తన రాజకీయ రంగప్రవేశంపై మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి క్లారీటీ ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి అంతా హెరిటేజ్ వ్యవహారాలపైనే అని ఆమె స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో అయిదు హెరిటేజ్ ప్రాజెస్ యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2022 కల్లా హెరిటేజ్ రూ.6వేల కోట్ల టర్నోవరే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బ్రహ్మణి వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.