honour
-
మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం
సాంటో డొమింగో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ఆయనకు అందించింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుయానా చేరుకున్నారు. అక్కడ డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఆయనన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో మోదీని డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ సత్కరించారు. కరోనా టైంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలో భారత్ అందించిన సహకారం.. అందులో ఆయన పాత్రను బర్టన్ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే.. Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3— Narendra Modi (@narendramodi) November 20, 2024ఈ అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు జార్జ్‌టౌన్‌లో డొమెనికా ప్రధాని రూజ్వె స్కెర్రిట్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. 1981 నుంచి ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు.. 2019లో ఇండి-క్యారీకామ్లో భాగంగా మోదీ-స్కెర్రిట్ న్యూయార్క్‌లోనూ భేటీయ్యారు. కరోనా టైంలో ఈ దేశానికి భారత్ వ్యాక్సిన్ సహకారం అందించింది కూడా. -
Nara Family: అధికార దర్పమా?
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ ప్రకారమే నడుచుకుంటామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న మంత్రి నారా లోకేష్ తీరు.. ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ బహిరంగ బెదిరింపులు చాలదన్నట్లు .. మరోవైపు అధికార దర్పం ప్రదర్శిస్తోంది నారావారి కుటుంబం. తాజాగా..మంత్రి నారా లోకేష్ ఇంట్లో స్వాతంత్ర దినోత్స కార్యక్రమం జరిగింది. ఆయన భార్య నారా బ్రాహ్మణి జెండా ఎగరేశారు. అయితే అంతకు ముందు.. పోలీసుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారామె. ఆమె మాత్రమే కాదు.. తనయడు దేవాన్ష్‌కు కూడా పోలీసులు గౌరవ వందనం చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రికి తప్ప పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఎవరికీ ఇవ్వరు. అలా చేయడం నిబంధనలకు ఇది విరుద్ధమని రిటైర్డ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇలా రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని వాళ్లు అంటున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నివాసంలో జాతీయ జెండా ఎగుర వేయడం జరిగింది.#HappyIndependenceDay2024 pic.twitter.com/j6ZVid3QtF— Brahmani Nara (@brahmaninara) August 15, 2024 -
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!) -
ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్- టీటీఏ సంస్థ అధ్యక్షులు, వాట్స్(WATS), వాటా(WATA), ఇండియన్ కమ్యూనిటీ సెంటర్(Indian Community Center) వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం దక్కింది. కమ్యూనిటీ సర్వీస్, వాలంటీర్ లీడర్షిప్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకు గాను అమెరికాలో ప్రతిష్టాత్మకమైనా యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ వరించింది. ఆయన సేవా నిరతిని గుర్తించిన వాట్స్ సంస్థ.. ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ (PVSA), లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను స్వర్ణ పథకంతో సత్కరించింది. సంక్రాంతి, రిపబ్లిక్ డేని పురస్కరించుకుని వాట్స్(WATS) సంస్థ నిర్వహించిన ఈవెంట్లో.. సీటెల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను అందజేశారు. (చదవండి: తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం) -
అగ్నివీర్ అమృత్‌పాల్ అంత్యక్రియలపై వివాదం.. ఆర్మీ క్లారిటీ
ఢిల్లీ: అగ్నివీర్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రేగుతోంది. అగ్నివీర్ సైనికుని అంత్యక్రియల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీ స్పందించింది. అగ్నిపథ్ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి భేదం లేదని స్పష్టం చేసింది. ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రాదాయం లేదని వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా.. అగ్నిపథ్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోడంపై ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్‌లో రాజకీయ పార్టీలు సైన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభ్యర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని అధికార పార్టీ ఆప్ కూడా ప్రశ్నించింది. దీంతో ఆదివారం రాత్రి ఆర్మీ ఓ ప్రకటన వెలువరించింది. అమృత్ పాల్ సింగ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అంత్యక్రియల అంశంపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించింది. సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆర్మీ విధానాల ప్రకారమే స్వస్థలానికి చేర్చామని తెలిపింది. 1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఆత్మహత్య వంటి మరణాలకు సైనిక లాంఛనాలు ఉండబోవని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఈ విధానాలను పాటిస్తున్నామని పేర్కొంది. 2001 నుంచి ప్రతి ఏడాది సరాసరి 100-140 సైనికులు ఆత్మహత్యలతో మరణిస్తున్నారని తెలిపిన ఆర్మీ.. ఈ కేసుల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని వెల్లడించింది. నియమాల ప్రకారం అంత్యక్రియల ఖర్చులతో పాటు అందాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఆర్మీలో ఎలాంటి వివక్ష ఉండబోదని, ప్రోటోకాల్ ప్రకారమే అంతా జరుగుతుందని ప్రకటనలో వెల్లడించింది. అన్ని వర్గాల మద్దతును ఆర్మీ గౌరవిస్తూ ప్రోటోకాల్స్‌ను పాటిస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
గిన్నీస్ రికార్డు సాధించిన తెలుగుతేజం నిహాల్!
