
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ ప్రకారమే నడుచుకుంటామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న మంత్రి నారా లోకేష్ తీరు.. ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ బహిరంగ బెదిరింపులు చాలదన్నట్లు .. మరోవైపు అధికార దర్పం ప్రదర్శిస్తోంది నారావారి కుటుంబం. తాజాగా..
మంత్రి నారా లోకేష్ ఇంట్లో స్వాతంత్ర దినోత్స కార్యక్రమం జరిగింది. ఆయన భార్య నారా బ్రాహ్మణి జెండా ఎగరేశారు. అయితే అంతకు ముందు.. పోలీసుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారామె. ఆమె మాత్రమే కాదు.. తనయడు దేవాన్ష్‌కు కూడా పోలీసులు గౌరవ వందనం చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రికి తప్ప పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఎవరికీ ఇవ్వరు. అలా చేయడం నిబంధనలకు ఇది విరుద్ధమని రిటైర్డ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇలా రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని వాళ్లు అంటున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నివాసంలో జాతీయ జెండా ఎగుర వేయడం జరిగింది.#HappyIndependenceDay2024 pic.twitter.com/j6ZVid3QtF
— Brahmani Nara (@brahmaninara) August 15, 2024