
పూల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్ని పుస్తకాలు రాసినా రాయడానికి ఇంకా ఉంటుంది. ఇకబెనా అనేది జపాన్‌కు చెందిన ఫ్లవర్ ఆర్ట్. ఇకబెనాలో చేస్తున్న సేవకి గాను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’ అందుకున్నారు రేఖారెడ్డి. జపాన్ ఫ్లవర్ ఆర్ట్‌ను భారతీయ చేనేతకళతో సమ్మిళితం చేస్తూ తన ‘లూమ్స్ అండ్ బ్లూమ్స్, పెటల్స్ అండ్ ప్యాలెట్, మిశ్రణం’ రచనలను పరిచయం చేశారు రేఖారెడ్డి.
పువ్వులు, రంగులు జీవితంలో భాగం. లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉంచుకోవడం తోపాటు సుమభరితంగానూ ఉండాలి. భారతీయ సంస్కృతి పూలు ఆస్వాదనకు, ఆడంబరానికి, రసమయమైన, విలాసవంతమైన జీవితానికి ప్రతీకలు. అలాగే దైవానికి చేసే నిత్యపూజలో పూలది ప్రధానపాత్ర. మన పూల అలంకరణ ఈ తీరులోనే ఉంటుంది.
జపాన్ వాళ్లు మాత్రం తాము అనుసరించే నిరాడంబర జీవనశైలిలో పూలతో ఆధ్యాత్మికపథం నిర్మిస్తారు. బౌద్ధం నుంచి నేర్చుకున్న వైరాగ్యతను పూల అలంకరణ ద్వారా నిత్యధ్యానం చేస్తారు. మనిషి జీవితాన్ని పువ్వుతో పోలుస్తారు. త్రికోణాకారపు అమరికలో పైన స్వర్గం, కింద భూమి, మధ్యలో మనిషి... ఈ మూడింటికి ప్రతిరూపం ఇకబెనా ఫ్లవర్ అరేంజ్‌మెంట్. ఒక మొగ్గ, ఒక అర విరిసిన పువ్వు, మరొకటి పూర్తిగా విచ్చుకున్న పువ్వు... ఈ మూడు భవిష్యత్తు, వర్తమానం, భూత కాలాలకు సూచికలు.
మనిషి జీవన చక్రానికి ప్రతీక. ఫ్లవర్ అరేంజ్‌మెంట్ కూడా ధ్యానం వంటిదే. ఒకరు దేవుని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఒకరు ప్రకృతి ఒడిలో ధ్యానం చేస్తారు. రోజూ కొంత సమయం ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌లో నిమగ్నమైతే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ధ్యానం తర్వాత కలిగే అలౌకిక ఆనందం వంటిదే ఇది కూడా.
ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనం
జపాన్ సంస్కృతిలో భాగమైన ఇకబెనాలో భారతీయ సంస్కృతిని మమేకం చేస్తూ పసుపుకుంకుమలతో పరిపూర్ణం చేశారు. ‘బ్లూమ్స్ అండ్ లూమ్స్’ కాన్సెప్ట్ జపాన్ ఇకబెనాను భారతీయ చేనేతతో సమ్మిళితం చేయడం. ‘మిశ్రణం’లో మన ఆహారంలో ఉన్న పోషకాలు – జపాన్ పూల అలంకరణతో అనుసంధానం చేయడం.
పెటల్స్ అండ్ ప్యాలెట్స్‌లో పూలు– రంగుల మధ్య విడదీయలేని బంధాన్ని వర్ణించారు. రెండు దేశాల సంస్కృతుల సమ్మేళనమే ఇవన్నీ. స్టేజ్ టాక్‌లో ఆతిథులను సమ్మోహనపరిచిన ఈ ప్రయోగాలే ఆమెను ‘జపాన్ ఫారిన్ మినిస్టర్స్ కమెండేషన్ అవార్డు’కు ఎంపిక చేశాయి.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment