US Cities Announce Sri Sri Ravi Shankar Day - Sakshi
Sakshi News home page

Ravi Shankar Day: ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌కు 'అరుదైన గౌరవం'

Published Tue, Aug 1 2023 11:43 AM | Last Updated on Tue, Aug 1 2023 12:51 PM

US Cities Announce Sri Sri Ravi Shankar Day - Sakshi

భారతదేశ ఆధ్యాత్మికతకు అరుదైన గౌరవంగా భావించదగిన చారిత్రాత్మక గౌరవం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ రవిశంకర్‌కి లభించింది. హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు 'రవిశంకర్ దినోత్సవాన్ని' ప్రకటించడంతో అమెరికా కెనడా దేశాలలో రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన నగరాల సంఖ్య 30కి చేరింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న ఏకైక ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కావడం విశేషం. రవిశంకర్ దినోత్సవాన్ని ప్రకటించిన హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్, టెక్సాస్ రాష్ట్రాలు ఒకప్పుడూ యుద్ధ విధ్వంస ప్రాంతాలుగా ఉండేవి.

ఆ ప్రాంతాలల్లో గురుదేవ్ చేసిన శాంతి కృషిని ప్రశంసించిన టెక్సాస్ గవర్నర్ ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా అమెరికా, కెనడాలలోని 30నగరాలలో ఈ గౌరవం పొందిన మొట్టమొదటి, ఏకైక భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ రవిశంకర్‌. జూలై 30, 2023, బెంగళూరు: భారతీయ ఆధ్యాత్మిక చరిత్రకు గర్వకారణమైన పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, రవిశంకర్కు గౌరవసూచకంగా దినోత్సవాలు జరుపుకుంటున్న అమెరికా, కెనడా నగరాలు, రాష్ట్రాల సంఖ్య 30కి చేరింది. ఇప్పటికే 27 నగరాలలో ఈ దినోత్సవాలు ప్రకటించగా తాజాగా హోవార్డ్ కౌంటీ, మేరీల్యాండ్; టెక్సాస్ రాష్ట్రాలు ఈ ఉత్సవాలకు తేదీలను ప్రకటించాయి.

ఈ గౌరవం లభించిన మొదటి, ఏకైక ఆధ్యాత్మిక నాయకుడు రవిశంకర్‌ కావడం గమనార్హం. సేవాదృక్పథంతో, శాంతి, ఆనందాలను వ్యాపింపజేస్తూ వివాదాల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, భిన్న దృక్పథాల మధ్య తీవ్రమైన అంతరాలు ఏర్పడుతున్న నేటి సమాజాన్ని ఏకీకృతం చేసే దిశగా గురుదేవ్ మార్గదర్శకత్వంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకుగాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, "తాము నమ్మిన మార్గంపై గల అకుంఠిత విశ్వాసంతో గురుదేవ్ రవిశంకర్‌, వారి అనుచరగణం ప్రపంచంలోని అనేక యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ధైర్యంగా పర్యటించి..కరుడుగట్టిన ఖైదీలతో సైతం చర్చించి, వారికి మార్గనిర్దేశం చేయగలిగారు.

ఏ మాత్రమూ సరిదిద్దలేమని అనుకునే విభేదాలను సైతం పరిష్కరించగలిగారు.” అని ప్రశంసించారు. మేరీల్యాండ్‌లోని హోవార్డ్ కౌంటీ చేసిన కార్యనిర్వాహక ప్రకటనలో, "ప్రపంచ మానవతావాది, ఆధ్యాత్మిక నాయకుడు, శాంతి దూత, ప్రపంచంలో పరివర్తన తేగలిగే వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన శ్రీశ్రీ... అభిప్రాయ భేదాలతో విభిన్న ధృవాలుగా చీలిపోయి, దూరాలు పెరిగిపోయిన నేటి ప్రపంచ స్థితిలో గురుదేవ్ శ్రీశ్రీ మన సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి, ఐక్యత, ఆశావహ దృక్పథాల ద్వారా వ్యక్తిగత, సామాజిక స్థాయిలలో స్వీయ పునరుద్ధరణ ద్వారా సమైక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు..." అని పేర్కొన్నారు. హోవార్డ్ కౌంటీ జూలై 22వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ డే గా ప్రకటించింది. ఆధ్యాత్మికత మరియు సేవా మార్గాల ద్వారా ప్రజల జీవితాలను మార్చడానికి ఈ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న అపారమైన సహకారాన్ని గుర్తిస్తూ టెక్సాస్, బర్మింగ్‌హామ్ వరుసగా జూలై 29, జూలై 25వ తేదీలను శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించాయి.

అమెరికాలో శ్రీశ్రీ పర్యటన సందర్భంగా ఆయా నగరాలలో గురుదేవ్ కు ఘనస్వాగతం లభించింది. జాతి, కుల, స్థాయీ, లింగభేదాలకు అతీతంగా ఆయా ప్రాంతాలలో హాజరైన వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి శ్రీశ్రీ ప్రసంగించి, తమ మనసులోతులలోనికి తీసు కొనిపోయే శక్తివంతమైన ధ్యానక్రియలను వారిచే చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ ప్రవచనాలతో కూడిన ‘నోట్స్ ఫర్ ది జర్నీ విదిన్’ (అంతరంగ ప్రయాణానికి సూచనలు) అనే పుస్తకాన్ని ఆయా నగరాలలో విడుదలచేశారు. నిజాయితీగా అన్వేషించే సాధకులకు తమ దైనందిన జీవన సమస్యల నుండి, ఆధ్యాత్మికత వరకూ ఎదురయ్యే సార్వజనీనమైన ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానాలు ఇస్తుంది. శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఒక మానవతావాదిగా శ్రీశ్రీ చేసిన ప్రయత్నాలకుగాను అమెరికాలోని కౌంటీ ఆఫ్ అల్లెఘేనీ గత నెలలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను గౌరవించిన విషయం విదితమే.

ఆ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రంలో ‘... స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాలద్వారా వివిధ వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, నగరాలలో పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టడానికి గురుదేవ్ చేస్తున్న ప్రయత్నాలు, వారు విభిన్న సంస్కృతులు, జాతుల మధ్య సంఘర్షణలను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మాత్రమే పోల్చదగ్గవి.’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్ లోని ప్రఖ్యాత నేషనల్ మాల్ లో ఘనంగా జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల కోసం శ్రీశ్రీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద సమావేశాలలో ఒకటిగా పేర్కొనదగ్గ జనసమూహానికి శ్రీశ్రీ స్వయంగా మార్గదర్శనం చేస్తారు. ఉత్సవాలలోభాగంగా ప్రపంచవ్యాప్త కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

(చదవండి: కెనడాలో ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement