నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం | today honour present for best teachers | Sakshi
Sakshi News home page

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

Published Wed, Sep 7 2016 12:08 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

today honour present for best teachers

– 61 మందికి అవార్డుల ప్రదానం
– ఉదయం 11 గంటలకు సునయనలో కార్యక్రమం
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ నేతత్వంలో సత్కరించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు ఈ విషయం వెల్లడించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగే సత్కారం కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 61 మందిని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశామని, వీరంతా ఉదయం 9 గంటలకే సునయన ఆడిటోరియానికి చేరుకోవాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement