అమెరికా ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు ఓ ఎన్నారై వైద్యునికి ప్రతిష్ఠాత్మక అవార్డు అందించారు. బెతెస్డాలోని వాల్టర్ రీడ్ జాతీయ మిలటరీ వైద్య కేంద్రంలో ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా పనిచేస్తున్న రాహుల్ జిందాల్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనకు ఈ అవార్డును ఈనెల 13వ తేదీన వర్జీనియాలోని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల (యూఎస్సీఐఎస్) కేంద్రం ఆధ్వర్యంలో అందజేస్తారు.
వర్జీనియాలోని ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీ వద్ద గల మిలటరీ మహిళా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాహుల్ జిందాల్ జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో క్లినికల్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన ముందుగా అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజిలో ఎండీ చేసి, తర్వాత బ్రిటన్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం అమెరికాలో వైద్యసేవలు అందిస్తున్నారు.
ఎన్నారై వైద్యునికి అమెరికాలో సత్కారం
Published Sat, Nov 9 2013 4:26 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement