సీనియర్ వైద్యులకు సన్మానం
కర్నూలు(హాస్పిటల్): గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సీనియర్ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్ క్లబ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న, కర్నూలు మెడికల్ కాలేజి అధ్యాపకులైన డాక్టర్ జె.వీరాస్వామి(సూపరింటెండెంట్), ఐసీ రెడ్డి, ఉదయ్‌కుమార్, సూర్యనారాయణ(చర్మవ్యాధుల విభాగం), సూర్యనారాయణ, రామకృష్ణ(అనెస్తీషియా), కృష్ణానాయక్, మోహన్‌లాల్‌నాయక్(జనరల్ సర్జరీ), మాధవస్వామి(కార్డియాలజి), ఇందిర(గైనిక్), అబ్దుల్‌గఫూర్(రేడియాలజి), వెంకటకృష్ణ(చిన్నపిల్లల వైద్యులు)లతోపాటు పదవీ విరమణ పొందిన డాక్టర్ ఎస్వీ రంగారెడ్డి, పీబీ కన్నలను సన్మానించారు. ఈ సందర్భంగా ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి. శంకరశర్మ, డాక్టర్ సి. మల్లికార్జున్ మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు చెప్పి ఇంతటి వారిని చేసిన గురువులను సన్మానించుకోవడం సంప్రదాయమన్నారు.