చాక్లెట్‌ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?.. | The Chocolate Hills Of Bohol In Philippines | Sakshi
Sakshi News home page

Chocolate Hills: చాక్లెట్‌ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..

Published Sun, Jul 30 2023 8:35 AM | Last Updated on Sun, Jul 30 2023 2:49 PM

The Chocolate Hills Of Bohol In Philippines  - Sakshi

చాక్లెట్‌ కొండలు చాక్లెట్‌ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్‌లోని బొహోల్‌ ప్రావిన్స్‌లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్‌ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్‌ ప్రావిన్స్‌లో ఈ చాక్లెట్‌ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్‌ రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది.

(చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement