nara brahmani
-
హీరోయిన్గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ, నో చెప్పింది: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
ఏయ్..మా మామ సీఎం..
-
Nara Family: అధికార దర్పమా?
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ ప్రకారమే నడుచుకుంటామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న మంత్రి నారా లోకేష్ తీరు.. ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ బహిరంగ బెదిరింపులు చాలదన్నట్లు .. మరోవైపు అధికార దర్పం ప్రదర్శిస్తోంది నారావారి కుటుంబం. తాజాగా..మంత్రి నారా లోకేష్ ఇంట్లో స్వాతంత్ర దినోత్స కార్యక్రమం జరిగింది. ఆయన భార్య నారా బ్రాహ్మణి జెండా ఎగరేశారు. అయితే అంతకు ముందు.. పోలీసుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారామె. ఆమె మాత్రమే కాదు.. తనయడు దేవాన్ష్‌కు కూడా పోలీసులు గౌరవ వందనం చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రికి తప్ప పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఎవరికీ ఇవ్వరు. అలా చేయడం నిబంధనలకు ఇది విరుద్ధమని రిటైర్డ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని ఇలా రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని వాళ్లు అంటున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ నివాసంలో జాతీయ జెండా ఎగుర వేయడం జరిగింది.#HappyIndependenceDay2024 pic.twitter.com/j6ZVid3QtF— Brahmani Nara (@brahmaninara) August 15, 2024 -
నారా బ్రాహ్మణి మైండ్ గేమ్: బండి పుణ్యశీల
సాక్షి, విజయవాడ: నారా బ్రాహ్మణి ఆదేశాలతో ఐ టీడీపీ పనిచేస్తోందని, బ్రాహ్మణి మహిళ అయ్యి ఉండి సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర ప్రచారానికి తెరలేపిందని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల మండిపడ్డారు. సోషల్ మీడియాలో సీఎం సభ్యులపై ఐ టీడీపీ పెడుతున్న అసభ్యకర పోస్టింగ్‌లపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు ఆమె ఫిర్యాదు చేశారు. విజయవాడ సీపీ కాంతి రానా టాటాకు ఫిర్యాదు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను పుణ్యశీల కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని, బ్రాహ్మణి మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో ఉండగా బ్రాహ్మణి చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తోంది. మామను మించిన కోడలిగా బ్రాహ్మణి తన తండ్రిని దూరం పెట్టింది. చంద్రబాబు జైలుకు వెళ్లాక బాలకృష్ణ ఎక్కడ పార్టీని నడిపిస్తారో అని బ్రాహ్మణి ముందుకు వచ్చింది. సీఎం జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది’’ అని పుణ్యశీల పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? -
నారా భువనేశ్వరి, బ్రాహ్మణిపై మంత్రి బొత్స కామెంట్స్
-
నోరు జారిన బ్రాహ్మణి..మా ఫ్యామిలీ ఇంతే..
-
స్పందనేది ‘బాబూ’!
సాక్షి, అమరావతి : చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది. రాత్రి 7 గంటలకు ప్రజలంతా ఇళ్లలో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలపాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు అసలు పట్టించుకునే లేదు. ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతోందనే విషయం కూడా చాలామందికి తెలియదు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్, అక్కడక్కడ కొందరు నేతలు, కొంతమంది మద్దతుదారులు ఇళ్లలో లైట్లు ఆర్పి, కొవ్వొత్తులు వెలిగించి సోషల్ మీడియాలో హంగామా చేశారు తప్ప ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా స్పందించలేదు. అవినీతి చేసినందువల్లే చంద్రబాబు అరెస్టయి జైలుకు వెళ్లారని జనం నమ్మడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుపై ఏమాత్రం సానుభూతి లేదని ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనే చెబుతోందని అంటున్నారు. బాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ప్రజల నుంచే కాదు పార్టీలోనే స్పందన కనిపించలేదు. బయటకు వచ్చి ఆందోళనలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన బంద్‌తో సహా ఏ కార్యక్రమానికీ జనం నుంచి స్పందన రాలేదు. దీపాలు వెలిగించి భువనేశ్వరి నిరసన.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి లోకేశ్, బ్రాహ్మణి సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ‘కాంతితో క్రాంతి’ పేరుతో శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు రాజమహేంద్రవరంలోని లోకేశ్ శిబిరంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మహిళా నేతలు దీపాలు వెలిగించారు. అంతకు ముందే నారా లోకేశ్, బ్రాహ్మణి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. కాగా, బాబు జ్యుడిషియల్ రిమాండ్ 27వ రోజుకు చేరింది. -
నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిపై కొడాలి నాని సెటైర్లు
-
నేడు మూలాఖత్ లో చంద్రబాబును కలవనున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి
-
బ్రాహ్మణి ప్రకటనపై KSR స్ట్రాంగ్ కౌంటర్
-
బ్రహ్మణీ ముందు అది తెలుసుకో..బాలకృష్ణ కూతురివి అయితే ఎవడికి గొప్ప
-
మరోసారి బయటపడ్డ అయ్యన్నపాత్రుడి నోటి దురద
-
చంద్రబాబు, లోకేష్ బాటలోనే నారా బ్రాహ్మణి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ అని ఆయన విమర్శకులు తరచూ చెబుతుంటారు. ఆ బాటలోనే ఆయన కుమారుడు లోకేష్ కూడా నడుస్తుంటారు. వారికి తోడుగా ఇప్పుడు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా అసత్యాలు చెప్పడానికి పోటీ పడుతున్నట్లుగా ఉంది. ఆమె స్వయంగా చేశారో.. లేక ఆమె తరపున ఎవరైనా చేశారో కాని.. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవాటిని తరిమేశారని ఒక ప్రకటన వచ్చింది. దానికి ఆమె లులూ సంస్థ హైదరాబాద్ లో పెట్టిన ఒక మాల్‌ను చూపుతున్నారు. అలాగే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా సంస్థ తెలంగాణలో పెట్టుబడుల ప్రతిపాదనలు చేయడం. అయితే.. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఆమె చెప్పే విషయాలను వినబుద్ది అవుతుంది. అబద్దాలు ఆడడంలో మామ చంద్రబాబుకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది నారా బ్రాహ్మణి. లులూ కంపెనీ విశాఖలో ఒక మాల్ పెడతామని ముందుకు వచ్చినా, చంద్రబాబు ప్రభుత్వ టైమ్ లో ఎందుకు పెట్టలేకపోయారో ఆమె వివరించగలగాలి. ఆ సంస్థవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మాల్ పెట్టుకున్నారా?.. లేదంటే వాళ్ల సొంత స్థలంలో లేదంటే ఒక మూత పడ్డ మాల్ స్థానే పెట్టారా?.. మాల్ పెడితే పరిశ్రమలు వచ్చేసినట్లే చెప్పాలనుకుంటే, జగన్ ప్రభుత్వ హయాంలో.. ఏపీలో రామాయపట్నం వద్ద శరవేగంతో ఒక ఓడరేవు నిర్మాణం అవుతోంది. వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తోంది. మరి దానిని ఏమనాలి?. విశాఖపట్నంలో ఒక భారీ డేటా సెంటర్ వస్తోంది. ఇన్ఫోసిస్ శాఖ వస్తోంది. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ , కర్నూలులో గ్రీన్ ఎనర్జీ ..ఇలా అనేకం వస్తుంటే.. బ్రాహ్మణికి హైదరాబాద్‌లో పెట్టిన లులూ మాల్ గొప్పదిగా కనిపిస్తోంది. ఇది.. చూసే కళ్లను బట్టి ఉంటుంది. ✍️ఇక జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీని ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని చెప్పారు? ఆ మాటకు వస్తే ఆయన చంద్రబాబు టైమ్‌లో ఎందుకు ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదో బ్రాహ్మణి చెప్పగలరా? అంతెందుకు.. అసలు తమ కంపెనీ హెరిటేజ్ ను చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీలో ఎందుకు విస్తరించలేదు?. కొత్త ప్లాంట్లు పెట్టలేదు?. కేవలం అమరావతి రాజధాని లో తమకు అనుకూలంగా రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించి తాము కొన్న భూముల విలువ పెంచుకోవడానికి ప్రయత్నించారే తప్ప.. ఏపీలో ఏమైనా కొత్తగా హెరిటేజ్ పరిశ్రమ యూనిట్ పెట్టారా?. ఆమె అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలలో వచ్చే చెత్త కధనాల ఆధారంగా వ్యాఖ్యానించినట్లు అర్ధం అవుతుంది. ✍️ఆ మీడియానే చంద్రబాబును, లోకేష్ ను ముంచాయి. ఇప్పుడు బ్రాహ్మణి వంతు వచ్చినట్లుంది. ఆమె మేలుకోకపోతే ఆమెకే నష్టం అని చెప్పాలి. బ్రాహ్మణి పేరుతో ఈనాడు మీడియా ప్రకటన రాయడం , ఆ తర్వాత వారి సొంత పైత్యాన్ని జోడించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం చేసేసింది. చంద్రబాబు టైమ్ లో పరిశ్రమలకు స్వర్గమట. ఇప్పుడు కాదట. అప్పుడు వచ్చిన ఒక కియా పరిశ్రమ తప్ప ఇంకో పేరు చెప్పే పరిస్థితి లేదు. కియా కు కూడా టిడిపి ప్రభుత్వం రెండువేల కోట్లకు పైగా రాయితీలు ఇచ్చిన సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు. తెలంగాణలో వంద కోట్ల పెట్టుబడి వచ్చినా మొదటి పేజీలో ప్రముఖంగా అచ్చేయడం, ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి వచ్చినా దానిని కనిపించకుండా రాయడం, పైగా శాపనార్ధాలు పెట్టడం ఈనాడుకు అలవాటైపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పిన చంద్రబాబు వల్ల.. ఏపీకి నష్టం జరగలేదట. అయినా పరిశ్రమలు వచ్చేశాయట. అబద్దాలు రాయడానికి కూడా అంతు ఉండాలి! ✍️విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఈనాడులో వచ్చిన కదనం చదివితే ఆంధ్రప్రదేశ్ పై ఎంత ద్వేషంతో ఈ మీడియా ఉన్నదీ అర్దం అవుతుంది. విదేశీపెట్టుబడులు ఎపి కంటే తెలంగాణకు పది రెట్లు ఎక్కువ అంటూ తాటికాయంత హెడ్డింగ్ పెట్టి ఈనాడు పత్రిక తన వికృతానందాన్ని ప్రకటించుకుంది. ఎంత సేపు ఆంధ్రప్రదేశ్ పై పడి ఏడవడం, శాపనార్దాలు పెట్టడం నిత్య కృత్యాలుగా చేస్తున్న ఈనాడు.. ఈ వార్త రాయడానికి మాత్రం ఎంత సంతోషపడి ఉంటుందో. దీనిలోనే వారి రాక్షసత్యం కనిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంత , అసలు ఇలా విశ్లేషించవచ్చా? అనేవాటిని పక్కనపెడితే ఆ వార్త రాసిన తీరు చూస్తే ఏపీలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రజల మెదడులో విషం నింపే యత్నం చేసింది. ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు అంటే కేవలం విదేశీపెట్టుబడులే కాదు. స్వదేశీ పెట్టుబడులు కూడా లెక్కే. కాని ఈనాడు కావాలని ఈ దిక్కుమాలిన వార్త ఇచ్చింది. ఈ మధ్యనే ఒక సమాచారం వచ్చింది. పెట్టుబడుల విషయంలో ఏపీ ముందంజలో ఉందన్నది దాని సారాంశం. తెలంగాణ కన్నా, కొన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అధికంగా వస్తున్నట్లు కేంద్రమే తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ లో ఏపీ నెంబర్ ఒన్ స్థానాన్ని గత మూడేళ్లుగా పొందుతోంది.ఈ వార్తను తన మీడియాలో ఎన్నడైనా రాసిందా? అది రాయడానికి చేతులు రాని ఈనాడుకు ఈ విదేశీపెట్టుబడుల గురించి రాసే నైతిక హక్కు ఉంటుందా? కేవలం ద్వేషంతో ఈ వార్త వండారని తెలుస్తూనే ఉంది. ✍️ఇదే వార్తలో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మహారాష్ట్రలో 36634 కోట్ల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తెలంగాణకు 6829 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఈనాడు ఎపిపై రాసినట్టుగా ఈ రెండు రాష్ట్రాల పెట్టుబడులను ఎందుకు పోల్చలేదు. తెలంగాణకన్నా ఆరు రెట్లు అదనంగా మహారాష్ట్రకు పెట్టుబడులు వస్తున్నాయని ఎందుకు రాయలేదు. నిజానికి అలాంటి పోలికలు సరికాదు. మొత్తం సంవత్సరం అయిన తర్వాత ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందన్నది రాస్తే రాయవచ్చు. అలాగే మొత్తం అన్ని రకాల పెట్టుబడులు కలిపి ఏ విదంగా ఉన్నాయన్నది కథనంగా ఇవ్వవచ్చు. కాని ఈనాడు మాత్రం ఏపీ ద్వేషంతో ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. మొదటి ఆరు నెలల ప్రతిపాదనలను చూస్తే మహారాష్ట్ర కు 69870 కోట్లు వస్తే, డిల్లీకి 27680 కోట్లు,కర్నాటకకు 25680 కోట్లు గుజరాత్ కు 10702 కోట్లు, హరియానాకు 8904 కోట్లు, తెలంగాణకు 8655 కోట్ల ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు.. ఆ తర్వాత స్థానం తమిళనాడు ఉంది. రాష్ట్రాల మధ్య దీనిని పోల్చి చూస్తే తెలంగాణకన్నా మహారాష్ట్ర ఏడురెట్లు, డిల్లీ మూడు రెట్లు, కర్నాటకకు దాదాపు మూడు రెట్లు అధికంగా విదేశీపెట్టుబడులు వస్తున్నట్లు అంచనా వేశారు. మరి ఆ సంగతిని ఎందుకు పోల్చి చెప్పలేదు. కేవలం తెలంగాణ, ఏపీల మధ్యనే విదేశీ పెట్టుబడులపైనే ఎందుకు పోల్చారు?అంటే దానర్దం జగన్ ప్రభుత్వంపై ఉన్న అక్కసే అని వేరే చెప్పనవసరం లేదు.. ఇక్కడితో ఆగలేదు. టీడీపీ హయాంలో బాగా విదేశీపెట్టుబడులు వచ్చినట్లు కూడా ఈ పత్రిక ప్రచారం చేసింది. తీరా చూస్తే ఆ పెట్టుబడుల వివరాలు ఇవ్వకుండా ఏదో శాతం అంటూ సరిపెట్టింది. అంటే అప్పుడు వచ్చిన పెట్టుబడుల వాస్తవ అంకెను ఇస్తే అసలు విషయం అర్దం అయిపోతుందని, టిడిపి పాలన బండారం బయటపడుతుందని ఈనాడు భావించి ఉండాలి. విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకు ఆ స్థాయిలో రావడానికి, ఇతర రాష్ట్రాలకు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పారిశ్రామిక వాతావరణం ఉన్న తమిళనాడు కూడా ఎందుకు వెనుకబడిందన్నదానిపై విశ్లేషణ చేయాలి. అవేవి చేయకుండా గుడ్డ కాల్చి ఎపిపై ఈనాడు పడేసింది. ✍️అన్నిరకాల పెట్టుబడులు పరిశీలిస్తే ఏపీకి సుమారు రూ. 25 వేల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. అప్పుడు తెలంగాణకు చాలా తక్కువ పెట్టుబడి వచ్చినట్లు ఆ వివరాలు వెల్లడించాయి.అంత మాత్రాన తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని కాదు. తెలంగాణలో హైదరాబాద్ ఉండడం కీలక విషయం. ఆ నగరం చుట్టూరా ఐటి ,ఇతర సాప్ట్ తరహా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి వేయించిన రింగ్ రోడ్డే మూలకారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉంది. అందువల్ల ఇక్కడకు రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అధికంగా వస్తున్నాయి. ఏపీలో కొత్తగా నాలుగు ఓడ రేవులు నిర్మాణం అవుతున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. వాటన్నిటిని పెట్టుబడుల కింద చూడరా?ఈ ఓడరేవుల ఆధారంగా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. కొత్తగా కొప్పర్తి వద్ద పారిశ్రామిక క్లస్టర్ వస్తోంది. విశాఖలో డేటా సెంటర్ పదిహేనువేల కోట్ల పెట్టుబడితో వస్తోంది.కడప జిల్లాలో 8800 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి అయింది. శ్రీ సిటీలో ఎసి యూనిట్లు వచ్చాయి. అచ్యుతాపురంలో కొత్త ఫార్మా యూనిట్లు వస్తున్నాయి. మరి ఇవేవి తెలంగాణలో ఏవి అని ఎవరైనా అడిగితే అది తెలివి తక్కువతనం అవుతుంది.ఎందుకంటే తెలంగాణకు తీర ప్రాంతం లేదు. ✍️అలాగే ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదు. అంత ఖాళీ ప్రదేశం ఉండదు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. అయినా దానికి తగిన విదంగానే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి.విశాఖలో ఇన్ ఫోసిస్ తన కార్యకలాపాలు ఆరంభిస్తోంది. అలాగే మరికొన్ని ఐటి యూనిట్లు వస్తున్నాయి. ఐటి రంగం కోసం ఒకప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. నిజమే ..ఇంకా ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తే బాగుంటుందని రాస్తే ఫర్వాలేదు. కానీ, ఏపీని అవమానించే విధంగా అబద్దపు వార్తలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఇదంతా కక్ష తప్ప ఇంకొకటికాదు. ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులు కారు. ఈ మీడియాలో వచ్చే వార్తలనే చంద్రబాబు, లోకేష్ లు ప్రచారం చేస్తుంటారు. సరిగ్గా అదేదారిలో బ్రాహ్మణి కూడా నడుస్తున్నట్లుగా ఉన్నారు. భర్త,మామ మాదిరి తన పరువు కూడా పోగొట్టుకుంటారా?లేక హేతుబద్దంగా మాట్లాడి విలువ నిలబెట్టుకుంటారా?అన్నది ఆమె ఇష్టం. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఏపీకి ఇద్దరు గాంధీలు.. చంద్రబాబు, లోకేష్: పోసాని సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరే కారణమని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. ఆ మాటలు విని షాక్‌కు గురైనట్లు తెలిపారు. చంద్రబాబుకు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టిందని దుయ్యబట్టారు. తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి ఏం అనలేదు భువనేశ్వరి కోసం ఎన్టీఆర్ చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు. ఇందుకు ఎన్టీఆర్ టీడీపీ సీనియర్ నేతలను ఒప్పించారని గుర్తుచేశారు. అంత సాహసం చేసి బాబును పార్టీలోకి తీసుకొచ్చిన తండ్రిపై చెప్పులు వేయించినా భువనేశ్వరి చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. భారతదేశానికి ఒకరే గాంధీ. కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారని.. ఒకరు చంద్రబాబు మరొకరు లోకేష్ అంటూ సెటైర్లు వేశారు. భర్తలను మించిన రాజకీయ నాయకురాళ్లు భర్తలను మించిన రాజకీయ నాయకురాలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి, బ్రహ్మణిలను ఉద్ధేశిస్తూ పోసాని వ్యాఖ్యానించారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లని ఎద్దేవా చేశారు. భర్తలను తిట్టారనే విషయం మర్చిపోయి... వచ్చే ఎన్నికల్లో అత్తాకోడళ్లు పవన్ మద్దతు కోరారని విమర్శించారు. జ్యూస్ ఇవ్వగానే టీడీపీకి మద్దతు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీ వెళ్ళేటప్పుడు మనకేం కర్మ అని భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదు?. చంద్రబాబు దొంగ అని ఆనాడే నాదేండ్ల భాస్కర్ రావు అన్నారు. తండ్రిని చెప్పుతో కొడితే భువనేశ్వరి చుక్క కన్నీరు కార్చలేదు. సమసామాజిక స్థాపన పేరుతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారు. ఆనాడు ఒకమాట ఇవాళ మరో మాట మాట్లాడుతున్నారు. ఆయన అమాయకుడు. భువనేశ్వరి, బ్రహ్మని జ్యూస్ ఇవ్వగానే టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే.. అభయం ఇచ్చేశాడు. చదవండి: పవన్ ఫ్లాప్.. చంద్రబాబు జిమ్మిక్కే! అభివృద్ధి చేసిన వాళ్ళను గెలిపించండి పవన్‌కు వ్యక్తిత్వం ఉంటే పోటీలో ఒంటరిగా నిలబడాలి. సీఎం జగన్ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. అందుకే కులం, మతం లేదు. పవన్ వైస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి.. తనకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలి తనను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తానని పదేళ్లలో ఎక్కడైనా చెప్పారా?. వైఎస్ జగన్ మొదటి రోజు నుంచి ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడారు. పవన్ కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా చెప్పలేదు. కాపులు ఎవరికైనా ఓట్లు వేయండి చంద్రబాబుకు తప్ప. మీరు ఎవరి మైకంలోకి వెళ్ళకండి. ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించండి. ఇప్పటికే చాలా సార్లు మోసపోయారు. ఇక భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కావొద్దు. అప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? వైఎస్ జగన్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? సత్యమేవ జయతే కాదు. అసత్యమేవ అజయతే అని బోర్డు పెట్టుకోవాలి. హెరిటేజ్ పెట్టింది మా సినిమా లెజెండ్ కానీ ఇప్పుడు నారావారి అధీనంలో ఉన్నది. పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే కొటేషన్ చంద్రబాబుకు కరెక్ట్‌గా సరిపోతుంది. చంద్రబాబును చెప్పుతో కొట్టినప్పుడు ఈ సత్యమేవ జయతే దీక్షలు ఎక్కడికి పోయాయి? జయప్రద లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా? ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు. సీఎం జగన్ ఏనాడు కోర్టును ప్రశ్నించలేదు’ అని పోసాని పేర్కొన్నారు. -
బ్రాహ్మణి, కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పంచులు
-
జగన్ గురించి మాట్లాడితే మర్యాద దక్కదని ఆర్కే రోజా వార్నింగ్
-
బాలకృష్ణ, చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి..?: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు జిల్లా: రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఊదరగొట్టుకుంటూ, పచ్చ ఛానెళ్లల్లో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు పేదల కోసం.. ఒక్క మంచి ఆలోచన అయినా చేశాడా..? అంటూ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అదే మా నాయకుడు జగనన్న అతిచిన్న వయసులోనే పోరాడే యోధుడిగా నిలిచి, రాష్ట్రంలో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ‘‘ఆయన అంత చిన్నవయసులోనే ప్రజలకు ఏం కావాలో.. వారికి ఏ ఇవ్వాలో ఆలోచించి వారి సంక్షేమానికి, వారి ఆరోగ్యం కోసం జగనన్న సురక్ష పేరిట ప్రతి ఇంటి గడప దగ్గరకే వైద్యాన్ని తెచ్చిన మహనీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడి, షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు ప్రజాధనం స్వాహా చేశాడు’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చొంటే, ఈరోజు ఆయన భార్య,కోడలు బ్రాహ్మణి సిగ్గులేకుండా.. ప్రజలంతా గంటకొట్టి తమకు సంఘీభావం తెలపండని కోరతారా..?. బ్రాహ్మణికి బహుశా అసలు సైకోలు ఎవరో తెలియక ట్వీట్లు పెడుతున్నారనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద సైకోలెవరంటే, ఒకరు మీ నాన్న బాలకృష్ణ కాగా మరొకరు మీ మామ చంద్రబాబు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘మీ నాన్న, మీ మామకు అడ్రస్ కల్పించి, సమాజంలో గౌరవాన్ని అందించిన మీ తాత ఎన్టీ రామారావు గారిపై చెప్పులేసి.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి.. ఆయన పార్టీని లాక్కుని చివరికి ఆయన చావుకు కారణమైన పెద్దసైకోలెవరంటే.. అది బాలకృష్ణ, చంద్రబాబు అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. తప్పుచేసి, సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుకి పోయిన తర్వాత కూడా చంద్రబాబు కుటుంబం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం చాలా సిగ్గుచేటు. మరోసారి, సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ట్వీట్లు పెట్టినా నారా బ్రాహ్మణికి మర్యాద దక్కదు. మీరు ఇలాగే నీచమైన మాటలతో ప్రజల్ని అమాయకుల్ని చేయాలనుకుంటే మిమ్మల్ని హైదరాబాద్‌కే పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ధిచెబుతారు’’ అంటూ మంత్రి రోజా హెచ్చరించారు. చదవండి: మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ -
నారా బ్రాహ్మణికి చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చిన ఎమ్మెల్సీ కళ్యాణి
-
Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest: Petitions in different courts - Live Updates 5:10 PM, సెప్టెంబర్ 27, 2023 కిం కర్తవ్యం.? ► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు ► పారని లీగల్ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు ► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్‌కు సూచించిన ఎంపీలు ► ఆంధ్రప్రదేశ్‌కు వస్తే లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు ► లోకేష్ వెళ్లగానే అరెస్ట్ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు ► ముందస్తు బెయిల్‌కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు ► వెళ్లి అరెస్ట్ అయ్యేకంటే ఇక్కడే హోటల్లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్ 4:50 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టు : బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అక్టోబర్ 4న నిర్ణయం ► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా ► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం ► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన ►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి 4:25 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్ పొన్నవోలు ► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు ► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం ► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి ► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు ► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు ► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం ► పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు? ► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు? ► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి ► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి ► ఎంతకాలం పిటిషన్‌ను పెండింగ్ లో ఉంచాలి? ► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి 4:20 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID ► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది ► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు ► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు ► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు ► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు 4:05 PM, సెప్టెంబర్ 27, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు ► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్ చేయమని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం 3:30 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు ► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ 3:20 PM, సెప్టెంబర్ 27, 2023 రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్ వద్దు : అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు ► వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్ ► స్కిల్, ఇన్నర్ రింగ్‌రోడ్ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి ► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు ► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు ► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్ జనరల్ శ్రీరాం 3:00 PM, సెప్టెంబర్ 27, 2023 "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా 2:45 PM, సెప్టెంబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". 2:35 PM, సెప్టెంబర్ 27, 2023 నాట్ బిఫోర్ : సుప్రీంకోర్టు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ► చంద్రబాబు పిటిషన్‌పై "నాట్ బిఫోర్ మి" అని స్పందించిన జస్టిస్ SVN భట్టి ► మరో బెంచ్‌కు పిటిషన్‌ను మార్చాల్సిన అవశ్యకత ► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్ భట్టి ► బాబు పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 2:15 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్ నెంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కొద్దిసేపట్లో విచారణ ► చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► కిక్కిరిసిన హాల్ నెంబర్ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు ► బెంచ్ మీదకు వచ్చిన కేసు 2:10 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్ నెంబర్ 3 ► మరికొద్దిసేపట్లో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు ► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► ఐటం నెంబర్ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్ ► స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 12289/2023 ► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్ గుంటూరు ప్రమోద్ ► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్ ► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► Follow www.sakshi.com LIVE updates 1:56 PM, సెప్టెంబర్ 27, 2023 బాబు దోచుకుంటే.. జగన్ ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్ ► స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు ► చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు. ► ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు ► సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు ► 26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారు ► సీఎం జగన్.