న్యూజెర్సీ: అక్టోబర్ 7, 2023 అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధికంగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా బ్యాటరీలను ఇంతవరకు ఎవరు లైనింగ్ చేయలేదు.. కానీ మన తెలుగు విద్యార్థి నిహాల్ తన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యుల సహకారంతో ఈ ఘనతను నిహాల్ సొంతం చేసుకున్నారు. నిహాల్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం యావత్ తెలుగువారికి గర్వకారణం.. ఇది ప్రపంచంలో పర్యావరణ మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని గిన్నీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్‌లో రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సాధించిన విజయాలను అధికారికంగా నమోదు చేసి నిహాల్‌కు గిన్నీస్ రికార్డు ధ్రువ పత్రాన్ని అందించారు. రీసైకిల్ మై బ్యాటరీ సాధించిన ఈ విజయం తన పిలుపు స్పందించిన విద్యార్ధుల సహకారంతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నిహాల్ తెలిపాడు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి 10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్‌కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది. 2019లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదాతల అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని స్టాలిన్ తెలిపారు. తాజా ప్రకటన అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు ఈ స్థానంలో ఉందని స్టాలిన్ కొనియాడారు. అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు -
ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం'
భారతదేశ ఆధ్యాత్మికతకు అరుదైన గౌరవంగా భావించదగిన చారిత్రాత్మక గౌరవం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ రవిశంకర్‌కి లభించింది. హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు 'రవిశంకర్ దినోత్సవాన్ని' ప్రకటించడంతో అమెరికా కెనడా దేశాలలో రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన నగరాల సంఖ్య 30కి చేరింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కావడం విశేషం. రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఒకప్పుడూ యుద్ధ విధ్వంస ప్రాంతాలుగా ఉండేవి. ఆ ప్రాంతాలల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని ప్రశంసించిన టెక్సాస్ గవర్నర్ ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్. జూలై 30, 2023, బెంగళూరు: భారతీయ ఆధ్యాత్మిక చరిత్రకు గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, రవిశంకర్‌కు గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడా నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్; టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి. ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మిక నాయకుడు రవిశంకర్ కావడం గమనార్హం. సేవాదృక్పథంతో, శాంతి, ఆనందాలను వ్యాపింపజేస్తూ వివాదాల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, "తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ రవిశంకర్, వారి అనుచరగణం ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి..కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు. ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు.” అని ప్రశంసించారు. మేరీల్యాండ్‌లోని హోవార్డ్ కౌంటీ చేసిన కార్యనిర్వాహక ప్రకటనలో, "ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు, శాంతి దూత, ప్రపంచంలో పరివర్తన తేగలిగే వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీశ్రీ... అభిప్రాయ భేదాలతో విభిన్న ధృవాలుగా చీలిపోయి, దూరాలు పెరిగిపోయిన నేటి ప్రపంచ స్థితిలో గురుదేవ్ శ్రీశ్రీ మన సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి, ఐక్యత, ఆశావహ దృక్పథాల ద్వారా వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో స్వీయ పునరుద్ధరణ ద్వారా సమైక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు..." అని పేర్కొన్నారు. హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ డే గా ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్‌హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించాయి. అమెరికాలో శ్రీశ్రీ పర్యటన సందర్భంగా ఆయా నగరాలలో గురుదేవ్ కు ఘనస్వాగతం లభించింది. జాతి, కుల, స్థాయీ, లింగభేదాలకు అతీతంగా ఆయా ప్రాంతాలలో హాజరైన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి శ్రీశ్రీ ప్రసంగించి, తమ మనసులోతులలోనికి తీసు కొనిపోయే శక్తివంతమైన ధ్యానక్రియలను వారిచే చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ ప్రవచనాలతో కూడిన ‘నోట్స్ ఫర్ ది జర్నీ విదిన్’ (అంతరంగ ప్రయాణానికి సూచనలు) అనే పుస్తకాన్ని ఆయా నగరాలలో విడుదలచేశారు. నిజాయితీగా అన్వేషించే సాధకులకు తమ దైనందిన జీవన సమస్యల నుండి, ఆధ్యాత్మికత వరకూ ఎదురయ్యే సార్వజనీనమైన ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు ఇస్తుంది. శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఒక మానవతావాదిగా శ్రీశ్రీ చేసిన ప్రయత్నాలకుగాను అమెరికాలోని కౌంటీ ఆఫ్ అల్లెఘేనీ గత నెలలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను గౌరవించిన విషయం విదితమే. ఆ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో ‘... స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాలద్వారా వివిధ వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, నగరాలలో పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టడానికి గురుదేవ్ చేస్తున్న ప్రయత్నాలు, వారు విభిన్న సంస్కృతులు, జాతుల మధ్య సంఘర్షణలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మాత్రమే పోల్చదగ్గవి.’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని ప్రఖ్యాత నేషనల్ మాల్ లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాలలోభాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. (చదవండి: కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు) -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్‌లైన్స్ పుణె ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్‌ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్‌ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్‌లైన్స్ పైలట్. సంజయ్ కుమార్‌ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
'ఆర్డర్ ఆఫ్ నైల్'.. ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవం..
అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈజిప్టు అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీకి అందించారు. ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని మోదీ ఈ రోజు సందర్శించారు. సుమారు 1000 ఏళ్ల నాటి మసీదు గోడలపై చెక్కిన శాసనాలను ప్రధాని తిలకించారు. 13,560 మీటర్లలో విస్తరించిన మసీదును భారత్‌లోని దావూదీ బోహ్రా కమ్యునిటీలు 1970లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి వారే దాని పర్యవేక్షణ బాధ్యతలను చేపడుతున్నారు. గుజరాత్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న బోహ్రా తెగలతో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈజిప్టులోని భారత రాయబారి అజిత్ గుప్తే ఈ సందర్భంగా తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు, పాలస్తీనాలో పోరాట సమయంలో మరణించిన 4000 మంది భారత సైనికులకు గుర్తుగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈజిప్టు పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షునితో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతంపై సమావేశం నిర్వహించారు. ఇదీ చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
రతన్ టాటాకు మరో అరుదైన పురస్కారం: ఫోటోలు వైరల్
