
జపాన్ ఈశాన్య ప్రాంతంలో ఏటా ప్లమ్ చెట్లు పూత పూసే జనవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు జరుపుకొనే సంబరాలు ఇవి. ఈ సమయంలో జపాన్ ఈశాన్య ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ప్లమ్‌తోటల్లోని చెట్లు సరికొత్త పూలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ‘అటామీ బయినె ఉమె మత్సురి’ పేరిట జరుపుకొనే ఈ వేడుకల్లో పిల్లా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొంటారు.
షిజువోకా రాష్ట్రంలోని ఇజు ద్వీపకల్పంలో ప్లమ్ పూల సంబరాలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. పూలతో కళకళలాడే ప్లమ్ చెట్ల కిందకు చేరి వనభోజనాలు జరుపుకుంటారు. జపాన్‌లోని అతిపెద్ద ప్లమ్‌తోట ‘అటామీ బయినె’కు పెద్దసంఖ్యలో జనాలు చేరుకుని, విందు వినోదాలతోను, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇక్కడే కాకుండా, కొందరు సంపన్నుల ప్రైవేటు ప్లమ్‌తోటల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు కూడా ఈ సీజన్‌లో జపాన్‌కు వస్తుంటారు.
చదవండి: వారెవ్వా! ఓ వైపు సూర్యోదయం, మరో వైపు నిండుచంద్రుడు.. ఈ ఫొటో కోసం 2వేల సార్లు
Comments
Please login to add a commentAdd a comment