- తనను తీసుకెళ్లని బాబు.. లోకేష్
- ఒక్క ప్రాజెక్టుకూడా దక్కించుకోక బిక్క మొహం
- వట్టి చేతులతో తిరిగొచ్చిన తండ్రీకొడుకులు
- లోలోన సంబరపడుతున్న పవన్
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు.. లోకేష్ అక్కడ సీఈవోలు.. టెక్ కంపెనీల పెద్దలతో ఫోటోలు దిగారు.. ఎప్పట్లానే కోట్లు కోట్లు.. పెట్టుబడులు అంటూ ఊదరగొట్టినా ఒక్క ఇటుకబట్టీ.. అతుకుల మిల్లు.. అప్పడాల మిషన్ వంటి చిన్న పరిశ్రమల కూడా రాలేదు.. దీన్ని అటు సోషల్ మీడియాలో యూత్ మీమ్స్.. ట్రోలింగులతో పోస్టింగులు పెడుతుండగా అటు టీడీపీ అనుకూల మీడియా మాత్రం సైలెంట్ ఐంది. ఏపీలో అన్ని ప్రాథమిక ప్రక్రియలు పూర్తయి నిర్మాణం మొదలు కావాల్సిన జిందాల్ స్టిల్స్ మహారాష్ట్రకు తరలిపోయింది. అటు కొత్తగా ఒక్కటీ ఒప్పందం జరగలేదు. దీంతో ఇక ఈ దావోస్ విజయోత్సవాలు ఎలా చేయాలన్నదాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం అనుకూల మీడియా ప్రస్తుతానికి ఆ అంశాన్ని చర్చల్లో ఉంచడం లేదు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన పెద్దగా ఫలితం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం కక్కలేక మింగలేక ఉంటున్నా అటు లోలోన పవన్ కళ్యాణ్ మాత్రం సంబరపడిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్‌ను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. లోకేష్
వాస్తవానికి మొదట్లో బాబుపట్ల అత్యంత వినయవిధేయతలతో ఉన్న పవన్ ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. శాంతిభద్రతలు బాలేవు.. అవసరం ఐతే నేనే హోం శాఖను తీసుకుంటాను.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను అన్నారు.. తిరుమల తొక్కిసలాట మీద కూడా తాను ముందుగా స్పందించి ప్రజలకు ప్రభుత్వం తరఫున సారీ చెప్పడంతోబాటు మీరెందుకు చెప్పరు మీకేం కష్టం.. అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావును సైతం ప్రశ్నించి ఇరుకునపెట్టేసారు.
ఇవన్నీ లోకేష్ ను బాగా ఇరిటేట్ చేశాయని .. పవన్ను కంట్రోల్ చేయాలనీ అయన ప్లాన్ చేస్తున్నారని.. అందుకే తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు లీడర్లతో డిమాండ్లు చేయిస్తున్నారన్న ఫీలర్లు కూడా వచ్చాయి. మొత్తానికి అది సమసిపోగా ఇప్పుడు దావోస్ సదస్సుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు తీసుకెళ్లకుండా బాబు.. లోకేష్ ఇద్దరే వెళ్లారు. సీఎం హోదాలో బాబు.. ఐటి మంత్రిగా లోకేష్ వెళ్లారనుకున్నా పవన్ను సైతం తీసుకెళ్తే బాగుణ్ణని జనసైనికులు ఆశించారు. కానీ అక్కడ కూడా పవన్ వెళ్తే మీడియా మొత్తం ఆయనచుట్టూ ఉంటుందని.. లోకేష్.. చంద్రబాబును పట్టించుకోదని భయంతోనే ఆయన్ను తీసుకెళ్లలేదని అంటున్నారు..
హమ్మయ్య మనకు హ్యాపీ
ఇప్పుడు ఏమీ పెట్టుబడులు లేకుండా తిరిగొచ్చిన లోకేష్.. చంద్రబాబును చూసి పవన్ లోలోన సంతోషపడుతున్నారని అంటున్నారు... తనను పూర్తిగా పక్కనబెట్టేసి అదేదో వాళ్ళ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ అన్నట్లుగా వాళ్లిద్దరే వెళ్లడం.. పవన్ను కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం.. ఒకరకంగా ఆయన్ను అవమానించడమే అని అంటున్నారు. ఐటి గురించి నీకేం తెలీదు.. మేం చాలాసార్లు దావోస్ వెళ్లాం.. అవన్నీ నీకు అర్థం కానీ విషయాలు అన్నట్లుగా పవన్ను చిన్నచూపు చూసి ఆయన్ను వదిలేశారని ఇది చిన్నతనంగా భావించినా ఏమీ మాట్లాడకుండా పవన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు దావోస్ సదస్సు తుస్సుమనడంతో పోన్లే.. మనకు సంబంధం లేని విషయం. వాళ్లిద్దరే వెళ్లారు.. వట్టి చేతులతో తిరిగొచ్చారు.. మనదేం పోయింది.. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అలాగే జరగాలి అని పవన్ లోలోన ఖుష్ అవుతున్నారని అంటున్నారు..
--సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment