
చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన తనయుడు లోకేశ్ బుధవారం ప్రకటించారు. ఆరేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నామని తెలిపారు. తన భార్య బ్రాహ్మణి.. వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారని చెప్పారు. తన తండ్రి, తాను రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు.
లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు
చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ. 3 కోట్ల 73 లక్షలు
ప్రస్తుత ఆస్తులు రూ. 67 లక్షలు
బ్యాంకు రుణం రూ. 3 కోట్ల 6 లక్షలు
బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు రూ. 3లక్షల 59 వేలు
అంబాసిడర్ కారు విలువ రూ. లక్షా 52 వేలు
నారా భువనేశ్వరి మొత్తం ఆస్తి రూ. 38 కోట్ల 66 లక్షలు
అప్పులు రూ. 13 కోట్లు
నికర ఆస్తులు రూ. 24 కోట్లు 84 లక్షలు
పంజాగుట్ట స్థలం విలువ రూ. 73 లక్షలు
మదీనాగూడలో స్థలం విలువ రూ. 73 లక్షలు
తమిళనాడులో స్థలం విలువ రూ. కోటి 86 లక్షలు
హెరిటేజ్ లో వాటా విలువ రూ. 19 కోట్ల 93 లక్షలు
వివిధ కంపెనీల్లో వాటా విలువ రూ. 3 కోట్ల 29 లక్షలు
వాహనాల విలువ రూ. 91 లక్షలు
పీఎఫ్ ఖాతాలో రూ. కోటి 73 లక్షలు
నారా లోకేశ్ మొత్తం ఆస్తి విలువ రూ. 14 కోట్ల 50 లక్షలు
నికర ఆస్తులు రూ. 8 కోట్ల 15 లక్షలు
కారు విలువ రూ. 92 లక్షలు
అప్పులు రూ. 6 కోట్ల 35 లక్షలు
బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ రూ. 12 కోట్ల 75 లక్షలు
నికర ఆస్తులు రూ. 12 కోట్లు 33 లక్షలు
అప్పులు రూ. 42 లక్షలు
మాదాపూర్ లో స్థలం విలువ రూ. 17 లక్షలు
జూబ్లిహిల్స్ లో ఇంటి విలువ రూ. 3 కోట్ల 50 లక్షలు
హెరిటేజ్ లో వాటా విలువ రూ.78 లక్షలు
బంగారు ఆభరణాల విలువ రూ. 15 లక్షలు
పీఎఫ్ ఖాతాలో రూ. 19 లక్షలు
నగదు నిల్వ రూ. 25 లక్షలు
దేవాన్ష్ మొత్తం ఆస్తి రూ. 11 కోట్ల 32 లక్షలు
ఫిక్సెడ్ డిపాజిట్ రూ. 2 కోట్ల 4 లక్షలు
దేవాన్ష్ పేరిట ఇంటి విలువ రూ. 9 కోట్ల 17 లక్షలు
నగదు నిల్వ రూ. 2 లక్షల 31 వేలు