hills
-
పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..!
భారతదేశంలో కనిపించే అరుదైన పుష్పం ఈ నీలకురంజి పుష్పం. ఇది పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. సముద్రమట్టానికి 1300–2400 మీటర్ల ఎత్తులో ఉండే కొండ ప్రాంతాల్లో నీలకురంజి మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు సాధారణంగా 30–60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అరుదుగా 180 మీటర్లకు మించి కూడా ఎదుగుతాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని పడమటి కనుమల ప్రాంతంలో నీలగిరి కొండలు, అన్నామలై కొండలు, పళని కొండలు, బాబా బుడాన్‌గిరి కొండలపై ఈ పూలు కనిపిస్తాయి. ఈ పూలు పూసినప్పుడు కొండలన్నీ నీలాల రాశుల్లా కనిపిస్తాయి. పన్నెండేళ్లకు ఒకసారి పూసే ఈ పూలను తిలకించడానికి పర్యాటకులు తండోపతండాలుగా ఈ కొండ ప్రాంతాలకు చేరుకుంటారు. (చదవండి: బొమ్మలు చెప్పే చరిత్ర..) -
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శేషచల అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం మంటలు వ్యాపించాయి. ఎండలతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
చాక్లెట్ గుట్టలుగా రాసిపోసినట్లు కొండలు..ఎక్కడున్నాయంటే?..
చాక్లెట్ కొండలు చాక్లెట్ రంగులో కనిపించే ఈ కొండలు ఫిలిప్పీన్స్‌లోని బొహోల్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. భారీ ఎత్తున చాక్లెట్‌ను గుట్టలుగా రాశిపోసినట్లు కనిపించే ఇలాంటి 1776 కొండలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి యాభై కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. బొహోల్ ప్రావిన్స్‌లో ఈ చాక్లెట్ కొండలే ప్రధాన పర్యాటక ఆకర్షణ. వీటిని చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. యూనెస్కో ఈ కొండలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. వీటిలో రెండు కొండలపై ఇటీవలి కాలంలో టరిస్ట్ రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు. గోపురాల్లా తీర్చిదిద్దినట్లు కనిపించే ఈ కొండలు ఒక్కొక్కటి సగటున 30 నుంచి 50 మీటర్ల ఎత్తు ఉంటాయి. వీటిలో అతి ఎత్తయిన కొండ 120 మీటర్లు ఉంటుంది. (చదవండి: గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే) -
గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘కొండలు పగలేసినం..బండలనూ పిండినం.. మా పదవులు అడ్డుపెట్టి ఉన్నకాడికి ఊడ్చుతం’’.. ఇదేంటీ యాభై ఏళ్ల క్రితం విప్లవ కవి చెరబండ రాజు అప్పటి దోపిడీ పీడనపై ఎక్కుపెట్టిన ‘కొండలు పగిలేసినం..’’అన్న కవితకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారా? అవును..వ్యతిరేకమే..ఇప్పుడిలాగే ఉంది పరిస్థితి. అక్రమాలు సాగించే వారికి పదవుల్లో ఉన్నవారి అండా దండా తోడైతే ఇంక అడ్డేముంది? అందినకాడికి మనదే..అన్నట్టుగా కళ్ల ముందే కొండలన్నీ పిండి చేస్తున్నారు. సర్కారుకు కొసరంత సీనరేజీ కట్టి..కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో భూగర్భ వనరుల శాఖ కొండలు, గుట్టలను పలు సంస్థలకు లీజుకు ఇస్తుంటుంది. ఆయా సంస్థల నుంచి సీనరేజీ వసూలు చేస్తుంది. అయితే కొండ/గుట్టలో కొంత భాగం లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు. అధికారులెవరైనా ప్రశ్నిస్తే నయానో, భయానో వారిని చెప్పుచేతల్లో పెట్టుకుని మైనింగ్ జోన్ సహా, ఇతర ప్రాంతాల్లోనూ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అడ్డూఅదుపూ లేని క్రషింగ్‌తో కొండలు కనుమరుగవుతున్నా, భారీయెత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వాస్తవ లీజును మించి పదింతల మైనింగ్! నిజామాబాద్ జిల్లాలో గుట్టల్ని మింగే ‘అనకొండలు’ బట్టాపూర్ కొండను ఆనవాళ్లే లేకుండా మింగేస్తున్నాయి. తీసుకున్న లీజును మించి పదింతల మైనింగ్, క్రషింగ్ చేస్తూ ఎవరడ్డొచ్చినా తగ్గేదేలేదంటున్నారు. ఈ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న బట్టాపూర్ కొండ క్రషింగ్ వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం బట్టాపూర్ సర్వేనంబర్ 195/1లో 3.85 హెక్టార్లను 2016లో లీజుకు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుండి అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 13,686 క్యూబిక్ మీటర్ల మేరకే భూగర్భ శాఖ నుండి అనుమతి తీసుకుని సుమారు రూ.6.36 లక్షల సీనరేజీని చెల్లించారు. కానీ వాస్తవంగా సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కొండను తొలిచి కంకరగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఫిట్ మెజర్మెంట్ పద్ధతిలో బట్టాపూర్ క్వారీలో పరిమితికి మించి తవ్వకం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించినా..దీని వెనక ఉన్న ముఖ్యనేత హెచ్చరికతో ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. ఈ క్వారీలో పరిమితికి మించిన పేలుళ్ల కారణంగా బండరాళ్లు పంటపొలాల్లో, పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో పడుతున్నాయన్న ఫిర్యాదుతో.. ఓ మారు తనిఖీకి వచ్చిన కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో ఆనంద్‌రెడ్డిని 24 గంటల్లోనే బదిలీ చేయించడంతో, ఇక ఏ ప్రభుత్వ శాఖ అధికారీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. సామాన్యులు బకాయి పడితే వారం రోజులు కూడా ఉపేక్షించని విద్యుత్ అధికారులు.. ఈ వీవీఐపీ ఫిబ్రవరి, 2022 నుండి విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సంబంధిత సంస్థ ఎన్పీడీసీఎల్కు రూ.51.15 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా..ఆ వైపు వెళ్లేందుకు విద్యుత్ అధికారులు సాహసించటం లేదు. ఇది బట్టాపూర్ గుట్ట. ఇందులో అతి కొద్ది భాగాన్నే లీజుకు తీసుకున్నారు. (2015లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) ప్రస్తుతం బట్టాపూర్ గుట్ట దాదాపు కనుమరుగైన పరిస్థితి. (2022లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) అన్నిచోట్లా ఇదే తంతు.. ►రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్వే నంబర్ 268లో 680 ఎకరాల్లో ఉన్న మైనింగ్ జోన్‌లోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వం నుండి లీజు మంజూరైన వాటిలో మెజారిటీ సంస్థలు తమ లీజులను అనధికారికంగా ఇతరులకు విక్రయించేశాయి. ఈ జోన్‌లోని మెజారిటీ లీజులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి. ►నిబంధనల మేరకు క్వారీ తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో నింపి చదును చేయాల్సి ఉండగా ఆ పని ఎవరూ చేయటం లేదు. ఇక మైనింగ్ కోసం ఏకంగా నాలుగు ఇంచుల బోర్లు వేస్తూ వాటిలో పేలుడు పదార్థాలు నింపి పేల్చేస్తున్నారు. తీసుకున్న లీజు పరిధిని మించి మైనింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఫిట్ మెజర్మెంట్ పక్కాగా జరగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ క్వారీల పేలుళ్లతో భూ ప్రకంపనలు నిత్యకృత్యమయ్యాయి. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల తదితర మండలాల్లోని క్వారీల్లోనూ తీసుకున్న అనుమతుల కంటే భారీ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.పరిమితికి మించిన పేలుడు పదార్థాలు వాడుతుండటంతో మాదారాం, లకుడారం గ్రామాల్లో ఇళ్లకు బీటలు పడుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ►క్వారీలు, క్రషర్ల నిర్వాహకులంతా కీలక ప్రజాప్రతినిధులు కావటం, వారు సిఫారసు చేసిన అధికారులే పర్యవేక్షకులు కావడంతో క్రషింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?) -
తిరుమల కొండలకు జీఎస్ఐ రక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కొండచరియలు విరిగిపడే ఘటనలకు చెక్ పెట్టేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) భారీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. కొండ ప్రాంతాలు సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బండ్లగూడలోని జీఎస్ఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ దక్షిణాది విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ జనార్దన్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో 7–8 ఏళ్లుగా పర్వత సానువుల సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది తిరుమల కొండలనూ సర్వే చేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా తిరుమల కొండలపై వాననీటి ప్రవాహాలను గుర్తించి వాటి ద్వారా కొండలు బలహీన పడకుండా ఉండేలా తగిన పరిష్కార మార్గాలనూ సూచిస్తామని వివరించారు. వనరుల మ్యాప్‌లు విడుదల.... తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో ఉండే ఖనిజాలు, భూగర్భ జలాలు, భూ వినియోగం తీరుతెన్నులతోపాటు ఇతర భౌగోళిక అంశాలను సూచించే డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్‌లను సిద్ధం చేస్తున్నామని సంస్థ తెలంగాణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్.చక్రవర్తి తెలిపారు. ఇప్పటికే 22 జిల్లాల మ్యాప్‌లు సిద్ధమవగా మిగిలినవి మరో నెల రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల, పోలవరం, కొలిమలై వంటి ప్రాజెక్టుల పూర్తిస్థాయి సర్వేలను కూడా ఈ ఏడాది చేపట్టినట్లు ఆయన వివరించారు. ఫ్లోరైడ్ కాలుష్యంపై అధ్యయనం.. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ కాలుష్యం, మూత్రపిండాల సమస్యలకు కారణా లను అన్వేషించే పనులను పబ్లిక్ గుడ్ జియో సైన్స్‌లో భాగంగా చేపట్టామన్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా, కర్ణాటకలోని రాయచూరులో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ కాలుష్యాలకు కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. -
తిరుమల గిరులను కప్పేసిన మంచు దుప్పటి
-
నగరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ముక్కు కొండ ఉంది. హనుమంతుని ముక్కు ఆకారంలో ఉండటంతో కొండకు ముక్కు కొండ అన్నపేరు వచ్చింది. పుత్తూరు, నగరి జాతీయ రహదారిలో వెళ్లే వారికి సుదూర ప్రాంతం వరకు ఈ కొండ కనిపిస్తుంది. పడుకున్న మనిషి ముక్కు ఆకారంలో ఉండటంతో ఈ కొండకు ఈ పేరు వచ్చిందని నానుడి. సముద్ర మట్టానికి 855 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వంద కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది. ట్రెక్కింగ్ ఇలా... నారాయణవనం మండలం, సముదాయం గ్రామంలోని అవనాక్షమ్మ ఆలయ సమీపం నుంచి ముక్కుకొండ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. గైడ్లు లేకుండా కొండపైకి చేరుకోలేము. వారు కూడా వెళ్లే మార్గంలో చెట్లపై గుర్తులు పెట్టుకుంటూ, రాళ్లు పేర్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ ఆ గుర్తుల ఆధారంగా క్రిందకు చేరుస్తారు. ఈ కొండపైకి వెళ్లడం సాహసంతో కూడుకున్న పని. కొండ ఎక్కడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. పైకి వెళ్లేవారు తినడానికి అవసరమైన ఆహారం, నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే దారి పూర్తిగా రాళ్లతోను, ముళ్లకంపలతోను, బోదలతోను నిండి చిట్టడవిలా ఉంటుంది. ప్రాచీన లైట్ హౌస్ మధ్యయుగ కాలంలో ముక్కుకొండ బంగాళాఖాతంలో వచ్చే పడవలకు చెన్నై మార్గం చూపే దిక్సూచిగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థన మేరకు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కార్వేటినగరం రాజుల ఈ కొండ శిఖరంపై అఖండ ధీపం వెలిగించడానికి అంగీకరించారు. కొండశిఖరంపై ఒక అఖండాన్ని ఏర్పాటుచేసి అక్కడ మంటపెట్టడానికి జంగములనే చెంచులను నియమించారు. సూచించిన సమయాల్లో వారు అఖండం వెలిగించే ప్రక్రియను కొనసాగించడానికి కొండ క్రింద వారికి భూములు కేటాయించారు. అఖండంలో ఒక టన్ను కొయ్యలు వేసి నిప్పంటించగా అది సముద్రంలో ప్రయాణించే షిప్పులకు చిన్న దీపంలా కనిపించేది. ఇలా ముక్కుకొండపై వెలిగించే మంటలు సముద్రంలో ప్రయాణించే షిప్పులకు దారిచూపే లైట్హౌస్గా మారింది. ఈ దీపం ఆధారంగా షిప్పులు చెన్నై పోర్టుకు చేరుకునేవి. చెన్నై హార్బరులో లైట్ హౌస్ నిర్మించిన పిదప కొండపై షిప్పులకోసం దీపం వెలిగించడాన్ని ఆపేశారు. ప్రస్తుతం షిప్పులకోసం దీపం వెలిగించక పోయినా ప్రతి చిత్రాపౌర్ణమికి చెంచులు కొండపై అఖండాన్ని వెలిగిస్తారు. ముక్కుకొండ ఊరిపేరుగా మారింది ఈ కొండ కారణంగానే కొండ అంచున ఉన్న ప్రాంతానికి నగరి అనే పేరు వచ్చింది. ముక్కు ఆకారంలో ఉన్న ఈ కొండను ముక్కు కొండ అని నాశికగిరి అని పిలిచే వారు. నాశిక గిరి కాలక్రమేణా నగిరి అని క్రమేణా నగరి అని మారింది. హనుమంతుడు ప్రతిష్ఠించిన గగన వినాయకుడు కొండశిఖరంపై వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉండటంతో ఈ వినాయకుని గగన వినాయకునిగా పిలుస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ చేసే సమయంలో ఢీకొన్న కారణంగా కొండ ఇలా ముక్కు ఆకారంలో మారిందని దీంతో హనుమంతడు అక్కడ ఆగి కొండపై ఆగి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున కొండపై ధీపం వెలిగిస్తే హనుమంతుడు వచ్చి ఆశీర్వదిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. కొండపైకి వెళ్లే వారు గగన వినాయకుని, ఆదిశేషుని ఆకారంలో ఉన్న బండను, అఖండాన్ని చూడవచ్చు. వీటితో పాటు వివిధ ఆకారాలోల్లో ఉన్న రాతి బండలను, చెట్లను చూడవచ్చు. చారిత్రక ప్రసిద్దిగాంచిన ఈ కొండపైకి ఆంద్రప్రదేవ్ టూరిజం వారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొండ విశేషాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి -
మేఘాలే తాకాయి.. ‘హిల్’ హైలెస్సా..
ఎత్తయిన పచ్చని కొండలు.. వాటి మధ్య దవళవర్ణ శోభితమైన మేఘాలు తాకుతూ వెళితే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది. అటువంటి ఆకర్షణీయమైన దృశ్యాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు వేదికయ్యాయి. ఏజెన్సీలోని ఘాట్ రోడ్లు, రంపచోడవరం సమీపంలోని భూపతిపాలెం ప్రాజెక్టు, సున్నంపాడు, మారేడుమిల్లి వద్ద కొండకొండకూ మధ్య తేలియాడుతూ వెళుతున్న మేఘమాలికలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. -
కొండలు కొల్లగొడుతున్నారు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపద అయినటువంటి కొండలను తవ్వేస్తూ అక్రమంగా రాళ్లు, గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవానికి మండలంలోని అధికారికంగా ఎటువంటి క్వారీలు లేవు. కానీ ఇటీవల విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గ్రావెల్, మట్టి అవసరం కావడంతో అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. అదును చూసి శివారుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని కొండలను నాశనం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసి కలపను కూడా తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు..? ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఒక వైపు రెవెన్యూశాఖ, మరో వైపు పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్రమ గ్రావెల్ రవాణా తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారులకు తెలిసే అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు మామూళ్లు ఇస్తుండడంతో నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కారణంగానే కొన్నిసార్లు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంటున్న వాహనాలను కూడా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రకృతి సంపదను అక్రమార్కులు నాశనం చేస్తారని వాపోతున్నారు. పర్యావరణానికి ముప్పు కొండలు, చెట్లు వంటివి ప్రకృతి సంపద. వీటి మనుగడతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుంది. అయితే మనుషులు తమ స్వార్థం కోసం కొండలను తవ్వేస్తూ, చెట్లను నరికేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతోంది. ఫలితంగా మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. మరోవైపు చెట్లను నరికేస్తుండడం వలన వాతావరణంలో మార్పులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువలన ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విలువైన ప్రకృతి సంపదకు నష్టం కలుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. పర్యావరణ రక్షణ అందరి బాధ్యత ప్రభుత్వ భూముల్లోని కొండలను తవ్వేస్తుండడం వలన వన్య ప్రాణులకు ఇబ్బందులు వస్తున్నాయి. కొండలపై ఉండే చెట్లను కూడా అక్రమార్కులు నరికేస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. భవిష్యత్‌లో జరిగబోయే నష్టాలు గురించి ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. – బమ్మిడి భూపతిరావు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, మఖరజోల, అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ భూములు నుంచి అక్రమంగా కంకర, మట్టి, రాళ్లను తీసుకెళ్లడం నేరం. ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత భూముల నుంచి కూడా గ్రావెల్ తీసుకెళ్లాలంటే రెవెన్యూ నుంచి మైన్స్ ద్వారా అనుమతి తప్పక పొందాలి. ఎవరైనా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవు. – దల్లి కొండలరావు, తహసీల్దార్, మందస -
వనం నుంచి ఆకాశానికి హరివిల్లు
అదొక ఎత్తయిన కొండ. కొండ నిండా చెట్లు. ఆకులనే కప్పుకున్నట్లు అనిపించే కొండది. కొండ కింద ఓ దట్టమైన వనం. బోలెడు చెట్లతో పువ్వులతో ఆ వనం అందంగా కనిపిస్తుండేది. కొండకు వచ్చిన వారంతా ముందుగా ఆ వనాన్ని తిలకించి పులకించిపోయేవారు. అక్కడి వాతావరణం ఎంత బాగుండేదో చెప్పడానికి మాటలు చాలవు. ఓరోజు కొండ పైనుంచి కనిపించింది ఓ హరివిల్లు. సప్తవర్ణాలతో ఆ హరివిల్లు చూసిన వారందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. మానవమాత్రులే కాదు, సువిశాలమైన తోటలో నివాసముంటున్న జంతువులు కూడా ఆ హరివిల్లును చూసి ఆస్వాదిస్తున్నాయి. పట్టరాని ఆనందంతో నృత్యాలు చేస్తున్నాయి. ఇంతలో ఓ ఏనుగు మరొక ఏనుగును పిలిచింది. ‘ఏంటీ పిలిచేవా?’ అని అడిగింది రెండో ఏనుగు. ‘అవును సోదరా! ఇదిగో చూసేవా ఆ కొండ మీద నుంచి కనిపిస్తున్న హరివిల్లుని. ఎంత బాగుందో కదూ! దాన్ని తీసుకొచ్చి మన వనానికి తోరణంలా చేసుకుందాం. అప్పుడు ఈ హరివిల్లుతో మన తోటకు మరింత అందం వస్తుంది అని చెప్పింది మొదటి ఏనుగు.‘అవును! నిజమే, నీ ఆలోచన బాగుంది. ఇప్పుడే వెళ్దాం మనమిద్దరం.’అని రెండో ఏనుగు చెప్పింది.రెండు ఏనుగులూ కొండ ఎక్కడం మొదలుపెట్టాయి. కొండ ఎక్కుతున్న కొద్దీ హరివిల్లు అందం అంతకంతకూ రెట్టింపవుతూ కనిపిస్తోంది. ఈ ఆనందంతో తాము పర్వతం ఎక్కుతున్న శ్రమను మరచిపోయాయి ఏనుగులు. ఓ గంటకు ఏనుగులు రెండూ హరివిల్లుకు చేరువకొచ్చాయి. ఏనుగులు తమ తొండాన్ని పెద్దవి చేసి హరివిల్లును అందుకున్నాయి. రెండూ ఓ అవగాహనకొచ్చాయి. పెద్ద ఏనుగు తన వీపుమీద హరివిల్లును పెట్టుకుని కొండ దిగింది. వెనకే చిన్న ఏనుగూ వచ్చింది. రెండు ఏనుగులకు ఎంత ఉత్సాహమో మాటల్లో చెప్పలేం. పాటలు పాడుతూ పర్వతం కిందకు చేరాయి. ఈ ఏనుగుల పాటలు విని తోటలోని మిగిలిన జంతువులూ వాటి దగ్గరకు వచ్చాయి. జంతువుల లోకంలో ఆనందం ఉప్పొంగింది. పెద్ద ఏనుగు వీపు మీదున్న హరివిల్లు తమ తోటలో ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాయి ఇతర జంతువులు. ఇంతలో అక్కడికి పక్కనున్న తోటలోని ఓ పులి అక్కడకు వచ్చింది. ‘ఏనుగా.. ఏనుగా..! నువ్వు చేసింది సరికాదు. ప్రకృతిలో హరివిల్లు అందరికీ సొంతం. మన తోటలన్నింటికీ కలిపేసుకుంటూ వాటికి ప్రవేశద్వారంగా ఈ హరివిల్లును ఏర్పాటుచేసుకుందాం’ అని చెప్పింది పులి. ‘అలా కలపడం కుదరదంటే ఒక్కో వనానికి ఒక్కో రోజు ఈ హరివిల్లుని ప్రవేశద్వారంగా ఉంచుకుందాం’ అని కూడా పులి చెప్పింది.కానీ ఓ ఎలుగుబంటి అంది కదా దానికన్నా ‘హరివిల్లులో ఏడు రంగులు ఉన్నాయి కదా. వాటిని ఏ రంగుకా రంగు విడగొట్టి ఒక్కో తోటకు ప్రవేశద్వారంగా చేసుకుందాం’ అని సూచించింది.కానీ అందుకు జింకలు ఒప్పుకోలేదు. ‘హరివిల్లుని అలా వేరు చేస్తే అది హరివిల్లు ఎందుకవుతుంది? రంగులనలా వేరు చేయడం ఏమీ బాగుండదు’ అంది జింకల నాయకుడు.‘అయితే మరేం చేద్దాం?’ అని కుందేలు అడిగింది.అప్పుడు ఒంటె చెప్పిందిలా...‘ఏడు రంగులూ చెదరిపోకుండా హరివిల్లుని ఏడు ముక్కలుగా చేసుకుని ఒక్కో వనానికి ఓ ప్రవేశద్వారం ఏర్పాటు చేసుకుందాం’ అని.ఇంతలో డేగ అంది కదా ‘అన్నట్టు మనుషులకైతే ఏదైనా ముక్కలు చేయడానికీ కోయడానికీ వాళ్ళ దగ్గర సుత్తి కొడవలి రంపం అంటూ ఏవేవో సాధనాలు ఉంటాయి. మన దగ్గర అలాంటివి లేవుగా... మరి హరివిల్లుని ఏడు ముక్కలు చేయడం ఎలాగా?’ అని ప్రశ్నించింది. ఈ మాట వినడంతోనే పులి క్షణాల్లో ఓ పెద్ద లావుపాటి కర్రను తీసుకొచ్చింది. పులి ఎక్కడ కర్రతో హరివిల్లుని ముక్కలు చేస్తుందో అని కోతి పెద్దగా అరిచింది...‘ఆగండి అందరూ..! మాట వినండి’ అంటూ కోతి చెట్టుపై నుంచి దూకింది. ‘మిత్రులారా! హరివిల్లుని ముక్కలు చేయడమో కోయడమో అసాధ్యం. అది అంత సులువైనది కాదు. ప్రకృతి వరప్రసాదం. మనుషులు ప్రకృతిని తమ ఇష్టమొచ్చినట్టు నాశనం చేస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం, అందం కోసం, కాలక్షేపం కోసం అంటూ రకరకాల కారణాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అదెంత తప్పో వారికి తెలియడం లేదు. భవిష్యత్తరాలవారికి చేటు తెచ్చే పనులే ఇవన్నీనూ. కనుక మనమూ అలాంటి పనే చేయడం దేనికి? .ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే దానికి అందం. దానిని నాశనం చేసే హక్కు మనకే కాదు మనుషులకూ లేదు. వాతావరణ సమతుల్యతను పరిరక్షించడం మన కర్తవ్యం కూడానూ. మనుషులకీ విషయాన్ని మనమందరం కలిసి చెప్దాం’ అంది కోతి.ఈ మాటలు చిరుతపులికి నచ్చలేదు.‘ఈ కోతి ఏదో జ్ఞానిలా ఈ మాటలు చెప్తోంది. దాని మాటలు వినకండి’ అని అరిచింది చిరుతపులి.కానీ కోతి మాటలతో ఏనుగు ఏకీభవించింది.‘అవును! కోతి చెప్పింది నిజమే. మనముండే వనంలోకి మనుషులు ప్రవేశిస్తున్నప్పుడు, చెట్లను నరుకుతున్నప్పుడు మనమందరికీ కోపం వస్తోంది. బాధపడుతున్నాం కదా! అలాగే ఇది కూడా. చెప్పింది ఏదో మనకన్నా చిన్నదని నిర్లక్ష్యం చేయకూడదు. అందరి మాటా వినాలి. నాకేదో అనిపించి ఈ హరివిల్లుని తీసుకొచ్చాను. అది తప్పని తెలిసింది. ఆకాశం నుంచి తీసుకొచ్చేయడం నా స్వార్థానికి నిదర్శనం కదా’ అంది ఏనుగు. పెద్ద ఏనుగు చెప్పిన ఈ మాటలతో మిగిలిన జంతువులన్నీ ఏకీభవించాయి. అందరం కలిసి ఈ హరివిల్లుని కొండెక్కి ఆకాశంలో పెట్టేద్దాం అని ముక్తకంఠంతో చెప్పాయి. అన్నీ కలిసి హరివిల్లుని ఏనుగు వీపు మీద పెట్టాయి. వాటి వెనుక ఆటపాటలతో కొండ మీదకు సాగాయి. పర్వతం అగ్రభాగానికి చేరాయి. హరివిల్లుని ఆకాశంకేసి విసిరాయి. అది మేఘాల మధ్య తేలుతూ కనిపించింది. ఆ అందాన్ని చూసి జంతువులన్నీ చప్పట్లు చరిచాయి. వాటి ఆనందాన్ని చూసి మేఘాలు పకపకా నవ్వాయి. వాటి ఆనందంతో శ్రుతికలిపాయి. మేఘాలు మహదానందంగా వర్షం కురిపించాయి.సూర్యుడు కూడా సంతోషంతో వెచ్చటి ఎండను ప్రసాదించి మురిసిపోయాడు. ఆ వర్షానికి, ఆ ఎండకూ మధ్య హరివిల్లు మరింత అందంగా దర్శనమిచ్చింది. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. - యామిజాల జగదీశ్ -
కొండల కన్నీటి ధార!
► అక్రమార్కుల దెబ్బకు పిండవుతున్న కొండలు ► యథేచ్ఛగా ప్రకృతి సంపద దోపిడీ ► రాత్రి వేళల్లో సాగుతున్న గ్రావెల్ తవ్వకాలు ► అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు నందిగామ : పట్టణానికి దూరంగా, ప్రశాంతంగా కనిపించే ఆ ప్రాంతం.. రాత్రి వేళ మాత్రం రణగొణ ధ్వనులతో నిండిపోతోంది.. ఈ ప్రాంతానికి ప్రకృతి అందాలు అద్దిన పల్లగిరి కొండను అక్రమార్కులు తొలిచేస్తున్నారు. అధికారులు కూడా తమవంతు సాయమందిస్తూ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిసున్నాయి. దీంతో అత్యంత విలువైన ప్రజా సంపద అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. పట్టణ శివారుల్లోని పల్లగిరి, రాఘవాపురం కొండలు అక్రమ మైనింగ్ వ్యాపారులకు వరంగా మారాయి. ఒక సర్వే నంబరులో తవ్వకాలకు అనుమతించామని మైనింగ్ అధికారులు చెబుతుండగా, వేరే ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుండటం గమనార్హం. చీకటి పడితే చాలు.. అక్రమ మైనింగ్ వ్యాపారులు రాత్రి సమయాన్ని అనుకూలంగా మలచుకున్నారు. జన సంచారం పలుచబడినప్పటి నుంచి గ్రావెల్ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇళ్ల నిర్మాణాలు, స్థలాలు చదును చేసుకునేందుకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రావెల్ వాడకం సర్వసాధారణం. దీంతో సదరు అక్రమార్కులు వ్యాపారం మూడు జేసీబీలు, ఆరు ట్రాక్టర్లుగా వర్థిల్లుతోంది. అడిగే నాధుడు లేడు.. అధికారుల నిఘా అంతకన్నా లేదు. అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించే వారే కనిపించరు. అధిక మొత్తంలో గ్రావెల్ అవసరమైన వారికి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మొత్తం సరిపోకపోతే కొందరు వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి టిప్పర్ల ద్వారా సైతం గ్రావెల్ తరలిస్తున్నారు. తెలివిగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రజా సంపదను పరిరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో చేయి కలిపి గ్రావెల్ అక్రమ రవాణాకు పూర్తిగా సహకరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చే సందర్భాల్లో అక్రమ వ్యాపారులకు ఉప్పందించి, గ్రావెల్ రవాణాకు సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులు కొండలను కొల్లగొడుతూ ప్రకృతి సంపదను డబ్బు రూపంలోకి మార్చేసుకుంటున్నారు. కనీసం ఉన్నతాధికారులైనా కలుగజేసుకొని ప్రకృతి సంపదను పరిరక్షించాలని పలువురు మేధావులు కోరుతున్నారు. ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పులు పగటి వేళ సైతం అనధికారికంగా గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు. ఒకే వే బిల్లుపై రోజు మొత్తంలో దాదాపు 20 నుంచి 30 ట్రిప్పుల వరకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. నిజానికి ఒక వే బిల్లు ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ముందుగానే మైనింగ్ శాఖాధికారుల నుంచి 50 వరకు వేబిల్లులు తీసుకుంటారు. ఇక వీటితోనే వందల ట్రిప్పులు గ్రావెల్ తరలించడం పరిపాటిగా మారింది. కరుగుతున్న కొండలు నందిగామ పట్టణం నుంచి మధిర వెళ్లే రహదారిలో పట్టణ శివార్లలో రహదారికి ఇరువైపులా మున్నేటి తీరంలో ఉండే పల్లగిరి, రాఘవాపురం కొండలు ప్రకృతి అందాలకు నిలయంగా దర్శనమిస్తుంటాయి. పల్లగిరి కొండను ఈ ప్రాంత ప్రజల సమైక్యత శిఖరం అని కూడా పిలుచుకుంటారు. పలు హిందూ దేవాలయాలు, చర్చిలతో పాటు ఓ దర్గా కూడా ఈ కొండపై ఉంది. కొండపైగల శిలువగిరి పుణ్య క్షేత్రాన్ని ఆనుకొని తవ్వకాలు జరుపుతుండటంతో క్రైస్తవ సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు నిత్యం పల్లగిరి కొండపై కొద్దిసేపు సేద తీరి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తుంటారు. అక్రమ మైనింగ్ పుణ్యమాని ఈ కొండ ఇప్పటికే కొద్దిమేర రూపు కోల్పోయింది. ఒకచోట అనుమతి.. మరోచోట తవ్వకాలు గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ డీఈ వై.సత్తిబాబును వివరణ కోరగా సర్వే నంబరు 21/6లో గ్రావెల్ తవ్వకాలకు ఓ వ్యాపారికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే, సదరు వ్యాపారి తనకు కేటాయించిన నంబరులో కాకుండా వేరే ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం. ఈ విషయం తెలిసి కూడా అధికారులు కుంటి సాకులు చెబుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
అడవి పందుల నుంచి.. పంటలను కాపాడుకోండి
రెడ్డిపల్లి కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం కలిగిన పరిసర గ్రామాల్లో పంటలకు జింకలు, అడవి పందుల బెడద ఎక్కువగా ఉందని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ పి.లక్ష్మిరెడ్డి అన్నారు. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పంటలను కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. నివారణ మార్గాలు ఇలా మనుషుల తల వెంట్రుకలు పొలంలో, పందులు వచ్చే మార్గంలో వేయడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించేటప్పుడు వాటి ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి పందులను తీవ్రంగా బాధిస్తాయి. ఓ దఫా వాటి ముక్కుల్లో నుంచి వెంట్రుకలు బయటకు రాకుండా వాటిని ఇబ్బందులకు గురిచేయడంతో మళ్ళీ మళ్ళీ ఆ పంట వైపు పందులు చూడవు. రాత్రివేళల్లో గంటకు ఒకసారి పొలాల్లో టపాకులు కాల్చినట్లైతే అడవి పందులు దూరంగా పారిపోతాయి. ఒక కొబ్బరి తాడును తీసుకుని వాటి పురుల మధ్య అక్కడక్కడ పటాకులు పెట్టి ఒక చెట్టుకు వేలాడదీయాలి. ఇలాంటివి పొలంలో నాలుగైదు చోట్ల పెట్టి రాత్రి వేళల్లో కొబ్బరి తాడుకు నిప్పంటించాలి. కాలుకుంటూ పోయే కొద్ది మధ్యలో ఉన్న పటాకులు పేలుతాయి. పొలం మధ్యలో ఒక చోట ఒక పెద్ద కిరోసిన్ దీపం వెలిగించి రాత్రంతా ఆరిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పొలాల్లో మినుక్కు మినిక్కుమంటూ వెలిగే లైట్లు అమర్చినా కొంత ఫలితం ఉంటుంది. పొలంలో అక్కడక్కడ పది అడుగుల ఎత్తు ఉన్న కట్టెలు వాటికి బెలూన్లు వేలాడదీయాలి. రాత్రివేళ్లలో అవి గాలికి ఎగురుతూ ఉంటాయి. వాటిని చూసి అడవి పందులు పంట దగ్గరికి కూడా రావు. కట్టెలకు తెల్లగుడ్డలను కట్టి వేలాడదీసినా పారిపోతాయి. సోలార్ ఫెన్సింగ్ ఖర్చుతో కూడుకున్నదైనా అడవి పందుల బెడద నుంచి పంటలకు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఫెన్సింగ్‌ను పశువులు, మనుషులు తాకినా ప్రాణనష్టం ఉండదు. పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో 10 అడుగుల దూరానికి ఒక కొయ్య పాతాలి. వాటìకి పంది చమురు లేదా చెడిపోయిన బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థాన్ని పూయాలి. ఈ వాసనకు పందులు రావు. అలాగే కుళ్లిపోయిన కోడిగుడ్లు వేయడం ద్వారా ఆ దుర్వాసనకు పరిసర ప్రాంతాల్లోకి కూడా పందులు రావు. గుడ్డ సంచుల్లో 100 గ్రాములు చొప్పున ఫోరేట్ గుళికలు మూటగట్టి పొలంలో అక్కడ ఉంచాలి. వీటిని పొలంలో అక్కడక్కడ కొయ్యలకు వేలాడదీసి అప్పుడప్పుడు తడుపుతుండాలి. దీంతో ఫోరేట్ వాసన పొలమంతా వ్యాపిస్తుంది. ఈ వాసనకు అడవి పందులు రావు. పొలం చుట్టూ కందకాలు తవ్వుకోవడం ద్వారా అడవి జంతువుల బెడదను తగ్గించుకోవచ్చు. కందకాల వల్ల భూగర్భ జలాల అభివృద్ధికి ఓ వైపు దోహదపడుతూనే అడవి జంతువుల బెడదను కూడా నిర్మూలిస్తుంది. పొలం చుట్టూ గట్ల వెంబడి రెండు మూడు సాళ్లు చొప్పున తెల్ల కుసుము సాగు చేయడం ద్వారా వాటికుండే ముళ్లుల కారణంగా పందులు పొలాల్లోకి వచ్చే అవకాశం ఉండదు. -
కళింగ కశ్మీర్
టూర్‌దర్శన్ - దారింగిబాడి నింగిని తాకే కొండలు... కొండల దిగువన ఆకుపచ్చని లోయలు... కొండలను ముద్దాడుతున్నాయా అనిపించే నీలిమబ్బులు... కొండల మీదుగా ఉరకలేస్తూ జాలువారే జలపాతాలు... కనుచూపు మేరలో కనిపించే పచ్చని కాఫీ తోటలు, మిరియాల తోటలు... పక్షుల కిలకిలలు తప్ప వాహనాల రణగొణలు వినిపించని ప్రశాంత వాతావరణం... వేసవిలోనూ చెమటలు పట్టనివ్వని చల్లని వాతావరణం... ఇటీవలి కాలం వరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని అద్భుత ప్రదేశం దారింగిబాడి. ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొంధొమాల్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం దారింగిబాడి. సముద్ర మట్టానికి దాదాపు 3 వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం వేసవిలోనూ చల్లగా ఉంటుంది. శీతాకాలం ఇక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. కొండలన్నీ మంచుతో కప్పబడి కనిపిస్తాయి. అందుకే ‘కశ్మీర్ ఆఫ్ ఒడిశా’గా పేరుపొందింది. దారింగిబాడి ఉన్న కొంధొమాల్ ప్రాంతం చాలాకాలం వరకు ఆటవికుల రాజ్యంగానే ఉండేది. క్రీస్తుశకం నాలుగో దశాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏ రాజులూ జయించిన దాఖలాల్లేవు. క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో సముద్రగుప్తుడు కోసలకు దక్షిణాన ఉన్న కొంధొమాల్ ప్రాంతం మీదుగా దక్షిణాపథానికి జైత్రయాత్ర సాగించాడని చెబుతారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో ఈ ప్రాంతం ఘుముసుర రాజ్యాన్ని పాలించిన భంజ వంశీయుల అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతిలోకి వచ్చింది. ఏం చూడాలి? * దారింగిబాడిలో పచ్చదనం నిండిన కొండలు, లోయల అందాలను చూసి తీరాల్సిందే. ఇక్కడి కొండలలో రుషికుల్యా నది మొదలైన ప్రదేశం, పుతుడి, పకడాఝర్ జలపాతాలతో పాటు ఊరికి చేరువలోనే జలకళ ఉట్టిపడే డోలూరి నది ప్రవాహ మార్గంలో పలుచోట్ల కనిపించే జలపాతాలు కనువిందు చేస్తాయి. * దారింగిబాడి పరిసరాల్లో విరివిగా కనిపించే కాఫీ తోటలు, మిరియాల తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. * దారింగిబాడి కొండలపైన హిల్‌వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని చూస్తే, దారింగిబాడి ఊరితో పాటు కనుచూపు మేరలోని పరిసరాలన్నీ పచ్చదనంతో అలరారుతూ నయనానందం కలిగిస్తాయి. * ఇక్కడకు చేరువలోనే చకాపడాలోని ప్రాచీన విరూపాక్ష దేవాలయం, బాలాస్కుంపాలోని బరలాదేవి ఆలయం ప్రశాంత వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. * దారింగిబాడికి చేరువలోని బేల్గఢ్ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన పక్షులు, వన్యప్రాణులు, వృక్షసంపద కనువిందు చేస్తాయి. దాదాపు 16 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలోనే ఆదిమ తెగకు చెందిన డోగ్రియా కొంధొలు నివసిస్తూ ఉంటారు. ఏం కొనాలి? * ఇక్కడి తోటల్లో విస్తారంగా పండే శ్రేష్టమైన కాఫీ గింజలను, మిరియాలను చౌకగా కొనుక్కోవచ్చు. * పసుపు సాగుకు కొంధొమాల్ జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి పసుపు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన పసుపు కొమ్ములను కొనుక్కోవచ్చు. * ఇక్కడ విరివిగా పండే అల్లం, వెల్లుల్లి, ఆవాలు వంటివి కూడా చాలా చౌకగా దొరుకుతాయి. * స్థానిక గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన తేనె, వనమూలికలు, ఇతర అటవీ ఉత్పత్తులు కూడా ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * విమాన మార్గంలో వచ్చేవారు ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే దారింగిబాడికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. * కొంధొమాల్ జిల్లాలో ఇప్పటికీ కనీసం రైల్వేస్టేషన్ కూడా లేదు. రైళ్లలో వచ్చేవారు బరంపురం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో దారింగిబాడికి చేరుకోవాల్సి ఉంటుంది. * బరంపురం నుంచి సురడా మీదుగా లేదా మోహనా, బ్రాహ్మణిగావ్ల మీదుగా లేదా భంజనగర్, జి.ఉదయగిరిల మీదుగా దారింగిబాడి చేరుకోవచ్చు. -
అపార్ట్మెంట్ వివాదంలో 'టీడీపీ ఎమ్మెల్యే'
-
కొండపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
విజయవాడ: కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లపాలెం క్వారీ కొండపై నుంచి జారిపడి ప్రమాదవశాత్తూ సింహ మధు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది కలిసి కొండపై పేకాటాడుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో తప్పించుకోబోయి కొండపై నుంచి జారిపడ్డారు. గాయపడిన ఇద్దర్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కొండల మధ్య కోరుకున్న జీవితం
దశాబ్దం క్రితం పారిశ్రామిక ప్రగతి నేపథ్యంలో లక్షల మంది చైనీయులు పట్టణబాట పట్టారు. వీరిలో కొంతమంది అక్కడ మనలేకపోయారు. కొండలమధ్యన ఉన్న సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నూడుల్స్ తింటున్న ఈ మహిళ కూడా అలాంటి వారిలో ఒకరు. కరెంటు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల మధ్య కోరిమరీ జీవిస్తున్న తమకు ఎనలేని ప్రశాంతత ఉందని వీరు చెబుతారు. -
పంచాయతీల్లో పవన విద్యుత్!
సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఎత్తై ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో ఏర్పాటు మెదక్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు అవసరమైతే పంచాయతీల ద్వారా నిధులిస్తామని సూచన కసరత్తు ప్రారంభించిన జెన్కో సాక్షి, హైదరాబాద్: తక్కువ విద్యుత్ విని యో గం ఉండే చిన్న పల్లెలు, ఆవాస ప్రాంతాలు, తండాల్లో పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గుట్టలు, కొండలతో కూడిన ఎత్తై ప్రాం తాలను గుర్తించాలని.. సాధ్యాసాధ్యాలను, ప్రయోజనమెంత అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గం గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు. తెలంగాణ లో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుట్టలు, కొండలు విస్తరించి ఉన్నాయని... ఎత్తై ఈ ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పవన విద్యుదుత్పత్తికి సాధ్యమయ్యే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. కేవలం వీధి దీపాలు, రాత్రి పూట బల్బులు తప్ప విద్యుత్ గృహోపకరణాలు లేనటువంటి చిన్న పంచాయతీలను ఎంచుకోవాలని చెప్పారు. కొండలు, గుట్టల పరి సరాల్లోని తండాలు, చిన్న పంచాయతీల పరిధిలో ఈ ప్లాంట్లు నెలకొల్పితే ఎంత విద్యుత్ సరఫరా చేసే వీలుంది, ఎంత ప్రయోజనం ఉం టుందనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. అవసరమైతే పంచాయతీల ద్వారా ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని అధికారులకు సీఎం చెప్పారు. ఒక పల్లెలో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని పల్లెల్లో పవన విద్యు త్ ఉత్పత్తికి అనువైన అవకాశాలున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించా రు. సీఎం ఆదేశం మేరకు అవసరమైన సమాచా రం సేకరణకు జెన్కో కసరత్తు ప్రారంభించింది. రెండు జిల్లాల్లో ఎక్కువ.. రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రీన్కో కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 750 ఎకరాల విస్తీర్ణంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే జిల్లాలోని ఆమనగల్లులో 150 మెగావాట్ల ప్రాజెక్టుకు తెలంగాణ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ చేసుకుంది. దీంతో పాటు కొడంగల్‌లో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మెదక్ జిల్లా కంగ్టిలో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్కో కంపెనీ గతంలోనే ప్రతిపాదనలు సమర్పించింది. వీటితో పాటు మైత్రి సంస్థ రంగారెడ్డి జిల్లా పరిగిలో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఎంవోయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన ప్లాంటులోని ఒక్క యూనిట్‌తో (ఒక గాలి మర) గరిష్ఠంగా 2.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే లక్ష్య సాధనతో పాటు.. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇది మార్గంగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
షిల్లాంగ్‌లో 15ఏళ్ల బాలిక దారుణ హత్య
న్యూఢిల్లీ: మేఘాలయులోని తూర్పుగారో హిల్స్ జిల్లాలో ఓ 15ఏళ్ల బాలిక దారుణ హత్యకుగురైంది. గుర్తుతెలియుని వ్యక్తులు ఆ బాలిక తలతోపాటు చేతులను కూడా నరికివేశారు. సోంగ్‌సక్‌రోడ్‌కు సమీపంలోని అడవిలో బాలిక మతదేహాన్ని కనుగొన్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాలి కపై అత్యాచారం జరిగినట్టు భావిస్తున్నారు. వారంకిందట కనిపించకుండా పోరుున బాలిక ఆదివారం రాత్రి శవమై కనిపించిందని జిల్లా ఎస్పీ డేవిస్ మరక్ తెలిపారు. చేతులు, తల ఒకచోట.. మొండెం మరోచోట దొరికాయని, వుృతదేహంలో అధికభాగాన్ని జంతువులు తినేశాయుని ఆయన చెప్పారు. యుువతిపై సాముహిక అత్యాచారం: జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా, తొరాయ్ గ్రామం సమీపంలో పదిమంది వ్యక్తులు 20 ఏళ్ల యుువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి స్నేహితురాళ్లతో కలిసి ఈ గ్రామలో దుర్గాపూజ కార్యక్రమాలను చూసేందుకు వచ్చిన ఆ యుువతిని పదివుంది యుువకులు పట్టుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. -
ఒకే మాట.. ఒకే బాట..!
‘మార్పు అనేది నీ నుంచే మొదలవ్వాలి’ అన్నారు మహాత్మాగాంధీ. ఆ మాట తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ... ఆ ఊరివాళ్లు గాంధీగారి మాటను అక్షరాలా నిజం చేశారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ కూచోకుండా తమ ఊరిని, తమ జీవితాలను బాగు చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు! ముంబైకి ఎనభై - తొంభై కిలోమీటర్ల దూరంలో... ఠాణే జిల్లా, షాపూర్ తాలూకాలో ఉంది కుడిశేత గ్రామం. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఊరిలో అంతకంటే ఆకర్షించే విషయం ఒకటుంది. అదే... గ్రామస్తుల ఐక్యత. వారంతా ఒకే మాట మీద ఉంటారు. ఒకే తాటి మీద నడుస్తారు. ఒక ఇంటిలోని వారే ఒక్కటిగా ఉండలేకపోతున్న ఈ రోజుల్లో... ఒక ఊరివారంతా అంతగా కలసి మెలసి ఉంటున్నారంటే నిజంగా గొప్ప విషయం. అంత గొప్ప సంస్కారానికి పునాది వేసింది ఓ వ్యక్తి. ఆయన గురించి తెలుసుకుంటే... ఈ రోజు కుడిశేత ఆదర్శగ్రామంగా ఎలా నిలిచిందో తెలుస్తుంది. మాటతోనే మార్పునకు శ్రీకారం... ఒకప్పటి కుడిశేత గ్రామానికి, నేటి కుడిశేతకి అసలు పోలికే లేదు. ఒకనాడు ఆ ఊరిలో మద్యం ఏరులై పారేది. అందరూ మద్యానికి బానిసలైపోయేవారు. ఏ పనీ చేసేవారు కాదు. కుటుంబాలను పట్టించుకునేవారు కాదు. దాంతో ప్రతి గడపలోనూ పేదరికం తాండవించేది. అభివృద్ధి అనేది ఆ గ్రామానికి ఆమడ దూరంలో ఉండేది. విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు... ఏ వసతులూ ఉండేవి కావు. కనీసం ఒక పాఠశాల కూడా ఉండేది కాదు. ఈ పరిస్థితి ఓ వ్యక్తిని కదిలించింది. ఎలాగైనా ఆ ఊరిని మార్చాలన్న పట్టుదలను రేకెత్తించింది. ఆ పట్టుదలే ఆయనను అభివృద్ధి దిశగా అడుగులు వేయించింది. ఆయన పేరు... గోమా దాదా ఉగరా, కుడిశేత గ్రామ మాజీ సర్పంచ్! నిజానికి సర్పంచ్ కాకముందే కుడిశేతను మార్చేందుకు కృషి చేయడం మొదలు పెట్టారు ఉగరాకి. కుడిశేతలో నెలకొని ఉన్న సమస్యలన్నింటికీ మద్యపానమే కారణమని అనిపించిందాయనకి. దాంతో మద్యం వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామస్తులందరి చెవిలో ఇల్లు కట్టుకుని పోరారు. మొదట్లో ఆయన మాటను ఎవరూ లెక్క చేయలేదు. కానీ నెలలు, సంవత్సరాల తరబడి అదే పనిగా బోధించేసరికి కొద్దికొద్దిగా మారడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా మద్యానికి దూరమవుతూ వచ్చారు. దాంతో తన మిగతా ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు నడుం కట్టారు ఉగరా. ఆర్థిక స్వావలంబన కోసం ఏం చేయాలో గ్రామస్థులకు వివరించారు. అందరం కలసి శ్రమిస్తే ఊరిని స్వర్గం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన మాటలు వారి మీద బాగానే పని చేశాయి. మీరెలా చెబితే అలా చేస్తామన్నారు. శ్రమదానంతో ఊరిని మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. నీటిని పొదుపు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. రోడ్లు వేసుకున్నారు. పాఠశాలను కట్టించారు. చీకటి నిండిన గ్రామంలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి దిశగా అత్యంత వేగంగా పయనించసాగారు. ఇప్పుడు కుడిశేత గ్రామంలో ప్రతి ఇంటా సౌర విద్యుత్ దీపాల కాంతి పరచుకుంటోంది. పెద్దలంతా పనులు చేసుకుంటున్నారు. పిల్లలంతా చదువుకుంటున్నారు. ఇదంతా ఉగరా చలవే అంటారు గ్రామస్థులంతా. ఆయన చూపిన బాటలో సాగినందువల్లే తమ జీవితాలు మారిపోయాయి అంటారు వారు. ఉగరా మరణించిన తర్వాత ప్రస్తుతం ఉగరా సోదరుడు కాలూరామ్ సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన కూడా ఆ ఊరి బాగోగుల కోసం శ్రమిస్తున్నారు. చిన్న చిన్న చెక్ డ్యామ్స్ని నిర్మించారు. త్వరలో నీటి కొళాయిలను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆయన మాత్రమే కాదు... ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఉగరా చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారు. నేటికీ ఎవ్వరూ అక్కడ మద్యం ముట్టరు. ఆ మాటే ఎత్తరు. ఊరిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు. కలసి కట్టుగా మెలగుతారు. ఒకరు ఇల్లు కట్టుకుంటే మిగతా వారంతా వెళ్లి సాయం చేస్తారు. ఆ ఐకమత్యమే వారి జీవితాలను బాగు చేసింది. ఆ ఐకమత్యమే వారిని ఈ రోజు ఆదర్శవంతులుగా చేసింది, వారి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దింది! - గుండారపు శ్రీనివాస్, ఫొటోలు: పిట్ల రాము, సాక్షి ముంబై ఒక ఊరు... ఒకే గణపతి మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో ‘ఒక గ్రామం - ఒకే గణపతి’ అన్న సంప్రదాయం ఉంది. ఖర్చును తగ్గించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు వారంతా. ఒక్కోచోట ఒక్కో విగ్రహాన్ని ప్రతిష్టించే బదులు ఊరి మొత్తానికి ఒకే విగ్రహాన్ని పెడదాం, అందరం కలిసి పండుగ చేసుకుందాం అన్న ఉగరా ఆలోచన ఫలించింది. అందరూ కలసి పండుగ చేసుకునే విధానంతో గ్రామస్తుల మధ్య ఐక్యత పెరిగింది. ప్రారంభించిన ఆ విధానాన్నే కుడిశేత గ్రామస్తులు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ప్రతి యేటా ఒకే ఒక్క వినాయకుణ్ని ప్రతిష్టిస్తున్నారు. ఒక్కటిగా పండుగ చేసుకుంటున్నారు. -
ఔషధ గుణాలున్న నీటికి ఉదయగిరిలో డిమాండ్
-
ప్రకృతి గీసిన ఐదు రంగుల చిత్రం!
అన్వేషణం ప్రకృతి ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు, గుట్టలు, లోయలు, నదులు, చెట్లు, కొమ్మలు, ఆకులు, పూలు... అసలు అందం లేనిదేది? ఆకట్టుకోనిదేది? అలా తమ అందాలతో కనువిందు చేసేవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి... ఫైవ్ ఫ్లవర్ లేక్. ఈ పేరే కాస్త విచిత్రంగా ఉంది కదూ! పువ్వులేంటి, అయిదు రకాలుండటమేంటి, వాటికీ సరస్సుకీ సంబంధమేంటి అనిపిస్తుందా! అదే మరి దీని ప్రత్యేకత! చైనాలో ఉన్న వుహుయా జిహాయ్గో నేషనల్ పార్క్‌లోని ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలంటే పెట్టిపుట్టాలేమో అనిపిస్తుంది. అందుకే ఆ పార్క్‌ని ఫెయిరీ ల్యాండ్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అంటే దేవతలు నివసించే స్థలమని వారి ఉద్దేశం. ఆ పార్కు అందం ఒకెత్తయితే... అందులో ఉన్న ‘ఫైవ్ ఫ్లవర్ లేక్’ అందం మరొకెత్తు. స్వచ్ఛమైన సరస్సు, చుట్టూ పచ్చని మొక్కలు, రంగురంగులు పూలతో... ప్రఖ్యాత చిత్రకారుడు ప్రతిష్టాత్మకంగా గీసిన చిత్రంలా ఉంటుంది. అసలు దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ఈ సరస్సు చుట్టూ ఎన్నో రకాల పూలమొక్కలు ఉంటాయి. వాటన్నిటి పూలనూ పరిశీలిస్తే ప్రతిదానిలోనూ నాలుగు రంగులు ఎక్కువగా ఉంటాయి. ఏపుగా పెరిగిన ఆ చెట్ల నీడ స్వచ్ఛమైన నీటిలో పడి, ఆ పూలరంగు సరస్సులో ప్రతిఫలిస్తుంది. నీటికి ఉన్న నీలిరంగుతో పాటు... పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు మిళితమై అయిదు రంగుల్లో మెరిసిపోతుంటుంది. అందుకే దీనికి ఫైవ్ ఫ్లవర్ లేక్ అనే పేరు వచ్చింది. మరో విశేషమేమిటంటే, ఈ సరస్సు చుట్టూ ఉన్న మొక్కలు సంవత్సరమంతా పూస్తూనే ఉంటాయి. అసలు పూలు లేకపోవడమన్నదే ఎప్పుడూ ఉండదు. దాంతో ఈ సరస్సు ఏడాది పొడవునా అలా రంగురంగులుగానే కనిపిస్తుంది! ఈ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా? సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి, పైసా పైసా కూడగట్టినా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే బ్రిటన్‌కు చెందిన మైఖేల్ బక్ అనే ఆయన కేవలం 150 పౌండ్లతో ఇల్లు కట్టేశాడు. మైఖేల్ పేదవాడేమీ కాదు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఎంత ఉన్నా ఆడంబరంగా బతకాల్సిన అవసరం లేదన్నది అతడి ఉద్దేశం. తన ఇంట్లోవాళ్లు ఆడంబరాలకు పోయి మితిమీరిన ఖర్చు చేయడం నచ్చలేదతనికి. మనిషి తలచుకుంటే చాలా సింపుల్‌గా బతకగలడని నిరూపించాలనుకున్నాడు. దాని ఫలితమే అతడు తన గార్డెన్లో కట్టిన ఈ ఇల్లు. ముందుగా సహజసిద్ధమైన కలప, ఆకులు, మట్టి, ఈనెలు తదితర వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు మైఖేల్. పైకప్పు వేయడానికి అవసరమైన నట్లు, మేకుల వంటి వాటికి మాత్రం ఓ నూట యాభై పౌండ్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఒక్కసారి హోటల్‌కి వెళ్లి భోంచేసినా ఇంకా ఎక్కువ బిల్లు అవుతుందేమో. కానీ ఆ మాత్రం డబ్బుతో ఇల్లు కట్టేశాడు. ఎనిమిది నెలలపాటు ఒక్కడే కష్టపడి దీన్ని కట్టుకున్నాడు మైఖేల్. అలా అని ఆషామాషీగా కట్టలేదు. చూశారుగా ఎంత బాగుందో! అంత తక్కువ సొమ్ముతో ఇంత అందమైన ఇంటిని కట్టడం ఇంకెవరికైనా సాధ్యమా! -
విహారం: హనీమూన్ ప్యారడైజ్ : కోవళం
కోవళం బీచ్... పర్యాటక ప్రపంచానికి చిరపరిచితమైన ప్రదేశం. భారత- పాశ్చాత్య దేశాల మధ్య వర్తకవాణిజ్యాలకు బీజం పడినప్పటి నుంచి పర్యాటక ప్రాధాన్యం సంతరించుకున్న తీరం ఇది. సరుకుల రవాణాకి అరేబియా తీరం అనువుగా ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందింది, దాంతోపాటు పర్యాటకమూ విస్తరించింది. ఇందుకు దోహదం చేసిన కారణం కోవళం దగ్గర సముద్రం సౌమ్యంగా ఉండడమే. మంద్రంగా చిన్నపాటి అలలతో సీబాత్కు చక్కగా ఉంటుంది ఈ తీరం. ఇక్కడ అడుగు లోతు సముద్రపు నీటిలో పడుకుని అలల తాకిడిని ఆస్వాదిస్తున్న విదేశీయులు కనిపిస్తారు. ఎత్తై అలలతో ఎగిసిపడే బంగాళాఖాతంలోకి పది అడుగుల కంటే లోపలికి వెళ్లాలంటే భయమేస్తుంటుంది. అరేబియా మాత్రం పొత్తిళ్లలో పాపాయిని సేదదీర్చినట్లు పర్యాటకులను సేదదీరుస్తుంది. ఈ టూరిస్ట్ ఫ్రెండ్లీ వాతావరణంలో విస్తరించిన రిసార్టులు... ప్రకృతి సహజత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రతిసృష్టి చేసినట్లు ఉంటాయి. హనీమూన్ ప్యారడైజ్‌గా అభివర్ణించుకునే ఈ రిసార్టులు, కాటేజీల్లో స్విమ్మింగ్‌పూల్, మెడిసనల్ ఆయిల్బాత్, మసాజ్, యోగా సెంటర్ వంటి రిలాక్సేషన్లు ఉంటాయి. కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్‌కి ఈ ప్రదేశానికే తొలిప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడి లీలా గ్రూప్ రిసార్టు, కరిక్కథి బీచ్ హౌస్ వంటి రిసార్టులు సముద్రాన్ని ఆనుకుని ఉన్నట్లే అనిపిస్తాయి. ఈ రిసార్టుల ఆవరణలో తిరుగుతుంటే సముద్రపు అలలు మనల్ని తాకడానికి వస్తున్నట్లు భ్రమ కల్పిస్తాయి. సముద్రంలో ఈదడానికి భయమేస్తే, సముద్రాన్ని చూస్తూ ఇక్కడి స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టవచ్చు. బీచ్‌లో సేదదీరాక నేల మీద అద్భుతాలు చూడాలని అడుగులు వేస్తే... త్రివేండ్రం స్వాగతం పలుకుతుంది. త్రివేండ్రం పేరుతోపాటే మనకు గుర్తొచ్చేవి పద్మనాభస్వామి ఆలయం, ట్రావన్‌కోర్ రాజమందిరం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వార్తల్లోకెక్కిన పద్మనాభ స్వామి ఆలయం త్రివేండ్రం నుంచి 80 కి.మీ.ల దూరంలో కన్యాకుమారికి వెళ్లే దారిలో ఉంటుంది. కౌడియార్ (ట్రావెన్కోర్ రాజవంశపు అధికారిక భవనం), పద్మనాభపురం ప్యాలెస్‌లు ఇక్కడ ఆధునికతను డామినేట్ చేస్తున్న సంప్రదాయ నిర్మాణాలు. వీటికి బ్యాక్‌డ్రాప్‌గా ఉన్న దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయత అన్నీ కలిసి రవివర్మ చిత్రాన్ని తలపిస్తాయి. కళాప్రియులకు రాజా రవివర్మ ఇక్కడే పుట్టాడన్న విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఆ మహాచిత్రకారుడు అంతటి గొప్ప చిత్రాలకు రూపమివ్వడానికి ఇక్కడి దట్టమైన అడవులతో విస్తరించిన కొండలు, సముద్రతీరం, ప్రకృతితో మమేకమైన జీవితం కారణమేమో! రవివర్మ చిత్రాల్లోని స్త్రీమూర్తులలో కనిపించే లాలిత్యం ఇక్కడ కనిపిస్తోంది. ఆయన చిత్రాల్లో పాశ్చాత్య ఛాయలు మేళవించిన భారతీయత కనిపిస్తుంది. ఇందుకు అప్పటి పాశ్చాత్యుల రాకపోకలే కారణం కావచ్చు. రవివర్మను ఇంతగా తలుచుకున్న తర్వాత ఇక్కడి శ్రీచిత్ర ఆర్ట్ గ్యాలరీని చూడకుండా ఉండలేం. చూడకుండా పర్యటన ముగిస్తే ఆ చిత్రకారుడికి ఇవేమీ పట్టకపోవచ్చు కానీ మన మనసు తొలిచేస్తూ ఉంటుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్లకు వెళ్లిన ప్రతిసారీ గుర్తుకొచ్చి మరీ... అప్పుడు చూడకపోవడంతో ఎంత మిస్సయ్యావో కదా అని బాధపెడుతుంది. అందుకోసమైనా చూసి తీరాలి. శ్రీచిత్ర ఆర్ట్ గ్యాలరీలో కేరళ సంప్రదాయ కళాకృతులు, శిల్పాలు, చిత్రాల విభాగాలున్నాయి. రవివర్మ చిత్రాలకు ప్రత్యేక విభాగం ఉంది. 1940లో కిల్లిమనూర్ ప్యాలెస్ నుంచి రాజకుటుంబీకులు గ్యాలరీకి పంపించిన 75 పెయింటింగుల్లో 63 మాత్రమే కనిపిస్తున్నాయిక్కడ. కాళ్లొచ్చి వెళ్లిన చిత్రాల సంగతేంటో మరి! ఇదే ప్రాంగణంలో ఉన్న నేపియర్ మ్యూజియం కేరళ సంస్కృతికి, సంప్రదాయ కళాఖండాలకు వేదిక. ఈ భవనం నిర్మాణశైలి తీరప్రాంత వాతావరణానికి అనువుగా ఉంటుంది. కేరళ, మొఘల్, చైనా, ఇటలీ భవన నిర్మాణ రీతులను కలగలిపి రూపొందించిన డిజైన్ ఇది. నాచురల్ ఎయిర్‌కండిషన్‌తో కూడిన ఈ డిజైన్ మీద ఆర్కిటెక్టు స్టూడెంట్లు అధ్యయనం చేస్తుంటారు. ఈ మ్యూజియంలో పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, రథాలు, ఇత్తడి విగ్రహాలు, దంతపు బొమ్మలతోపాటు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న తోలుబొమ్మలు కూడా ఉంటాయి. ఇక్కడి అనేక విగ్రహాలు భారత- రామాయణ కథల ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంటాయి. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి మద్రాసు గవర్నర్ జాన్ నేపియర్ పేరునే ఈ మ్యూజియానికి పెట్టారు. స్థానికులు దీనిని గవర్నమెంట్ ఆర్ట్ మ్యూజియం అనే పిలుస్తారు. ఎందుకో కానీ ఈ మ్యూజియానికి సోమ, బుధవారాలు రెండు రోజులు సెలవు. త్రివేండ్రం నగర శివారుగా అడుగులేస్తే కనుచూపు మేరలో అరువిక్కార నది కనిపిస్తుంది. ఇది త్రివేండ్రం నగరానికి మంచినీటి వనరు. ఈ నదీతీరాన ఉన్న దుర్గామాత ఆలయం చాలా పురాతనమైనది. టూర్ అంటే ఇవన్నీ చూడడమే కాదు ఇంకా ఏదో అల్లరి చేయాలంటే... నెయ్యార్ డ్యామ్ వైపుగా సాగిపోవాల్సిందే. ఇక్కడైతే పడవ విహారం, పర్వతారోహణ వంటి సాహసాలు చేయవచ్చు. పశ్చిమ కనుమల మీదకు సాగే ట్రెకింగ్ రూట్లో రెండు జలపాతాలు కనువిందు చేస్తాయి. లయన్ సఫారీ పార్క్, క్రొకొడైల్ రేరింగ్ సెంటర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సరే... ఇంత అందమైన ప్రదేశంలో టూరిస్ట్ స్టే సౌకర్యం ఉంటే బావుణ్ణు కదా అని ఆరా తీశాక... పొన్ముడి కొండలు మీద కాటేజీలు కనిపిస్తాయి. కేరళ సముద్రాన్ని చూసిన తర్వాత హౌస్‌బోట్ ఎక్కకపోతే ఎలా? ఈ సరదా తీర్చే పిక్నిక్ స్పాట్ అక్కులమ్ సరస్సు. ఈ లేక్ తీరాన మ్యూజికల్ ఫౌంటెయిన్, బోట్ క్లబ్, సరస్సులో స్పీడ్‌బోట్‌లో షికారు, పెడల్ బోట్ నడుపుకుంటూ పోవడం, కెట్టువల్లం(హౌస్‌బోట్)లో రాత్రి బస సౌకర్యాలున్నాయి. ఇవన్నీ చూశాక అరేబియా తీరాన్నే వెళ్తే ‘అంచుతెంగు’ చేరుతాం. ఇక్కడికి వెళ్లడం అంత అవసరమా... అంటే? కొంత అవసరమే! ట్రావన్‌కోర్ రాజు ఈస్టిండియా కంపెనీకి లీజుకిచ్చిన కొబ్బరి తోట ఇది. ఇక్కడ సెయింట్ జేవియర్ చర్చ్, బ్రిటిష్ వాళ్ల కోట ఉన్నాయి. చివరగా వెలి లాగూన్ (ఉప్పు నీటి సరస్సు)లోని ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కెళ్లి కేరళ సంప్రదాయ వంటకాలను రుచి చూస్తూ కోవళం బీచ్ రిసార్టుల నుంచి సాగిన పర్యటనను సింహావలోకనం చేసుకుంటే కోవళం ట్రిప్ తీపి జ్ఞాపకంగా మిగులుతుంది. ఎక్కడ ఉంది ? కరిక్కాథి బీచ్ హౌస్ రిసార్టు కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి దగ్గరగా కోవళం బీచ్‌లో ఉంది. సమీప విమానాశ్రయం: త్రివేండ్రం ఎయిర్ పోర్టు నుంచి దక్షిణంగా 20 కి.మీ.ల దూరం. సమీప రైల్వేస్టేషన్... త్రివేండ్రం రైల్వేస్టేషన్, ఇక్కడి నుంచి 11కి.మీ.ల దూరం. ఎక్కడ ఉండాలి ? కరిక్కథి బీచ్ హౌస్‌లో రోజు గది అద్దె 99 యూరోల నుంచి 590 యూరోలు ఉంటుంది (ఒక యూరో దాదాపుగా 79 రూపాయలు). ద లీలా కోవళం, వివాంతా బై తాజ్ - కోవళం వంటి ప్రైవేట్ హోటళ్లలో గది అద్దె రోజుకి కనీసం పదకొండు వేల రూపాయలు ఉంటుంది. కేరళ పర్యాటకశాఖ నిర్వహించే సముద్ర కోవళంలో మూడున్నర వేల నుంచి 11 వేల వరకు ఉంటుంది. హోటల్ సీ ఫేస్‌లో రెండువేల నుంచి మొదలైతే, జీవన్ ఆయుర్వేదిక్ బీచ్ రిసార్టులో ఒక రోజు అద్దె పన్నెండు వందల రూపాయల నుంచి మొదలవుతుంది. వీటితోపాటు ఆరువందల అద్దెతో హోటల్ సీవీడ్ వంటి బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. భోజనం ఎలా? రకరకాల సీఫుడ్ తినాలంటే ‘సీషోర్’ రెస్టారెంట్‌కెళ్లాలి. ఇది మల్టీక్విజిన్ రెస్టారెంట్. ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన ఐటెమ్ ‘సీ ఫుడ్ బాస్కెట్’. జలచరాలను సాస్‌లలో ఉడికించి తయారు చేస్తారు. ఇంకా ఏమి చూడవచ్చు? ఎంతెంత దూరం? అంచుతెంగు... ఇది త్రివేండ్రం నగరానికి 40 కి.మీ.ల దూరంలో అరేబియా తీరాన ఉంది. నెయ్యార్డ్యామ్... త్రివేండ్రానికి 30 కి.మీ.ల దూరంలో ఉంది. నెయ్యట్టికార... ఇది నెయ్యర్ నదీతీరాన విస్తరించిన పురాతన పట్టణం. ఇక్కడ 18వ శతాబ్దంలో మార్తాండవర్మ కట్టించిన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. పూవార్... పురాతన రేవు పట్టణం. త్రివేండ్రం నుంచి 29 కి.మీ.లు. చక్కటి రిసార్టులతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. వెలి లాగూన్... నగర శివారులోని ఉప్పు నీటి సరస్సు. షంగుముగమ్ బీచ్... ఎయిర్‌పోర్టుకి, కోవళం బీచ్‌కి దగ్గరగా ఉంది.