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు 1:10 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► అరెస్ట్ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్రను తేల్చిన CID ► లోకేష్‌కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID ► తనను అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్ 1:00 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్ ► లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ ► లంచ్ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి ► మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ ► ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ 12:50 PM, సెప్టెంబర్ 27, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:40 PM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ జోలికి రావొద్దు : తెలుగుదేశం ► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం ► లోకేష్‌ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్ ► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు ► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం ► ఆఘమేఘాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టిన పంచుమర్తి అనురాధ ► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు ► హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు ► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి ► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP ► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP 12:10 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ? ► కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై CID, బాబు లాయర్ల వాదనలు ► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు ► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు ► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన ► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి 11:40 AM, సెప్టెంబర్ 27, 2023 కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 11:30 AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్ ► వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు ► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు ► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు ► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు 11:15AM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు ► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్ వివేకానంద ► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి 11:10AM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్లో నేడు వాదనలు జరిగే అవకాశం ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► అరెస్ట్ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► 17A సెక్షన్ ప్రకారం గవర్నర్‌కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు ► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు ► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు ► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ ► రేపటి నుంచి అక్టోబర్ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 11:00AM, సెప్టెంబర్ 27, 2023 ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు ► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు ► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 10:50AM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ►ఇప్పటికే బెంచ్‌ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ ►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్ ►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు ►మరో బెంచ్‌కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్ నెంబర్ 38371/2023 కేటాయింపు ►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి ►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి ►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయి ►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం ►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది ►ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు పిటిషన్ 10:30AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటం నెంబర్ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 10:00AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి ►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ ►ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కొట్టివేత కూడా ► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదైన స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలని పిటిషన్ ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి.. నేడు విచారణ 09:22AM, సెప్టెంబర్ 27, 2023 ముందు ఏ పిటిషన్‌పై విచారణ? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారుల పిటిషన్ ►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ ►లోకేష్ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం.. 09:10AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్‌లపై చర్చ ►ఏపీ అసెంబ్లీ సెషన్.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. ►అలాగే శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపైనా చర్చ జరగనుంది 08:55AM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే ►ఇన్నర్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా ►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు ►ఇన్నర్ రింగ రోడ్ అలైన్మెంట్ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 08:00AM, సెప్టెంబర్ 27, 2023 తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి ►తండ్రి ఎలాగో కొడుకు అలాగే! ►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి. ►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి. ►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి ►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది. Like father, Like son! Meet Nara Lokesh A14 in the Inner Ring Road scam. While in Delhi he should offer a buy-one-get-one-free scheme to the lawyers he is meeting. Take up the father’s case and you’ll get the son's case for free. This father-son duo’s game is now over. pic.twitter.com/JIhpnXrA8R — Vijayasai Reddy V (@VSReddy_MP) September 27, 2023 06:52AM, సెప్టెంబర్ 27, 2023 క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ ►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 06:52AM, సెప్టెంబర్ 27, 2023 నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 06:45AM, సెప్టెంబర్ 27, 2023 నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ ►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు ►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 06:44AM, సెప్టెంబర్ 27, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 06:00AM, సెప్టెంబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
పవన్ కల్యాణ్ ఎక్కడ?: నారా బ్రహ్మణి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ-జనసేన పొత్తు ప్రయాణం ఇరు పార్టీల కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తోంది. తాజాగా జనసేన నేత నాగబాబు ముందే ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా.. టీడీపీతో ప్రయాణం తప్పదన్నట్లు ఆయన కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉంటే.. జనసేన నేతలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి జరిపిన సమావేశంలో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం విద్యానగర్‌లో లోకేశ్ క్యాంపు వద్ద ఆయన భార్య బ్రాహ్మణితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్కడ? అని జనసేన నేతలను ఉద్దేశించి బ్రాహ్మణి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు నేతలు. ఏకంగా తమ అధినేత ఎక్కడంటూ నేరుగా ఆమె అడగడం గురించి వాళ్లు గుసగుసలాడుకున్నారు. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె అవునా.. అన్నట్లు తలవూపారు. ఇక ఉమ్మడి పోరాటంలో టీడీపీ తమకు మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని జనసేన నేతలు నారా బ్రహ్మణికి స్పష్టం చేశారు. ఇందుకోసం నిధులు సమకూర్చాలని బ్రాహ్మణిని జనసేన నేతలు కోరినట్టు సమాచారం. ‘నిధుల విషయం తర్వాత మాట్లాడదాం... ఉమ్మడిపోరు ప్రారంభిద్దాం’ అని ఆమె చెప్పడంతో జనసేన నేతలు మెల్లగా జారుకున్నట్లు తెలిసింది. -
నారా బ్రాహ్మణి కి గట్టి కౌంటర్ ఇచ్చిన పోసాని
-
నారా బ్రహ్మణికి పోసాని కౌంటర్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణికి ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు?’ ‘మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు?’ ‘చంపిందెవరు?’.. వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు?.. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతాంటూ బ్రహ్మణికి సవాల్ విసిరారు పోసాని. బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది కూడా ప్రజల కోసమేనా అంటూ చరుకలంటించారు. అవినీతి పనులు చేస్తే ఎవరినైనా జైల్లోనే పెడతారని అన్నారు. చంద్రబాబు 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నాడని, దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు తెచ్చుకున్న చరిత్ర లేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీనే చెప్పారని గుర్తు చేశారు. చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ‘ఏ దిక్కైనా వెళ్లండి బాగుపడతారు. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచావు.. ఒప్పుకోవు. ఎన్టీఆర్‌ను చంపావు.. ఒప్పుకోవు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా. జైల్లో ఉండి ర్యాలీలు, ధర్నాలతో నీకేం పని. దోమల మందు.. మంచి దోమ తెర కొనిపెడతా. రెండు ఏసీలు కొనిపెడతా తీసుకెళ్లి జైల్లో చంద్రబాబుకి ఇవ్వండి అన్నారు పోసాని. నంది అవార్డులు గతంలో పంచుకునేవారని అందరికీ తెలుసు. ఆ కాంపౌండ్‌కు రెండు, ఈ కాంపౌండ్ కు రెండు వెళ్లేవి. ఎలా అంటే అలా పరిగెత్తేవి. నేను ఉన్నంతకాలం అర్హులకే నంది అవార్డులు వస్తాయి. నంది అవార్డులపై ప్రశ్నిస్తే అప్పటి పెద్దలు నన్ను బ్యాన్ చేశారు. నాకు టెంపర్ సినిమాకు నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేశా. నిస్పక్షపాతంగా నంది అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. ఒక్క తప్పు చేసినట్లు చూపించినా రిజైన్ చేసి వెళ్లిపోతా ’ అని పోసాని పేర్కొన్నారు. -
ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణం’లో చిక్కి జైలు పాలు కావడంతో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్టీపై ఇప్పటికే పట్టు సడలుతున్న తరుణంలో.. పులిమీద పుట్రలా చంద్రబాబుపై కేసులు రావడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు లోకేష్ కూడా కేసులలో ఉండడం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత ఆందోళనకరంగా మారింది. ఇదే టైమ్‌లో పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు వియ్యంకుడు , హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హల్ చల్ చేయడం పార్టీని మరింత గందరగోళంలో పడేసింది. ఇవి చాలవన్నట్లు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. రంగంలోకి రావాలని, టూర్లు చేయాలని సూచించడం ఆ పార్టీలో ఏర్పడిన అయోమయ స్థితికి దర్పణం పడుతోంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు.. కొన్ని పేర్లతో రాష్ట్రంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దూషణలు చేస్తూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగాలు సాగించారు. అలాగే యువగళం పాదయాత్ర పేరిట లోకేష్ కార్యకర్తలలో గరళం నూరిపోస్తూ.. హింసకు ప్రేరిపిస్తూ వచ్చారు. వాటి ఫలితంగా పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో కేసుల పాలై జైళ్లలో పడ్డారు. వాళ్లను ఆదుకునే పరిస్థితి టీడీపీ నాయకత్వానికి లేకుండా పోయింది. ఎన్ని ఎక్కువ కేసులు నమోదు అయితే.. ఆ వ్యక్తికి అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తండ్రే రాజమండ్రి జైలులో ఉండవలసి వచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి పెద్ద,పెద్ద లాయర్లను ప్రత్యేక విమానాలలో రప్పించి కోర్టులలో వాదనలు చేయిస్తున్నారు. వారేమో అవినీతి జరగలేదని చెప్పలేకపోతున్నారు. కేవలం సాంకేతిక అంశాలపైనే వాదనలు చేస్తుండడంతో పార్టీ క్యాడర్‌కు తమ నేత అవినీతి చేసి దొరికిపోయాడన్న భావన నెలకొంది. అదే టైమ్ లో చంద్రబాబు,లోకేష్‌ల మాట నమ్మి హింసాకాండకు తెగపడ్డ కార్యకర్తలు ,స్థానిక నేతలు దిక్కులేక అల్లాడుతున్నారు. వారిలో ఆర్ధికంగా స్థితిమంతులైనవారు కొద్దిమంది ముందస్తు బెయిల్ పొందినా, తొంభై శాతం మంది జైళ్లలోనే మగ్గవలసి వచ్చింది. దాంతో టీడీపీ క్యాడర్‌కు కనువిప్పు అయింది. ✍️ చంద్రబాబు, లోకేష్‌లు తమ పరపతి ఉపయోగించి.. పెద్ద,పెద్ద లాయర్లను కాకపోయినా, ఓ మోస్తరు లాయర్లను పెట్టి తమను ఎలాగో కేసుల నుంచి బయటవేస్తారని భావించిన కార్యకర్తలకు సీన్ రివర్స్ అవడం జీర్ణం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడే బెయిల్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అంతా టీడీపీకి పెద్ద షాక్‌గా మారింది. వాస్తవ పరిస్థితి అర్ధం అయ్యేసరికి టీడీపీ నాయకత్వం బంద్ కాల్ ఇచ్చినా.. పెద్దగా బయటకు రాకుండా క్యాడర్ జాగ్రత్తపడింది. కొందరు నేతలైతే పోలీసులను అభ్యర్ధించి మరీ హౌస్ అరెస్టు అయ్యారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఎంత ప్రచారం చేసినా.. నమ్మలేకపోతున్నారు. దానికి కారణం.. కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించి.. రాజమండ్రి జైలుకు పంపడమే!. చంద్రబాబు రిమాండ్ వెనుక.. ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టు ఇలా చేయరన్న సంగతిని వాళ్లు(టీడీపీ క్యాడర్) అర్ధం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కాని, మంత్రులు.. అధికారులు కాని ఆ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను ఆధారసహితంగా చెబుతుండడంతో టీడీపీ క్యాడర్‌కు వాస్తవ పరిస్థితి అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వచ్చినా, విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తీసుకు వెళ్లినా రోడ్ల వెంట నిలబడి ఆయనకు కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. ✍️ ఇక చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా.. ఇతరత్రా పిటిషన్లు ఆయన లాయర్లు వేయడంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఈ కేసులో చంద్రబాబును తప్పించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసినా.. అది ఏమవుతుందో తెలియదు. కాని, ఈలోగా చంద్రబాబు జైలులోనే గడపవలసి రావడం పార్టీ క్యాడర్‌ను డీమోరలైజ్ చేస్తోంది. అందుకే పార్టీ నాయకత్వం ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు లోకేష్‌పై కూడా కేసుల కత్తి వేలాడుతోంది. తనకు ఏమవుతుందో తెలియక ఆయన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యమంత్రిని, పోలీసులను నోటికి వచ్చినట్లు దూషించినంత తేలికగా కేసులు ఉండవన్న సంగతి అర్దం అయ్యేసరికి లోకేష్ ఊబిలో చిక్కుకుపోయారు. ఆయన కూడా అరెస్టు అయితే పార్టీని నైతికంగా మరింత దెబ్బతీస్తుంది. అసలే ఆయన నాయకత్వంపై ఇంకా నమ్మకం ఏర్పడలేదు. దానికి తోడు ఈ కేసులు రావడంతో వీళ్లతో జట్టుకట్టి ఉంటే ఏమవుతామోనన్న భయం క్యాడర్‌కు పట్టుకుంది. ✍️ మరోవైపు.. చంద్రబాబు, లోకేష్‌లు సంక్షోభంలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ కార్యాలయంలో హల్ చల్ చేశారన్న వార్తతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తన కుమారుడు బాలకృష్ణ రాజకీయ వారసుడు కావాలని ఎప్పుడో 1986 ప్రాంతంలోనే ఎన్.టి.రామారావు ప్రకటన చేయడం, దానిని విత్ డ్రా చేసుకునే వరకు చంద్రబాబు ప్రయత్నాలు సాగించడం తెలిసిందే. ఇప్పుడు పార్టీ మొత్తం నారా వారి పార్టీగా మారిపోయి.. నందమూరి వంశానికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అభిప్రాయం బలంగా జనాల్లోనే ఉంది. అందువల్ల బాలకృష్ణ ఏమైనా చొరవ తీసుకునే.. ధైర్యం చేశారా? అనే చర్చ నడిచింది క్యాడర్లో!. ఇంతకాలం చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం అని భావిస్తుంటే, బాలకృష్ణ వచ్చి చంద్రబాబు సీటులో కూర్చోవడం.. ఆయనకు సంబందించిన వార్తలేవి చంద్రబాబు సన్నిహితంగా ఉండే ఆంధ్రజ్యోతిలో రాకపోవడంతో.. బాలకృష్ణ చేసిన హడావుడి ఆ తండ్రీకొడుకులకు నచ్చలేదా? అనే ప్రశ్న తలెత్తింది కూడా!. ఒకవేళ బాలకృష్ణ తానే నాయకత్వం వహించాలనుకుని ఇలా చేశారా? అనే అనుమానమూ పార్టీ వర్గాలలో ఏర్పడింది. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల కిందట.. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కూడా రంగంలో దిగాల్సిన సమయం ఆసన్నమైందంటూ కథనం రావడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరచింది. అంటే దీని అర్ధం చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరనా?.. లేక చంద్రబాబు నాయకత్వ పటిమపై సందేహాలు వచ్చాయా? లేదంటే లోకేష్ కూడా జైలుకు వెళతారనా? లేకుంటే లోకేష్ నాయకత్వం సరిపోదనా?. ఒకవేళ వీరిద్దరూ(భువనేశ్వరి, బ్రహ్మణీలు) రావడం వల్ల జనంలో సానుభూతి వస్తుందనా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేక క్యాడర్‌ను వేధిస్తున్నాయి. ✍️ గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి విజయమ్మలు పర్యటనలు చేశారు. సభలలో మాట్లాడారు. కాని అప్పుడు అది ఉప ఎన్నికల సమయం కావడంతో.. వారి అవసరం పడింది. అలాగే షర్మిల పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు జైలులో ఉన్నారు కనుక వీరు జనంలోకి వస్తే రిసీవ్ చేసుకుంటారా?. ఒకవేళ చూడడానికి వచ్చినా జనం.. ఆ తర్వాత ఓట్ల వరకు పరిస్థితిని తెస్తారా? అనేది అనుమానమే!. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు ఈ పరిణామాలన్నిటికి జైలులో ఉన్న చంద్రబాబు అంగీకరిస్తారా?.. దానివల్ల తన రాజకీయ అనుభవానికి.. పరువుకి భంగం అనుకునే అవకాశం ఉండదా?.. ఇలా ఎన్నో చిక్కుల నడుమ తెలుగుదేశంలో నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి. టీడీపీ క్యాడర్‌ను ఎంత ఉత్తేజపరచాలని చూస్తున్నా.. రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా.. వారిలో ఆ కాక కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇన్ని రోజులు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు వాళ్లే ఇక్కట్లపాలయ్యారని, అందువల్ల అనవసరంగా తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు సహజంగానే భావించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందనిపిస్తోంది. ‘‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ’’ నినాదం ఇచ్చిన పార్టీలో.. ఇప్పుడు ఆ పిలుపు ఇచ్చిన చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్‌ల భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయిందన్న భావన ఆ పార్టీ క్యాడర్లోనే నెలకొంది!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బ్రాహ్మిణికి ఉన్న బుద్ది కూడా లోకేష్ కి లేదు: పేర్ని నాని
-
నారా లోకేష్ ‘విందు’ రాజకీయం
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. (చదవండి: మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..) ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీపై తన పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనతో పాటు రాజకీయంగానూ తనపై పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ విందు రాజకీయం మొదలుపెట్టినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్ చెప్పినట్లు తెలిసింది. (విజయవాడ నడిబొడ్డున కోట్ల విలువైన భూమి కబ్జా) -
మోదీ,కేసీఆర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
-
రాహుల్ పారిశ్రామికవేత్తల భేటీకి టీడీపీ పారిశ్రామికవేత్తలు
-
రాహుల్ సమావేశానికి నారా బ్రాహ్మణి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ భేటీ పలు ఆసక్తికర రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ఈ భేటీకి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణితోపాటు ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్, జేసీ తనయుడు పవన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఫొటో: రాహుల్‌తో భేటీకి హాజరైన పారిశ్రామికవేత్తలు... గత కొంతకాలంగా కాంగ్రెస్-టీడీపీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు కాపురం చేసిన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా దూరం జరగడంతో.. రానున్న ఎన్నికల్లో కొత్త మిత్రుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజావ్యతిరేకత భారీగా పెరగడంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు బాబు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో జోడీ కట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీలు అన్యోన్యంగా వ్యవహరించాయి. రాజ్యసభ పీఏసీ సభ్యుని ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వగా.. డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతునిచ్చింది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు చేయ్యేసి ఫొటోలకు ఫోజుచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏపీలో ఏమంతా మెరుగుపడలేదు. విభజనకు కారణమైన పార్టీగా ఏపీలో కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. విభజనకు, ఏపీని వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిత్యం నిందించే చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో చెట్టపట్టాలకు సిద్ధమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నాలుగేళ్లలో బిలియన్ డాలర్లకు!!
-
నాలుగేళ్లలో బిలియన్ డాలర్లకు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగేళ్లలో ఆదాయాన్ని రూ.6 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘గతేడాది 15 శాతం వృద్ధిని నమోదు చేశాం. ఇప్పటి నుంచి 25 శాతం వృద్ధి రేటును లకి‡్ష్యంచాం’‘ అని సంస్థ ఈడీ నారా బ్రాహ్మణి తెలిపారు. తమ వ్యాపారంలో 40 శాతం వాటా విలువ ఆధారిత ఉత్పత్తులదేనన్నారు. బుధవారమిక్కడ అల్పెన్వీ పేరిట ఐస్‌క్రీమ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే నాలుగేళ్లలో ఐస్‌క్రీమ్ ఉత్పత్తులపై రూ.80 కోట్ల పెట్టుబడులు పెడతాం. 2022 నాటికి ఐస్‌క్రీమ్‌ల నుంచి రూ.230 కోట్ల వ్యాపారం లకి‡్ష్యంచాం’’ అని తెలిపారు. ప్రస్తుతానికివి దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో లభ్యమవుతాయని.. మెల్లగా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మిల్క్ క్రీమ్, ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్ ఫేవర్లు, ఫార్మాట్లలో లభ్యమవుతాయి. ధరలు రూ.10–45 మధ్యలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్పర్సన్ అండ్ ఎండీ నారా భువనేశ్వరీ, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సాంబశివరావు పాల్గొన్నారు. -
చంద్రబాబు, దేవాన్ష్ తాగేది ఆ పాలే
-
చంద్రబాబు, దేవాన్ష్ తాగేది ఆ పాలే
- హెరిటేజ్ పాలలో కల్తీకి తావులేదు: బ్రాహ్మణి - తమిళనాడు మంత్రి సంచలన ఆరోపణలకు కౌంటర్ చెన్నై: ప్రైవేట్ డైరీలను ఉద్దేశించి తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన సంచలన ఆరోపణలపై హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పందించారు. హెరిటేజ్ పాలలో కల్తీకి తావులేదని, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నందునే తమ సంస్థ పాతికేళ్లుగా మనగలుగుతోందని ఆమె చెప్పారు. చెన్నైలో గురువారం జరిగిన కార్యక్రమంలో "హెరిటేజ్ పెట్ బాటిల్" ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదలచేసిన బ్రాహ్మణి.. మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పాల సేకరణ కోసం తుప్పుపట్టని క్యాన్లను వాడుతున్నామని, సేకరించిన పాలను 150 సెంటర్లలో ప్రాసెసింగ్ చేస్తున్నామని, హెరిటేజ్ పాలలో కల్తీకి తావే లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు. తన రెండేళ్ల కుమారుడు దేవాన్ష్, తన మామ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం హెరిటేజ్ పాలనే తాగుతారని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో తన మామ(చంద్రబాబు) పాదయాత్ర చేసిన సందర్భంలో హెరిటేజ్ పాలను తాగి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారని బ్రాహ్మణి వివరించారు. వచ్చే ఐదేళ్లలో హెరిటేజ్ టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవి పాలు కాదు విషం: రాజేంద్ర పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ప్రైవేట్ డైరీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలు పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, క్లోరిన్ లాంటి రసాయనాలను కలుపుతున్నాయని, తమ బృందాలు చేసిన అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. గతవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. "ప్రైవేట్ డైరీలు తయారుచేసేవి పాలే కాదు.. విషం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై పలు డైరీ సంస్థలు మండిపడ్డాయి. -
యూరోపియన్ సంస్థతో...హెరిటేజ్ ఫుడ్స్ జట్టు
నెల రోజుల్లో ఒప్పందం ఖరారు ► విపణిలోకి కొత్త బేవరేజెస్ ఉత్పత్తులు ► ఐదేళ్లలో 6 వేల కోట్ల ఆదాయం లక్ష్యం ► రూ.150 కోట్లతో కొత్తగా 5 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లు ► హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్.. యూరప్‌నకు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థతో సంయుక్త భాగస్వామ్య (జేవీ) ఒప్పందం కుదుర్చుకోనుంది. ఒప్పంద చర్చలు ముగింపు దశలో ఉన్నాయని.. నెల లేదా 6 వారాల్లో ఒప్పందం ఖరారవుతుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ కొత్త భాగస్వామ్యం సాంకేతికత, బ్రాండింగ్, మార్కెటింగ్ మూడు విభాగాల్లోనూ ఉంటుందని, అలాగే ప్రస్తుతమున్న హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులతో పాటు విపణిలోకి కొత్తగా బేవరేజెస్ ఉత్పత్తులను పరిచయం చేస్తామని తెలియజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ఈ మధ్యే రిలయన్స్ డెయిరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని కొనుగోళ్లకు తాము సిద్ధంగా ఉన్నామని, సంస్థను మరింత విస్తరిస్తామని చెప్పారామె. హెరిటేజ్ ఫుడ్స్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రాహ్మణితో కలసి హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్, చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కొత్త లోగో, ప్యాకేజింగ్లను విడుదల చేశారు. బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘‘ఈ ఆర్ధిక సంవత్సరం ఫలితాలింకా వెల్లడించాల్సి ఉంది. 2015–16 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,380 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఐదేళ్లలో మూడింతల వృద్ధితో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం’’ అని చెప్పారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ నుంచి విపణిలో పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, ఐస్‌క్రీమ్, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ తదితర ఉత్పత్తులున్నాయి. మా మొత్తం ఆదాయంలో 10–12 శాతం వాటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలది. ఉత్పత్తుల పరంగా చూస్తే పెరుగు వాటానే అత్యధికం. గత ఐదేళ్లుగా ఏటా 18 శాతం వృద్ధి రేటును సా«ధించాం. అంతర్జాతీయ కంపెనీతో భాగస్వామ్యం, ఇతర పెట్టుబడులతో వచ్చే ఐదేళ్లలో 25 శాతం వార్షిక వృద్ధి రేటును సాధిస్తామని బ్రాహ్మణి ధీమా వ్యక్తం చేశారు. రూ.150 కోట్లతో 5 ప్రాసెసింగ్ యూనిట్లు.. ప్రస్తుతం హెచ్ఎఫ్ఎల్ ఉత్పత్తులు దక్షిణ, ఉత్తరాదిలోని 15 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంచింది. ఇందులో భాగంగానే మరో 5 రాష్ట్రాల్లో 5 పాల ప్రాసెసింగ్ ప్లాంట్లను నెలకొల్పనుంది. ఒక్కో ప్లాంట్‌పై రూ.25–30 కోట్లు చొప్పున.. మొత్తం రూ.150 కోట్లతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల మంది రైతుల నుంచి 14 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్న హెచ్ఎఫ్ఎల్ సామర్థ్యం.. కొత్త యూనిట్ల అనంతరం 25–30 లక్షల లీటర్లకు చేరుతుందని బ్రాహ్మణి వివరించారు. కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చైర్మన్ సీతారామయ్య, ప్రెసిడెంట్ సాంబశివరావు, డైరెక్టర్ నాగరాజా నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తన రాజకీయ రంగప్రవేశంపై మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి క్లారీటీ ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి అంతా హెరిటేజ్ వ్యవహారాలపైనే అని ఆమె స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో అయిదు హెరిటేజ్ ప్రాజెస్ యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2022 కల్లా హెరిటేజ్ రూ.6వేల కోట్ల టర్నోవరే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బ్రహ్మణి వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆమె పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మణి తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని ఆమె వెల్లడించారు. దీంతో చాల కాలంగా బ్రహ్మణి రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్టు అయింది. -
పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కీలక వ్యాఖ్యలు
-
'ఆ సినిమా చూడటం అదృష్టం'
తనకు పిల్లనిచ్చిన మేనమామ నందమూరి బాలకృష్ణ నటించిన నూరో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా అమరావతి చరిత్రను మరోసారి చూడటం అదృష్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సినిమా ప్రీమియర్‌ను చూశానని, దర్శకుడు క్రిష్ చాలా అద్భుతంగా తీశారని చెప్పారు. అందులోనూ బాలయ్య మావయ్య స్ఫూర్తిదాయకమైన పెర్ఫామెన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానన్నారు. సినిమాలో నటించిన ఇతరుల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిందేనని ట్వీట్ చేశారు. ఇక శాతకర్ణి సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని.. నోరప్పగించి సినిమా అలా చూస్తుండిపోయానని బాలకృష్ణ కుమార్తె, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. దర్శకుడు క్రిష్‌కు అభినందనలు తెలిపారు. Fortunate to have revisited the history of #Amaravati through #GautamiPutraSatakarni premiere last night. Kudos to @DirKrish. (1/2) — Lokesh Nara (@naralokesh) 10 January 2017 Mesmerised by #Balayya mavayya's inspiring performance. Contribution of other artists in #GautamiPutraSatakarni deserves special mention 2/2 — Lokesh Nara (@naralokesh) 10 January 2017 Spellbound after watching Satakarni! Congratulations @DirKrish on #nbk100.#respectmother #telugupride #prouddaughter — Brahmani Nara (@brahmaninara) 10 January 2017 -
అత్తా కోడళ్లకు ఎమ్మెల్యే రోజా సూటి ప్రశ్న
-
ఆస్తుల పేరిట మరోసారి లోకేశ్ సొంత లెక్కలు
-
చిన‘బాబు’ లెక్కలు చిత్ర విచిత్రాలు
- ఆస్తుల పేరిట మరోసారి లోకేశ్ సొంతలెక్కలు - చంద్రబాబుకు భవనాన్ని బహుమతిచ్చిన కుటుంబం - హెరిటేజ్‌లో వాటాల మార్కెట్ విలువే రూ.932 కోట్లు - కొన్న విలువంటూ రూ.33 కోట్లుగానే పేర్కొన్న చినబాబు - భారీ భవంతులకూ నామమాత్రపు ధరనే చూపిన తీరు - తాజాగా కొన్న వాటి విషయంలోనూ అదే తీరు - ఇదే ఏడాదిలో అంత తక్కువ ధరకు ఎలా కొన్నారో చెప్పరు - రూ.100 కోట్ల విలువైన భూమి... ఇప్పటికీ రూ.79 లక్షలేనట! - వినేవారుంటే... తీరులో సాగిన లోకేశ్ ఆస్తుల లెక్క సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం పుత్రోత్సాహం కుదిపేసి ఉంటుంది. కుటుంబ ఆస్తుల పేరిట నోటికొచ్చిన లెక్కలు చెప్పిన పుత్రరత్నాన్ని చూసి... తాను రెండెకరాలతో మొదలెడితే తన వారసుడు రెండాకులు ఎక్కువే చదివాడని ఉప్పొంగిపోయి ఉంటారు. తాము చెప్పిందల్లా ప్రచారం చేయటానికి నాయక గణం, అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చు. కానీ జనం సైతం దాన్ని పిచ్చిగా నమ్మేస్తారన్న ఈ తండ్రీకొడుకుల నమ్మకమే అన్నిటికన్నా హైైలైట్. మాట తప్పకపోవటమంటే ఏంటన్నది వీళ్లనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో పదిహేనేళ్ల కిందట జూబ్లీ హిల్స్‌లో పాతిక లక్షలకు కొన్న భవనం... ఇపుడు యాభై కోట్లు పలుకుతున్నా చంద్రబాబు, లోకేశ్ బాబు ఇద్దరూ దాని విలువ పాతిక లక్షలనే చెబుతున్నారు.పాతికేళ్లు గడిచాకా దాని విలువ రూ.100 కోట్లు దాటేసినా వారు మాట తప్పరు. పాతిక లక్షలనే చెబుతారు!. అదీ బాబు కుటుంబమంటే!!. ఏడాదికోసారి తప్పనిసరి తద్దినంలా అవే లెక్కల్ని వల్లెవేయటం ఎందుకనే సందేహం ఎవరికొచ్చినా బాబు కుటుంబానికైతే రాదు. వరసగా రెండో ఏడాది... బుధవారం లోకేశ్ బాబు చెప్పిన లెక్కల్లో ఐదారు తప్ప అన్నీ పాతవే. విశేషమేంటంటే పాతవాటికి కూడా తనదైన చిత్రాల్ని జోడించారు చినబాబు. అవేంటో ఒకసారి చూద్దాం... చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిందెవరు? హా తండ్రి చంద్రబాబు ఆస్తుల్ని ప్రకటించిన లోకేశ్... నారావారి పల్లెలో దాదాపు ఎకరం స్థలంలో భవనం కడుతున్నామని చెప్పారు. దీన్ని కుటుంబం నుంచి వచ్చిన గిఫ్ట్‌గా పేర్కొన్నారు. కుటుంబమంటే? బాబుకు తల్లిదండ్రుల నుంచి భూమి సంక్రమించి ఉండొచ్చు. కానీ ఈ ఏడాదే కట్టిన భవనాన్ని బాబుకు గిఫ్ట్ ఇచ్చేదెవరు? భార్య భువనేశ్వరా? లేక చినబాబా? అందుకేనేమో!! దీని విలువను మాత్రం లోకేశ్ చెప్పలేదు. భువనేశ్వరికి హెరిటేజ్‌లో వాటా ఎంత? భువనేశ్వరి పేరిట పంజాగుట్టలోని భవనం, తమిళనాడులోని ఆస్తుల సహా అన్నిటికీ పాత విలువలే చెప్పగా...హెరిటేజ్ ఫుడ్స్‌లో తనకున్న వాటా విలువను కూడా రూ.19.95 కోట్లుగానే చూపించారు. నిజానికి ఆమెకున్న 53,30,826 షేర్లకు బుధవారంనాటి మార్కెట్ విలువ (రూ.902 చొప్పున) రూ.480 కోట్లపైనే. భూములు, భవనాలు, షేర్ల మార్కెట్ విలువ తరచూ మారుతుంటుంది కనక తాము కొన్నప్పటి విలువనే చూపిస్తున్నామన్నది లోకేశ్ మాట. మరి పాతికేళ్ల కిందటి విలువల్నే ఇప్పటికీ చూపించాలనుకుంటే ఏటా ఈ లెక్కలెందుకు చెప్పటం? ఈ మధ్యే హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాను ఫ్యూచర్ గ్రూప్‌కు విక్రయించడానికి చర్చలు కూడా జరిగాయి. మరి బాబు కుటుంబం తమ వాటాకు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగడుతుందా? లేక తాము కొన్నప్పటి విలువ ఇస్తే చాలంటుందా? ఎవరిని మోసం చేయటానికిదంతా? ► భువనేశ్వరి వద్దనున్న బంగారం, ఆభరణాలకు గతేడాది చెప్పిన విలువ రూ.26.96 లక్షలు. ఇపుడైతే రూ.1.27 కోట్లుగా పేర్కొన్నారు. చిత్రమేంటంటే గతేడాది తమ వద్ద 3,380 గ్రాముల బంగారం ఉందని చెప్పగా ఈ సారి 3519 గ్రాములని చెప్పారు. అంటే ఈ ఏడాదిలో పెరిగిన 139 గ్రాముల విలువ రూ.కోటి అవుతుందా? లేక మార్కెట్ విలువ ప్రకారం లెక్కించారా? లోకేశ్‌కే ఎరుక!!. లోకేశ్... ఇప్పటికీ నానమ్మ పేరే!! జూబ్లీహిల్స్‌లో ప్లాటు విలువను గతేడాది రూ.2.36 కోట్లుగా చూపించిన లోకేశ్... ఇపుడు స్వల్పంగా పెంచి రూ.3.68 కోట్లుగా చెప్పారు. కొన్నప్పటి విలువనే చూపిస్తున్నామన్నపుడు ఇదెలా పెరిగింది? నోటికొచ్చినట్టు చెప్పటమేనా ఆ లెక్క? ► మదీనాగూడలో ఐదెకరాల్ని కొన్నానని, ఐదెకరాలు మాత్రం నానమ్మ నుంచి గిఫ్ట్‌గా వచ్చిందని లోకేశ్ చెబుతుంటారు. పసుపు కుంకుమగా వచ్చిన అరెకరం తప్ప ఏమీ ఆస్తుల్లేని అమ్మణ్ణమ్మ... లోకేశ్‌కు అంత బహుమతి ఎలా ఇచ్చారో మాత్రం ఏ బాబూ చెప్పరు. ► విశేషమేంటంటే ముంబయి శివార్లలో తనకున్న స్థలం విలువను రెండుమూడేళ్ల పాటు రూ.58.69 లక్షలుగానే చూపించారు లోకేశ్. ఈ సారి విక్రయించేసినట్లున్నారు. అసలు ఎంతకు విక్రయించారు? కోట్ల విలువైన ఆ స్థలాన్ని రూ.58 లక్షలకే విక్రయించేశారా? ► ఇక హెరిటేజ్ ఫుడ్స్‌లో తనకున్న 23,66,400 షేర్ల విలువను రూ.2.21 కోట్లుగా చూపించారు. కానీ దాని అసలు విలువ రూ.212 కోట్లు. అదీ చినబాబు లెక్కంటే!!. బ్రాహ్మణి... స్థలానికి బదులు భవనమా? ఈ సారి బ్రాహ్మణి ఆస్తుల్లోకి కొత్తగా ఓ ప్లాటొచ్చి చేరింది. జూబ్లీహిల్స్‌లో 650 గజాల్లో ఏకంగా 6,000 చదరపు అడుగులు నిర్మించి ఉన్న భవనం తన పేరిట చూపించారు. రూ.3.5 కోట్లుగా దాని విలువను చూపిస్తూ... ఎక్స్చేంజ్ డీడ్‌గా పేర్కొన్నారు. గతేడాది చూపించిన ఆస్తుల్లో నందగిరి హిల్స్‌లో 778 గజాల స్థలం ఉంది. ఇపుడది లేదు. అంటే ఈ స్థలాన్నిచ్చి ఆ భవనాన్ని తీసుకున్నారా? ► విశేషమేంటంటే వివాదాస్పద ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో 2,440 గజాల స్థలం విలువను గతేడాది 1.15 కోట్లుగా చూపించారు. ఈ సారి రూ.1.23 కోట్లన్నారు. ఇదెక్కడి లెక్క? ►మరో చిత్రం కూడా ఉంది. మాదాపూర్‌లోని 924 గజాల ప్లాటు విలువను గతేడాది 3.37 లక్షలుగా చూపించారు. ఈ సారి రూ.17 లక్షలుగా చూపించారు. ఇది మార్కెట్ విలువా లేక కొన్నప్పటి విలువా? కొన్నప్పటి విలువైతే రూ.3.37 లక్షలే ఉండాలి కదా? మార్కెట్ విలువైతే గతం రూ.80 వేలు వేసుకున్నా 80 లక్షలుండాలి కదా!!. ► హెరిటేజ్ ఫుడ్స్‌లో బ్రాహ్మణి వాటా విలువను 78 లక్షలుగా పేర్కొనగా... దాని అసలు విలువ 9.09 కోట్లు. ► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలో రూ.70 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎల్ఐసీ అనుబంధ సంస్థ ఎల్ఐసీ హోమ్‌ఫైనాన్స్ మాత్రమే లిస్టయింది. మరి ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలో వీళ్లకెవరు వాటా అమ్మారన్నది లోకేష్‌కే ఎరుక. ► 97 కిలోల వెండి ధరను గతేడాది 3.3 లక్షలుగా... ఈ సారి రూ.12.37 లక్షలు చూపించారు. మరి ఏడాదిలో వెండి ధర 4 రెట్లు పెరిగిందా? దేవాన్ష్‌కూ నానమ్మ బహుమతే!! ఈ సారి నారా కుటుంబ ఆస్తుల జాబితాలోకి కొత్తగా వచ్చి చేరింది బాబు మనవడు దేవాన్ష్. తనకు జూబ్లీహిల్స్‌లో 1191 చ. గజాల స్థలం. దాన్లో 19,500 చదరపుటడుగుల భవనం కలిపి ఉన్నాయని దాన్ని ఈ ఏడాదే రూ.9 కోట్లకు కొన్నామని చెప్పారు. చ. అడుగుకు రూ.1,500 నిర్మాణ ఛార్జీలు వేసుకున్నా దాదా పు రూ.3 కోట్లు. స్థలం విలువ కనీసం 25 కోట్లు. మరి 9 కోట్లకు ఎవరిచ్చారు? దీన్ని నానమ్మ భువనేశ్వరి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులోనూ వారసత్వమేనా!!. చివరిగా నిర్వాణా హోల్డింగ్స్‌కు వివిధ కంపెనీల్లో వాటాలున్నాయి. ఒక్క హెరిటేజ్ ఫుడ్స్ లో దానికున్న వాటా విలువే రూ.231 కోట్లు. కానీ దీన్ని 10.82 లక్షలుగా మాత్రమే చూపిం చి.. నిర్వాణాకు 43.95 లక్షల నికర అప్పులున్నట్లు పేర్కొన్నారు. మరీఇంత దారుణమా!!. మా ఆస్తులు ఇవే: లోకేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తి గత మార్చి 31 నాటికి రూ. 67.04 లక్షలుగా ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యద ర్శి నారా లోకేష్ ప్రకటించారు. తన తల్లి భువనేశ్వరి పేరిట రూ. 24.84 కోట్లు, తన పేరిట రూ. 8.5 కోట్లు, తన సతీమణి బ్రహ్మణి పేరుతో రూ. 12.33 కోట్లు, కుమారుడు దేవాన్ష్ పేరుతో రూ. 11.32 కోట్ల ఆస్తులుండగా... తాము నిర్వహించే నిర్వాణ హోల్డింగ్స్ కంపెనీ రూ.43 లక్షల లోటులో ఉందని చెప్పారు. ఆయన బుధ వారం గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబం ఆస్తులను ప్రకటించారు. మార్కెట్ విలువలు మారుతుంటాయి కాబట్టి ఆస్తులు కొనుగోలు చేసినపుడు ఎంత విలువ ఉందో అంతే ప్రకటించామని చెప్పారు. ఆ వివరాలివే... నారా చంద్రబాబు నాయుడు ► హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 65లో ఉన్న 1125 చదరపు గజాల ఇంటి స్థలం(బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది). నిర్మాణం పురోగతిలో ఉన్న ఇంటి విలువ రూ.3.68 కోట్లు ► చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారి పల్లెలో కుటుంబ సభ్యుల నుంచి బహుమతిగా వచ్చిన 0.97 ఎకరాల స్థలంలోని నాలుగింట మూడొంతుల నివాస భవనం. (దీని విలువ పేర్కొన లేదు) ► అంబాసిడర్ కారు రూ. 1.52 లక్షలు ►ఇతర ఆస్తులు-నేషనల్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు రూ.0.01 లక్షలు ►సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్లో నిల్వ, చేతిలో నగదు:రూ.3.59 లక్షలు ►మొత్తం ఆస్తులు: రూ. 3.73 కోట్లు ►బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇంటి నిర్మాణ రుణం: రూ.3.06 కోట్లు ►నికర ఆస్తి: రూ. 67.04 లక్షలు నారా భువనేశ్వరి ► హైదరాబాద్ పంజాగుట్టలో ఆంధ్రాబ్యాంక్ తనఖాలో ఉన్న 650 చ.గ. స్థలం: 73.33 లక్షలు ► తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరు సమీపంలో 50 వేల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం ఉన్న 2.33 ఎకరాల స్థలం (కొటక్ మహీంద్ర బ్యాంక్‌లో తనఖాలో ఉంది): 1.86 కోట్లు ► రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం మదీనా గూడ గ్రామంలోని సర్వే నంబర్ 51లో ఉన్న ఐదు ఎకరాల భూమి(బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది): 73.80 లక్షలు. ► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 53,30,826 షేర్లు: 19.95 కోట్లు ► విజయ బ్యాంక్‌లో 100 షేర్లు: 0.02 లక్షలు ► అన్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: 3.58 కోట్లు ► పీఎఫ్ ఖాతాలో నిల్వ: 1.73 కోట్లు ► విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు (3.52 కిలోలు) 1.27 కోట్లు ► వెండి 32.7 కిలోలు: 4.57 లక్షలు ► ఆడి కారు: 91.93 లక్షలు ► లిక్విడ్ ఆస్తులు: అడ్వాన్సులు, చెల్లించాల్సినవి : 7.75 కోట్లు ► సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్లో నిల్వ,ఫిక్స్డ్ డిపాజిట్లు: 6.41 లక్షలు ► మొత్తం ఆస్తులు: 38.66 కోట్లు ► రుణాలు, అప్పులు: బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఆటు ఇతర బ్యాంకుల్లో: 6.86 కోట్లు ► ఇతర రుణాలు, చెల్లింపులు: 6.95 కోట్లు ► మొత్తం రుణాలు: 13.82 కోట్లు ► నికర ఆస్తులు: 24.84 కోట్లు నారా లోకేశ్ ► హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 65లో ఉన్న 1,285 చదరపు గజాల ఇంటి స్థలం (బ్యాంక్ ఆఫ్ బరోడాలో తనఖాలో ఉంది). ఇందులో తండ్రి చంద్రబాబుతో కలిపి ఇంటి నిర్మాణం పురోగతిలో ఉంది. దీని విలువ రూ.3.68 కోట్లు ► రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో ఉన్న సర్వే నంబర్ 51ఏలో ఉన్న ఐదు ఎకరాల భూమి (బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖాలో ఉంది): నానమ్మ అమ్మణమ్మ బహుమతిగా ఇచ్చింది. ► ఇదే సర్వే నంబరులోని ఫాం హౌస్ ( బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖాలో ఉంది): 2.21 కోట్లు ► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 23,66,400 షేర్లు. ► అన్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: రూ.1.64 కోట్లు ► మోటారు వాహనాలు: ఫోర్డ్ ఫియస్టా, రెండు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్లు: 92.93 లక్షలు ► అడ్వాన్సులు, రావల్సినవి: 3.45 కోట్లు ► సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్స్‌లో నిల్వ: 5.86 లక్షలు. ► మొత్తం ఆస్తులు: 14.50 కోట్లు ► రుణాలు, అప్పులు:బ్యాంకుల్లో: 7.99 లక్షలు ►ఇతర రుణాలు, అడ్వాన్సులు : 3.21 కోట్లు ►బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంటి రుణం : 3.06 కోట్లు ►మొత్తం అప్పులు: 6.35 కోట్లు ►నికర ఆస్తులు: 8.15 కోట్లు నారా బ్రహ్మణి ► రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం: 17.25 లక్షలు ►జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 19లోని ప్లాట్ నంబరు 459లో ఇల్లు: రూ. 3.50 కోట్లు ► చెన్నై నగరంలోని టెంపుల్ స్టెప్స్‌లో 4,782 చదరపు గజాల వాణిజ్య స్థలం: రూ. 48.00 లక్షలు ► రంగారెడ్డి జిల్లా మణికొండలో 2,440 చదరపు గజాల స్థలానికి చెల్లించిన బయానా: రూ.1.23 కోట్లు ► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు:-హెరిటేజ్ ఫుడ్స్ ఇండియాలో 1.01 లక్షల షేర్లు: రూ.78.51 లక్షలు. ► ఇతర లిస్టెడ్ కంపెనీల్లో షేర్లు: రూ.70.56 లక్షలు. ► బంగారం 2325.34 గ్రాములు, విలువైన రాళ్లు (310.06 క్యారెట్లు): 15.90 లక్ష లు ► వెండి 97.441 కిలోలు : 12.37 లక్షలు ► అడ్వాన్సులు, రావల్సినవి: రూ.5.14 కోట్లు ► పీఎఫ్ ఎకౌంట్లో నిల్వ:19.64 లక్షలు ► నగదు, బ్యాంక్ బ్యాలెన్స్: 25.92 లక్షలు ► మొత్తం ఆస్తులు: రూ. 12.76 కోట్లు ► లోన్లు, అడ్వాన్సులు: 42.18 లక్షలు ► నికర ఆస్తులు: రూ.12.33 కోట్లు నారా దేవాన్ష్ ► హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లోని ప్లాట్ నంబర్ 469లో 19,500 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగిన 1,191 చదరపు గజాల ప్లాట్: రూ.9.18 కోట్లు ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ విభాగంలో ఫిక్సడ్ డిపాజిట్లు: రూ. 2.04 కోట్లు ► అడ్వాన్సులు, రావాల్సినవి: రూ.5.63 లక్షలు ► వెండి ఊయల: రూ.2.87 లక్షలు ► బ్యాంకు ఎకౌంట్లో నిల్వ, నగదు: రూ.2.31 లక్షలు ► మొత్తం ఆస్తులు: రూ.11.33 కోట్లు ► గత ఆర్థిక సంవత్సరంలో నానమ్మ నారా భువనేశ్వరి నుంచి రూ.9.20 కోట్లు, తాతయ్య నందమూరి బాలకృష్ణ నుంచి రూ.2.04 కోట్లు, తండ్రి నారా లోకేష్ నుంచి రూ.2.87 లక్షల విలువైన వెండి ఊయల బహుమతిగా అందుకున్నాడు. నిర్వాణ హోల్డింగ్స్ ► లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు: హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో 25,72,842 షేర్లు: రూ.10.83 కోట్లు ► అన్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల విలువ: రూ.7.14 కోట్లు ► మోటారు కార్లు: మూడు ఫార్చునర్ కార్లు, రేంజ్ రోవర్, స్కార్పియో, ఒక బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్: రూ.3.81 కోట్లు ► అడ్వాన్సులు, రావల్సినవి: 10.90 లక్షలు ► బ్యాంకు ఎకౌంట్లో నిల్వ: 14.10 లక్షలు ► మొత్తం ఆస్తులు: రూ.22.02 కోట్లు రుణాలు, అప్పులు ► వాహనాల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం: రూ.1.40 కోట్లు ► షేర్ క్యాపిటల్: నారా భువనేశ్వరి: రూ.3.29 కోట్లు, నారా లోకేష్: రూ.1.62 కోట్లు ► అడ్వాన్సులు: నారా భువనేశ్వరి: రూ.7.69 కోట్లు, నారా లోకేష్: రూ.2.64 కోట్లు ► ఇతర అడ్వాన్సులు: రూ.5.83 కోట్లు ► మొత్తం అప్పులు: రూ.22.46 కోట్లు ► నికర ఆస్తులు: -43.95 లక్షలు -
చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన తనయుడు లోకేశ్ బుధవారం ప్రకటించారు. ఆరేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలిపారు. తన భార్య బ్రాహ్మణి.. వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారని చెప్పారు. తన తండ్రి, తాను రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ. 3 కోట్ల 73 లక్షలు ప్రస్తుత ఆస్తులు రూ. 67 లక్షలు బ్యాంకు రుణం రూ. 3 కోట్ల 6 లక్షలు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు రూ. 3లక్షల 59 వేలు అంబాసిడర్ కారు విలువ రూ. లక్షా 52 వేలు నారా భువనేశ్వరి మొత్తం ఆస్తి రూ. 38 కోట్ల 66 లక్షలు అప్పులు రూ. 13 కోట్లు నికర ఆస్తులు రూ. 24 కోట్లు 84 లక్షలు పంజాగుట్ట స్థలం విలువ రూ. 73 లక్షలు మదీనాగూడలో స్థలం విలువ రూ. 73 లక్షలు తమిళనాడులో స్థలం విలువ రూ. కోటి 86 లక్షలు హెరిటేజ్ లో వాటా విలువ రూ. 19 కోట్ల 93 లక్షలు వివిధ కంపెనీల్లో వాటా విలువ రూ. 3 కోట్ల 29 లక్షలు వాహనాల విలువ రూ. 91 లక్షలు పీఎఫ్ ఖాతాలో రూ. కోటి 73 లక్షలు నారా లోకేశ్ మొత్తం ఆస్తి విలువ రూ. 14 కోట్ల 50 లక్షలు నికర ఆస్తులు రూ. 8 కోట్ల 15 లక్షలు కారు విలువ రూ. 92 లక్షలు అప్పులు రూ. 6 కోట్ల 35 లక్షలు బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ రూ. 12 కోట్ల 75 లక్షలు నికర ఆస్తులు రూ. 12 కోట్లు 33 లక్షలు అప్పులు రూ. 42 లక్షలు మాదాపూర్ లో స్థలం విలువ రూ. 17 లక్షలు జూబ్లిహిల్స్ లో ఇంటి విలువ రూ. 3 కోట్ల 50 లక్షలు హెరిటేజ్ లో వాటా విలువ రూ.78 లక్షలు బంగారు ఆభరణాల విలువ రూ. 15 లక్షలు పీఎఫ్ ఖాతాలో రూ. 19 లక్షలు నగదు నిల్వ రూ. 25 లక్షలు దేవాన్ష్ మొత్తం ఆస్తి రూ. 11 కోట్ల 32 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ రూ. 2 కోట్ల 4 లక్షలు దేవాన్ష్ పేరిట ఇంటి విలువ రూ. 9 కోట్ల 17 లక్షలు నగదు నిల్వ రూ. 2 లక్షల 31 వేలు -
చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన
-
త్వరలోనే తాత కాబోతున్న హీరో
టాలీవుడ్ హీరో, అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరలోనే తాత కాబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. వారికి త్వరలోనే తొలి సంతానం కలగబోతోంది. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు బ్రాహ్మణి సీమంతం వేడుకను కూడా చాలా ఘనంగా నిర్వహించాయి. కాగా, ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బాలకృష్ణ.. తాను తాత కాబోతున్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మనవలు, మనవరాళ్లు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంటుందని, తాను తొందర్లోనే తాత అవుతున్నానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.