భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే..
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్‌కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.
ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్‌ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది.
ఎవరీ రాధిక సేన్..?
⇒హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్‌లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్‌మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశారు.
⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని UN మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది.
⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం.
⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్‌సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు.
(చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment