సాక్షి, సినిమా : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్‌కు ప్రత్యేక గౌరవం దక్కింది. స్విట్జర్‌లాండ్‌లో దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో క్రిస్టల్ పురస్కారాన్ని అందుకున్నాడు.
మహిళలు, చిన్నారుల హక్కుల కోసం గణనీయమైన కృషి చేసే వ్యక్తులకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ అవార్డును ఏటా అందజేస్తోంది. మీర్ ఫౌండేషన్ ద్వారా షారూఖ్ తన సేవలను అందిస్తున్నారు. హాలీవుడ్ తారలు కేట్ బ్లాంచెట్, లెజెండరీ సంగీత దర్శకుడు ఎల్టోన్ జాన్‌లతోపాటు షారూఖ్‌కి 24వ క్రిస్టల్ అవార్డును అందుకున్నాడు. ఇక అవార్డు పట్ల డబ్ల్యూఈఎఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన షారూఖ్.. భారత్ తరపున ఈ అంశంపై మరింతగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించాడు. అనంతరం బ్లాంచెట్‌తో స్టేజీపై సెల్ఫీ దిగేందుకు యత్నించి సదస్సులో నవ్వులు పూయించాడు.
చంద్రబాబు విషెస్...
షారూఖ్‌కు క్రిస్టల్ అవార్డు దక్కటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప నాయకుడు అనిపించుకోవాలంటే రాజకీయనేతలే కావాల్సిన అవసరం లేదని.. షారూఖ్‌కు అభినందనలని చంద్రబాబు ట్వీటారు. పలువురు సెలబ్రిటీలు కూడా షారూఖ్ ఖాన్‌ను సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
One need not be a politician to be a great leader and lead the society towards a better tomorrow.
— N Chandrababu Naidu (@ncbn) 23 January 2018
Congratulations @iamsrk on being awarded @wef's 24th crystal award. Your dedicated efforts for Women’s and Children’s rights are commendable.
Comments
Please login to add a commentAdd a comment