతాలే.. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ (నల్లశానపు) రాయిని వాడారు. ►సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ►వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. ►నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం. ►ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. ►గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ►భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. అద్దంలాంటి నునుపుతో.. ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. ►ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. ►దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి చిత్రాలు ఉన్నాయి. ►ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి. రామప్పకు ఎలా వెళ్లాలి? వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే వరంగల్ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. బస్సుల ద్వారా అయితే.. వరంగల్ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు. అభివృద్ధి పనులు షురూ.. రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం, రెండు స్వాగత తోరణాలు కట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. తరలిరానున్న పర్యాటకులు రాష్ట్రంలో గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, కట్టడాలున్నా తగిన ప్రచారం, వసతులు లేక దేశ, విదేశీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలకు పోటెత్తుతున్నారు. తాజాగా రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏళ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నా. – ప్రధాని మోదీ కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. – సీఎం కేసీఆర్ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు 13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది తెలంగాణ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు. దీనిపై తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీమ్ ఇండియాకు అభినందనలు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకు, శిల్ప కళా చాతుర్యానికి రామప్ప ఆలయం ఓ చక్కని ఉదాహరణ. టీమ్ ఇండియాకు అభినందనలు. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంతోషకరమైన వార్త రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కడం గొప్ప వార్త. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. –కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆనందంగా ఉంది రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించింది. దీనికి మార్గదర్శనం, మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి దేశం తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విదేశాంగ శాఖ, భారత పురావస్తు శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నా. – ట్విట్టర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రామప్ప తర్వాతి లక్ష్యం హైదరాబాద్ నగరమే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని చేర్చడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు లభించడంలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. తెలంగాణ నుంచి రామప్ప తొలి వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించింది. తర్వాత హైదరాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. –ట్విట్టర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజిది. ఈ గుర్తింపుతో ‘రామప్ప’ కట్టడం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం సంతోషకరం. – శ్రీనివాస్‌గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి చాలా సంతోషం.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన సీఎం కేసీఆర్ సహా అందరికీ ధన్యవాదాలు. – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మా కృషి ఫలించింది రామప్పకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావటంతో ఆనందంగా ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిలో మా ట్రస్టు కీలకపాత్ర పోషించింది. పర్యాటకపరంగా రామప్ప ప్రాంత రూపురేఖలు మారతాయి. – పాపారావు, కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
సాక్షి, పాలంపేట(వరంగల్): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. యూనెస్కో సూచనలు ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం ► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి. ► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్ పరిధిలోకి తీసుకురావాలి. ► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి ► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి ► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చేపట్టే చర్యలు, పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు ► కట్టడానికి సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు అద్భుతాల నెలవు రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. -
World Heritage Sites : ‘వారసత్వ రేసులో రామప్ప’
సాక్క్షి, వెబ్‌డెస్క్ : ద్భుతాలకు నెలవైన రామప్ప వైభవం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట నుంచి చైనాకు చేరుకుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో కొత్తవాటిని చేర్చేందుకు యూనెస్కో సమావేశాలు చైనాలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా తరఫున 2020 నామినీగా రామప్ప ఎంపికైంది. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐదేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఓ సారి చూద్దాం... -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
Ramappa Temple: తుది అంకానికి వారసత్వ హోదా
సాక్షి, హైదరాబాద్: రమణీయమైన శిల్పకళతో అలరారే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. కోవిడ్ విలయం కారణంగా నిలిచిపోయిన తుది కసరత్తును యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తిరిగి ప్రారంభించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూలై 15 నుంచి 30 మధ్య యునెస్కో హెరిటేజ్ కమిటీ భేటీ కాబోతోంది. ఇందులో సభ్యత్వం ఉన్న 18 దేశాల ప్రతినిధులు నివేదికను కూలంకషంగా పరిశీలించి ఓటు వేయనున్నారు. ఎక్కువ ఓట్లు వస్తే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరుతుంది. లేదంటే మళ్లీ నిరాశ తప్పదు. అయితే ఇప్పటివరకు జరిగిన కసరత్తులో పూర్తి సానుకూల వాతావరణమే ఏర్పడినందున, ఈ కమిటీ కూడా సాను కూల నిర్ణయమే తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం యునెస్కో నుంచి స్థానిక అధికారులకు సమాచారం అందింది. కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే, తెలుగు రాష్ట్రాల్లో తొలి యునెస్కో గుర్తింపు పొందిన కట్టడంగా ఈ కాకతీయుల కళాసృష్టి రికార్డు సృష్టించనుంది. చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
‘మానవ చరిత్రలో ఇదే అత్యంత భారీ సంక్షోభం’
పారీస్: కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడి కోసం దేశాలన్ని లాక్డౌన్ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవి చూస్తున్నాయి. అయితే కరోనా వల్ల ఆర్థికంగానే కాక విద్యాపరంగా కూడా ఎంతో నష్టం వాటిల్లిందని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో దాదాపు 1.6 బిలియన్ మంది పిల్లలు పాఠశాలకు, యూనివర్సిటీలకు దూరమయ్యారని సంస్థ తెలిపింది. ఒక తరం మొత్తం పిల్లల చదువు పాడవ్వడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అన్నది. యునెస్కో డాటాను ఆధారంగా చేసుకుని సేవ్ ది చిల్డ్రన్ ఓ నివేదిక వెల్లడించింది. ఫలితంగా 90-117 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలోకి నెట్టబడతారని నివేదిక అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను భరించడం కోసం చాలా మంది పిల్లలు బలవంతంగా పనులకు వెళ్లాల్సి వస్తుందని.. బాల్య వివాహాల సంఖ్య పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంతేకాక దాదాపు 9.7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక తెలిపింది. అంతేకాక 2021 నాటి అన్ని దేశాల బడ్జెట్లలో విద్యకు కేటాయింపులు భారీగా తగ్గుతాయని.. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 77 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్ నివేదిక అంచాన వేసింది. అంతేకాక ఈ చర్యల వల్ల పేద-ధనిక, ఆడ-మగ అంతరాలు మరింత పెరుగుతాయన్నది. దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వాలు, దాతలు పిల్లలందరికి సురక్షితమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరింది. ఇప్పటికే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు సగం విద్యా సంవత్సరం నష్టపోయారని నివేదిక తెలిపింది. విద్యా కార్యక్రమాల కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 77 బిలియన్ డాలర్లు కేటాయించాల్సి వస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈ విద్యా సంక్షోభం ముగియకపోతే.. పిల్లల భవిష్యత్తుపై ఆ ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది. 2030 నాటికి పిల్లలందరికి నాణ్యమైన విద్య అందించాలనే ఐక్యరాజ్యసమితి వాగ్దానం పూర్తికాదని తెలిపింది. 12 దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు నివేదిక వెల్లడించింది. నైజర్, మాలి, చాడ్, లైబీరియా, అఫ్ఘనిస్తాన్, గినియా, మౌరిటానియా, యెమెన్, నైజీరియా, పాకిస్తాన్, సెనెగల్, ఐవరీ కోస్ట్ దేశాల పిల్లలు చాలా వెనకబడిపోయే ప్రమాదం ఉందని సేవ్ ది చిల్డ్రన్ నివేదిక హెచ్చరించింది. -
ఐసోలేషన్‌లో అవే మన ఆత్మీయ నేస్తాలు!
జీవితంలో ప్రతీ ఒక్కరు తమకంటూ కొంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటారు. బాధ కలిగినా.. సంతోషంతో మనసు ఉప్పొంగినా ఆ భావాలను వారితో పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్లమనే భావన కలుగుతుంది. అలాంటి సమయాల్లో నచ్చిన పుస్తకం తీసి చదువుతూ ఉంటే మనసు తేలికపడుతుంది. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు... మానసికంగా ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ‘చినిగిన చొక్కైనా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు... ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా స్వీయ అనుభవంతోనే మనకు దాని విలువ బోధపడుతుంది. నేడు(ఏప్రిల్ 23) అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. జగమెరిగిన ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా వరల్డ్ బుక్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ప్రపంచమంతా కోవిడ్-19తో కల్లోలం అవుతున్న వేళ పుస్తకాలు చేసే మ్యాజిక్ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో... సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్ చేసింది. మంచి పుస్తకాన్ని మించిన ఆత్మీయులెవరూ ఉండరంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్‌లో బుక్స్ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్బుక్డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం’’ అని ట్వీట్ చేశారు. తాటాకుల నుంచి ఇ-బుక్‌ల వరకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాల ముద్రణ సులువుగా మారింది.. ఇ- బుక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాలేవీ లేని పురాతన కాలం నుంచే ఎంతో మంది రచయితలు, కవులు తాటి ఆకులపై రచనా వ్యాసంగాలు చేశారు. ఇక సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎంతో మంది రాజులు కవులను ప్రోత్సహిస్తూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి భవిష్యత్ తరాలకు విలువైన సంపదను అందించారు. ఇక ప్రస్తుతం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటూ ప్రపంచంపై కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి పోతులూరి వీరేంద్ర బ్రహ్మేంద్రస్వామి ఏనాడో తాళపత్ర గ్రంథాల్లో లిఖించారన్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల వయస్సులో లైబ్రరీ స్థాపించిన చిన్నారి యశోద గొప్ప కానుక... ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళకు చెందిన యశోద డి షెనాయ్ వంటి(12) చిన్నారులు సైతం ఖాళీ సమయాన్ని మరిన్ని ఎక్కువ పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్‌షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ బుక్ డే రోజు తమకు అందిన గొప్ప కానుక అంటూ పుస్తక ప్రియులు మురిసిపోతున్నారు. 23 April is #WorldBookDay! In a world disrupted by #COVID19, it is the magic of books that we need now. Let's unleash the power of reading to dream, to learn and to help us build a better tomorrow! ℹ️ https://t.co/MjMQG6JGxW #ShareCulture pic.twitter.com/jUNDlIjGxs — UNESCO (@UNESCO) April 23, 2020 -
రామప్పపై యునెస్కో సందేహాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉన్న కల్యాణ మండపం పునర్నిర్మాణంలో నెలకొన్న దుస్థితి రామప్పకు ఎదురవుతుందా? రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్న యునెస్కోకు ఈ తరహా సందేహం వచ్చినట్లుంది. రామప్ప పరిరక్షణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, కట్టడంపై దుష్ప్రభావం చూపే పరిస్థితులను సకాలంలో నిరోధించటం, ఆక్రమణల్లేకుండా చూడటం, పర్యాటకుల సంఖ్య పెంచేందుకు చేపట్టే చర్యలు, పర్యాటకుల వల్ల కట్టడంపై ప్రభావం.. తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత స్థాయి హోదా అధికారి ఆధ్వర్యంలో అథారిటీ ఏర్పాటు చేస్తారా అంటూ తాజాగా యునెస్కో ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చే జూన్/జూలైలో చైనాలో జరిగే సమావేశంలో రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని యునెస్కో తేల్చనుంది. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేముందు ఇలాంటి సందేహాను యునెస్కో లేవనెత్తడం సహజమేనని అధికారులు పేర్కొంటున్నా.. రామప్పపై వేయి స్తంభాల దేవాలయ కల్యాణమండపం పునర్నిర్మాణంలో కనిపించిన నిర్లక్ష్యం ప్రభావం ఉంటుందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడే ప్రశ్నించిన యునెస్కో ప్రతినిధి గత నవంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోష్యానంద రామప్పను సందర్శించారు. డోజియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు రామప్ప కట్టడానికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా చూశారు. ఆలయం పక్కనే అసంపూర్తిగా ఉన్న కల్యాణమండపాన్ని చూసి విస్తుపోయారు. దానికి కారణాలపై వాకబు చేశారు. శిథిలావస్థకు రావటంతో కట్టడాన్ని పునర్నిర్మిస్తున్నామని అధికారులు వివరించారు. కానీ తిరిగి నిర్మించేందుకు ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్న లేవనెత్తారు. దీంతో కొన్ని అంతర్గత సమస్యలు అని అధికారులు చెప్పారు. అద్భుత నిర్మాణం దుస్థితిని కళ్లారా చూశాక ఆయనకు రామప్ప విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకే తాజాగా మన అధికార యంత్రాంగం నుంచి స్పష్టత కోరుతూ యునెస్కో పలు ప్రశ్నలు అడిగింది. రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉండే కల్యాణమండపాన్ని పునర్నిర్మించేందుకు దశాబ్దన్నర కిందటే విడదీసి ఆ రాళ్లపై సీరియల్ నంబర్లు వేసి పక్కన పెట్టారు. చివరకు మూడేళ్ల కింద పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ.7.5 కోట్ల అంచనాతో మొదలుపెట్టినా.. పైకప్పు వరకు రాకుండానే ఆ నిధులు ఖర్చయిపోయాయి. ఇప్పుడు దాదాపు రూ.కోటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉన్నాయి. తదుపరి నిధులు వస్తే కానీ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. దాదాపు రెండేళ్లుగా అవి నిలిచిపోయే ఉన్నాయి. ఈ పనుల్లో పాలుపంచుకునే స్థపతులతో పాటు ఇతర సిబ్బందికి చెల్లించే మొత్తం తాలూకు రేట్లను సవరించాలన్న విజ్ఞప్తి ఉంది. ఆ రేట్లు ఎంతుంటాయో నిర్ధారించేందుకే ఏడాదికిపైగా సమయం పట్టింది. ఇటీవలే ఆ ధరలను పేర్కొంటూ ఏఎస్ఐకి ప్రతిపాదన పంపారు. ముందు చూపు లేకపోవడంతోనే.. గతంలో పనులు చేపట్టినప్పుడు క్రేన్లను వినియోగించారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే వాటిని వాడారు. ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్ చేయటం కష్టంగా మారింది. పునాదులకు అయ్యే వ్యయం రెట్టింపు అయింది. దీనికి కారణాలను ఢిల్లీ అధికారులకు వివరించాల్సి ఉంది. ఇలాంటి చిక్కుముడులతో పనులు పెండింగులో పడి పైకప్పు లేకుండానే మొండి శిలలు వెక్కిరిస్తున్నాయి. అలాంటి సమస్య రాదు.. ‘వేయిస్తంభాల దేవాలయ మండపం పునర్నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో మళ్లీ పనులు మొదలై ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కే విషయంలో దీని ప్రభావం ఉంటుందనుకోను. కొన్ని అనుమానాలను నివృత్తి చేయాలంటే యునెస్కో కోరిన మాట నిజమే. వాటికి సమాధానాలు పంపాం. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే సమయంలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవటం యునెస్కోకు సహజమే’ – మల్లేశం, ఏఎస్ఐ అధికారి -
సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో
పారిస్: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో కీలక సూచన చేసింది. దేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్ మసాజ్
బ్యాంకాక్ : ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గురువారం థాయ్ మాసజ్ను వారసత్వ జాబితాలో చేర్చినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి థాయ్ మసాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు తెలిసింది. 2500 ఏళ్ల క్రితమే ఈ విధానం థాయ్‌కు వచ్చిందని థాయ్ ప్రజలు అంటున్నారు. -
'ఉగ్రవాదం పాక్ డీఎన్ఏలోనే ఉంది'
పారిస్ : కశ్మీర్ విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ వేదికలపై భారత్ దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా ప్యారిస్‌లో జరుగుతున్న యూనెస్కో జనరల్ సమావేశంలో పాక్ లేవనెత్తిన కశ్మీర్ అంశాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదం అనేది పాక్ డీఎన్ఏలోనే ఉందంటూ భారత్ తరపున హాజరైన అనన్య అగర్వాల్ స్పష్టం చేశారు. పాక్ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్తను దారుణంగా కుంగదీశాయన్నారు. యూనెస్కో వేదికగా భారత్‌పై బురద జల్లేందుకు ప్రయతించిన పాక్ వైఖరిని ఆమె ఖండించారు. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం వంటి చీకటి కోణాలకు పాక్ అడ్డాగా మారందని అగర్వాల్ ఆరోపించారు. అణు యుద్దం, ఇతర దేశాలపై ఆయుధాలను ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐక్యరాజ్యసమితి వేదికను అవమానించడం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పేరు మోసిన ఒసామా బిన్ లాడెన్, హక్కానీ నెట్వర్క్ లాంటి వారిని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ హీరోలుగా అభివర్ణించడాన్ని చూస్తేనే వారి నిజం స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.అలాగే పాక్ మైనారిటీ వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. మళ్లీ పాక్ ఇటువంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని అనన్య తేల్చి చెప్పారు. -
రామప్ప’ ఇక రమణీయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంçస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్ఆర్ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి వద్ద, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. కాగా యునెస్కోకి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాగా, సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, ఈ నెల 22న పారిస్ లో యునెస్కో బృందంతో సమావేశం జరగనుంది. కాగా, రామప్ప ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులతో సోమవారం సమీక్ష జరిపారు. -
హైదరాబాద్ ఆహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రఖ్యాతిగాంచిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించినట్టు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎంపికయ్యేందుకు దరఖాస్తు నుంచి ప్రెజెంటేషన్ దాకా వివిధ వర్గాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించి ముషార్రఫ్ అలీ కీలకభూమిక పోషించారు. శతాబ్దాల ఘనత.. వందల ఏళ్లనుంచి వివిధ రకాల వంటలకు సుప్రసిద్ధమైన హైదరాబాద్ నగరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని దేశాల వారినీ ఆకట్టుకోవడమేకాక ఇక్కడి వివిధ రకాల వంటకాలు అందరినీ అలరిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాలను అందిపుచ్చుకున్న పాకశాస్త్ర ప్రవీణులేగాక ఈ రంగానికి సంబంధించి ఎన్నో సంస్థలు, పరిశోధనశాలలు సైతం నగరంలో ఉన్నాయి. వీధిబండ్ల నుంచి సెవెన్ స్టార్ హోటళ్ల దాకా వివిధ ఆహారాలను అందిస్తుండటం నగరానికి ఈ చోటు దక్కడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన హలీం వరకు హైదరాబాద్‌కే ప్రత్యేకమైనవి కావడం కూడా ఇందుకు ఉపకరించాయి. కాకతీయుల కాలం నుంచి టర్కీలు, మొఘల్ వంటకాలు హైదరాబాద్ జిహ్వచాపల్యాన్ని పెంచాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్‌కు పరిచయం చేశారు. పరిశ్రమగానూ ఉపాధి నగరంలో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు 2,200 కాగా, మరో లక్ష కుటుంబాలు ఆహారమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంలో ఉన్నారు. ఆహార వినియోగంలోనూ హైదరాబాద్ తక్కువేం లేదు. నిత్యం 700 టన్నుల చికెన్, (ప్రత్యేక సందర్భాల్లో 2000 టన్నులు), 291 టన్నుల మాంసం వినియోగమవుతున్నాయంటే నగర వాసులకు వంటకాలపై ఎంత మక్కువో అంచనా వేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి తగినట్లుగా ఇరుకుసందులోని టిఫిన్ బండి నుంచి ప్రపంచశ్రేణి తాజ్, నోవాటెల్ వంటి గ్రూప్ హోటళ్లు, వాటి వినియోగదారులు నగరంలో ఉన్నారు. స్వీట్ఫెస్టివల్స్ వంటివి ఇక్కడే నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల వారిని ఒక్కచోట చేరుస్తున్నారు. నగరానికి గర్వకారణం: మేయర్ నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్ దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరం. మన నగరం యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో చేరడం అందరికీ గర్వకారణం. మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. హైదరాబాద్ నగరానికి క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం లభించడంపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. -
హైదరాబాద్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: విలక్షణమైన సిటీగా పేరొందిన హైదరాబాద్.. ప్రపంచంలోని సృజనాత్మక నగరాల (క్రియేటీవ్ సిటీస్) జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో ఎంపిక చేసిన క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో 66 నగరాలను ఎంపిక చేయగా.. అందులో మన హైదరాబాద్ సిటీ ఉంది. భారత్ తరపున ముంబై మహా నగరాన్ని సినిమా, హైదరాబాద్ నగరాన్ని ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి ఎంపికచేశారు. భారతదేశం నుంచి మొత్తం 18నగరాలు ఈ నెట్‌వర్క్‌లో స్థానం కోసం పోటీపడగా.. ఎనిమిది నగరాలు మాత్రమే తమ దరఖాస్తులను యునెస్కోకు పంపాయి. అందులో కేవలం నాలుగు నగరాలు మాత్రమే (హైదరాబాద్, ముంబాయి, శ్రీనగర్, లక్నో) ఎంపికయ్యాయి. హైదరాబాద్ క్రియేటీవ్ సిటీస్ నెట్‌వర్క్‌లో స్థానం పొందడం పట్ల రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
రామప్ప.. మెరిసిందప్పా
ఆహా... ఎంతలో ఎంతమార్పు! ఏడొందల ఏళ్ల క్రితం నిర్మాణరంగంలో ప్రపంచానికి సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన రామప్ప దేవాలయం పరిసరాలు ఎలా ఉండేవి ఎలా మారాయి..! గుడిని గుర్తుపట్టకుండా ఉన్న పిచ్చిమొక్కలను, 300 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమకట్టడాలను అధికారులు తొలగించారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతం కేవలం 20 రోజుల్లో ఆహ్లాదకరంగా మారిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తించేందుకు ఈ నెల 25న యునెస్కో ప్రతినిధులు అక్కడికి వస్తుండటమే దీనికి కారణం. మార్పు ఎంతుందో ఈ చిత్రాలే సాక్ష్యం. –సాక్షి, హైదరాబాద్. ఎంత గొప్ప ఆలయమైనా సరే, అడ్డదిడ్డంగా వెలిసే అక్రమ నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని గజిబిజిలా మార్చేస్తాయి. రామప్ప దేవాలయం ప్రవేశద్వార ప్రాంతం 20 రోజుల క్రితం ఇలా ఉంది. ఇప్పుడక్కడ దేవాలయం, దాని చుట్టూ చెట్లు తప్ప మరేం లేదు. యునెస్కో నిబంధనల ప్రకారం.. కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలుండకూడదు. అందుకే అధికారులు ఇలా మార్చేశారు. రామప్ప ఆలయం తరహాలోనే మంచి నిర్మాణకౌశలం ఉన్న చిన్నగుడి ఇది. ఆలయం శిల్ప సౌందర్యం ఇప్పటివరకు కనిపించేది కాదు. ఇప్పుడు ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. మూలవిరాట్టు దర్శనం కాకున్నా, శిల్పుల పనితనాన్ని దర్శించుకునే అవకాశం చిక్కింది. గుబురుగా పెరిగిన చెట్లు, లతలతో ఇదో పొదరిల్లులా మారింది కదూ. కానీ అక్కడ ఓ రాతి నిర్మాణం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలమైతే ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. అది త్రికూటాలయం. రామప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో దీనిన్ని కట్టారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత దానికి విముక్తి కలిగింది. -
అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట
పారిస్: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్‌లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు. ‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. కాప్– 21 సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన. ఫుట్‌బాల్ భాషలో మోదీ ప్రసంగం భారత్‌తో ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు. ‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్‌ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్‌కు వెళ్లనున్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
పారిస్ : విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునెస్కో హెడ్ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, ఫ్రాన్స్ మధ్య చిరకాల స్నేహం ఉందని అన్నారు. కాలానికి అతీతంగా ఇరుదేశాల మధ్య స్నేహం బంధం నిలిచి ఉందని పేర్కొన్నారు. ‘భారత్, ఫ్రాన్స్ దేశాలు పరస్పరం అభివృద్ధిని కోరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య మధ్య చిరకాల స్నేహం ఉంది. భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ఈనాటికి కావు. మీ అందరినీ కలవడం నా అదృష్టం. రామభక్తి, దేశభక్తి, మహాత్మా గాంధీ భారత్‌కు ప్రతీక. కష్టనష్టాల్లో భారత్, ఫ్రాన్స్ పరస్పరం సహకరించుకుంటాయి. నవభారత్ నిర్మాణం కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగే కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గత ఐదేళ్లలో దేశంలో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణం’అన్నారు. -
చరిత్రకు వారసత్వం..
‘ప్రత్యేకత’ ఉంటే హెరిటేజ్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: చార్మినార్, రామప్ప, వేయి స్తంభాల గుడి.. అద్భుత నిర్మాణానికి, కట్టిపడేసే శిల్పకళకు తార్కాణాలు. నాటి నైపుణ్యానికి ప్రతీకలు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. దీని కోసమే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), హెరిటేజ్ తెలంగాణ కృషి చేస్తున్నాయి. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడం.. ఎర్రమంజిల్ కూల్చివేత నేపథ్యంలో ‘హెరిటేజ్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు హెరిటేజ్ అంటే ఏమిటి?.. ఎలా గుర్తిస్తారు?... ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ప్రస్తుతం తెలంగాణలో ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, రామప్ప, వేయిస్తంభాల గుడి ఇందులో ప్రముఖమైనవి. దేశానికి ప్రాధాన్యాన్ని కల్పించే ప్రాంతం/ కట్టడాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తన ఆధీనంలోకి తీసుకుంటుంది. హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 రక్షిత కట్టడాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతదిగా ఉన్న కట్టడం/ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రక్షిత కట్టడాల జాబితాలోకి చేరుతుంది. నాటి హుడా ఆధ్వర్యంలో ఏర్పడ్డ హెరిటేజ్ కమిటీ గుర్తించిన కట్టడాలు 137. ఇటీవల వీటిని రక్షిత కట్టడాల జాబితా నుంచి సవరించారు. ఇవి అటు ఏఎస్ఐ అధీనంలో, ఇటు హెరిటేజ్ తెలంగాణ అధీనంలో లేవు. ప్రస్తుతం 3,693 కేంద్ర ప్రభుత్వ అధీనంలో (బ్రిటిష్ కాలంలో) 1861లో ప్రారంభమైన ఏఎస్ఐ తొలుత ఢిల్లీలోని 20 చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాలుగా గుర్తించింది. స్వాతంత్రం సిద్ధించే నాటికి వీటి సంఖ్య 151కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ జాబితాలో 3,693 ఉన్నాయి. వారసత్వ కట్టడాలంటే.. ఒక మానవ కట్టడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతం కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనీసం వందేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించొచ్చు. చారిత్రకంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక లక్షణాలుండాలి. లేదా నిర్మాణ శైలి అసాధారణ విలక్షణతతో కూడుకుని ఉండాలి. ఆ నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండాలి. దాని సౌందర్యం గొప్పగా అనిపించాలి. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైనదై ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ప్రకృతి రమణీయతలో విలక్షణం కనపడాలి. అది ఆ ప్రాంత ప్రత్యేకత అని చాటి చెప్పేలా ఉండాలి.... ఇలా ఏదో ఓ అంశాన్ని అది కలిగి ఉంటే దాన్ని వారసత్వ ప్రాంతం కట్టడంగా గుర్తిస్తారు. -
‘రామప్ప’కు టైమొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’కు యునెస్కో పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైంది. చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ హోదా తిరస్కరించిన ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే నెల 25న యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. ఆ అద్భుత దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కలి్పంచాల్సిందిగా 2017లో భారత ప్రభుత్వం యునెస్కోకు దరఖాస్తు చేసింది. దాని ప్రత్యేకతలు, అది అద్భుత నిర్మాణంగా మారటానికి అందులో నిగూఢమైన అంశాలను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన) దాఖలు చేసిన ఇంతకాలానికి దాన్ని పరిశీలించేందుకు ఆ సంస్థ రానుంది. ఈ సారి వస్తుందనే ధీమా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు/ప్రాంతాలు ఏవీ లేవు. దీంతో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో చారి్మనార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులను యూనిట్‌గా చేసి యునెస్కోకు దరఖాస్తు చేశారు. కానీ నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడి కబ్జాలు చూసి అవాక్కయ్యారు. కట్టాడాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ప్రైవేటు నిర్మాణాలుండటం, కట్టడాలకు అతి చేరువగా వాహనాలు వెళ్తుండటం, ఓ పద్ధతి లేకుండా దుకాణాలు వెలియటంతో గుర్తింపు ఇవ్వలేమని యునెస్కో తిరస్కరించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి కేంద్రాన్ని కోరింది. దీంతో 2017లో కేంద్రం యునెస్కోకు దరఖాస్తు చేసింది. అయితే, ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ యునెస్కో తిప్పి పంపింది. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు పంపారు. దాన్ని స్వీకరించిన యునెస్కో.. ఆ వివరాలు కచి్చతంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు బృందాన్ని పంపుతోంది. రామప్ప విశేషాలు.. ఇది రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆ ఆల యానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం మన దేశంలో మరెక్కడా లేదు. క్రీ.శ.1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది. పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామశివారులో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరువలో రామప్ప పేరుతో పెద్ద చెరువు కూడా ఉంది. దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలున్నా.. అవన్నీ పర్యవేక్షణ లేక శిథిలమయ్యాయి. కాగా, మన దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 38 ఉన్నాయి. అద్భుత నిర్మాణం.. నర్తకి కళ్లముందే నృత్యం చేస్తున్నట్లు అనిపించేంత సహజంగా ఆలయంలో శిల్పాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, పైకప్పు, ఫ్లోర్‌పై చూడ చక్కని, అబ్బురపరిచే చెక్కడాలున్నాయి. దక్షిణ భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన హంపి, హాలెబీడు, తంజావూరు ఆలయాలతో పోలుస్తూ చూడామణి నందగోపాల్ రామప్ప ప్రత్యేకతలను గుర్తించి నివేదించారు. హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్ రాతిపై చెక్కారు. కానీ రామప్పలో కఠినంగా ఉండే డోలరైట్ రాతిపై చెక్కారు. శిల్పాలు అద్దం మాదిరిగా నునుపు తేలుతూ మెరుస్తూ ఉండటం నాటి శిల్పుల నిర్మాణ పనితనానికి నిదర్శనం. వెంట్రుక దూరేంతటి సన్నటి సందులతో కూడిన డిజైన్లు శిల్పాలపై ఉండటం దీని విశిష్టత. గర్భాలయ ప్రవేశ మార్గం పక్కన ఉండే వేణుగోపాలస్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరా లు పలకటం నాటి పరిజ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది. ఈ ఆలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయి. నిర్మాణ బరువును తగ్గించేందుకు ఈ ఇటుకలు రూపొందించారు. పూర్తి నల్లరాతితో ఆలయాన్ని నిర్మించారు. కానీ సమీపంలో ఎక్కడా అలాంటి రాళ్ల జాడ కనిపించదు. వేరే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఆ రాళ్లను తెప్పించారన్నమాట. పేరిణి నృత్యం స్పష్టించేందుకు ఈ ఆలయంలోని శిల్పాల నృత్య భంగిమలే ప్రేరణ. గణపతి దేవుడి బావమరిది జాయపసేనానీ 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ. -
గండికోటకు ‘వారసత్వ హోదా’ వచ్చేనా?
సాక్షి, కడప : భారతదేశపు గ్రాండ్ క్యానియన్‌గా పేరుగాంచి దేశానికి తలమానికంగా నిలిచిన గండికోటకు వారసత్వ హోదా వచ్చే అవకాశంపై పర్యాటకాభిమానుల్లో తిరిగి ఆశలు మొలకెత్తుతున్నాయి. 2012 నుంచి గండికోటకు వారసత్వ హోదా కోసం జిల్లాలోని పర్యాటకాభిమానులేగాక ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఎన్నో రకాలుగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, అధికారులను గట్టిగా ఈ విషయంపై అడిగారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా రెండు సంవత్సరాలుగా సాక్షాత్తు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా నెలరోజుల్లో వారసత్వ హోదా వస్తుందని నమ్మబలికా రు. గత సంవత్సరం కూడా అదే హామీ ఇచ్చారు. కానీ హోదాకు సంబంధించి ఇంతవరకు జిల్లా నుంచి కనీస అభ్యర్థనలు వెళ్లలేదని తెలుసుకున్న పర్యాటకాభిమానులు ఆవేదనకు గురయ్యారు. వారసత్వహోదా వస్తే.... గండికోటకు వారసత్వ హోదా వస్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. సంవత్సరానికి రూ. 100 కోట్లు కోట అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్ర పరిశోధకులు, అధ్యయనం కోసం ఈ కోటను ప్రతి సంవత్సరం రెండు, మూడు నెలలపాటు పరిశీలిస్తారు. వారితోపాటు ఆయా దేశాలకు చెందిన పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంది. 2012లో గండికోటలో చారిత్రక సంపద అభివృద్ధిలో భాగంగా గండికోటలో వారసత్వ ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా పర్యాటకాభిమానులు కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి 2015 నుంచి ఉత్సవాలను నిర్వహించింది. అప్పటి నుంచి 2019 ఫిబ్రవరి వరకు జరిపారు. ప్రతి సంవత్సరం నిధుల కొరత ఉందని ఉత్సవాలను నిలిపివేసే ప్రయత్నం చేస్తుండడం జిల్లాకు చెందిన పర్యాటకాభిమానులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు గట్టిగా పట్టుబట్టడంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఇవ్వగా.. వేరే శాఖల నుంచి కొద్దిమొత్తాన్ని ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయని ప్రచారం చేశారు. కానీ ఆ స్థాయి కార్యక్రమాలు జరగకపోవడం గమనార్హం. దీనికి అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభిస్తే పుష్కలంగా నిధులు వచ్చి అనుకున్న విధంగా కోటను అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. గత ప్రభుత్వాలు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారేగానీ ఈ విషయంపై అభ్యర్థన పంపింది లేదు. ప్రస్తుతం పర్యాటకానికి ప్రత్యేకంగా మంత్రిని నియమించడం, ఆయన కూడా ఈ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి కనబరుస్తుండడంతో జిల్లా వాసుల్లో గండికోటకు యునెస్కో గుర్తింపు లభించగలదని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి గండికోటను సందర్శించాలని కోరుతున్నారు. -
యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవరం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోని మానస సరోవర్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ ‘యునెస్కో’ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. కైలాస సరోవర్ ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్‌లో విస్తరించి ఉండగా... మిగతా భాగం తూర్పున నేపాల్, ఉత్తరాన చైనా ఉంది. ఈ మూడు దేశాల్లో కలిపి 31 చ.కిలో మీటర్ల ప్రాంతంలో ఈ పవిత్రస్థలం ఉంది. తమ దేశాల్లోని ప్రాంతాలను కూడా వారసత్వ స్థలంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. -
మాలిన్యం తొలగించే దీపాలు
పుస్తకపఠనం, పుస్తకప్రచురణ, కాపీరై ట్లను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ సెర్వాంటిస్ వర్ధంతిని (ఏప్రిల్ 23) దృష్టిలో ఉంచుకొని 1995 నుండి యునెస్కో ప్రపంచ పుస్తకదినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయించింది. ప్రపంచ ప్రసిద్ధ స్పానిష్ రచయిత మైఖెల్ కెర్విం టిస్ పేద కుటుంబంలో జన్మించాడు. తొలిరోజుల్లో స్పానిష్ రాణి ఎలిజిబెత్ వెలోయిస్ స్మృతి కవితల సంకలనాన్ని 1569లో ప్రచురించాడు. ఆర్థిక సమ స్యల వల్ల ఇటలీలో స్పానిస్ మిలటరి దళంలో సైనికుడిగా చేరాడు. «ధైర్య సాహసాలతో లెపాంటో యుద్ధంలో (1571) పాల్గొని తీవ్రంగా గాయప డ్డాడు. తిరిగి వచ్చిన తరువాత ‘లాగ లాటి’ అనే నవలను గ్రామీణ శృంగార జీవితం ఇతివృత్తంగా రాశాడు. తర్వాత సాహసవీరుల గాథలు ఇతివృత్తంగా ‘డాన్‌క్విక్సోటి’ నవల మొదటి భాగాన్ని 1605లో ప్రచురించాడు. రెండోభాగాన్ని 1615లో ప్రచురించాడు. ఆ నవలను ప్రపంచవ్యాప్తంగా 60 భాషల్లోకి అను వదించారు. ప్రపంచంలో అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన నవలగా ప్రసిద్ధి పొందింది. అప్పట్లో రచయితకు కాపీరైట్ హక్కు, రాయల్టీ సదుపాయం లేనందున ఆర్థికంగా సంపన్నుడు కాలేక పోయాడు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని యునెస్కో ప్రచురణ, కాపీ రైట్లను ప్రోత్సహించేందుకు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రకటించింది. ‘పుస్తకాలు మనో మాలిన్యాన్ని తొలగించే దీపాలు’ అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర,్త కందుకూరి వీరేశలింగం ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో... మంచి పుస్తకం కొనుక్కో’ అన్న సూక్తిని ప్రచారం చేశారు. కానీ నేటి యువత పుస్తక పఠ నానికి దూరమైంది. రకరకాల చానళ్ల, మీడియా ప్రభావమే దీనికి కారణం. పుస్త్తకపఠనాసక్తితో విలువైన గ్రం«ధపఠ నంలో నిమగ్నమైన వారిని ఒకప్పుడు పుస్తకాల పురుగులు అనేవారు. నేడు పుస్తకాలు తొలిచే పురుగులే కాని, పుస్తక ప్రియులు లేరు. ప్రతిభావంతమైన రచ యితల మంచి పుస్తకాలను తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమి వంటి సంస్థలు ప్రచురించాలి. గ్రంథా లయాలకు పంపిణి చేసి పాఠకులకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్రపంచ పుస్తక దినోత్సవ పరమార్థం నెరవేరుతుంది. ( ప్రపంచ పుస్తక దినోత్సవానికి నేటితో పాతికేళ్లు) డాక్టర్ పీవీ సుబ్బారావు, విశ్రాంత ఆచార్యులు మొబైల్: 98491 77594 -
గుర్తింపు దక్కేనా..!
సాక్షి, ములుగు: కాకతీయుల అద్భుత శిల్పకళా సంపదకు నిలువుటద్దం రామప్ప దేవాలయం. ప్రపం చ వ్యాప్తంగా కీర్తిని పొందాయి ఇక్కడి శిల్పాలు. విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన కళాఖండాలను తనివితీరా చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. 806 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతూ ఉంటాయి. ఇది ఇప్పటికీ అం తుపట్టని అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆలయం ఎదుట ఉండే నందీశ్వరుడు ఏకశిలతో ఏర్పాటు చేయడంతో పాటు శివలింగానికి ఎదురుగా ఉండడం మరో ప్రత్యేకత. సూర్యకాంతి నేరుగా గర్భగుడిలో పడి ప్రకాశవంతమైన వెలుతురును ప్రసరింపజేయడం శిల్పి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయం ముచ్చటగా మూడోసారి 2019 సంవత్సరానికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యునెస్కోకు నామినేట్ అయింది. ఇప్పటికే రెండుసార్లు (2017, 2018) రాష్ట్రం నుంచి అందించిన ప్రతిపాదనలో వివరాలు సరిగా లేవని తిరస్కరించబడింది. దేశం నుంచి ఒక చారిత్రక ప్రదేశానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఈ రెండు సార్లు రాజస్థాన్ రాష్ట్రం యునెస్కో గుర్తింపు పొందింది. పకడ్బందీగా ప్రతిపాదనలు.. రామప్ప ఆలయాన్ని ఇప్పటికే రెండు సార్లు యు నెస్కో తిరస్కరించడంతో పర్యాటక శాఖ అన్ని రకాల జాగ్రత్తలతో పకడ్బందీగా ప్రతిపాదనలు చేసింది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ ప్రతిపాదన యునెస్కో బెంచ్ ముందుకు వెళ్లనుంది. కాగా, ఈ దఫా రామప్ప ఆలయం మాత్రమే నా మినేట్ కావడంతో కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, వారసత్వ సంపదకు తగిన గౌరవం దక్కుతుందని భక్తులు, స్థానికులు ఆశిస్తున్నారు. ప్రతిపాదనలు.. జిలాల్లోని వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతిదేవుడి కాలంలో సామంత రాజు రేచర్లరుద్రడు నిర్మించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్‌గా అరుదైన సాండ్ బాక్స్ టెక్నాలజీని వినియోగించారు. దీంతో పాటు ఆలయ పైభాగం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. అలాగే సరిగమపలు పలికే మ్యూజికల్ పిల్లర్, చిపురుపుల్ల దూరే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాలు, ఆ కాలంలో మహిళ హై హిల్స్ చెప్పులు, పేరిణీ నత్య భంగిమలు, రకరకాల రాళ్లను వినియోగించి, నృత్య భంగిమలతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనలో పొందుపర్చారు. సమీప రాజ్యాలతో వ్యాపార సంబంధాలు భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆలయ గోడలపై శిల్పాలను చెక్కించడం, బెల్లం, కరక్కాయలతో కూడిన మిశ్రమంతో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు చేశారు. పరిశీలన.. రామప్పకు యునెస్కో జాబితాలో చోటుదక్కడంలో భాగంగా ప్రతిపాదనల కోసం ఇటీవల ఆర్కాలజీ డైరెక్టర్ విశాలాక్షి, ఇంటాక్ట్ కన్వీనర్ పాండురంగారావుతో కూడిన బృందం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ప్రతిపాదన యునెస్కో పరిశీలనలోకి వెళ్లిన అనంతరం మరోసారి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కేంద్ర బృంద సభ్యులు ఆలయాన్ని సందర్శించనున్నారు. మెరుగపడనున్న సౌకర్యాలు.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఆలయానికి చోటు దక్కితే టూరిజం పరంగా ప్రపంచ దేశాల చూపు రామప్పవైపు మరలుతుంది. నిధుల కేటాయింపు నేరుగా జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అన్ని రకాల వసతులు, సౌకర్యాలు మెరుగుపడుతాయి. షాపులను తొలగిస్తేనే.. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందాలంటే ఆలయ చుట్టు పక్కల 100మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దీంతో పాటు మరో 200 మీటర్ల పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు, ఇతర గృహాల నిర్మాణం చేపట్టకూడదు. అయితే ఆలయానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. గత రెండు సంవత్సరాలుగా షాపులను తొలగించే విషయంలో రెవెన్యూ, సంభందిత అధికారులు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. యునెస్కో బృందం పరిశీలనకు వచ్చే సమయంలో దుకాణాలు ఇలాగే కొనసాగినట్లయితే ప్రతిపాదనలు తిరస్కరించబడే అవకాశం ఉంది. -
ఆదివాసీ భాషల పరిరక్షణే కర్తవ్యం
ఆదిమజాతులకు జరిగే అన్యాయాన్ని అందరి దృష్టికీ తీసుకొచ్చి, వారి జీవించే హక్కును రక్షించడం, వారికి అభివృద్ధి ఫలాలు దక్కేలా చూడటం అవసరమని సమస్త సమాజాలకూ గుర్తు చేయడం కోసం ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మూడు దశాబ్దాలక్రితం ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మన దేశం ఆ తీర్మానంపై సంతకం చేసినా, దాన్ని మన పార్లమెంటు ఇంతవరకూ ధ్రువీకరించలేదు. ప్రపం చవ్యాప్తంగా సుమారు ఐదు వేల రకాల ఆదిమ తెగలున్నాయని ఒక అంచనా. వీరి భాషలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. మన దేశంలో 700కు పైగా తెగలుండగా అందులో సుమారు 500 తెగలు మాత్రమే మిగిలాయి. వీరి భాషల్లో 197 కనుమరుగు కానున్నాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తోటి, చెంచు, కొండరెడ్డి, కులియ, దులియ తదితర తెగలతో పాటు, కొలాం, సవర వంటి భాషలు కూడా కనుమరుగుకాను న్నాయి. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలోనే ఆదిమ తెగల పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల దీనావస్థలు చెప్పనక్కరలేదు. మనుషులుగా ఆదిమ జాతులకే లేని భద్రత వారి భాషలకు, సంస్కృ తులకు ఎలా ఉంటుంది? వివిధ దేశాల్లో సాగిన వలస పాలన స్థానిక ఆదిమ జాతుల్ని అణచివేసి, వారి రాజ్యాలతోపాటు వారి భాషల్ని, సంస్కృతుల్ని ధ్వంసం చేసింది. దానివల్ల ఇంతవరకూ కలిగిన నష్టాన్ని గుర్తించబట్టే యునెస్కో ఈ ఏడాదిని ప్రపంచ ఆదివాసీ భాషా సంవ త్సరంగా ప్రకటించబోతున్నది. ఈ నెల 28న ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో దీనిపై ప్రకటన వెలువడుతుంది. ఆదిమజాతుల భాషా జ్ఞానాన్ని పరిరక్షించు కోవడం విశ్వమానవాళి బాధ్యత అని ఈ ప్రకటన గుర్తుచేస్తుంది. ఆదిమ జాతుల సంస్కృతి వర్ధిల్లితేనే మానవ వైవిధ్యత వర్ధిల్లుతుంది. ఆదిమ జాతుల, భాషా సంస్కృతుల పరిరక్షణ అంటే వారి భాషా సంస్కృతు లను, జీవన విధానాన్ని సజీవంగా కొనసాగేలా చూడటం. అది వీలై నంత తొందరగా జరగాలి. విశ్వవిద్యాలయాలు సైతం నిజాయితీగా వాస్తవ మూల భాషా జ్ఞాన అన్వేషణ మొదలుపెట్టాలి. చారిత్రక వాస్తవ నిర్ధారణలు జరగాలి. ఈ ఆదివాసీ భాషా సంవత్సరం పొడవునా వర్సిటీలు మూల భాషలపై అధ్యయనాలు, మేధోమథనాలు నిర్వహించాలి. ఆదివాసీ భాషల పరిరక్షణకు యునెస్కో ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. 2005లోనే యునెస్కో, మన జాతీయ విద్యా పరి శోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ), కేంద్ర భారతీయ భాషల సంస్థ (సీఐఐఎల్)లు మైసూర్లో సెమినార్ నిర్వహించాయి. ఆదివాసీ భాషల పరిరక్షణతోపాటు ఆ తెగల్లో విద్యాపరంగా ఉన్న వెనకబాటును, వారి మాతృభాషల్లోనే ప్రాథమిక విద్యా బోధన జరిగితే అధిగమించవచ్చునని తేల్చారు. ఆవిధంగా 2006లో ఆదివాసీలు అధికంగా నివసించే రాష్ట్రా లను ఎన్నుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చ టగా మిగిలిపోయింది. ఆదిమజాతుల పిల్లలకు వారి భాష, సంస్కృతు లపై పాఠ్యాంశాలు లేకపోవడం, తమది కాని భాష నేర్చుకోవాల్సి రావడంవంటి కారణాలతో మధ్యలోనే అనేకులు చదువు మానేస్తున్నారు. వారి పండుగలు, ఇతర సందర్భాల్లో ఆ పిల్లలు పాల్గొనేందుకు వీలు కల్పించకపోవడం వల్ల అటువంటివారు తమ భాషాసంస్కృతులకు దూరమవుతున్నారు. సామాజిక ఆదరణ, ఆచరణ ఉంటేనే ఏ భాషైనా సజీవంగా ఉంటుంది. ఆదివాసీ భాషలు అంతరించిపోవడానికి వాటికి లిపి లేకపోవడమే కారణమన్న వాదన సరికాదు. మన దేశంలోని హిందీ, తెలుగు సహా అనేక భాషల్లో ఆదివాసీ భాషా పదాలు వచ్చిచేరాయి. తెలుగులో 20 శాతం, తమిళంలో 30 శాతం, కన్నడలో 80 శాతం కోయ భాషాపదాలున్నాయి. భర్త చనిపో యిన మహిళను తెలుగులో వితంతువు అంటారు. దీనికి సమానార్థక పదం దాదాపు అన్ని భాషల్లో ఉంది. కానీ అండమాన్ దీవుల్లో నివసించే ఒక ఆదిమ తెగ భాషలో చనిపోయిన వ్యక్తి రక్తసంబంధీకులందరినీ సంబోధించేందుకు వేర్వేరు పదాలున్నాయి. ఇలా సమృద్ధంగా పద జాలం ఉండటం ఆదిమ జాతుల భాషల ప్రత్యేకత. అందుకే ఆ భాషల్ని, వారి సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. (ఈ ఏడాదిని ఆదివాసీ భాషా సంవత్సరంగా యునెస్కో రేపు ప్రకటించబోతున్న సందర్భంగా) మడివి నెహ్రూ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమన్వయకర్త, కోయభాష ప్రామాణీకరణ సభ్యులు -
విక్టోరియన్ గోథిక్‌కు గౌరవం
ముంబై/న్యూఢిల్లీ: ముంబైకి మరో చారిత్రక గుర్తింపు దక్కింది. నగరంలోని విక్టోరియన్ గోథిక్ (19వ శతాబ్దం), ఆర్ట్ డెకో (20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ (2004), ఎలిఫెంటా గుహలు (1987) ఈ జాబితాలో ఉన్నాయి. బెహరైన్లోని మనామాలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 42వ సమావేశంలో భాగంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డబ్ల్యూహెచ్‌సీ సైట్ల జాబితాలో ముంబైలోని విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో నిర్మాణ శైలిలకు చోటుదక్కింది. భారత్‌కు అభినందనలు’ అని యునెస్కో ట్వీట్ చేసింది. 21 దేశాలు ఏకగ్రీవంగా.. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లాంబా.. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు. జాబితాలో ఈ2కట్టడాలకు చోటు దక్కడం భారత్‌కు, ముంబైకి దక్కిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు. జాబితా రూపకల్పన సమయంలో డబ్ల్యూహెచ్సీలోని 21 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఈ రెండు కట్టడాలకు ఓటు వేశాయి. యునెస్కో నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ మహేశ్ శర్మ, చరిత్రకారుడు రఫీక్ బగ్దాదీ, ఆర్కియాలజిస్టు కురుశ్ దలాల్ సహా చారిత్రక ప్రముఖులు స్వాగతించారు. తాజా నిర్ణయంతో భారత్‌లో ఉన్న డబ్ల్యూహెచ్‌సీ కట్టడాల సంఖ్య 37కు చేరింది. 1200 పేజీల నామినేషన్ ముంబైలోని ఓవల్ మైదాన్ దగ్గర్లోని చాలా భవనాలు విక్టోరియన్ గోథిక్ శైలిలో కట్టినవే. పాత సచివాలయం (1857–74), యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్ హాల్ (1874–78), బాంబే హైకోర్టు (1878), ప్రజాపనుల శాఖ కార్యాలయం (1872), వాట్సన్ హోటల్ (1869), డేవిడ్ ససూన్ లైబ్రరీ (1870), ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ (1888) గోతిక్ శైలిలోని భవనాలే. నామినేషన్లను 1200 పేజీలతో మొత్తం మూడు అధ్యాయాలుగా పంపించారు. ఇందులో ఫొటోగ్రాఫ్‌లు, డ్రాయింగ్లు, వీటి ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక కట్టడాల జాబితాలో జపాన్, కొరియాలకు చెందిన కట్టడాలకూ చోటు దక్కింది. దేనికదే వైవిధ్యం విక్టోరియన్ గోథిక్ శైలిలో ప్రభుత్వ భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై యూనివర్సిటీ, పాతసెక్రటేరియట్, పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం, బాంబే హైకోర్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, మహారాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం తదితర భవనాలు ఈ స్టైల్లో ఉన్నాయి. దాదాపు దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు ఈ శైలివే. ఇలాంటి భవనాల నిర్మాణంలో తెలుగు కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఆర్ట్ డెకో శైలిలో భవంతులు, నివాస స్థలాలున్నాయి. మెరీన్ డ్రైవ్ పరిసరాల్లోని భవనాల్లో ఈ శైలి ఎక్కువగా కనబడుతుంది. బాడ్గే బాజార్ లోని క్రికెట్ క్లబ్ ఇండియా (సీసీఐ) కూడా ఈ శైలిలో నిర్మించిందే. ద రీగల్, ఎరోస్ సినిమా భవనాలు, మెరీన్ డ్రైవ్‌లోని మొదటి వరసలోని భవనాలకూ గుర్తింపు దక్కింది. -
యునెస్కోలో భరత నాట్య ప్రదర్శన
లండన్: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పరిశోధకురాలు బాలాదేవీ చంద్రశేఖర్ తన ప్రదర్శన ద్వారా చరిత్ర సృష్టించనున్నారు. గురువారం ఆమె పారిస్‌లోని యునెస్కో(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక మండలి)లో వివిధ దేశాలకు చెందిన 100 మంది సమక్షంలో ‘బృహదీశ్వర’ అంశంపై భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘ఇది చాలా అరుదైన ప్రదర్శన. భారతీయ ప్రాచీన కట్టడాలపై ఆసక్తి కలిగించేందుకు, మన దేశం, సంస్కృతులపై అవగాహన పెంచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది’ అని బాలాదేవి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా ‘బృహదీశ్వర’ ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. -
2050 నాటికి ప్రపంచం గొంతెండిపోతుంది
సాక్షి, హైదారాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ మహానగరం.. తాగునీరు లేక ఎడారిగా మారబోతున్న నగరం... మనిషికి 50 లీటర్లు మాత్రమేనంటూ నీటికి రేషన్ విధించింది తొలి నగరం. ఆ దుస్థితే ప్రపంచ దేశాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. నీటిసంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రతరం కానుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. అప్పటికి 500 కోట్ల మంది నీరు లభ్యం కాని ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించింది. 2050నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. అంటే సగం మంది జనాభా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడతారన్న మాట. అందులోనూ సురక్షిత నీరు దొరక్క భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా యునెస్కో తన నివేదికలో నీటివనరులపై భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటికి డిమాండ్ పెరగడం, నీటి కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం వంటి కారణాలతో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ... చైనా, భారత్, అమెరికా, రష్యా, పాకిస్థాన్ దేశాలు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నాయి. ఆ దేశాలే నీటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడతాయి. భూమిపై 70 శాతం నీరు ఉంటే అందులో స్వచ్ఛమైన నీరు కేవలం 2 శాతం మాత్రమే మధ్య భారతం అత్యధికంగా నీటికొరతను ఎదుర్కొంటుంది. 2050నాటికి 40 శాతం నీటి వనరులు తగ్గిపోతాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి. దక్షిణ భారత్ నీటి కాలుష్యం సమస్యని అత్యధికంగా ఎదుర్కొంటుంది. దక్షిణభారతంలో ఉన్న నదులన్నీ 2050నాటికి విషతుల్యంగా మారతాయి. బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఈకోలి బ్యాక్టేరియా సమస్య తీవ్రతరమవుతుంది. భారత్‌లో 21 శాతం వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నవే. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది సురక్షిత మంచి నీరు అందడం లేదు. భారత్‌లో 16.3 కోట్ల మంది భారతీయులకు రక్షిత మంచినీరు లభ్యం కావడం లేదు. పరిశుభ్రమైన తాగు నీరు లేక భారత్‌లో ప్రతీరోజూ అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులు దాదాపు 500 మంది మరణిస్తున్నారు. ఏడాదికి ఏడాది నీటి వినియోగం 1 శాతం పెరుగుతూ వస్తోంది. వాతావరణంలో వస్తున్న విచిత్రమైన పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటికి కట కట ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వరద ముంపునకు గురవుతాయి. 2050 నాటికి 116 కోట్ల మందికి వరదల వల్ల ముప్పుని ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాల కోసం కసరత్తు చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సూచించారు. వర్షపు నీటిని రీసైక్లింగ్‌కు చైనా అనుసరిస్తున్న విధానాలు, భారత్‌లో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన నీటిసంరక్షణ, అటవీప్రాంతాన్ని విస్తరించడం వంటి చర్యలు, ఉక్రెయిన్‌లో కృత్రిమ చిత్తడి నేలల్ని రూపొందించడం వంటివి అన్ని చోట్లా చేపట్టాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అలా చేయడం వల్ల నీటి సంక్షోభం బారి నుంచి తప్పించుకోవడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్ని 20 శాతం పెంచుకోవచ్చునని ఆ నివేదిక వివరించింది. -
కుప్పకూలిన యూఎన్ వారసత్వ సంపద
బ్యూనోస్ ఎయిర్స్, అర్జెంటినా : అర్జెంటినాలో యూనెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో వేల మంది ప్రాణాలకు అపాయం తప్పింది. పెంటగోనియా ప్రాంతంలో గల లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు బ్రిడ్జి ఉంది. సోమవారం బ్రిడ్జిని సందర్శించి, దానిపై నడిచి వెళ్లేందుకు వేలాది మంది యాత్రికులు పార్కుకు రావాల్సివుంది. అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో వచ్చిన భారీ తుపాను ధాటికి బ్రిడ్జి కుప్పకూలిపోయింది. చివరిసారిగా 2004లో ఈ మంచు బ్రిడ్జి కుప్పకూలినట్లు లాస్ గ్లేసిరేస్ జాతీయ పార్కులోని గ్లేసిరీయమ్ మ్యూజియం డైరెక్టర్ తెలిపారు. -
ప్చ్.. రామప్ప!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ హోదా అందినట్లే అంది చేజారింది. నిర్మాణ చాతుర్యం, వైశిష్ట్యం పరంగా ప్రత్యేకత చాటుకుంటున్న రామప్ప దేవాలయం యునెస్కో జాబితాలోకి చేరినట్టే చేరి దారితప్పినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం లేదన్న లోటును రామప్ప తీరుస్తుందని ఆశించినా.. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించిన రామప్ప దరఖాస్తును కేంద్రం బుట్టదాఖలు చేసిందని, దాని స్థానంలో జైపూర్ ప్రతిపాదనను పంపిందని సమాచారం. గతంలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధు లతో కలిపిన ప్రతిపాదన, ఆ తర్వాత వేయిస్తంభాల గుడి ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడంతో ఈసారి పక్కాగా దరఖాస్తు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రామప్ప దేవాలయాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించింది. కానీ అది యునెస్కో తలుపు తట్టకుండానే తిరుగుటపాలో వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఢిల్లీ స్థాయిలో స్క్రూటినీ కమిటీనే తిరస్కరించినట్లు్ల సమాచారం. రెండు సార్లు తయారు చేసినా.. గత చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి కొంత పక్కాగానే ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామప్ప ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చారు. కానీ ఆలయ ప్రతిపాదన (డోషియర్) రూపకల్పనలో పక్కాగా వ్యవహరించకపోవడమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది. కేవలం రామప్ప ఆలయ నిర్మాణ కౌశలంపైనే దృష్టి సారించి వివరాలు సేకరించిన నిపుణులు.. ఆ కోణంలోనే దాన్ని ప్రతిపాదించారని, యునెస్కోకు పంపాల్సిన పద్ధతిలో ప్రతిపాదన లేదని ఢిల్లీ స్క్రూటినీ కమిటీ అభిప్రాయ పడినట్లు తెలిసింది. కట్టడానికి సంబంధించిన కొన్ని వివరాలూ తప్పుగా పేర్కొన్నట్లు కమిటీ గుర్తించిందని తెలుస్తోంది. కొన్ని శిల్పాలకు సంబంధించి కుడి వైపు వివరాలను ఎడమవైపు, ఎడమ వైపు వివరాలు కుడివైపు ఉన్నట్లు తప్పుగా నమోదు చేసిన విషయాన్నీ కమిటీ గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రానికి సమాచారం లేదు.. జైపూర్ ప్రతిపాదనను కేంద్రం వారం క్రితం యునెస్కోకు పంపి రామప్పను పెండింగులో పెట్టిందని ఢిల్లీ సమాచారం. కానీ దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందలేదు. యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపం చ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాజస్తాన్ ఈ విషయంలో గట్టి లాబీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో బాగా వెనుకబడిన తెలంగాణ, యునెస్కో గుర్తింపు పొందే విషయంలోనూ మంచి అవకాశం చేజార్చుకున్నట్లయింది. యునెస్కో ప్రతిపాదనలు రూపొందించటంలో అనుభవం ఉన్నవారి మార్గదర్శనంలో కొత్త ప్రతిపాదన రూపొందిస్తే భవిష్యత్‌లోనైనా రామప్పకు గుర్తింపు తథ్యమన్న విషయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లు కూడా లేకుండా డోషియర్ రూపొందించాలని సూచిస్తున్నారు. కనీస వసతులూ లేవు..! ప్రపంచ వారసత్వ హోదా పొందే కట్టడం వద్ద పర్యాటకులకు కనీస వసతులు అవసరం. కానీ రామప్ప ఆలయానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు. అక్కడ పర్యాటకులకు మంచి భోజనం లభించే వసతి లేదు. మంచి నీరు, టాయిలెట్లకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కనీస వసతులు కల్పించి దరఖాస్తు చేసి ఉండాల్సిందని, దాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని కమిటీ తప్పుబట్టిందని తెలుస్తోంది. వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయాన్ని రుద్రేశ్వరాలయంగా పిలుస్తారు. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వరాలయంగా పేర్కొంటారు. కానీ యునెస్కో ప్రతిపాదనలో దాన్ని రుద్రేశ్వరాలయంగా పేర్కొన్నట్లు తెలిసింది. దీన్ని కూడా కమిటీ గుర్తించిందని చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టిందని సమాచారం. ఇదే కేటగిరీలో పోటీ పడిన రాజస్తాన్ రాజధాని నగరం జైపూర్ ప్రతిపాదనకు కమిటీ జై కొట్టిందని తెలుస్తోంది.