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, టాటాసన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు అరుదైన పురస్కారం లభించింది. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం రతన్ టాటాను వరించింది. ఆస్ట్రేలియా-భారత్ ద్వైపాక్షిక సంబంధానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారతదేశంలోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ' ఫారెల్ ట్విటర్లో షేర్ చేశారు. పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటా వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలో కూడా గొప్ప వ్యక్తిగా నిలిచారని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని తీసుకొచ్చిం దన్నారు. ఆస్ట్రేలియా-భారత్ బంధానికి టాటా సుదీర్ఘ నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. టాటా వపర్ సదరన్ ఒడిశా డిస్టట్రీబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ కూడా లింక్డ్ఇన్ పోస్ట్‌లో సత్కార వేడుక ఫోటోలను చేశారు. బిజినెస్‌లోనూ, ఫిలాంత్రఫీలోనే టాటా చేసిన సేవలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యాయన్నారు. అనేక విజయవంతమైన వెంచర్ల వెనుక చోదక శక్తిగా రతన్ టాటా ఉన్నారు. ఆయన లీడర్ షిప్, విజన్ ఎంతోమందికి తమ కలల సాకారంలో గొప్ప స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు Ratan Tata is a titan of biz, industry & philanthropy not just in 🇮🇳, but his contributions have also made a significant impact in 🇦🇺. Delighted to confer Order of Australia (AO) honour to @RNTata2000 in recognition of his longstanding commitment to the 🇦🇺🇮🇳relationship. @ausgov pic.twitter.com/N7e05sWzpV — Barry O’Farrell AO (@AusHCIndia) April 22, 2023 -
‘మోదీ’ గ్రేట్ అంటూనే సెటైర్లు.. ఆ సీఎం మామూలోడు కాదు!
జైపూర్: అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎప్పుడు నిప్పులు చెరిగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ గ్రేట్ అంటూనే చురకలు అంటించారు. ఈ సంఘటన రాజస్థాన్ బాన్సవారా జిల్లాలోని మంగఢ్ హిల్‌పై నిర్వహించిన‘మంగఢ్ ధామ్ కి గౌరవ్ గాథా’ కార్యక్రమం వేదికపై కనిపించింది. వేదికపై పీఎం మోదీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ‘పీఎం మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ప్రపంచం ఆ సత్యాన్ని గ్రహించి ఆ దేశానికి ప్రధాని మనల్ని కలిసేందుకు వచ్చారని గొప్పగా భావిస్తారు.’ - అశోక్ గెహ్లట్ , రాజస్థాన్ ముఖ్యమంత్రి. #WATCH | At 'Mangarh Dham ki Gaurav Gatha’, Raj CM Gehlot says, "...When PM Modi goes aborad, he receives great honour. Because he's PM of the nation of Gandhi, where democracy is deep-rooted. When world realises this, they feel proud that PM of that country is coming to them..." pic.twitter.com/Mi6HaqueRH — ANI (@ANI) November 1, 2022 ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులుగా అశోక్ గెహ్లట్‌తో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ ముఖ్యమంత్రులుగా అశోక్ జీ, నేను కలిసి పని చేశాం. మన ముఖ్యమంత్రుల్లో ఆయన అత్యంత సీనియర్. ప్రస్తుతం వేదికపై ఉన్న సీఎంలలోనూ ఆయనే సీనియర్.’అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైబల్ కమ్యూనిటీ పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత ట్రైబల్ కమ్యూనిటీలకు చరిత్రలో సరైన స్థానం లభించలేదన్నారు. అలాంటి దశాబ్దాల కాలం నాటి తప్పులను తాము సవరిస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రథమ ఎస్.మైన్‌కర్, డాక్టర్ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్ రంగనాథన్ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరిగిన 29వ సీఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్ కెమిస్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగాల్లో డాక్టర్ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా.. వైద్యానికి కీలకమైన సంక్లిష్టమైన సహజ రసాయనాలు గుర్తించేందుకు డాక్టర్ దేబేంద్ర కృషి చేస్తున్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్ఐఆర్ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు. -
‘బుల్లెట్ బండి’.. వాళ్లిద్దరికి సన్మానం
సాక్షి, కేశంపేట(హైదరాబాద్): యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ‘బుల్లెట్ బండెక్కి..’ పాటను రాసిన గేయ రచయితలను ఎంపీపీ రవీందర్‌యాదవ్ బుధవారం సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో గేయ రచయితలు మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన రాము, లక్ష్మణ్‌లను శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు -
‘ఒక్క ట్వీట్ చేస్తారు.. పూర్తిగా మర్చిపోతారు’
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అనే వార్త తెలిసినప్పటి నుంచి రిటైర్డ్ బ్రిగేడియర్ సీకే సూద్ స్థిమితంగా ఉండలేకపోతున్నారు. 20 మంది సైనికులు చనిపోయారని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత విలవిల్లాడిపోయారో.. సూద్ కూడా అలానే బాధపడ్డారు. ఈ ఘటన ఆయన కుమారుడిని గుర్తు చేసింది. సీకే సూద్ కుమారుడు మేజర్ అంజు సూద్ కూడా గత నెల 2న కశ్మీర్ హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకున్న పౌరులను కాపాడే క్రమంలో అంజు సూద్ మరణించారు. ఈ ఘటనలో మొత్త ఐదుగురు చనిపోయారు. కొడుకు మరణించిన విషాదం నుంచి బయటపడక ముందే మరో 20 మంది సరిహద్దులో నెలకొరిగారనే విషయం ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘నా కుమారుడు మరణించాడనే వార్త నాకు ఒక రోజు తర్వాత తెలిసింది. ఆలోపే ఈ వార్త అన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది’ అన్నారు. రాజకీయ నాయకులు అమర జవాన్ల మృతికి సంతాపంగా ఓ ట్వీట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని.. ఆ తర్వాత వీరుల కుటుంబాలను పట్టించుకునే నాదుడు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీకే సూద్ గత నెల 30న Change.org అనే ఆన్లైన్ పిటీషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీకే సూద్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మన హీరోల త్యాగాన్ని ఎలా గుర్తిస్తుందో మీకు తెలుసా.. ఓ ట్వీట్‌తో. ఒక ట్వీట్ అంటే కేవలం 140 అక్షరాల్లో. వారు ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో ఐదుగురు వీర జవాన్లు మృతి చెందారని తెలుపుతారు. కానీ వారి పేర్లును వెల్లడించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాయ్‌కాట్ చైనా) ఈ పిటీషన్లో (Change.org/MartyrsOfIndia) సీకే సూద్ దేశ ప్రధాని / రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ.. అమరులైన జవాన్ల త్యాగాన్ని గుర్తు చేస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ మెమోంటో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘ఒక బలమైన కారణం కోసం ప్రతి ఏడాది ఎందరో జవాన్లు అమరులవుతున్నారు. వారిని ఒక్క సారి స్మరించుకుని తర్వాత మర్చిపోతారు. వారి కుటుంబాలను అస్సలు పట్టించుకోరు. ఈ పద్దతి మారాలి’ అన్నారు. ఇందుకు జనాలు తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. ఈ ఆన్లైన్ పిటీషన్ ఇప్పటికే 19,800 సంతకాలు సేకరించింది... వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. -
భారతీయ నటుడికి ప్రత్యేక గౌరవం
సాక్షి, సినిమా : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్‌లో దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో క్రిస్టల్ పురస్కారాన్ని అందుకున్నాడు. మహిళలు, చిన్నారుల హక్కుల కోసం గణనీయమైన కృషి చేసే వ్యక్తులకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ అవార్డును ఏటా అందజేస్తోంది. మీర్ ఫౌండేషన్ ద్వారా షారూఖ్ తన సేవలను అందిస్తున్నారు. హాలీవుడ్ తారలు కేట్ బ్లాంచెట్, లెజెండరీ సంగీత దర్శకుడు ఎల్టోన్ జాన్‌లతోపాటు షారూఖ్‌కి 24వ క్రిస్టల్ అవార్డును అందుకున్నాడు. ఇక అవార్డు పట్ల డబ్ల్యూఈఎఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన షారూఖ్.. భారత్ తరపున ఈ అంశంపై మరింతగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించాడు. అనంతరం బ్లాంచెట్‌తో స్టేజీపై సెల్ఫీ దిగేందుకు యత్నించి సదస్సులో నవ్వులు పూయించాడు. చంద్రబాబు విషెస్... షారూఖ్‌కు క్రిస్టల్ అవార్డు దక్కటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప నాయకుడు అనిపించుకోవాలంటే రాజకీయనేతలే కావాల్సిన అవసరం లేదని.. షారూఖ్‌కు అభినందనలని చంద్రబాబు ట్వీటారు. పలువురు సెలబ్రిటీలు కూడా షారూఖ్ ఖాన్‌ను సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) One need not be a politician to be a great leader and lead the society towards a better tomorrow. Congratulations @iamsrk on being awarded @wef's 24th crystal award. Your dedicated efforts for Women’s and Children’s rights are commendable. — N Chandrababu Naidu (@ncbn) 23 January 2018 -
2జీ స్కాం తీర్పుపై అరుణ్ జైట్లీ స్పందన
-
2జీ స్కాం తీర్పుపై అరుణ్ జైట్లీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రంపై పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పుపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ తీర్పును కాంగ్రెస్ సన్మాన పత్రంలా భావిస్తోందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి 2012లో అవినీతి, మోసపూరిత పాలసీ అని సుప్రీంకోర్టు తేల్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అన్ని లైసెన్సులను నిలిపివేసిందన్నారు. 2జీ కేటాయింపులు సక్రమమని కాంగ్రెస్ భావిస్తోంది. తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ సంబర పడుతోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా 2జీ కేటాయింపులు జరిగాయని జైట్లీ విమర్శించారు. యూపీఏ హయాంలో 2007లో కేటాయించిన 2జీ స్పెక్ట్రంమ లైసెన్సులను 2001 రేట్లకనుగుణంగా కేటాయింపులు జరిగాయి, తద్వారా ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చారన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చార్జిషీట్‌ను తిరిగి పరిశీలించాలని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని , ఆ విశ్వాసం తనకుందని అరుణ జైట్లీ వెల్లడించారు. -
జేసీకి సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను శనివారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, డీఎస్ఓ సుబ్రమణ్యం, వికలాంగుల శాఖ ఏడీ భాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు జేసీని ఆయన చాంబరులో కలసి సన్మానించారు. -
దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది
డీఈఓ తాహెరా సుల్తానా నంద్యాల: మనదేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. స్థానిక ఎన్జీఓ కాలనీలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆదివారం సైన్స్‌డే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమెతో పాటు గురురాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ముందున్నామని చెప్పారు. దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు బాల్యం నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలు కావాలని కోరారు. భూగర్భ శాస్త్రవేత్త కేవీ రమణయ్య, రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామయ్య, సెంథిల్ రాజు, డాక్టర్ మధుసూదనరావులను సన్మానించారు. అనంతరం సైన్స్‌పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో రాణించిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సుమతి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల కో డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు. -
జస్టిస్ చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం
-
సీనియర్ వైద్యులకు సన్మానం
కర్నూలు(హాస్పిటల్): గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సీనియర్ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్ క్లబ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న, కర్నూలు మెడికల్ కాలేజి అధ్యాపకులైన డాక్టర్ జె.వీరాస్వామి(సూపరింటెండెంట్), ఐసీ రెడ్డి, ఉదయ్‌కుమార్, సూర్యనారాయణ(చర్మవ్యాధుల విభాగం), సూర్యనారాయణ, రామకృష్ణ(అనెస్తీషియా), కృష్ణానాయక్, మోహన్‌లాల్‌నాయక్(జనరల్ సర్జరీ), మాధవస్వామి(కార్డియాలజి), ఇందిర(గైనిక్), అబ్దుల్‌గఫూర్(రేడియాలజి), వెంకటకృష్ణ(చిన్నపిల్లల వైద్యులు)లతోపాటు పదవీ విరమణ పొందిన డాక్టర్ ఎస్వీ రంగారెడ్డి, పీబీ కన్నలను సన్మానించారు. ఈ సందర్భంగా ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి. శంకరశర్మ, డాక్టర్ సి. మల్లికార్జున్ మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు చెప్పి ఇంతటి వారిని చేసిన గురువులను సన్మానించుకోవడం సంప్రదాయమన్నారు. -
నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
– 61 మందికి అవార్డుల ప్రదానం – ఉదయం 11 గంటలకు సునయనలో కార్యక్రమం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నేతత్వంలో సత్కరించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు ఈ విషయం వెల్లడించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగే సత్కారం కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 61 మందిని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశామని, వీరంతా ఉదయం 9 గంటలకే సునయన ఆడిటోరియానికి చేరుకోవాలని సూచించారు. -
అలనాటి కాన్పూర్ విద్యార్థికి ఒబామా సన్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భారతీయ సంతతి పౌరుడికి గుర్తింపును ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన రాకేష్ కే జైన్ (65)ను ఒబామా సైన్స్ మెడల్ తో సత్కరించారు. మరో పాక్ సంతతి పౌరుడికి కూడా ఒబామా ఈ సన్మానం చేశారు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ ఆస్పత్రిలో రాకేష్ విశేష సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ వ్రణాలపై పరిశోధించి ముందస్తుగా దానిని గుర్తించేలా నివారణ చర్యలు తీసుకునేలా, వైద్య ప్రక్రియను కూడా ఆయన ఆవిష్కరించారు. జైన్ అలనాడు ఐఐటీ కాన్పూర్ విద్యార్థి. ఇప్పటికే ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. 1972లోనే కాన్పూర్ లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. 1959లో ప్రారంభించిన ఈ అవార్డు నేషనల్ సైన్స్ పౌండేషన్ తరుపున ప్రతి ఏడాది వైట్ హౌస్ అందిస్తుంది. ఇక పాక్ సంతతికి చెందిన హుమయూన్(53) కూడా ఒబామా చేతుల మీదుగా సత్కారం పొందారు. -
పరువు కోసం మహిళల్ని పిట్టల్లా..
ఫైసలాబాద్: పాకిస్తాన్లో ఇటీవల పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. మహిళల వల్ల కుటుంబ పరువు మంటగలుస్తోందని భావిస్తున్న కొందరు పురుషులు పాశవికంగా హత్యలకు పాల్పడుతున్నారు. బుధవారం ఫైసలాబాద్ జిల్లాలోని ఒకే ఇంట్లో జహర, ఫర్జానా, నస్రీన్ అనే ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకునే సరికే ముగ్గురు మహిళలు రక్తపు మడుగులో నిర్జీవంగా పడిఉన్నారు. కాల్పులు చోటుచేసుకోవడానికి ముందు కుటుంబంలోని పురుషులు మహిళలతో పెద్ద ఎత్తున వాగ్వాదం చేసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనను పరువు హత్యలుగా పోలీసులు వెల్లడించారు. హత్యకు పాల్పడిన వారు పరారీలో ఉన్నారు. దేశంలో ఇటీవల పెరిగిపోతున్న పరువు హత్యల పట్ల అక్కడి సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. చంపడం ద్వారా కుటుంబ గౌరవం పెదగదంటూ నినాదాలు చేస్తున్నారు. ఒక్క 2015లోనే పరువు హత్యల మూలంగా 1,100 మంది మహిళలు తమ కుటుంబంలోని పురుషుల చేతిలో దారుణంగా హతమయ్యారని హ్యూమన్ రైట్స్ కమిషన్ వెల్లడించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమౌతోంది.