భారతదేశంలో కనిపించే అరుదైన పుష్పం ఈ నీలకురంజి పుష్పం. ఇది పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. సముద్రమట్టానికి 1300–2400 మీటర్ల ఎత్తులో ఉండే కొండ ప్రాంతాల్లో నీలకురంజి మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు సాధారణంగా 30–60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి.
అరుదుగా 180 మీటర్లకు మించి కూడా ఎదుగుతాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని పడమటి కనుమల ప్రాంతంలో నీలగిరి కొండలు, అన్నామలై కొండలు, పళని కొండలు, బాబా బుడాన్‌గిరి కొండలపై ఈ పూలు కనిపిస్తాయి. ఈ పూలు పూసినప్పుడు కొండలన్నీ నీలాల రాశుల్లా కనిపిస్తాయి. పన్నెండేళ్లకు ఒకసారి పూసే ఈ పూలను తిలకించడానికి పర్యాటకులు తండోపతండాలుగా ఈ కొండ ప్రాంతాలకు చేరుకుంటారు.
(చదవండి: బొమ్మలు చెప్పే చరిత్ర..)
Comments
Please login to add a commentAdd a comment